Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గ్రామీణ మహిళల సాధికారతకై... మూడు తరాల కృషి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Dec 02,2022

గ్రామీణ మహిళల సాధికారతకై... మూడు తరాల కృషి

          మూడు తరాల మహిళలు... సామాజిక కార్యక్రమాలతో వేలాది మంది జీవితాలలో శక్తివంతమైన మార్పు తీసుకొస్తున్నారు. 1995లో 'కలకత్తా ఫౌండేషన్‌'ను శ్యామ్లు దుదేజా ప్రారంభించారు. ఆమె కుమార్తె మాలిక, మనవరాళ్ళు సౌమ్య, మహిమలు తమ వారసత్వాన్ని సామాజిక కార్యక్రమాలతో ముందుకు తీసుకువెళుతున్నారు. ఎంతో మంది మహిళలకు సాధికారత కల్పిస్తున్నారు. ఆ మూడు తరాల మహిళలు చేస్తున్న సామాజిక కృషి గురించి నేటి మానవిలో...
           1947లో దేశ విభజన సమయంలో శామ్లు దుదేజా తన కుటుంబంతో కలిసి కరాచీ నుండి బొంబాయికి ఒకే ఒక సూట్‌కేసులో దుస్తులు పెట్టుకొని పారిపోయారు. ధనిక భూస్వాములుగా ఉన్న వారు శరణార్థులుగా జీవితాన్ని కొత్తగా ప్రారంభించవలసి వచ్చింది. ఆమె అప్పటి తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ''మామాజీ నుండి అప్పుగా తీసుకున్న డబ్బుతో మా నాన్న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. మేము వెంటనే అక్కడికి వెళ్ళి బార్సతిలో ఉన్నాము. నాన్న ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. కానీ మా అమ్మ మాత్రం మా తిండి విషయంలో ఎలాంటి లోటూ చేయాలేదు. తన చీరలు చింపి మాకు బట్టలు కుట్టేది'' అన్నారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన శామ్లూ ఎంతో క్రమశిక్షణగా ఉండేవారు. ఇదే పశ్చిమ బెంగాల్‌ గ్రామీణ ప్రాంతంలో పునరుజ్జీవనానికి నాయకత్వం వహించడానికి, కలకత్తా ఫౌండేషన్‌ను ప్రారంభించడానికి ఆమెను ప్రేరేపించింది.
ఇప్పటికీ పర్యవేక్షిస్తారు
           అదే క్రమశిక్షణను ఆమె ఫౌండేషన్‌కు నాయకత్వం వహిస్తున్న తన కుమార్తె మలికా దుదేజా వర్మకు అప్ని కుటీర్‌, సామా వంటి పెద్ద కమ్యూనిటీలకు ప్రయోజనం చేకూర్చే సామాజిక కార్యక్రమాలను ప్రారంభించిన ఆమె మనవరాళ్ళు సౌమ్య, మహిమా వర్మలకు అందించారు. 84 ఏండ్ల వయసులో ఉన్న శ్యామ్లూ ఇప్పటికీ 27 సంవత్సరాల కిందట ప్రారంభించిన కలకత్తా ఫౌండేషన్‌ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. మహిళల కోసం దాని జీవనోపాధి కార్యక్రమాలపై ఆసక్తిని కనబరుస్తున్నారు. అంతేకాదు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌ ప్రచురించిన రెండు గణిత పాఠ్యపుస్తకాలను కూడా రాశారు. పాకిస్తాన్‌, నేపాల్‌తో పాటు మనదేశంలోని పాఠశాలల్లో ఉపయోగించబడినవి.
సంగీతంతో ప్రారంభం
           ''కోల్‌కతాలోని నా స్నేహితురాలు ఆర్కెస్ట్రాతో అనాథ పిల్లలకు సంగీత శిక్షణ ఇప్పిస్తుంది. యుఎస్‌ కాన్సులేట్‌లో పోస్ట్‌ చేయబడిన ఆమె భర్తతో పాటు వెళుతూ నన్ను దీని బాధ్యతలు స్వీకరించమని కోరింది. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం గురించి నాకు తెలియదు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్కెస్ట్రా శిక్షణ కోసం నిధులు సేకరించేదాన్ని. ఇదే తర్వాత కలకత్తా ఫౌండేషన్‌ ఒక ఎన్‌జీఓగా ఆవిర్భవించటానికి దారితీసింది'' అన్నారు ఆమె. కేవలం ఆర్కెస్ట్రా మాత్రమే కాకుండా శ్యామ్లూ పెద్ద ప్రాజెక్టుల కోసం నిధులను సేకరించడం ప్రారంభించారు. కుష్ఠు వ్యాధిగ్రస్తుల పిల్లలు, ఇతరుల కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. 1998లో కోల్‌కతాలోని తాజ్‌లో బస చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌వాకు ఆమె తన పనిని వివరించి సహాయం కోరారు. 2004లో సునామీ ద్వీపాలను తాకిన తర్వాత అండమాన్‌ కోసం నిధుల సేకరణతో సహా ఫౌండేషన్‌ వివిధ కార్యక్రమాలకు క్రికెటర్లు సహాయం చేసిన సుదీర్ఘ అనుబంధానికి ఇది నాంది. ఆ సమయంలో సహాయక సామగ్రి పంపిణీని పర్యవేక్షించడానికి శ్యామ్లూ స్వయంగా దీవులకు వెళ్లారు.
ఇంటి గుమ్మం దగ్గరే ఆదాయం
           ఆమె కుమార్తె మాలిక చిన్న వయసులో ఉన్నప్పుడు శ్యామ్లూ కాంత ఎంబ్రాయిడరీ పనిలో మహిళల శిక్షణను పర్యవేక్షించడానికి కూతురిని కూడా తనతో పాటు గ్రామాలకు తీసుకువెళ్లేవారు. ''అమ్మ ఈ మహిళలను ఇంటికి తీసుకువచ్చి పని చేయడానికి చీరలు ఇవ్వడం, వారి విశ్వాసాన్ని పెంచడం నేను చూశాను. అప్పటి వరకు కళను తరతరాలుగా అందించిన గ్రామీణ మహిళలు కాంత పని చేసేవారు. పిల్లల చుట్టలు, మంచం బొంతలకే పరిమితమయ్యారు. మా అమ్మ కళను జాతీయ స్థాయికి, ఆపై ప్రపంచానికి ఎగ్జిబిషన్ల ద్వారా తీసుకెళ్లింది'' అని ఆమె చెప్పారు. షీ ఫౌండేషన్‌ అనధికారికంగా 1990లో ప్రారంభించబడింది. 2003లో నమోదు చేయబడింది, ద్వార్‌ పే రోజీ (ఇంటి గుమ్మం వద్ద ఆదాయం) సూత్రం అనుసరించడం ద్వారా గ్రామీణ బెంగాల్‌లోని 80,000 మంది మహిళా కళాకారులకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా సమాజ అభివృద్ధి ప్రయత్నాల ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ మహిళల సంక్షేమం, పురోగతికి ఇది పనిచేస్తుంది.
కొత్త కోణాన్ని సంతరించుకుంది
           తల్లి, అమ్మమ్మ అడుగుజాడల్లోనే సౌమ్య, మహిమ వర్మలు కలకత్తా ఫౌండేషన్‌ను సామాజిక, ఆర్థిక కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నారు. సౌమ్య యుఎస్‌లోని కళాశాలకు వెళ్లి మానవ హక్కులు, సామాజిక న్యాయానికి సంబంధించిన కోర్సు చేసి వచ్చారు. 2019లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత ఆమె ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడానికి కోల్‌కతాకు తిరిగి వచ్చారు. ''నేను కలకత్తా ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాను. అందుబాటు ధరలో ఆరోగ్య క్లినిక్‌లను ప్రారంభించి నగరంలోని ఆసుపత్రులను భాగస్వామ్యం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణను తీసుకెళ్లాలనేది నా ఆలోచన. దీని కోసం కొంత కాలం పని చేయాల్సి వస్తుంది. మళ్ళీ నా చదువును కొనసాగించడానికి యుఎస్‌కి తిరిగి రావాలనేది నా ప్రణాళిక'' అని ఆమె చెప్పారు. గ్రామీణ ఔట్‌రీచ్‌ క్లినిక్‌లను ప్రారంభించిన కేవలం ఐదు నెలల్లో మహమ్మారి వచ్చి పడింది. వైద్యులు ముందు వరుసలోకి వచ్చారు. ఆమె సోదరి మహిమ కూడా అడుగు పెట్టడంతో వారి సామాజిక పని కొత్త కోణాన్ని సంతరించుకుంది. 2015లో నిర్భయ ఘటన జరిగినప్పుడు మహిమ తొమ్మిదవ తరగతిలో ఉంది. ఆ సమయంలో చాలా మంది యువతులలాగే ఆమె కూడా ఈ హింసాత్మక నేరానికి తీవ్రంగా ప్రభావితమైంది.
ఆత్మరక్షణ శిబిరాలను ప్రారంభించి
           ''ఇది భారతీయ మహిళగా సమాజంలో నా గుర్తింపు, నా స్థానం గురించి పునరాలోచించటానికి నన్ను నెట్టివేసింది. నాకు ఫౌండేషన్‌తో పాటు కుటుంబ మద్దతు ఉన్నందున 'గర్ల్స్‌ ఫర్‌ టుమారో' అనే ఉద్యమాన్ని ప్రారంభించగలిగాను. న్యాయవాదులు, పోలీసులతో మాట్లాడాం. మహిళల భద్రత ఎందుకు అత్యంత ముఖ్యమైనదో చెబుతూ యువతులకు సాధారణ ఆత్మరక్షణ శిబిరాలను ప్రారంభించాం'' అని ఆమె చెప్పింది. తర్వాత ఆమె డ్యూక్‌ యూనివర్సిటీలో చదువుకోవడానికి యుఎస్‌కు వెళ్లింది. వలసలతో మహిళలు ఎలా ప్రభావితం అవుతున్నారో అర్థం చేసుకోవడానికి జోర్డాన్‌, రువాండాలోని శరణార్థి శిబిరాల్లో కూడా పనిచేసింది. గ్రాడ్యుయేషన్‌ తర్వాత మహమ్మారి కారణంగా 2020లో భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఏడాదిన్నర పాటు సహాయక చర్యలు చేపట్టిన తర్వాత ఆ సోదరీమణులు స్పష్టత వచ్చింది. అవసరం చాలా ఎక్కువగా ఉంది, నిధులు అయిపోతాయి. సంఘాలకు వివిధ మార్గాల్లో సహాయం అవసరం ఉంది.
భౌతిక స్థలం లేకపోవడం
           ''సంఘాలు స్థిరమైన జీవనోపాధి అవకాశాల ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటున్నాయని అర్థం చేసుకున్నాం. కానీ చాలా మంది అమ్మాయిలు చదువుకు దూరమయ్యారు. వారి ఇళ్ల నుండి కూడా బయటకు రాలేదు. మహిళలు ఇతర మహిళలను కలవడానికి, నైపుణ్యాలను నేర్చుకునే భౌతిక స్థలం లేకపోవడం కాస్త కష్టంగా అనిపించింది'' అని సౌమ్య చెప్పింది. ఇప్పుడు సోదరీమణుల లక్ష్యం మహిళల కోసం భౌతిక, సురక్షితమైన స్థలాలను సృష్టించడం. ఇదే అప్ని కుటీర్‌లను ప్రారంభించేందుకు దారితీసింది. అలాగే సామా కూడా ఏర్పడింది. అక్కడ వారు కుట్టు, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, ఇతర నైపుణ్యాలను నేర్చుకుంటారు. పండుగలు జరుపుకుంటారు, సమాజికంగా కలిసి ఉంటారు. పశ్చిమ బెంగాల్‌లో అలాంటి ఆరు ప్రాంతాలు ఉన్నాయి. కోల్‌కతాలోని అతిపెద్ద మురికివాడ నుండి బంగ్లాదేశ్‌ సరిహద్దుల వరు అవకి ఉన్నాయి. బీహార్‌లోని మొదటి అప్నీ కుటీర్‌ త్వరలో కిషన్‌గంజ్‌లో ప్రారంభించబడుతుంది.
స్థానిక ప్రభుత్వాలతో కలిసి
           2021 నుండి సామా తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 80పైగా జిల్లాల్లో కార్యకలాపాలను స్థాపించింది. విజయవంతంగా 25,000 మందికి పైగా ఆదాయాన్ని అందిస్తోంది. గతంలో గాలా ఫండ్‌ రైజర్స్‌, ఈవెంట్‌ల ద్వారా వారి అమ్మమ్మ శ్యాంలు ఫౌండేషన్‌ కోసం నిధులు సేకరించగా ఇప్పుడు మనువరాళ్ళు CSR నిధులను ట్యాప్‌ చేయడం, ఇతర ఫౌండేషన్‌లతో భాగస్వామ్యం చేస్తున్నారు. వారు అనుమతుల కోసం గ్రామ పంచాయతీల వంటి స్థానిక ప్రభుత్వాలతో అనధికారికంగా పని చేస్తారు. అప్ని కుటీర్‌ 40 మంది బృందంతో, సామా 20 మంది పూర్తి సమయం ఉద్యోగులతో పని చేస్తుంది.
సాంఘిక హోదాలో మార్పు కోసం
           ''గ్రామీణ మహిళలకు ఉపాధి, స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా వారిని ఆర్థికంగా స్థిరంగా చేయడం ద్వారా మేము సంఘాలను చూసుకోగలిగాం. ఇందులో ఆరోగ్య సంరక్షణ, విద్య, ప్రాథమిక సౌకర్యాలు కూడా ఉన్నాయి'' అని మాలికా చెప్పారు. ఇక మహిమ సాంఘిక హోదాలో మార్పు కోసం పని చేస్తున్నారు. ''ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాన్సెప్ట్‌ వేలాది మంది మహిళలు ఆదాయాన్ని పొందేందుకు వీలు కల్పిస్తున్నదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు తమ ఇళ్లలో ఉంటూ ఎంతసేపైనా పని చేయవచ్చు. పని చేయడానికి బయటకు వెళ్ళాల్సిన అసరం లేదు'' అంటూ మహిమ చెప్పారు. మహమ్మారి సమయంలో ''నాణ్యమైన అసామన్యమైన పని'' కారణంగా మాత్రమే షీ ఫౌండేషన్‌ మహిళలకు చెల్లించగలిగింది. షీ ఫౌండేషన్‌ ఇప్పుడు గ్రామీణ బెంగాల్‌ అంతటా మహిళా కళాకారులకు మద్దతు ఇస్తుంది. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ వారి క్రియేటింగ్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ప్రాజెక్ట్‌లో కేస్‌ స్టడీగా ప్రదర్శించబడింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మొక్కజొన్న వంటలు అదుర్స్‌
ఆర్ధిక పొరపాట్లతో...
సహజమైన నిగారింపుకై...
బలమైన మహిళా శ్రామికశక్తి
ఈ లక్షణాలుంటే...
ఔషధ గుణాలు ఎన్నో...
సుస్వర 'వాణి'
చర్మానికి మేలు చేస్తుంది
బోలెడు ప్రయోజనాలు
ఇట్ల చేద్దాం
కొబ్బరాకుల కళాకృతులు
మార్పులకు కంగారుపడొద్దు
ఇట్ల చేద్దాం
వ్యక్తిగత లక్ష్యాలూ అవసరమే
మూసవిధానానికి స్వస్తి చెప్పండి
బరువు తగ్గాలంటే వీటిని కలిపి తినొద్దు
ఈ పద్ధతి పాటించండి
పిల్లలతో ఇలా మాట్లాడండి
పనులు పంచుకోండి
ఆరోగ్యానికి ప్రమాదం
సమానత్వం వైపు పయనం
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
ఇట్ల చేద్దాం
మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?

తాజా వార్తలు

12:20 PM

తుర్కియేలో చలికి తట్టుకోలేక ఏంచేస్తున్నారంటే ...

12:16 PM

సింగ‌రేణి కోసం ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాం: కేటీఆర్

12:07 PM

తొలి టెస్టు.. ఆస్ట్రేలియా 76/2

11:59 AM

అవును.. లోపాలున్నాయి: తుర్కియే అధ్యక్షులు ఎర్డోగాన్‌

11:56 AM

నలుగురు చిన్నారుల సజీవ దహనం..

11:39 AM

భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..

11:07 AM

డిస్నీలో ఏడు వేల మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు..

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.