Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహాద్భుత మండల ఆర్ట్‌ | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Dec 05,2022

మహాద్భుత మండల ఆర్ట్‌

               మండల ఆర్ట్‌గా పిలవబడుతున్న రేఖాగణితాల చిత్రాలు చాలా పురాతనమైనవి. ఆధ్యాత్మిక సంప్రదాయాలలో భక్తి మంటపాల దగ్గరా ఈ రకమైన చిత్రాలు ప్రాచీన కాలం నుండీ కనిపిస్తున్నాయి. ముగ్గుల్లోనూ ఇవి మనకు కనిపిస్తుంటాయి. వీటిని ఆధునీకరించి మండల ఆర్ట్‌గా వెలుగులోకి తీసుకువస్తున్నారు. పూణేలో ఉన్న నా ఫ్రెండ్‌ కూతురు వాళ్ళ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో నేర్పించారని ఒక చిత్రం పంపినపుడు ఆశ్చర్యం వేసింది. నా చిన్నప్పటి చిత్రాలు ఇలా మార్పు చెందాయని అనిపించింది. ఈ ఆర్ట్‌ చైనాలో మొదటగా పుట్టిందని చెబుతుంటారు. అయితే మా నాయనమ్మ వేసే చతురస్రాల, వృత్తాల ఆకారపు ముగ్గులు ఈ విధంగానే ఉండేవి. బౌద్ధ, జైన మతాల సంప్రదాయాలలోనూ ఈ చిత్రాలను చూడవచ్చు. చూడటానికి చాలా సులభంగా కనిపిస్తుంది. కానీ కొద్దిగా శ్రద్ధ పెట్టందే అసలైన రూపం రాదు. వృత్తాకారపు ముగ్గు, చతురస్రపు వాకిళ్ళతో వేసే సంక్రాంతి ముగ్గులు కూడా ఈ ఆర్ట్‌ను సూచించినట్టుగానే అనిపిస్తుంది. అయితే ఈరోజు మనం ఈ ఆర్ట్‌ సంగతి ఏంటో చూద్దాం.
సీసాపైన ఆర్ట్‌
           మొదటి సారి ప్రయత్నించేటపుడు మరీ కష్టమైన చిత్రాలు కాకుండా కాస్త సులభంగా ఉన్న చిత్రాలను వేసుకోవడం మంచిది. చిన్నతనంలో స్కూళ్ళలో ఖాళీ పీరియడ్‌ దొరికితే చాలు తెల్లని నోటు పుస్తకంలో గుండ్రంగా వృత్తాలు గీసేవాళ్ళం. దాంతో డిజైన్లనూ సృష్టించే వాళ్ళం. అప్పట్లో అందరి దగ్గరా ఇంకు పెన్నులే ఉండేవి. ఒక గుండ్రమంతా నీలి రంగుతో చుక్కలు పెట్టి మరో వృత్తమంతా ఎర్ర రంగు పెన్నుతో చుక్కలు పెట్టే వాళ్ళం. ఆకుపచ్చ రంగు ఇంకు పెన్నులు మాష్టార్ల దగ్గర ఉండేవి. పిల్లల పరీక్ష పేపర్లలో ఎర్ర ఇంక్‌, గ్రీన్‌ ఇంకు పెన్నులతో దిద్ది మార్కులు వేసేవారు. అలా రంగుల చుక్కలతో డిజైన్లు చేసి సంతోష పడేవాళ్ళం. నేనూ మా అమ్మ చీరకు నలుపు రంగుతో చుక్కల వృత్తాలు గీసి పెయింటింగ్‌ వేశాను. స్కూలులో ఇంకు పెన్నుల డిజైను తర్వాత రెండవది చీరల పెయింటింగ్‌. అప్పట్లో దీని పేరు మండల ఆర్ట్‌ అని తెలియదు. ఇప్పుడైతే మొదటగా ఒక సీసా మీద ప్రయత్నిద్దాం. ఒక ఇయర్‌ బడ్‌ తీసుకొని ఒక వృత్తంలా ఒకే రంగు చుక్కలు పెడదాం. ఇలా వృత్తం నిండే దాకా పెడితే అందమైన చిత్రం వస్తుంది. సీసాపై ఫ్లవర్‌వేజ్‌గా వాడవచ్చు. మండల ఆర్ట్‌నూ బాటిల్‌ ఆర్ట్‌నూ కలిపి తయారు చేశామిలా.
వృత్తంలా ఉండే డిజైను
           ఇది బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చేద్దాం. రంగులైనా, బ్లాక్‌ అండ్‌ వైట్‌ అయినా దేని అందం దానిదే. ఒక తెల్లని డ్రాయింగ్‌ పేపర్‌ తీసుకొని దానిమీద వృత్తలేఖిని సహాయంతో గుండ్రాన్ని గీసుకోవాలి. లేదంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్‌ లేదా స్టీలు ప్లేట్ల సహాయంతో గుండ్రంగా పెన్సిల్‌తో గీయాలి. ఇప్పుడు దాని మీద బ్లాక్‌ ఇంక్‌ పెన్నుతో డిజైన్‌ గీస్తే బాగుంటుంది. మొదట చుక్కలు పెట్టుకుంటూరావాలి. దాని పక్కనే లైన్లు గీసుకోవచ్చు. ఈ లైన్లకి ఆనుకొని గొలుసు కట్టు డిజైనును వేసుకుంటూ వెళ్ళాలి. దానిని ఆనుకునే మరల లైన్లు గీసుకోవాలి. లైన్లకు పక్కగా చుక్కలు వేసుకోవాలి. రేఖలు, చుక్కలు, లైన్లు అంటూ రకరకాలుగా ఒక దాని పక్కన ఒకటి క్రమ పద్ధతిలో వేసుకుంటూ వెళితే అందమైన డిజైను ఆవిష్కృతమవుతుంది. ఈ ఆర్ట్‌ అంతా ఒక రకమైన మ్యాథమేటిక్స్‌ అసలు ముగ్గులన్నీ మ్యాథమాటిక్స్‌లాగే కనిపిస్తాయి నాకు. నేనయితే ముగ్గుల్ని ఒక ఆర్ట్‌గానే భావిస్తాను. పిల్లలకు సులభంగా డ్రాయింగ్‌ నేర్పే పద్ధతి అనిపిస్తుంది. వృత్త లేఖిని సహాయంతో వృత్తాల మధ్యలో డిజైన్లు గీసి వాటిని రంగులతో నింపి దాచుకున్న స్కూలు రోజులు గుర్తొస్తాయి. దీనిలోనే కొద్దిగా మార్పులతో డాట్స్‌ డిజైన్‌ మెహందీ కూడా వస్తున్నది. ఒక రకమైన ఆర్ట్‌ వస్తే మిగతావన్నీ కూడా కొద్ది భేదాలతో ఉంటాయి. కాబట్టి నేర్చుకోవడం సులభం. మొదటిదే కాస్త కష్టం.
నెమలీకతో ఆర్ట్‌
           ఒక వేణువు, నెమలీక, వృత్తంతో ఆర్ట్‌ వేద్దాం. వృత్తాకారంలో ఉండే డిజైను కాబట్టే దీనికి 'మండల' అనే పేరు పెట్టారు. వేణువును, నెమలీకను మొదటగా తెల్లని డ్రాయింగ్‌ పేపర్‌ మీద పెన్సిల్‌తో వేసుకోవాలి. దీని పైభాగాన వృత్తాకారపు డిజైను వెయ్యాలి. ఒక సెం.మీ. లేదా అర సెం.మీ తేడా పెట్టుకొని రేఖలు గీసుకోవాలి. ఆ రేఖల్ని చుట్టుతూ వృత్తాలు గీసుకోవాలి. రేఖలు, వృత్తాలు నలుపు రంగుతో వేసుకోవాలి. ఇప్పుడు వాటి మధ్య ఉన్న ఖాళీని సున్నాలు, గొలుసులు, పూలతో నింపుతూ పెన్నుతో వెయ్యాలి. దీనిని ఫిల్లింగ్‌ అంటారు. ఇలా కొద్దిగా కూడా ఖాళీ లేకుండా ఫిల్లింగ్‌ చేస్తే డిజైను అందంగా ఉంటుంది. ఒక దానికీ మరొక దానికీ మధ్య ఉండే ఖాళీ సమానంగా ఉండటమే ఈ కళ గొప్పదనం. వేణువు, నెమలీకలతో మండల ఆర్ట్‌ వేసే అద్భుతంగా ఉంటుంది. నేను ఈ డిజైనును చతురస్రాలుగానూ, నెమళ్ళగానూ, అష్టదళ పద్మాలుగానూ రకరకాలుగా చిత్రీకరించాను. కేవలం రెడ్‌ పెన్నుతోనే చతురస్ర డిజైనును వేశాను. ఒక్కో రంగు ఇంకు పెన్ను సహాయంతో ఒక్కో చిత్రాన్ని తయారు చేశాను. ఇప్పుడు నెమలి బొమ్మను చూద్దాం. మొదటగా నెమలి బొమ్మను వేసి దానిని రకరకాల రేఖలతో నింపితే అందంగా తయారవుతుంది. కొద్దిగా పురి విప్పిన నెమలిని నేను చిత్రించాను. నేను నెమళ్ళను ఎరుపు రంగు పెన్నుతోనూ, నలుపు రంగు పెన్నుతోనూ చిత్రించాను. నేను మండల ఆర్ట్‌ అనే పేరు తెలియకుండానే కాలేజీ రోజుల్లో ఈ రకమైన వృత్తాల డిజైన్లను సృష్టించి ఫ్రైజులు అందుకున్నాను. ఈ ఆర్ట్‌లో సీతాకోక చిలుకలు వంటి వాటిని రంగుల్లో చిత్రించవచ్చు. ఈ రోజుల్లో సీసాలు, కప్పులు, సాసర్ల వంటి వాటి మీద రంగుల చుక్కలతో డిజైన్లనే ఎక్కువ గీస్తున్నారు. వస్త్రాలు, చీరల మీద చుక్కలు పెట్టే పోల్కి డిజైన్లు చాలా ప్రసిద్ధి పొందాయి.
తారకల్ని సృష్టిద్దాం
           అర్థవృత్తాలు, ఈకలకు, చంద్రవంకలు వంటి డిజైన్లను మండల కళలో అద్భుతంగా చిత్రించవచ్చు. పొరలు పొరలుగా ఉండే ఈ చిత్రకళ స్త్రీ గర్భాశయంలోని పొరల్ని సూచిస్తుంది. గర్భాశయంలోని పొరల మధ్య ఉండే శిశువును సూచిస్తూ ఈ కళ సాగిందని పూర్వీకుల అభిప్రాయం. రేకా గణితం లోని అందమైన చిత్రాలని సైన్స్‌ భావిస్తుంది. ఆకాశంలోని చందమామ, తారకల్ని మన మండల కళలో సృష్టిద్దాం. చంద్రవంకకు వేలాడే నక్షత్రాల్లా బొమ్మను వేసుకుందాం. చంద్రవంకలోని ఖాళీలో మొదటగా అర్ధవృత్తాన్ని వేసి మండల కళతో నింపాలి. తర్వాత నక్షత్రాలను వేలాడదీయాలి. ఫుల్‌ స్టాప్‌ లాంటి చుక్కల్ని అందమైన డిజైన్లుగా మార్చడం అద్భుతమైన కళ. నలుపు రంగు పెన్నుతో చుక్కలు, గీతలు గీసుకుంటూ చంద్రవంకను ఖాళీ లేకుండా నింపేయాలి. నక్షత్రాలు చుట్టుముట్టిన చంద్రుడిని మండల ఆర్ట్‌లో బంధించాం. ఈ డిజైన్లను రంగుల్లో బంధిస్తే ఇంకా అందంగా ఉంటుంది.

- డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మొక్కజొన్న వంటలు అదుర్స్‌
ఆర్ధిక పొరపాట్లతో...
సహజమైన నిగారింపుకై...
బలమైన మహిళా శ్రామికశక్తి
ఈ లక్షణాలుంటే...
ఔషధ గుణాలు ఎన్నో...
సుస్వర 'వాణి'
చర్మానికి మేలు చేస్తుంది
బోలెడు ప్రయోజనాలు
ఇట్ల చేద్దాం
కొబ్బరాకుల కళాకృతులు
మార్పులకు కంగారుపడొద్దు
ఇట్ల చేద్దాం
వ్యక్తిగత లక్ష్యాలూ అవసరమే
మూసవిధానానికి స్వస్తి చెప్పండి
బరువు తగ్గాలంటే వీటిని కలిపి తినొద్దు
ఈ పద్ధతి పాటించండి
పిల్లలతో ఇలా మాట్లాడండి
పనులు పంచుకోండి
ఆరోగ్యానికి ప్రమాదం
సమానత్వం వైపు పయనం
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
ఇట్ల చేద్దాం
మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?

తాజా వార్తలు

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు.. ఉత్వర్వులు జారీ

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ..నడిచిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.