Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆ హింసను గుర్తించండం ఎలా..? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

ఆ హింసను గుర్తించండం ఎలా..?

            అవగాహన లోపమో లేదంటే అంతా భర్తే చూసుకుంటారన్న అతి విశ్వాసమో.. కొంతమంది మహిళలు తమ డబ్బు నిర్వహణ బాధ్యతలు తమ భర్తల చేతుల్లో పెడుతుంటారు. అయితే మొదట్లో కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆ తర్వాత మీకు తెలియకుండానే ఖాతాల్లోంచి వేలకు వేలు మాయమవడం, మిమ్మల్ని వారి గుప్పిట్లో పెట్టుకొని డబ్బు విషయంలో హింసించడం, మీ పేరిట ఉన్న ఆస్తిపాస్తుల్ని వారి అధీనంలోకి తెచ్చుకోవడం.. ఇలా 'పేరుకు మాత్రమే డబ్బు మీది.. ఎక్కడ వాడాలి? ఎలా వాడాలన్న విషయం మాత్రం అవతలి వారిదే!' అన్నట్లుగా తయారవుతుంది పరిస్థితి. దీన్నే 'ఆర్ధిక హింస' అంటున్నారు నిపుణులు. మరి దీని నుండి బయట పడాలంటే ఏం చేయాలి? అసలు మీరు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలుసుకోవడం ఎలా? దీనికి నిపుణులు ఇస్తున్న సూచనలేమిటో తెలుసుకుందాం...
            కేవలం భర్త మాత్రమే ఇలా చేస్తాడని కాదు.. మీ ఖాతాలన్నీ కుటుంబంలో ఎవరి చేతిలో పెట్టినా ఇలాంటి ప్రమాదం తలెత్తే అవకాశాలూ లేకపోలేదు. అందుకే ఇలా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. అందుకే డబ్బు నిర్వహణ గురించి కనీస అవగాహన పెంచుకోమంటున్నారు. మరి ఇదివరకే ఈ ఉచ్చులో పడిపోయి పలు సవాళ్లను ఎదుర్కొంటోన్న వారూ ఎంతోమంది ఉండి ఉండచ్చు.
గుర్తించడం ఇలా...
            బ్యాంకు ఖాతాలు, ఆస్తిపాస్తులు ఎదుటివారి చేతిలో పెట్టి మహిళలు తాము మోసపోయామని గుర్తించాలంటే ఎదుటివారి ప్రవర్తన ద్వారా ఇది సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. మీరు చేతి నిండా సంపాదిస్తున్నా అది చూసి ఓర్వలేక.. లేదంటే ఆర్థికంగా మీరు వారి కంటే ఓ మెట్టు పైనున్నా సహించలేక మిమ్మల్ని ఎలాగైనా ఉద్యోగం మాన్పించాలన్న ఆలోచనలో ఉంటారు వారు. ఇదే ఉద్దేశంతో మిమ్మల్ని పదే పదే హింసిస్తుంటారు. ఆఫీస్‌లోనైనా, ఇంటి నుంచైనా మిమ్మల్ని ప్రశాంతంగా పనిచేసుకోకుండా మాటలు, చేతలతో హింసించడం, మానసికంగా కుంగదీయడం వంటివి చేస్తుంటారు. అవసరానికి మీకు డబ్బులు ఇవ్వకపోవడం, మీ బ్యాంక్‌ ఖాతాలు, ఆస్తిపాస్తులు పూర్తిగా తమ అధీనంలోకి మార్చుకోవడం.. వంటివి చేస్తారు. ఒక్కోసారి మీకు అవసరమైన మొత్తం కంటే తక్కువ డబ్బిచ్చి ఇందులోనే ఖర్చులన్నీ పూర్తి చేసుకోవాలన్న నియమం పెట్టే వారూ లేకపోలేదు. ఇదీ ఓ రకంగా హింసే. వాళ్లు మాత్రం మీ డబ్బుతో జల్సాలు చేసి.. మీరు పెట్టే ఖర్చుల్ని భూతద్దంలో చూడడం, రసీదులు చూపించమనడం వంటివి చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. డబ్బు మీదే.. కానీ మీ ప్రమేయం లేకుండా, మీ నిర్ణయం తీసుకోకుండా ఆ డబ్బుని ఇష్టారీతిన ఖర్చు పెడుతుంటారు. మీ గుర్తింపు కార్డులను దొంగిలించడం లేదంటే మోసపూరితమైన ట్యాక్స్‌ రిటర్న్స్‌ని మీ పేరుకు అనుసంధానించడం.. వంటివి చేస్తుంటారు. మీ ప్రమేయం లేకుండానే మీకు సంబంధించిన ఆస్తిపాస్తులు అమ్మేయడం లేదంటే తన పేరు మీదకు మార్చుకోవడం.. వంటివి చేసే వారూ లేకపోలేదు. మీ పేరుతో తప్పుడు బీమా క్లెయిమ్స్‌ దాఖలు చేయడం. మీరు ఏ ఖర్చులు పెట్టాలన్నా తన దగ్గర చేయి చాచేలాంటి పరిస్థితి తీసుకురావడం. ఇష్టారీతిన రుణాలు తీసుకోమని మిమ్మల్ని బలవంతం చేయడం. ఇలాంవన్నీ ఆర్థిక హింస కిందకే వస్తాయి.
బయటపడం ఎలా...
            డబ్బు విషయంలో ఇంట్లో వాళ్లనే నమ్మొద్దని చెబుతుంటారు పెద్దలు. ఎందుకంటే ఎలాంటి అనుబంధాలనైనా విడదీసే మత్తు మందు ఇది. అందుకే డబ్బు నిర్వహణ బాధ్యతలన్నీ మహిళలు ఎవరికి వారే చూసుకోవడం మంచిది. ఒకవేళ ఈ హింసను ఎదుర్కొంటున్న వారు దీన్నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
ఇప్పటిదాకా కోల్పోయిన డబ్బు గురించి బాధపడడం కంటే ఇక ముందు అలా జరగకుండా జాగ్రత్తపడడం మంచిది. ముందు మీ బ్యాంకును సంప్రదించి కార్డులు బ్లాక్‌ చేయించడం, పిన్‌ మార్పించడం, మీ పర్సనల్‌ కంప్యూటర్‌, మొబైల్స్‌లో లాగిన్‌ ఐడీలు, పాస్‌వర్డులు మార్చేయడం.. వంటివి వెంటనే చేసేయాలి.
            మీ పేరు మీదున్న క్రెడిట్‌ కార్డు బిల్లులు, రుణాలు సమయానికి చెల్లించకుండా ఉంటే వాటిని వచ్చే నెల జీతంతో తీర్చేసి ఆయా కార్డుల్ని బ్లాక్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొత్త కార్డులు తీసుకున్నా ఆ వివరాలేవీ సదరు వ్యక్తికి తెలియకుండా జాగ్రత్తపడాలి.
            పాన్‌, ఆధార్‌, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, మీ స్టడీ సర్టిఫికెట్స్‌.. వంటివన్నీ ఎదుటి వ్యక్తికి తెలియకుండా రహస్యంగా దాచుకోవడం మంచిది.
మీ ప్రమేయం లేకుండా సొంతం చేసుకున్న మీ ఆస్తిపాస్తులు తిరిగి ఇవ్వమని వారిని ఓ మాట అడిగి చూడండి. దీనికి అంగీకరించపోతే మాత్రం చట్టబద్ధంగా ముందుకెళ్లడానికీ వెనకాడకండి.
            ఆర్థిక హింస కూడా గృహ హింస కిందకే వస్తుందని చట్టం చెబుతోంది. అందుకే ఎదుటివారిపై మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌ని సంప్రదించచ్చు.
            ఇంత జరిగాక మానసికంగా ఎంతగానో కుంగిపోతాం.. కాబట్టి ఈ హింసను మీలోనే దాచుకోకుండా మీ కుటుంబ సభ్యులతో పంచుకొని వారి సలహాలు తీసుకోవచ్చు.. లేదంటే మానసిక నిపుణులను సంప్రదించి కౌన్సెలింగ్‌ తీసుకున్నా ఫలితం ఉంటుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?
సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు
సానుకూలంగా వ్యవహరించండి
ఇట్ల చేద్దాం
బంగారు తంజావూరు చిత్రకళ
ఇట్ల చేద్దాం
వారిని అర్థం చేసుకోవాలంటే..?
జీర్ణశక్తికి ఇవి తింటే మంచిది
ప్రేమతో ఏదైనా జయించవచ్చు
మీ ఎదుగుదలకు అడ్డం కావొద్దు
ఆవిరి పట్టండి
చితికిపోతున్న బాల్యం
కొన్ని పొదుపు సూత్రాలు పాటిస్తే...
బయటి వాటితో పనేముంది
ఇట్ల చేద్దాం
బరువు పెరుగుతున్నారా..?
మనకంటూ ఓ ఫ్రెండ్స్‌ సర్కిల్‌
తులసితో ఆకులతో ప్రయోజనాలు...
రాజ్యాంగ రూపకల్పనలో మహిళలు
శ్రామిక మహిళల భవిత ఏమిటి?
పిల్లల్లో నైపుణ్యం పెంచడానికి..?
ఇట్ల చేద్దాం
అవాంతరాలు దాటుకుని...
పాటల పూదోటలో విరబూసిన 'పద్మ'జ

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.