Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పిల్లలతో ఇలా మాట్లాడండి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Feb 04,2023

పిల్లలతో ఇలా మాట్లాడండి

             తమ పిల్లలు సురక్షితమైన వాతావరణంలో పెరగాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు. అయితే దీనికోసం పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చాలా అవసరం. వారు ఏ విషయాల పట్ల కలవర పడుతున్నారో తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం అంత సులభం కాదు. అప్పుడే తల్లిదండ్రులు ఛాలెంజింగా తీసుకోవాలి. పిల్లల మనసులోని భయాలను రాబట్టడానికి, వారితో సంభాషించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈరోజు తెలుసుకుందాం...
             ''నేడు పిల్లల బాల్యానికి సంబంధించిన నిర్వచనం రూపాంతరం చెందుతోంది. ఇకపై పిల్లలను అమాయకులుగా పరిగణించలేరని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనస్తత్వవేత్తలు అంటున్నారు. అందరి ఏకాభిప్రాయం ఏమిటంటే పిల్లలు చాలా విషయాల పట్ల ఆసక్తిగా ఉంటారు. ముఖ్యంగా పెద్దలు వారి వద్ద దాచి ఉంచడానికి ప్రయత్నించే విషయా గురించి తెలుసుకోవాలనుకుంటారు. అందుకే పిల్లలు వాటికోసం ఇంటర్నెంట్‌, స్నేహితులపై ఆధారపడే పరిస్థితి రాకముందే తల్లిదండ్రులు వారితో మాట్లాడాలి'' అని మెర్లిన్‌వాండ్‌ పిల్లల పుస్తకాల రచయిత్రి నేహా జైన్‌ సలహా ఇస్తున్నారు. అయితే చెప్పే విషయాలను వారిని భయపెట్టకుండా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలని ఆమె అంటున్నారు.
సౌకర్యమైన స్థలం
             టీనేజ్‌లోకి వస్తున్న పిల్లలతో ఆందోళన కలిగించే సంభాషణల గురించి మాట్లాడేటపుడు తగినంత సమయం కేటాయించుకోవాలి. వారికి బాగా పరిచయం ఉండి, ఇష్టపడే ప్రదేశంగా అది ఉండాలి. పిల్లలు నిద్రపోయే ముందు మాట్లాడకూడదు. ఒంటరిగా నిద్రపోయే పిల్లల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంతమైన సమయం, స్థలం కేటాయించుకోవాలి.
సమాచారంతో సిద్ధంగా ఉండండి
             తల్లిదండ్రులు తమకు తెలియని విషయాలను పిల్లలకు చెప్పకుండా వదిలేస్తారు. ఇది సరైనది కాదు. మీరు మాట్లాడే విషయాన్ని బట్టి వారికి ఎలాంటి సందేహాలు వస్తాయో గుర్తించి తగిన సమాచారంతో మాట్లాడడం మొదలుపెట్టాలి. ఓ పరిశోధన ప్రకారం 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు జంతువులతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. వాటికి మానవ లక్షణాలను ఆపాదిస్తారు. అందువల్ల ఈ వయసు వారితో మాట్లాడేటపుడు జంతువుల బొమ్మలను ఉపయోగించడం మంచిది. యుక్తవయసులో ఉన్నవారు, యుక్తవయసు వారితో పసిపిల్లల మాదిరిగా మాట్లాడవద్దు. వయసుకి తగిన సమాచారాన్ని వారికి తప్పక ఇవ్వాలి.
నేరుగా చెప్పొద్దు
పిల్లలకు వాళ్ళు చేస్తున్న పొరపాట్ల గురించి చెప్పడానికి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆత్రుత ఉంటుంది. అయితే పిల్లలు మీ మాటలు స్వీకరించ డానికి, గ్రహించడానికి మానసికంగా, మేధోపరంగా సిద్ధంగా ఉండాలని గుర్తుంచుకోండి. పిల్లలకి ఇప్పటికే తెలిసిన విషయాలు ఏమిటో గుర్తించండి. చెప్పే ముందు వారి అనుమతి అడగండి. చెప్పాల్సిన విషయాన్ని నేరుగా కాకుండా క్రమంగా సంభాషణలో చేర్చండి. ఇది మీ బిడ్డ పరిస్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెబుతారని, వారికి ఇష్టమైనపుడు సంభాషణను ముగించవచ్చని పిల్లలకు భరోసా ఇవ్వండి.
అంశాన్ని పరిచయం చేయండి
             మాట్లాడే అంశంపై పిల్లల ప్రాథమిక జ్ఞానం, సంభాషణను కొనసాగించడంలో వారి నేర్పు ప్రదర్శించిన తర్వాత మీరు విషయాన్ని పరిచయం చేయవచ్చు. ముందు పిల్లలకు ఉన్న అపోహలను తొలగించండి. బెదిరింపు లేని రీతిలో సంభాషణను ప్రారంభించండి. చిన్న పిల్లలతో, వారికి ఇష్టమైన కార్టూన్‌ పాత్రలు, మృదువైన బొమ్మలు మూడవ వ్యక్తి కథను రూపొందించడానికి ఉపయోగించబడతాయి. పెద్ద పిల్లలతో అయితే ప్రత్యక్ష విధానం సరిపోతుంది.
ప్రశ్నలకు సమాధానం
             వారికి వచ్చే ప్రశ్నలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉండటం చాలా కీలకం. మీ భావనలను గ్రహించలేకపోతే పిల్లలను ఎగతాళి చేయొద్దు. వారి కోసం మీరు ఉన్నారని వారికి తెలియజేయండి. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మీకు చాలా సంతోషమని వారికి అనిపించాలి. ఫలానా విషయం గురించి పిల్లలు ఎందుకు తెలుసుకోవాలో వారికి ముందే వివరించడం మంచిదని కొందరు నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో, ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవలసిన చర్యలపై వారికి కనీస అవగాహన కల్పించాలి. అదే సమయంలో వారిని రక్షించేందుకు మీరు అండగా ఉంటారని, వారు ఒంటరిగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని కూడా పిల్లలకు భరోసా ఇవ్వండి.
తక్కువగా మాట్లాడకండి
             కొన్ని విషయాల గురించి తల్లిదండ్రులు పిల్లలతో ఆచితూచి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా పెద్ద పిల్లల వద్ద. ఇది మంచి పద్దతి కాదంటున్నారు నిపుణులు. మీరు చెప్పాలనుకుంటున్న సమాచారం అర్థం చేసుకోగల సామర్థ్యం మీ బిడ్డకు ఉందని గుర్తించండి. వారి స్థాయికి దిగి, వారి అభిప్రాయాన్ని స్వీకరించి వారి అభిప్రాయాన్ని వినిపించమని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. అయితే వారితో మాట్లాడకుండా మాత్రం ఉండండి.
భావోద్వేగాలను ధృవీకరించండి
పిల్లలకు బాధాకరమైన వార్తలను తెలియజేయాల్సిన సందర్భాల్లో వారు దాని గురించి పూర్తిగా అనుభవాన్ని పొందకుండా జాగ్రత్త వహించాలి. ఇక్కడ పిల్లలు సెంటర్‌ స్టేజ్‌లో ఉన్నారని అర్థం చేసుకోండి. విచారంగా భావించడం సరైంది కాదని, దుఃఖానికి సమయ పరిమితి లేదని పిల్లలకు తెలియజేయండి. మరో మాటలో చెప్పాలంటే పిల్లల భావోద్వేగాలను ధృవీకరించండి. కష్టమైన అంశాల గురించి మీ పిల్లలతో మాట్లాడటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీ ఉద్దేశాన్ని వదులుకోవద్దు. ఏ సమయంలోనైనా విషయాలు మీ చేతుల్లోకి వెళ్లినట్టు, పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు మీకు అనిపిస్తే నిపుణుల సహాయం తీసుకోండి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సౌందర్య కోమ‌లం
జుట్టును పెంచే ఆహారం
వేసవిలో చల్లచల్లగా...
గ్యాడ్జెట్స్‌కి సెలవివ్వండి
జిడ్డు వదలాలంటే..?
అలసిపోకుండా...
'నన్ను నేను మలుచుకున్నా'
అమ్మాయిల తడాఖా...
ఎండు చెట్ల చిత్రాలు
ఈ పండ్లు తినండి
ప్రణాళిక వేసుకోండి..
సిద్ధిపేట పాటల ఐడిల్‌
జయించడానికి మార్గాలు..
స్త్రీ శక్తికి చిహ్నం గులాబీ దండు
అమ్మ ఎందరికో ఆదర్శం
ముందస్తు జాగ్రత్తలు
విజయ సాకేతం
జీవకళ ఉట్టిపడే చిత్రాలు
ఉగాది రుచులు..!!
పండుగ శోభ
అనాథలకు అమ్మగా...
హాని చేయని కొయ్యబొమ్మలు
పాదాల పగుళ్ళకు...
మొలకలు తినండి
ఆమే ఓ ఉత్తేజం
చదువు చెప్పే ఆటలు నేర్పే 'యుక'
ఆత్మవిశ్వాసం నింపండి..
సాహిత్యంతో సమాజ పురోగమనం
ఉత్సాహంగా గడిపేద్దాం
ప్రోటీన్లు చాలా అవసరం

తాజా వార్తలు

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

07:28 AM

ఢిల్లీలో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

07:00 AM

నేటి నుంచి ఐపీఎల్‌-16వ సీజన్ ప్రారంభం...

06:29 AM

అరగంటలో 5,450 పిడుగులు.. ఐదుగురి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.