Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మార్పులకు కంగారుపడొద్దు | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

మార్పులకు కంగారుపడొద్దు

గర్భం ధరించిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో.. అలాగే ప్రసవానంతరం కూడా శారీరకంగా కొన్ని మార్పులు రావడం సహజం. అయితే తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన వారిలో చాలామంది ఇలాంటి మార్పులు జరగడం వల్ల కంగారు పడుతుంటారు. కానీ ప్రసవం తర్వాత జుట్టు రాలిపోవడం, కాళ్లలో వాపు, వక్షోజాల్లో పెరుగుదల.. వంటి పలు శారీరక మార్పులు సహజమేనని, అందుకు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవన్నీ కొన్ని రోజుల వరకు కొనసాగి, ఆ తర్వాత పరిస్థితి సాధారణమవుతుందంటున్నారు. మరి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి శరీరంలో జరిగే ఆ మార్పులేంటో తెలుసుకుందాం...
ప్రసవం తర్వాత కలిగే శారీరక మార్పుల్లో బ్లీడింగ్‌ ఎక్కువగా అవడం కూడా ఓ భాగమే. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు రెండు మూడు వారాల వరకు ఎక్కువ మొత్తంలో బ్లీడింగ్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత అందులోని మలినాలు, మిగిలిన వ్యర్థ పదార్థాలన్నీ రక్తం రూపంలో బయటికి వెళ్లిపోయి గర్భసంచి శుభ్రపడడమే ఇందుకు కారణం. ఇక ఆ తర్వాత మళ్లీ నాలుగైదు నెలలు లేదంటే ఆరు నెలల అనంతరం మహిళల్లో నెలసరి ప్రారంభమవడం గమనించవచ్చంటున్నారు వైద్యులు. కాబట్టి ఈ సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువవుతోందని భయపడకుండా నిపుణుల సూచనలు శ్రద్ధగా పాటిస్తే మేలని సూచిస్తున్నారు.
ప్రసవం తర్వాత మలబద్ధకం, మూత్రవిసర్జన సమయంలో మంట.. వంటి సమస్యలు కూడా చాలామందికి ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ సమయంలో నీరు, పండ్ల రసాలు, పాలు.. వంటి ఫైబర్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్యను సత్వరమే తగ్గించుకోవచ్చంటున్నారు.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు ఆరువారాల వరకు శరీరంలో శక్తి స్థాయులు తగ్గుతాయి. అలాగే రాత్రుళ్లు చెమటలు పట్టడం, కాస్త ఒత్తిడి.. వంటివి కూడా గమనించవచ్చు. మరి వీటన్నింటి నుంచి త్వరగా బయటపడాలంటే నిపుణుల సలహాతో ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, సమతులాహారం తినడం.. వంటివి చేయడం ఉత్తమం.
అలాగే కాళ్లు, పాదాల్లో వాపు రావడం కూడా ప్రసవం తర్వాత ఎక్కువమందిలో గమనించవచ్చు. అయితే డెలివరీ తర్వాత బరువు తగ్గే క్రమంలో ఈ వాపు నెమ్మదిగా తగ్గిపోతుంది.
గర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత పొట్ట తిరిగి నాజూగ్గా తయారవడానికి కాస్త సమయం పడుతుంది. అంతవరకు పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంది. అంతేకాదు.. గర్భధారణ సమయంలో చర్మం క్రమంగా సాగుతుంది. అలాగే ప్రసవానంతరం సాగిన చర్మం ముడుచుకోకుండా స్ట్రెచ్‌ మార్క్స్‌ రూపంలో చర్మంపై కనిపిస్తాయి. కాబట్టి పొట్ట తగ్గించుకోవడానికి నిపుణులు సూచించిన బెల్టును ధరించడంతో పాటు వైద్యుల సూచనల మేరకు స్ట్రెచ్‌ మార్క్స్‌ పోగొట్టుకోవడానికి సరైన చిట్కాలు పాటిస్తూ, తగిన వ్యాయామాలు చేయడం కూడా ఎంతో అవసరం. తద్వారా ఈ శారీరక మార్పును త్వరగా కవర్‌ చేసుకోవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సౌందర్య కోమ‌లం
జుట్టును పెంచే ఆహారం
వేసవిలో చల్లచల్లగా...
గ్యాడ్జెట్స్‌కి సెలవివ్వండి
జిడ్డు వదలాలంటే..?
అలసిపోకుండా...
'నన్ను నేను మలుచుకున్నా'
అమ్మాయిల తడాఖా...
ఎండు చెట్ల చిత్రాలు
ఈ పండ్లు తినండి
ప్రణాళిక వేసుకోండి..
సిద్ధిపేట పాటల ఐడిల్‌
జయించడానికి మార్గాలు..
స్త్రీ శక్తికి చిహ్నం గులాబీ దండు
అమ్మ ఎందరికో ఆదర్శం
ముందస్తు జాగ్రత్తలు
విజయ సాకేతం
జీవకళ ఉట్టిపడే చిత్రాలు
ఉగాది రుచులు..!!
పండుగ శోభ
అనాథలకు అమ్మగా...
హాని చేయని కొయ్యబొమ్మలు
పాదాల పగుళ్ళకు...
మొలకలు తినండి
ఆమే ఓ ఉత్తేజం
చదువు చెప్పే ఆటలు నేర్పే 'యుక'
ఆత్మవిశ్వాసం నింపండి..
సాహిత్యంతో సమాజ పురోగమనం
ఉత్సాహంగా గడిపేద్దాం
ప్రోటీన్లు చాలా అవసరం

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.