Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొబ్బరాకుల కళాకృతులు | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

కొబ్బరాకుల కళాకృతులు

          సముద్రతీర ప్రాంతాల్లో కొబ్బరి, తాటి చెట్లు విపరీతంగా పెరుగుతాయి. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగమూ మనకు ఉపయోగపడేదే. అనారోగ్యంగా ఉన్నప్పుడు కొబ్బరినీరే పుష్టికరమైన ఆహారం. కొబ్బరి గుజ్జును ఇంట్లోని ఆహార పదార్థాలన్నింటిలో ఉపయోగిస్తారు. కొబ్బరి చెట్టు కాండాన్ని ఇంటి కలపగా ఉపయోగిస్తారు. కొబ్బరి ఆకుల్ని పందిళ్ళు వేయడానికి, ఆకులోని ఈనెల్ని చీపుర్లుగా వాడుకోవడానికి ఉపయోగిస్తారు. ''కోకాస్‌ న్యూసిఫెరా'' అనే శాస్త్రీయనామం కలిగిన కొబ్బరి చెట్టులోని కొమ్మరెమ్మ ఆకు కాయ అన్నీ ప్రజలు వాడుకునేవే. కొబ్బరి చెట్టు ముప్పైమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సముద్ర ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో నాలుగైదు కొబ్బరి చెట్లుంటాయి. కొబ్బరి నీళ్ళలో పొటాషియం, సోడియం వంటి ఖనిజాలుంటాయి. డయేరియా వంటి జబ్బుల్లోనూ, శరీరంలో డీహైడ్రేషన్‌ ఏర్పడినప్పుడు కొబ్బరి నీరు ఎక్కువగా వాడతారు. భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరి కాయల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నది.
           మా ఇంట్లో నాలుగు కొబ్బరి చెట్లుండేవి. మా చిన్నతనంలో కొబ్బరి ఆకులతో బూరలు, వాచీలు, ఉంగరాలు తయారు చేసి పెట్టుకునే వాళ్ళం. మా బంధువులందరి ఇళ్లలోనూ కొబ్బరి చెట్లుండేవి. పిల్లలందరికీ వీటితో బొమ్మలు చెయ్యటమే పని. కొబ్బరి చెట్టు ఆకుల మధ్యలో మెత్తగా పొడిలాంటిది అతుక్కుని ఉండేది. దాన్ని తీసుకొని నెమలి ఫించాలకు మేత అని పుస్తకాలలో పెట్టుకునే వాళ్ళం. ఆ మేత తిని నెమలి ఫించం పెద్దగా పెరుగుతుందని నమ్మకం. మా అమ్మ, పెద్దమ్మలు కొబ్బరాకులతో చిలకలను తయారు చేసేవారు. అదే తయారీని చూసి పిల్లలంతా వైరుతో చిలకలను అల్లేవాళ్ళం. సరే ఇప్పుడు కొబ్బరాకులతో కొన్ని బొమ్మలు తయారు చేద్దాం..
చిలకమ్మను చేద్దాం
           కొబ్బరాకులలో ఈనెను వదిలి ఆకును కత్తిరించుకోవాలి. మధ్య ఈనెను వదిలేస్తే రెండు కొబ్బరాకులు వస్తాయి. ఆ రెండు ఆకులను ఉపయోగించి చిలకను చెయ్యాలి. ఒక ఆకును మడిచి క్రాస్‌గా పట్టుకుని రెండో ఆకును క్రాస్‌ చుట్టూతా తిప్పి కిందకున్న తోకలు మధ్యలో నుంచి దూరిస్తే ఒక ముడి వలె వస్తుంది. అయితే దాన్ని గట్టిగా లాకుండా కొద్దిగా వదులుగా ఉంచితే చిలక శరీరం తయారవుతుంది. శరీరానికి వెనక వైపున్న ఆకుల్ని తోకలా సన్నగా కత్తిరించి మిగతాది తీసేయాలి. శరీరానికి ముందు వైపున్న దాన్ని తలలా కత్తిరించి కన్ను గీసుకోవాలి. ఇలా కొబ్బరాకుల చిలకను చేయవచ్చు.
అమ్మాయి, అబ్బాయి బొమ్మ
           కొబ్బరాకులతో చాపలు, బుట్టలు, ద్వారానికి తోరణాలు ఇలా ఎన్నో చేసేవారు. గతంలో పెండిండ్లకు అంటే కొబ్బరాకుల పందిళ్ళదే హవా. కొబ్బరాకుల స్తంభాలు కట్టి పైన కొబ్బరాకులు కప్పి నాలుగు వైపులా చిలకలు, బాతులతో తోరణాలు వేలాడదీసి అద్భుతంగా అల్లేవారు. ఆడపిల్లలయితే పెండ్లి కూతురు పెండ్లి కొడుకు బొమ్మలు తయారు చేసి బొమ్మల పెండ్లి చేస్తూ ఆనందపడే వారు. మా అమ్మ, మా నాయనమ్మ కొబ్బరాకుల బుట్టలు చిన్నవి తయారు చేసి ముగ్గులేసుకునే నాము పెళ్ళలు పెట్టి గూట్లో పెట్టేవారు. నేను పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు బొమ్మలు చేసి ఆటలాడుకున్నాను. ఆ బొమ్మలే ఈ తరానికి పరిచయం చేద్దాం. కొబ్బరాకులోని ఈనెను తీసేసి పొడుగ్గా ఉన్న ఆకును పక్కనుంచుకోవాలి. మధ్యలోని ఈనెను తీసేస్తే రెండు ముక్కలు అవుతాయి. రెండు ముక్కలు ఒకదానికొకటి క్రాస్‌గా పెట్టి వెనక్కి ముందుకి చుట్టాలి. కొద్దిగా చుట్టాక పొడుగైన ఆకును పైకి పోనిచ్చి తల భాగాన్ని తయారు చేయాలి. కిందికి కాళ్ళను చేయాలి. అడ్డంగా ఉన్న ఆకుతో చేతులు పెట్టాలి. ఇది అబ్బాయి బొమ్మ అమ్మాయి బొమ్మకైతే జడ పెట్టాలి అంతే. తల భాగంలో కండ్లు, ముక్కు, నోరు పెట్టాలి. ఇంట్లో మిగిలిన వస్త్రపు ముక్కలతో అమ్మాయికి చీర, జాకెట్టు చుట్టాలి. అబ్బాయికి పంచె, కండువా కట్టాలి. రెండింటినీ పెట్టి పెండ్లి వేడుక చేసి సంతోషపడేవారు. బాగున్నాయా..!
ద్వారానికి తోరణాలు
           కొబ్బరాకు అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా! మధ్యలో పెద్ద కాడకు అటూ ఇటూ ఎన్నో సన్నని రిబ్బన్లలాగా ఉంటాయి. సన్నని రిబ్బన్ల లాంటి నాలుగు ఆకులు కోసుకుంటే చాలు. ద్వారానికి రెండు వైపులా అటు రెండు ఇటు రెండు తగిలిస్తే బాగుంటుంది. ఈ ఆకుకు మధ్య ఈనెను తీసేయకూడదు. బారెడు పొడుగున ఉండే ఈ ఆకుకు అక్కడక్కడా చిన్న గాట్లు పెట్టాలి. గాట్ల దగ్గర ఆకును చీల్చి మడవాలి. రెండు వైపుల ఆకుల్ని అటుదిటు, ఇటుదటు పోనిచ్చి ముడేయాలి. ఇలా బారెడు పొడవు పుల్లలో ఐదారు మడుల్లాగా వస్తాయి. ఇలా కాకుండా మొదటనే ఈనె మొత్తం తీసేసి ఆకులు విడిగా చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడీ ముక్కలకు చివర్న రెక్కలుగా కత్తిరించాలి. రెండు ముక్కలను క్రాస్‌గా పెట్టి ఈనెతో గుచ్చాలి. ఒక ఈనెకు నాలుగైదు ఆకుల పువ్వుల్ని గుచ్చి తోరణాలు చేయాలి. ఈ ఆకు పచ్చని తోరణాలను వాకిలికి అమర్చుకుంటే బాగుంటుంది.
మిడతను చేద్దాం
           కొబ్బరి చెట్లు వంద సంవత్సరాలు బతికి ఉంటాయి. ఏడు సంవత్సరాల నుంచి పూతకు వస్తుంది. కాండం పగుళ్ళు పగుళ్ళుగా, బిరసుగా ఉంటుంది. నేను ఈ కాండం మీద ఏర్పడే అనేక చిత్రాలను ఫొటోలు తీశాను. బెరడు ఊడిపోతూ, గీతలతో పగుళ్ళుతో అందమైన ఆకృతులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడతాయి వాటిలో పెద్ద పెద్ద రాజకోటలు, భవనాలు, గుహలు ఆకారాల్లో కనిపించాయి. వాటిని చక్కని ఫొటోలు తీసి ఎగ్జిబిషన్లు పెట్టాను. మనం మిడతను ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనిది 'ఓరిగామి'లో మడతల్ని చూసి కొబ్బరాకుతో ప్రయత్నించాను. దీనికి ఈనె తీసివేయకుండా ఉంచాలి. అటూ ఇటూ ఆకును కొద్దిగా చీల్చి అటు ఆకును ఇటువైపు, ఇటు ఆకును అటు వైపుకు పెట్టి జడ అల్లకంలా అల్లాలి. ఇది మిడత శరీరం అవుతుంది. ఈనెను మిడత కాళ్ళ వలె చూపించాలి. రెక్కలకు ఆకును చుట్టాలి. పాలల్లో చెట్ల మీద వాలే ఆకుపచ్చ మిడత తయారవుతుంది.
ఫ్లవర్‌ బొకే
           దీని కోసం ఆరు దళాల పుష్పం లేదా హృదయాకారంలను తయారు చేసుకోవాలి. ఇలా ఐదారు చేసుకుని రంగులు వేసుకుంటే కొత్తరకంగా ఉంటుంది. ఇలా చేసుకున్న హృదయాలను పల్లకు గుచ్చి పెట్టుకోవాలి. తర్వాత ఈనె తీసేసిన కొబ్బరాకులను క్రాస్‌గా మడిచి ఉంచాలి. ఇవి రెండు మూడు చేసి ఉంచుకోవాలి. కొన్ని ఆకులను మడిచి పాములా చేసి పెట్టుకోవాలి. దీన్ని మా చిన్నప్పుడు పాము అని ఆడుకునే వాళ్ళం. కొన్ని ఆకుల్ని కొద్దిగా మెలితిప్పి ఉంచాలి. వీటన్నింటినీ కలిపి ఒక ఫ్లవర్‌వేజ్‌లో పెడితే అందమైన పూల కుండీ తయారవుతుంది.
- డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సౌందర్య కోమ‌లం
జుట్టును పెంచే ఆహారం
వేసవిలో చల్లచల్లగా...
గ్యాడ్జెట్స్‌కి సెలవివ్వండి
జిడ్డు వదలాలంటే..?
అలసిపోకుండా...
'నన్ను నేను మలుచుకున్నా'
అమ్మాయిల తడాఖా...
ఎండు చెట్ల చిత్రాలు
ఈ పండ్లు తినండి
ప్రణాళిక వేసుకోండి..
సిద్ధిపేట పాటల ఐడిల్‌
జయించడానికి మార్గాలు..
స్త్రీ శక్తికి చిహ్నం గులాబీ దండు
అమ్మ ఎందరికో ఆదర్శం
ముందస్తు జాగ్రత్తలు
విజయ సాకేతం
జీవకళ ఉట్టిపడే చిత్రాలు
ఉగాది రుచులు..!!
పండుగ శోభ
అనాథలకు అమ్మగా...
హాని చేయని కొయ్యబొమ్మలు
పాదాల పగుళ్ళకు...
మొలకలు తినండి
ఆమే ఓ ఉత్తేజం
చదువు చెప్పే ఆటలు నేర్పే 'యుక'
ఆత్మవిశ్వాసం నింపండి..
సాహిత్యంతో సమాజ పురోగమనం
ఉత్సాహంగా గడిపేద్దాం
ప్రోటీన్లు చాలా అవసరం

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.