Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సుస్వర 'వాణి' | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Feb 07,2023

సుస్వర 'వాణి'

           'బోలె రే పపి హర' అంటూ తన గానంతో ఉత్తర భారత దేశంలో గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది' అంటూ రొమాంటిక్‌ పాటతో యువత మనసులో మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను తట్టిలేపిన వాణి జయరాం గొంతు మూగ పోయింది. అయినా తన పాటలతో శ్రోతల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయిన సుస్వర 'వాణి' పరిచయం నేటి మానవిలో...
            వాణి జయరాం అసలు పేరు కలై వాణి. 30, నవంబరు 1945లో వెల్లూరులో జన్మించారు. ఈమె తల్లి తండ్రులు పద్మావతి, దురైస్వామి అయ్యంగార్‌. వీరికి ఆరుగురు ఆడపిల్లలు, ముగ్గురు కొడుకులు. వాణి జయరాం ఐదవ సంతానం. శాస్త్రీయ సంగీత విద్వాంసుల కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచి వాణి రేడియోకి అతుక్కుపోయి హిందీ పాటలు ఎక్కువగా వింటూ ఉండేవారు.
సంగీతంలో శిక్షణ
            కూతురి ఆసక్తిని గమనించి సంగీతంలో శిక్షణ ఇప్పించేందుకు రంగ రామానుజ అయ్యంగార్‌ వద్ద చేర్పించారు. అక్కడ ముత్తుస్వామి దీక్షితార్‌ కృతులు నేర్చుకున్నారు. తర్వాత ఆమె కడలూర్‌ శ్రీనివాస్‌ అయ్యంగార్‌, టి.ఆర్‌.బాలసుబ్రహ్మణ్యన్‌, ఆర్‌.యెస్‌ మణి గార్ల వద్ద మెరుగైన సంగీత శిక్షణ తీసుకున్నారు. ఒక వైపు సంగీతం నేర్చుకుంటూనే చదువు కొనసాగించారు. చెన్నైలోని క్వీన్‌ మేరీ కళాశాల నుండి పట్టభద్రురాలు అయ్యారు. చదువు పూర్తి అవ్వగానే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మద్రాస్‌లో ఉద్యోగం రావడంతో చేరిపోయారు.
ఉద్యోగం వదిలేసి
            1969లో జయరాంతో వివాహం అయిన తర్వాత తన ఉద్యోగాన్ని ముంబయికి బదిలీ చేయించుకుని అక్కడ తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. వాణి గాన నైపుణ్యాన్ని తెలుసుకున్న జయరాం ఆమె అభిష్టాన్నీ గ్రహించి హిందూస్థాని సంగీతంలో శిక్షణ పొందేందుకు ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ దగ్గర చేర్పించారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూ బ్యాంక్‌ ఉద్యోగానికి స్వస్తి పలికారు. సంగీతాన్నే తన వృత్తిగా మలచుకున్నారు. ఖాన్‌ శిక్షణలో భజన, గజల్‌, తు మి రీ వంటి వివిధ స్వర రూపాలలో నైపుణ్యాన్ని సంపాదించారు. 1969లో తన మొదటి బహిరంగ కచేరి ఇచ్చారు. అదే సంవత్సరం వసంత దేశారుతో పరిచయం అయ్యింది. ఆమె స్వరానికి ముగ్ధుడైన దేశారు తన ఆల్బుమ్‌లో పాటకు ఆమెను ఎంచుకున్నారు. ఈ ఆల్బమ్‌ మరాఠీ ప్రేక్షకులలో ఎంతో ప్రజాదరణ పొందింది.
జాతీయ పురస్కారం
            బాలీవుడ్‌లో ఆమెకు ప్రజాదరణ రోజు రోజుకు పెరగసాగింది. దక్షిణ భారత దేశం నుండి అవకాశాలు రాసాగాయి. 1973లో మొదటిసారి తమిళ పాటను రికార్డ్‌ చేశారు. అయితే ఆ చిత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. ఆమె పాడిన పాటలలో మొదట విడుదల అయినది 1973లోనే టి.ఎం.సౌందర్‌ రాజన్‌తో కలిసి పాడిన యుగళ గీతం ''ఓరు ఇదం ఉన్ని దం''. ఇది విడుదలైన అతి తక్కువ కాలంలోనే బాలచందర్‌, కె. విశ్వనాథన్‌ తమ చిత్రంలో సోలో పాటకు ఆమెను నియమించుకున్నారు. 'అపూర్వ రాగాంగల్‌' చిత్రంలో ఆమె అందించిన పాటలకు ఉత్తమ నేపధ్య గాయనిగా మొదటి జాతీయ చలన చిత్ర అవార్డును అందుకున్నారు. అప్పటి నుండి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. పురస్కారాలు వెల్లువలా వచ్చి పడసాగాయి. తమిళనాడు రాష్ట్రం ఉత్తమ మహిళా నేపధ్య గాయనిగా గుర్తించి పురస్కారాన్ని అందించింది.
తెలుగులో అవకాశాలు
            ఇక తెలుగులో కూడా ఆమెకు అవకాశాలు రాసాగాయి. తెలుగులో తొలిసారిగా 'అభిమానవంతులు' చిత్రం కోసం పాడారు. 1975లో వచ్చిన 'పూజ' చిత్రంలోని పాటలు ఆమెను తెలుగు చిత్ర సీమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచాయి. కె.విశ్వనాధ్‌ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం చిత్రంలో ఐదు పాటలు పాడి విశేష ప్రజాదరణ పొంది రెండవ జాతీయ చలన చిత్ర పుర స్కారాన్ని అందుకున్నారు. ఆ చిత్రంలోని పాటలకే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి ఉత్తమ నేపధ్య గాయనిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.
కవిత్వం కూడా రాశారు
            మలయాళ, కన్నడ భాషాలలోనే కాక దాదాపు 16 భాషలలో పాటలు పాడి ప్రజాదరణ పొందారు. ఇన్ని పాటలు పాడిన వాణి జయరాం సంగీత ప్రపంచంలో ఎన్నో ఓడిదుకులను ఎదుర్కొన్నారు. కొన్ని సమస్యల వల్ల అనుకున్న సమయంలో పాటలన్ని ఆగిపోయాయి. అయిన ఆమె నిరాశ పడలేదు. ఆమెకు కవితలు రాయడం అంటే ఏంతో ఇష్టం. హిందీ భాషలో అనేక కవితలు రాసారు. రోజుకు 48 గంటలు ఉన్నా తనకు సరిపోవని అప్పుడప్పుడు ఆమె అంటుండేవారు. అంత బిజీగా గడిపేవారు.
పద్మభూషణ్‌ తీసుకోకుండానే...
            ఈ సంవత్సరం 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాణి జయరాంకు కేంద్ర ప్రభుత్వం కిందటి నెలలో పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారాన్ని స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆ పురస్కారాన్ని స్వీకరించ కుండానే ఆవిడ మరణించడం ఎంతో బాధాకరం. భర్త జయరాం ఐదు సంవత్సరా కిందట కన్నుమూశారు. ప్రజల మనసుల్లో తన గానంతో చెరగని ముద్ర వేసిన వాణి జయరాం మన మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారు.
- పాలపర్తి సంధ్యారాణి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సౌందర్య కోమ‌లం
జుట్టును పెంచే ఆహారం
వేసవిలో చల్లచల్లగా...
గ్యాడ్జెట్స్‌కి సెలవివ్వండి
జిడ్డు వదలాలంటే..?
అలసిపోకుండా...
'నన్ను నేను మలుచుకున్నా'
అమ్మాయిల తడాఖా...
ఎండు చెట్ల చిత్రాలు
ఈ పండ్లు తినండి
ప్రణాళిక వేసుకోండి..
సిద్ధిపేట పాటల ఐడిల్‌
జయించడానికి మార్గాలు..
స్త్రీ శక్తికి చిహ్నం గులాబీ దండు
అమ్మ ఎందరికో ఆదర్శం
ముందస్తు జాగ్రత్తలు
విజయ సాకేతం
జీవకళ ఉట్టిపడే చిత్రాలు
ఉగాది రుచులు..!!
పండుగ శోభ
అనాథలకు అమ్మగా...
హాని చేయని కొయ్యబొమ్మలు
పాదాల పగుళ్ళకు...
మొలకలు తినండి
ఆమే ఓ ఉత్తేజం
చదువు చెప్పే ఆటలు నేర్పే 'యుక'
ఆత్మవిశ్వాసం నింపండి..
సాహిత్యంతో సమాజ పురోగమనం
ఉత్సాహంగా గడిపేద్దాం
ప్రోటీన్లు చాలా అవసరం

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.