Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బలమైన మహిళా శ్రామికశక్తి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

బలమైన మహిళా శ్రామికశక్తి

             సరళా అహుజా... ఇంటి నుండే అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్యాక్టరీలో కుట్టు పనిచేసిన ఈమె ఢిల్లీలోని తన ఇంట్లో షాహీ ఎక్స్‌పోర్ట్స్‌ను ప్రారంభించారు. నేడు ఇది భారతదేశంలో అతిపెద్ద ఎగుమతి సంస్థగా మారింది. అనేక అంతర్జాతీయ క్లయింట్లతో 65శాతం కంటే ఎక్కువ మంది మహిళలు కూడిన బలమైన శ్రామికశక్తిని కలిగి ఉంది. దీని ఎదుగుదల కోసం ఆమె చేసిన శ్రమ, కృషి గురించి నేటి మానవిలో...
             షాహీ ఎక్స్‌పోర్ట్స్‌ భారతదేశపు అతిపెద్ద దుస్తులు తయారీ సంస్థ. 1970ల ప్రారంభంలో దాని వ్యవస్థాపకురాలు సరళా అహుజా ఇంటి నుండి తాత్కాలిక యూనిట్‌గా ఇది ప్రారంభమైంది. నేడు 1,15,000 ఉద్యోగుల శ్రామిక శక్తిని కలిగి ఉంది. భారతదేశం అంతటా 51 కర్మాగారాల నుండి ఈ సంవత్సరం రూ. 8,244 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద బ్రాండ్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం సుమారుగా రోజుకు 10,000 ఆర్డర్లు పొందుతుంది.
కుట్టు ఆపరేటర్‌గా...
             సరళా అహుజా వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా రెండేండ్ల కిందట ఆమె తన పదవి నుండి రిటైర్‌ అయ్యారు. అయినా కంపెనీ విస్తరణ, అభివృద్ధి, కొత్త కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూనే ఉన్నారు. షాహీలో ఆర్గనైజేషనల్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌గా ఆమె మనవడు అనంత్‌ అహూజా బాధ్యతలు చూస్తున్నాడు. ప్రస్తుతం ఆమెకు కాస్త జ్ఞాపకశక్తి తగ్గింది. అయినప్పటికీ మహిళల బలమైన వర్క్‌ఫోర్స్‌ను నిర్మించడంలో, స్థిరమైన భవిష్యత్తు కోసం కృషి చేయడంలో షాహి ప్రణాళికలను ఆమె వివరిస్తుంది. 16 ఏండ్ల వయసులో వివాహం చేసుకున్న సరళ, 22 ఏండ్ల వయసులో ఒక కర్మాగారంలో కుట్టు మిషన్‌ ఆపరేటర్‌గా పని చేసేవారు. పని, ఇల్లు రెండింటినీ నిర్వహించడం కష్టంగా ఉండడంతో ఒక సంవత్సరం తర్వాత ఆ పని వదిలేశారు
చాలా కష్టపడాల్సి వచ్చింది
             ''అయితే నాకు ఇంటి నుండి పని చేయడానికి ఆర్డర్‌లు వచ్చాయి. అది నాకు దొరికిన మంచి అవకాశం. అతి తక్కువ కాలంలోనే యుఎస్‌కి ఎగుమతి చేయవల్సి వచ్చింది. ఆ ఆర్డర్‌ల కోసం దాదాపు 15 మంది వర్కర్లను నియమించుకున్నాను'' ఆమె చెప్పారు. ఇది అంత సులభం కాదు. పని చేయడం కోసం ఆమె ఇంటికి వస్తున్న కార్మికులు, బయట చారు తాగడం గురించి ఇరుగుపొరుగు వారు నిరంతరం ఫిర్యాదు చేశారు. కానీ కుటుంబం మద్దతుతో వచ్చిన ఆర్డర్‌లను పూర్తి చేయగలిగారు. దీనికోసం సరళ చాలా కష్టపడాల్సి వచ్చింది. షాహీ ఎదుగుదల వేగంగా ఉంది. రూ. 5,000 పెట్టుబడితో ఆమె 1974లో ఢిల్లీలోని రంజిత్‌ నగర్‌లో షాహీ ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పారు. రోజుకు దాదాపు 200 ఆర్డర్లతో వ్యాపారం నేరుగా అమెరికా, యూరప్‌లకు నెట్‌వర్క్‌ల ద్వారా ఎగుమతి చేయబడింది. అర్జంట్‌ ఆర్డర్‌ల కోసం కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు కష్టపడి పని చేయడం సరళకి గుర్తుంది.
షాహీ కొనసాగింపు...
             ఆమెకు హరీష్‌, సునీల్‌ అనే ఇద్దరు కొడుకులు. వీరు కాస్త ఎదిగిన తర్వాత పాఠశాల, కళాశాల నుండి వచ్చి సాయంత్రం పూట తల్లికి సహకరించేవారు. మనవడు అనంత్‌ మాట్లాడుతూ ''90వ దశకంలో మా నాన్న భారతదేశంలో వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేసే బాధ్యత తీసుకున్నారు. దాని దిగుమతులు చూసుకోవడానికి మా మామయ్య యుఎస్‌కి వెళ్లారు. అతి తక్కువ కాలంలోనే ఎగుమతులు బాగా పెరిగాయి'' అన్నారు. షాహికి మొదటి నుండి మహిళతో కూడిన బలమైన శ్రామికశక్తి ఉంది. ఇది తీను మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయమని సరళ చెప్పారు.
మురికి వాడలకు వెళ్ళి
             ''నేను సమీపంలోని మురికివాడల్లోని ఇళ్లకు వెళ్లి నా దగ్గర పని చేయమని మహిళలను ప్రోత్సహించాను. ఇల్లు లేకుండా వీధుల్లో నివసిస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. నాతో కలిసి పని చేయండి మీ పిల్లలకు మంచి విద్య, జీవితాన్ని అందించండి అంటూ వారికి అవగాహన కల్పించాను'' అంటూ ఆమె అప్పటి రోజులు ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో స్థానికులు చాలాసార్లు ఆమెను బెదిరించారు. కానీ అవేవీ ఆమెపై పని చేయలేదు. నేడు షాహీ తన 1,15,000 బలమైన వర్క్‌ఫోర్స్‌లో 77,000 మంది మహిళలను కలిగి ఉంది. ''లడ్కే షైతాన్‌ హోతే హైన్‌ (మగవారు చెడ్డవారు కావచ్చు)''. వారు తమ స్త్రీలను కొట్టి వారి డబ్బు మొత్తాన్ని ఎత్తుకుపోయేరు. వాస్తవానికి 22 ఏండ్ల కిందట బెంగళూరులోని తన ఫ్యాక్టరీ ప్రాంగణంలో షాహి మొదటిసారిగా ఏటీఎంని కలిగి ఉందని అనంత్‌ పంచుకున్నారు. మహిళలు నేరుగా వారి జీతాలను వారి ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. వారి సంపాదనపై నియంత్రణ కలిగి ఉంటారు. అనంత్‌ 2012లో వ్యాపారంలో చేరాడు. పని అభివృద్ధి, విభిన్న అంశాల పట్ల ఆసక్తి ఎక్కువ.
మహిళలకు లైఫ్‌ స్కిల్స్‌ ప్రోగ్రామ్‌
             2007లో షాహి మహిళా శ్రామిక శక్తి కోసం సరళ చూపిన మార్గంతో స్పూర్తి పొంది వారి కోసం వ్యక్తిగత జీవిత నైపుణ్యాల కార్యక్రమం, వ్యక్తిగత అభివృద్ధి, కెరీర్‌ మెరుగుదల (P.A.C.E) కోసం పైలట్‌ చేసిన మొదటి కంపెనీగా షాహీ అవతరించింది. ఇది కమ్యూనికేషన్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, నిర్ణయాధికారం, సమస్య పరిష్కారం, కార్యాలయంలో వారంవారీ గ్రూప్‌ సెషన్ల ద్వారా ఆర్థిక అక్షరాస్యత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 75,000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. షాహి తనP.A.C.E స్థాయిని పెంచడానికి లైసెన్స్‌ పొందిన మొదటి సంస్థ కూడా. దాని ఫ్యాక్టరీలకు మించి మహిళలకు శిక్షణ ఇస్తుంది. ఇది గురుగ్రామ్‌లోని టెక్స్‌ ఫాస్టెనర్స్‌ జిప్పర్‌ ఫ్యాక్టరీలో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కార్మికులు మెరుగ్గా పని చేయడంలో సహాయపడిందని అనంత్‌ అంటున్నారు. ఉత్పాదకత పెరుగుదలకు దారితీసింది. షాహీలో తన కుమారులు, మనవళ్ల పని పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని సరళ చెబుతున్నారు. ఆమె రెండేండ్ల కిందటి వరకు ప్రతిరోజూ ఫరీదాబాద్‌ ఫ్యాక్టరీని సందర్శించేవారు. కానీ అనారోగ్యం కారణంగా పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం షాహీ రీసైక్లింగ్‌ దుస్తులపై దృష్టిపెట్టింది. సానుకూల పర్యావరణ ప్రభావాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. హానికరమైన రసాయనాల స్థానంలో ప్రత్యామ్నాయాలను వెదుకుతుంది. అలాగే మన్నికను పెంచడంపై దృష్టి పెట్టింది. ఒకసారి వాడి పాడైపోయిన తర్వాత ఆ ఉత్పత్తిలో ఉపయోగించిన పదార్థాల విలువ కోల్పోకుండా భద్రపరచబడుతుంది. తిరిగి మళ్ళీ పనిలోకి తీసుకురాబడుతుంది.
పర్యావరణ హితంగా...
            ''వనరులతో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, వ్యర్థాలను బాగా ఉపయోగించుకోవడానికి, మరింత రీసైకిల్‌ చేయడానికి ఇది ఒక పెద్ద అవకాశం. రీసైక్లింగ్‌ దుస్తులను తయారుచేసే ప్రతి ప్రక్రియ పర్యావరణ అనుకూలమైనది. ఇది పూర్తిగా జీవఅధోకరణం చెందుతుంది'' అని అనంత్‌ చెప్పారు. అనంత్‌ సోదరుడైన ఆనంద్‌ అహూజా షాహీ రిటైల్‌ విస్తరణను నిర్వహిస్తున్నారు. ఇందులో భారతదేశంలో 35 నైక్‌ స్టోర్‌లు ఉన్నాయి. ''మేము స్కేల్‌లో ప్రభావాన్ని కొనసాగించాలనుకుంటున్నాం. కార్మికులకు మంచి జీవితాలను ఇవ్వాలనుకుంటున్నాం. నాన్న వ్యాపారాన్ని చూసుకుంటున్నపుడు ఇంత పరిమాణంలో కంపెనీని నడుపుతున్న మహిళా పారిశ్రామికవేత్త మరొకరు లేరు. ఆ ఘనత కేవలం నానమ్మకే దక్కుతుంది. షాహీని నిర్మించడానికి ఆమె చాలా కష్టపడి పని చేసారు. దీన్ని ఇలాగే కొనసాగేలా చూడడం మా బాధ్యత, కర్తవ్యం'' అన్నారు అనంత్‌.
- సలీమ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సౌందర్య కోమ‌లం
జుట్టును పెంచే ఆహారం
వేసవిలో చల్లచల్లగా...
గ్యాడ్జెట్స్‌కి సెలవివ్వండి
జిడ్డు వదలాలంటే..?
అలసిపోకుండా...
'నన్ను నేను మలుచుకున్నా'
అమ్మాయిల తడాఖా...
ఎండు చెట్ల చిత్రాలు
ఈ పండ్లు తినండి
ప్రణాళిక వేసుకోండి..
సిద్ధిపేట పాటల ఐడిల్‌
జయించడానికి మార్గాలు..
స్త్రీ శక్తికి చిహ్నం గులాబీ దండు
అమ్మ ఎందరికో ఆదర్శం
ముందస్తు జాగ్రత్తలు
విజయ సాకేతం
జీవకళ ఉట్టిపడే చిత్రాలు
ఉగాది రుచులు..!!
పండుగ శోభ
అనాథలకు అమ్మగా...
హాని చేయని కొయ్యబొమ్మలు
పాదాల పగుళ్ళకు...
మొలకలు తినండి
ఆమే ఓ ఉత్తేజం
చదువు చెప్పే ఆటలు నేర్పే 'యుక'
ఆత్మవిశ్వాసం నింపండి..
సాహిత్యంతో సమాజ పురోగమనం
ఉత్సాహంగా గడిపేద్దాం
ప్రోటీన్లు చాలా అవసరం

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.