Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతులు ఆనందంగా ఉంటే సమాజం బాగున్నట్లే | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Oct 05,2022

రైతులు ఆనందంగా ఉంటే సమాజం బాగున్నట్లే

- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- అన్ని రంగాలు వ్యవసాయ ఆర్థిక అభివృద్ధిపైనే ఆధారం
- వైభవంగా మంత్రి పుట్టిన రోజు వేడుకలు
- శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు
నవతెలంగాణ- వనపర్తి
             రైతులు ఆనందంగా ఉంటే సమాజం బాగున్నట్లేనని, వ్యవసాయం బాగుంటే ప్రజలందరూ బాగుపడతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గోపాల్‌పేట మండలం చాకల్‌పల్లి శివారులో డీ-8పై నిర్మించిన మైనర్‌ 5 కాలువ నుండి సాగునీటిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. అనంతరం రైతులతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని రంగాలు వ్యవసాయ ఆర్థిక అభివృద్ధి మీద ఆధారపడే జీవిస్తాయన్నారు. వివిధ వృత్తులు, ఉపాధి, వ్యవసాయం బాగుంటేనే అభివృద్ది చెందుతాయని అభిప్రాయపడ్డారు. గత ఎనిమిదేళ్లలో మారిన గ్రామాల రూపురేఖలే దానికి నిదర్శనమన్నారు. సాగు నీరు అందని మిట్టప్రాంతాల రైతుల సమస్యలు దృష్టికి రాగానే సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వివిధ వ్యవసాయం బాగుంటేనే అభివృద్ది చెందుతాయన్నారు. కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వర్షాలు ప్రారంభమైన ప్రతిసారీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మమ్మల్ని అప్రమత్తం చేస్తారన్నారు. చెరువులు, కుంటలను ఎప్పటికప్పుడు నిండుగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నా మన్నారు. దీనిమూలంగా భూగర్భ జలాలు పెరుగుతా యన్నారు. గత ఏడేళ్ల ప్రయత్నం మూలంగా రాష్ట్రంలోనే వనపర్తి జిల్లాలో భూగర్భ జలాలు అత్యధికంగా పెరిగా యన్నారు. నీటి ఆయకట్టును పెంచేందుకు నిరంతర ప్రయ త్నాలు అసంపూర్తి పనులన్నీ సరిచేస్తున్నా మన్నారు. డీ-8 కాలువపై మైనర్‌ 5 కాలువ నుండి గోపాల్‌పేట, ఎర్రగట్టు తండాకు నీటి విడుదల శారు. రైతుల కోరిక మేరకు కొత్త కాలువతో 300 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. పుట్టినరోజు నాడు రైతులకు సాగునీరు అందించే కాల్వను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సాగునీటిని సద్వినియోగం చేసుకోవడంలో రైతులలో అవగాహన పెరిగిందన్నారు. పంటల మార్పిడి, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలం భించడంపై రైతులు అవగాహన పెంచు కోవాలన్నారు. రాబోయే కాలానికి అవసరమైన పంటలు పండించడంపై రైతు వేదికల ద్వారా రైతులను చైతన్యం చేస్తున్నామన్నారు. తెలంగాణలో పని సంస్క తి పెరిగిందని మంత్రి చెప్పారు. దళితబంధు పథకం కింద మంజూరైన కారును లబ్ధిదారుడు ప్రేమ్‌కు అందజేశారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా స్వగృహంలో మాతమూర్తి సింగిరెడ్డి తారకమ్మ చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు. అంతకుముందు వనపర్తి మం డలం అంజనగిరిలో ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆశీస్సులు అందుకుని, ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్త రఘుపతి సతీమణి ఆనందమ్మకు పార్టీ ఇన్సూరెన్స్‌ ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును అందజేశారు.
మంత్రికి శుభాకాంక్షలు , ప్రముఖులు, రక్తదానం
             మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంత్రికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మాజీ ఎంపీ మందా జగన్నాధం, మహబూబ్‌ నగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌ రెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌ తదితరులు మంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌ వనపర్తి క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్‌ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
             మంత్రి పుట్టినరోజు సందర్భంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉద్యోగుల సెంట్రల్‌ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం అధ్యక్షులు చిలుక నర్సింహారెడ్డి, కార్యదర్శి ముక్రం, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ వెంకటేశం, కోశాధికారి శేఖర్‌, హబీబ్‌, శ్రీశైలం, అశ్వక్‌ హాస్టల్‌ విద్యార్థుల కోసం వంద బెడ్‌ షీట్లు అందజేశారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గత ఎనిమిదేళ్లలో వనపర్తి అభివృద్ధిపౖౖె రూపొందించిన డాక్యుమెంటరీ టీజర్‌ను మంత్రి విడుదల చేశారు. భాగ్యనగర్‌ పోస్ట్‌ మాసపత్రిక రూపొందించిన ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఎడిటర్‌ మల్యాల వీర రాఘవరెడ్డి, ప్రముఖ కవులు కోట్ల వెంకటేశ్వర్‌ రెడ్డి, వనపట్ల సుబ్బయ్య పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో వనపర్తి జెడ్పీ చైర్మన్‌ ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.