Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతన్నల ఆశలు ఆవిరేనా? | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

రైతన్నల ఆశలు ఆవిరేనా?

- తగ్గిన పత్తి ధర
- తెగుళ్ల బారిన పడి దెబ్బతింటున్న వరి పంట
- గతేడాది పత్తి ధర రూ.10 వేల పైనే..
- ఈసారి రూ.7,550 రైతులకు గిట్టుబాటుకాక దయనీయ పరిస్థితి
         కాయలున్న చెట్టుకే రాయి దెబ్బలన్నట్టుగా ఉంది నేడు దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి. అరకొరగా వచ్చిన పత్తి పంట దిగుబడికి గిట్టుబాటు ధరలేక.. విక్రయించుకోలేని పరిస్థితి ఒక వైపు.. మొగిపురుగు తెగుళ్లు సోకి వరి పంట పొలాలు నశించిపోతున్న దుస్థితి మరోక వైపు నెలకొనడంతో రైతన్నల ఆశలు ఆవిరవుతున్నాయి. ఆరుగాళం కష్టపడి పెట్టుబడులు పెట్టి అరకొరగా వచ్చిన పత్తి దిగుబడికి ధర కూడా గణనీయంగా తగ్గింది. దీంతో పండిన పత్తి దిగుబడిని విక్రయించుకోలేక ఇళ్లల్లో నిల్వ చేసుకున్నారు. మార్కెట్‌లో పత్తికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో వ్యాపారులు ముఖం చాటేశారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రెండేళ్లుగా పత్తికి ప్రాధాన్యత పెరడగం, భారీ ధరలు పలకడంతో మండలంలో పత్తిని అధికంగా సాగు చేశారు. గతేడాది దిగుబడి తక్కువగా ఉన్నా.. ధర ఉండడంతో ఆ ఆశతో ఈసారి పత్తిని సాగు చేశారు. గత ఏడాది క్వింటాల్‌కు రూ.10 వేలకుపైగా పలికిన ధర.. ఈసారి రూ.7,550లకు పడిపోయింది. దీంతో ఈ ఏడాది పత్తి సాగు కలిసిరాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నవతెలంగాణ-బెజ్జంకి
         మండలంలో సుమారు 7 వేల ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులు, నకిలీ విత్తనాలు, తెగుళ్లు తదితర కారణాలతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఈసారి కేవలం రెండు మూడు క్వింటాళ్లకు పరిమితమైంది. ప్రస్తుత ధరలను బట్టి ఎకరాకు రూ.12 వేలు నుంచి రూ.15 వేలు మాత్రమే వచ్చేలా ఉంది. పెట్టుబడి మాత్రం ఎకరాకు మెట్ట భూమిలో రూ.30 వేలు, తడి భూముల్లో రూ.40 వేలు వరకు ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు.
తగ్గిన కొనుగోళ్లు
         మండలంలోని పత్తిని సాగు చేసిన రైతులు దిగుబడిని విక్రయించడానికి మండలంలోని పత్తి మిల్లులకు తరలిస్తుంటారు. మార్కెట్‌ అనుసరించి ఇక్కడ పత్తి ధరల నిర్ణయం జరుగుతుంది. ఈ ఏడాది ధరలు తక్కువగా ఉండడంతో వ్యాపారులు నాణ్యత పేరును ఆసరాగా చేసుకుని ధరలను మరింత తగ్గిస్తున్నారని వినికిడి. ధర నచ్చకపోతే దిగుబడిని వెనక్కి తీసుకువెళ్లాలని వ్యాపారస్తులు రైతులకు చెప్పేస్తున్నారని... దీంతో మిల్లు వరకూ తీసుకువెళ్లిన పత్తిని రైతులు ఏదో ఒక ధరకు విక్రయించి వస్తున్నారని సమాచారం.
ఇళ్లలోనే పత్తి నిల్వలు
         పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో రైతులు పత్తి దిగుబడులను ఇళ్లకు చేర్చి నిల్వ చేశారు. కోత కోతకూ ఇళ్లలో పత్తి దిగుబడి నిల్వ పెరుగుతోందని, గిట్టుబాటు ధర మాత్రం లభించకపోవడంతో తాము నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధర పెరుగుతోందని ఎదురుచూపులు చూసిన రైతులు అప్పుల బాధలు తాళలేక కొందరు విక్రయిస్తున్నారని తెలుపున్నారు. భవిష్యత్తులో ధర పెరుగుతుందని భావిస్తూ మరి కొందరు రైతులు గంపెడాశతో పత్తి దిగుబడిని ఇళ్లల్లో నిల్వ చేస్తున్నారు.
తెగుళ్ల బారిన వరిపంట పొలాలు
         యాసంగిలో మండలంలో వరిపంట సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ముందస్తుగా వరినాటు చేశామని ఊపిరిపిల్చుకుంటున్న క్రమంలో మొగిపురుగు తెగులుబారిన పడి నశించిపోతున్నాయి. యాసంగిలో వరి పంటకు తెగుళ్లు సోకడంతో ఆశించిన దిగుబడి కలగానే ఉంటుందని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, వరి పంటలు రైతులకు మొండిచెయ్యి చూపుతున్నాయని, ప్రభుత్వం ఆదుకోవాలని, లేనిపక్షంలో దుర్భరస్థితి ఎదుర్కొంటారని రైతులు దిగాలు చెందుతున్నారు.
మిల్లుల నిర్వహణ భారం
         పత్తి పంటలపై పురుగు ఆశించడం, విత్తనాల్లో నాణ్యత లోపం వల్ల నూనె శాతం తగ్గడంతో పత్తి ధరలపై ప్రభావం చూపుతోందని పత్తి మిల్లుల యజమానులు చెబుతున్నారు. మార్కెట్‌లో పత్తి ధర ప్రభావం వల్ల రైతులు వారి ఇళ్లలోనే పత్తి దిగుబడిని నిల్వ చేసుకుంటున్నారు. పత్తి కొనుగోళ్లు లేక మిల్లుల వద్ద వేచి చూసుకుంటూ పడిగాపులు కాస్తున్నాం. పత్తి విత్తనాలు క్వింటాల్‌కు మార్కెట్‌ ధర రూ.3,300 ఉంది.
- పత్తి మిల్లుల యాజమానులు

మోసం చేస్తున్న ప్రభుత్వాలు

         కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే తీరు రైతులను ఆశలతో మోసం చేస్తున్నాయి. గతంలో పరిపాలన సాగించిన ప్రభుత్వాలు పంటలకు నష్టపరిహారం అందించాయి. నేటి ప్రభుత్వాలు వ్యవసాయ సాగు పరికరాలపై రాయితీలకు మంగళం పాడాయి. పత్తి దిగుబడికి ధర లేదు. .వరిపంటలు తెగుళ్లు బారినపడి నశించిపోయాయి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి.
- చెప్యాల శ్రీనివాస్‌, గుగ్గీల్ల రైతు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కంప్యూటర్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
పలు ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
విద్యుద్ఘాతంతో ఇల్లు దగ్ధం
చింతా ప్రభాకర్‌ ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
కురుమ సంఘం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం
కన్నుల పండుగ్గా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
బీరంగూడ శంబులింగేశ్వర ఆలయానికి తరలి వచ్చిన భక్తులు
రాంరెడ్డిపేటలో కంటి వెలుగు క్యాంపు
బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శివ జయంతి వేడుకలు
నర్సాయపల్లి లో స్వయం పరిపాలనా దినోత్సవం
మియాపూర్‌ టు సదాశివపేట మెట్రో విస్తరణకు మోక్షమెప్పుడు
నదినే మళ్లించిన కారణజన్ముడు కేసీఆర్‌
కేసీఆర్‌ ఈ మట్టి బిడ్డ కావడం గర్వకారణం
కేసీఆర్‌ ప్రధాని కావాలి
టి.బి వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్టులు అందజేత
దేశంలోనే విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని ప్రత్యేక పూజలు
బండ ప్రకాష్‌కు డిప్యూటీ చైర్మన్‌ పదవి ఇవ్వడం హర్షణీయం
రైతు కుటుంబానికి రైతుబీమా ఒక వరం
తీగుల్‌ మండలం కల సాకారమయ్యేదెప్పుడో?
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
బీసీల సంక్షేమానికి సీఎం కృషి
గొల్ల కుర్మలపై నిబద్ధత కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్‌
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న మున్సిపల్‌ పాలకవర్గం
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
దౌలాపూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం విజయవంతం

తాజా వార్తలు

05:24 PM

IPL : సన్ రైజర్స్ కు భారీ విజయలక్ష్యం నిర్ధేశించిన రాజస్థాన్

05:16 PM

వ్యాన్-ట్రక్కు ఢీ..ఐదుగురు మృతి

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

10:27 AM

పాక్‌లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.