Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మొక్కుబడిగా మండల సర్వ సభ సమావేశం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • May 19,2022

మొక్కుబడిగా మండల సర్వ సభ సమావేశం

- కార్యదర్శుల విధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెడ్పీటీసీ
- నవతెలంగాణలో కథనం అంశంను లేవనెత్తిన సర్పంచ్‌
నవతెలంగాణ -మునుగోడు
                మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు అభివద్ధి ప్రణాళికలపై ప్రతి మూడు నెలలకోసారీ నిర్వహించుకునే మండల సర్వసభ్య సమావేశం ఇలాంటి తీర్మానాలు లేకుండానే మొక్కుబడిగా సాగింది. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశంలో పశుసంవర్ధక శాఖ , ఆరోగ్యశాఖ , బీసీ బాలుర హాస్టల్‌ , ఉపాధి హామీ , శిశు సంక్షేమ శాఖ , హార్టికల్చర్‌ , ఎక్సైజ్‌ శాఖ , వైద్యశాఖ అధికారులు తమ నివేదికలను చదివి వినిపించగా మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్‌ గైర్హాజర్‌ కావడంతో మండల విస్తరణ అధికారి ఎం.నరసింహ గౌడ్‌ నివేదికను సమావేశలో ప్రవేశపెడుతున్నడంతో ఎల్గాల గుడెం సర్పంచ్‌ సురిగి చలపతి కలగజేసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలి చార్జీలలోనే ధాన్యం పోసిన భూమి చార్జీల పేరుతో పాటు సెంటర్‌లో పనిచేసే ఇన్‌చార్జికి ఇవ్వాలని సాకుతో రైతుల నుండి అదనంగా బస్తా కు రెండు నుండి మూడు రూపాయలు తేమ శాతం పేరుతో 2 వేలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం తమ దష్టికి రాలేదని కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా పర్యవేక్షణ చేపడతామని వివరణ ఇచ్చారు. విద్యుత్‌ ఏఈ వరప్రసాద్‌ విద్యుత్‌ శాఖ ఎజెండాను ప్రసంగిస్తుండగా ఈనెల 16న నవ తెలంగాణ లో ప్రచురితమైన 'ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌' ఈ పథకం అమలులో ఉందా ..? అమలులో ఉంటే ఎస్సీ ఎస్టీ ల నుండి వేలకు వేలు బిల్లులు ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీశారు. నూట ఒక్క యూనిట్‌ ఉచిత విద్యుత్‌ అమల్లోనే ఉందని నూట ఒక్క యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీలు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు . మిషన్‌ భగీరథ , మిషన్‌ భగీరథ ఎంట్రా ఏఈ లు మణిదీప్‌ , అజరు కుమార్‌ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా సిబ్బందితో ఎప్పటికప్పుడు మండలంలోని ప్రతి గ్రామానికి నీటిని అందిస్తున్నామని అనడంతో మునుగోడు సర్పంచ్‌ మిర్యాల వెంకన్న తమ గ్రామపంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని సంబంధిత అధికారుల దష్టికి తీసుకెళ్లినప్పటికీ నీటి సమస్య పరిష్కారం కాలేదని సభ దష్టికి తీసుకువచ్చారు. రావిగూడెం సర్పంచ్‌ గుర్రం సత్యం తమ గ్రామ పంచాయతీ పరిధిలోని కార్మిక నగర్‌కు వెళ్లే పైప్‌ లైన్‌ చిట్యాల రోడ్డు విస్తీర్ణంలో పైపులు పగిలి పోవడంతో ఆ కాలనీ ప్రజలు మిషన్‌ భగీరథ నీటిని కి తాగ నోచుకోలేక పోతున్నారని వాపోయారు. ఈ విషయంపై డిఈఈ దష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి రవి ముదిరాజ్‌ మాట్లాడుతూ గ్రామాలలో విధులు నిర్వహించే కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాల్సిన బాధ్యతను మరిచి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు తెలియని పరిస్థితి దాపురించిందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ దష్టికి తీసుకువచ్చారని విధులు నిర్వహిస్తున్న కార్యదర్శిలపై పర్యవేక్షణ లోపంతోనే తమ ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తదనంతరం ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్‌ మాట్లాడుతూ ఆర్‌ అండ్‌బీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు సంబంధిత మండల ఆర్‌ అండ్‌బీ ఏఈ శిరీష కుమార్‌ మండలంలో వేలకోట్ల తో పనులు ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులను ఆహ్వానం చేయకుండా పనులను ప్రారంభిస్తూ ప్రజా ప్రతినిధులను అవమాన పరిచే విధంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి యాకూబ్‌ నాయక్‌ , తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాసులు , వైస్‌ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్‌ , ఎంపీటీసీలు , సర్పంచులు , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎక్కడ చూసినా చరిత్ర ఆనవాళ్లే!
జాతీయ లోక్‌ ఆదాలత్‌లో 9972 కేసులు రాజీ
లారీ బోల్తా
సంఘం నారాయణరెడ్డి జీవితం నేటి సమాజానికి ఆదర్శం
పాడి రైతులకు ప్రభుత్వం పెద్దపీట
ప్రభుత్వ విప్‌ సునీత పరామర్శ
పక్కా ప్రణాళికలతో పట్టణాభివృద్ధి
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
పల్లె ప్రగతితో గ్రామాలభివృద్ధి
సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన
ప్రాణాంతకమైన డ్రగ్స్‌ నివారణకు యువత బాధ్యతగా ఉండాలి
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే దారి ప్రతిపాదన
రాజీమార్గమే రాజామార్గం
డ్రయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయండి
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
రైతుల సమస్యలను పరిష్కరించాలి
ఎత్తిపోతలకు మరమ్మతులు చేపట్టాలి
ఐదో విడత పల్లె ప్రగతి సిబ్బందికి కలెక్టర్‌ సన్మానం
అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
600 లీటర్ల నాటుసారాపట్టివేత
ఆపన్నహస్తం కోసం ఎదురు చూపులు
ఔత్సాహికులకు వివిధ పథకాలపై అవగాహన కల్పించాలి
సమగ్ర బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
28 నుండి రైతుబంధు డబ్బులు జమ
డ్రగ్స్‌ వినియోగంతో యువశక్తి నిర్వీర్యం
లింగనిర్దారణ పరీక్షలు నిర్వహిస్తే కఠినచర్యలు
కుట్టుమిషన్లు ఇస్తామని స్వచ్ఛంద సంస్థ మహిళలకు టోకరా
పల్లెప్రగతి,ఉపాధిహామీపై రివ్యూ
వ్యర్ధ రసాయనాల ట్యాంకర్‌ పట్టివేత
ప్రముఖుల పర్యటనలో పాటించాల్సిన నిబంధనలపై సమీక్ష

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.