Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మనువాదంపై పోరాటమే అంబేద్కర్‌కు ఘనమైన నివాళి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

మనువాదంపై పోరాటమే అంబేద్కర్‌కు ఘనమైన నివాళి

నవతెలంగాణ - భువనగిరి
            నేటికీ సమాజంలో కొనసాగుతున్న కులవివక్షత, అంటరానితనానికి వ్యతిరేకంగా మనువాద సిద్ధాంతం పై పోరాటమే డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గారికి ఘనమైన నివాళులర్పించడం అవుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ తెలిపారు. మంగళవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 66వ వర్ధంతి సందర్భంగా భువనగిరిలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, సీపీఐ(ఎం) భువనగిరి మండల కార్యదర్శి వర్గ సభ్యురాలు కొండమడుగు నాగమణి తో కలిసి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ 75 సంవత్సరాల భారతావనిలో నేటికీ సామాజిక అసమానతలు కొనసాగడం చాలా దారుణమైన పరిస్థితి అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గారి స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పీసీసీ డిలిగేట్‌ మెంబర్‌ తంగేళ్ళ పల్లి రవి కుమార్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ కుటుంభ సభ్యులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 66 వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించే తీరిక మున్సిపల్‌ కమీషనర్‌, చైర్మన్‌ లకు లేకుండా పోయిందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ బర్రె జహంగీర్‌ అన్నారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి, వర్థంతి కార్యాక్రమాలు నిర్వాహించి దళిత సామాజిక వర్గాల ప్రజలను ఆకార్షించేందుకు కపట ప్రేమను చూపుతు, తమ వైపు తిప్పుకొనేందుకు స్వర్గ ప్రయత్నాలు చేస్తుంటే , భువనగిరి మున్సిపల్‌ కమిషనర్‌, చైర్మన్‌ మాత్రం అంబేద్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కూడా నిర్వహించడం లేదన్నారు . మంగళవారం భువనగిరి పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వర్థంతి కార్యక్రమం నిర్వహించారు.
భువనగిరి : డిసెంబర్‌ 7 నుండి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా నిర్ణయం తీసుకోవాలని కరెన్సీ నోట్లపై అంబేద్కర్‌ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మన్‌ కొడారి వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 67 వ వర్థంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్‌ విగ్రహం కు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్‌ ఫోటో సాధన సమితి జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య సాధన సమితి జిల్లా నాయకులు భానోతు భాస్కర్‌ నాయక్‌ రావుల రాజు, బుగ్గ రమేష్‌, రాచమల్ల సుదర్శన్‌ , మహ్మద్‌ షానూర్‌ బాబా తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు ఆధ్వర్యంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర వర్థంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రావుల రాజు, బీసీ నాయకులు సహదేవ్‌,ఇట్టబోయిన పావని, రాళ్ళబండి వనజ, హరికృష్ణ పాల్గొన్నారు.
ఆలేరురూరల్‌ : మండలంలోని కొలనుపాక గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహానికి కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం మనం నిరంతరం కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్‌,గ్రామశాఖ అధ్యక్షుడు విజేందర్‌ రెడ్డి,చాడ రాజు,మహేష్‌,ఇమ్రాన్‌ ఖాన్‌,నాయకులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 66వ వర్థంతి సందర్భంగా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జై భీమ్‌ యూత్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధ మల్ల అశోక్‌ ,డైరెక్టర్‌ ఆరె మల్లేష్‌ రాగాపురం సర్పంచ్‌ బక్క రాంప్రసాద్‌ ,జై భీమ్‌ యూత్‌ గౌరవ అధ్యక్షులు గడ్డం నాగరాజ్‌, అధ్యక్షులు సంపత్‌ కుమార్‌ ,బంగారయ్య, శ్రీకాంత్‌, తమ్ముడి సంపత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని కొలనుపాక గ్రామంలో టీిఆర్‌ఎస్‌ మండల ్ట అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఆరుట లక్ష్మీ ప్రసాద్‌ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్‌ రాజబోయిన కొండల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు దూసరి గణేష్‌, సొంటెం ప్రవీణ్‌ ,అమృతం బాలరాజు ,రాజు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
రాజాపేట: మండలంలోని పారుపల్లి, బొందుగుల, పాముకుంట తదితర గ్రామాలలో అదేవిధంగా పట్టణ కేంద్రంలోని అంబేద్కర్‌ నగర్‌లో డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ 66 వ వర్థంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షులు చింతల దేవదాస్‌, స్థానిక సర్పంచ్‌ ఆడెపు ఈశ్వరమ్మా శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ ఎర్రగోకుల కృష్ణ, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి అశోక్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు నేమీల మహేందర్‌ గౌడ్‌, మోత్కుపల్లి నవీన్‌ కుమార్‌, విజిలెన్స్‌ బోర్డు మెంబర్‌ సందిల భాస్కర్‌ గౌడ్‌, కుమ్మరి లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.
అడ్డగూడూరు:మండలకేంద్రంలో అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా టీిఆర్‌ఎస్‌ ఆద్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీపీి దర్శనాలు అంజయ్య, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిప్పలపల్లి మహేంద్రనాద్‌ ,పీఏసీఎస్‌ చైర్మెన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు ,సర్పంచ్‌ బాలెంల త్రివేణి దుర్గయ్య పాల్గొన్నారు. మండలకేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కడియం సోమన్న ,జిల్లా నాయకులు కూరాకుల వెంకటేశ్వర్‌ రావు , ,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మేకల ఇమ్మానియల్‌ ,తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్‌: అంబేద్కర్‌ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని హైదరాబాద్‌ - వరంగల్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి స్థానిక సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ఎండి దస్తగిరి, కోఆప్షన్‌ సభ్యులు ఎండి అక్బర్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు డాక్టర్‌ రాజేందర్‌, లోకదాసు ఉప్పలయ్య, గోస్కొండ సంజీవ, చంద్రయ్య, కట్ట ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్‌ నారాయణపురం : మండలకేంద్రంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 66వ వర్థంతి సందర్భంగా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ సంఘం అధ్యక్షులు కట్ట గాలిబ్‌,యువజన సంఘం అధ్యక్షులు గుండమల్ల సతీష్‌ కుమార్‌, నాయకులు మందుగుల బాలకృష్ణ, గుండమల్ల మల్లేష్‌, ఎం.లక్ష్మయ్య,గుండమల్ల రమేష్‌,మహేశ్వరం స్వామి,కట్ట బౌరేష్‌ ,మందుగుల సాయి కిరణ్‌,గుండమల్ల కృష్ణ,గుండమల్ల లింగస్వామి,మందుగుల శ్రీనివాస్‌, ఈసం సైదులు, బాలకృష్ణ,బొమ్మ శంకర్‌, వెంకటేష్‌,కట్ట శివ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ పట్టణకేంద్రంలోని రాజీవ్‌ స్మారక భవనంలో మంగళవారం కాంగ్రెస్‌పార్టీ మండలకమిటీ ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ 66వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌ఛార్జీ చల్లమల్ల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లింగోజిగూడెంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నర్సింహాగౌడ్‌, బోయ రామచంద్రం, నాయకులు బోయ దేవేందర్‌, మల్కాపురం నర్సింహా, ఎమ్‌డి.ఖయ్యుమ్‌, ఊదరి శ్యామ్‌, శ్రీనివాస్‌, చామకూర రాజయ్య, అరవింద్‌రెడ్డి, చెరుకు లింగస్వామిగౌడ్‌, కల్లెం దయాకర్‌, రాచకొండ భార్గవ్‌, బొంగు రమేశ్‌గౌడ్‌, ఎర్ర విక్రమ్‌, చరణ్‌, నాగరాజు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.
మోత్కూర్‌:అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కషి చేయాలని మోత్కూరు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి అన్నారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో, టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ బొల్లేపల్లి వెంకటయ్య, కమిషనర్‌ సి.శ్రీకాంత్‌, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, బొడ్డుపల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, మలిపెద్ది రజిత, వనం స్వామి, దబ్బేటి విజయరమేష్‌, కూరేళ్ల కుమారస్వామి, గనగాని నర్సింహ, పి.ఆనందమ్మ, ఎండి.షాహిన్‌ సుల్తానా, టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు చెడిపెల్లి రఘుపతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొణతం యాకూబ్‌ రెడ్డి, మాజీ చైర్మన్లు టి.మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్‌, ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్‌, కోఆప్షన్‌ మెంబర్‌ గనగాని నర్సిహ్మ, మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను, మహమద్‌ మజీద్‌, గ్రంధాలయ ఛైర్మెన్‌ కోమటి మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా మున్సిపాలిటీలో అంబేద్కర్‌ విగ్రహానికి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు, జిల్లా నాయకులు అవిశెట్టి అవిలుమల్లు, బద్దం నాగార్జున రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కారపోతుల వెంకన్న, మాజీ సర్పంచ్‌ బిక్షం, నాయకులు పల్లె బిక్షం, అన్నెపు నర్సింహ, ఉయ్యాల అంజయ్య, కోల శ్రీను, కొప్పుల రవీందర్‌ రెడ్డి, అవిశెట్టి కిరణ్‌, నిమ్మల శ్రీను, యాదగిరి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డ్‌ మెంబర్‌ కొణతం నాగార్జున రెడ్డి, జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు బయ్యని రాజు, నాయకులు సజ్జనం మనోహర్‌, కొంగరి మల్లేష్‌, నోముల వెంకన్న, కందుకూరి ప్రశాంత్‌, మామిడాల యాకేష్‌, కొప్పుల మధు, ఎడ్ల రాము, బి.శీను తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్‌ : మడల కేంద్రంలో మంగళవారం,
రాజ్యాంగ నిర్మాత,భారత రత్న,డా.బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి పురస్కరించుకొని టీ ఆర్‌ ఎస్‌ పట్టణ యూత్‌, బిజెపి, వైయస్సార్‌ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం మనం నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మోరిగాడి వెంకటేష్‌, కుండే సంపత్‌, ఏ నరసింహారెడ్డి,జె. శ్రీనివాసు, పి. శ్రావణ్‌, రాజు, రవీందర్‌,సందీప్‌, జి. నరేష్‌, సంతోష్‌,,ఎండీ షాబూ, మధు, ఫయాజ్‌, చింటూ, యాదగిరి ప్రశాంత్‌, టీంకు, మాధవ్‌, భరత్‌, రాజు, భరత్‌, తదితరులు పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల బహుజనుల రాజ్యాధికారంతోనే , రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కు నిజమైన నివాళి అని మాల మహానాడు జిల్లా నాయకులు తుంగ కుమార్‌ అన్నారు. ఆ సంఘం సమావేశం నిర్వహించారు. అంబేద్కర్‌ 66వ వర్ధంతి సందర్భంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. మాల సంక్షేమ సంఘము నాయకులు శికిలం శ్రీనివాస్‌, కొత్త కృష్ణ మాట్లాడుతూ బౌజనులకు రాజ్యాధికారం కావాలంటే అందరూ ఏకం కావాలని డబ్బులకు ఓటును అమ్ముకోవడం అంటే ఆయన్ని అవమానించినట్టే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్శింగరావు, రవి, పరిశరములు, శంకర్‌, చంద్రశేఖర్‌, దశరథ, కుమార్‌, కొత్త శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగ హక్కులను తొలగించేందుకు మతోన్మాద శక్తుల కుట్ర
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం
కమ్యూనిస్టులు కష్టజీవులు
రాజ్యాంగ ఫలాలు నేటికీ అందలేదు
వసంత పంచమి వేడుకలు
అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత
ప్రపంచంలోకెల్లా గొప్పది మన రాజ్యాంగం
కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ బడుల్లో విప్లవాత్మక మార్పులు
యువతను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి
లక్కీడ్రా విజేతలకు బహుమతులు ప్రదానం
ప్రతి గుండెకూ రాహుల్‌ గాంధీ సందేశం
మనువాద పాలకుల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలి
వేతనాలు చెల్లించకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం
సర్వసభ్య సమావేశంలో.. సమస్యల తోరణం
ఆడపిల్లలు ఉన్నతవిద్య పొందితేనే హక్కులు సాధ్యం
జీఎఎంపీఎస్‌-2023 క్యాలెండర్‌ ఆవిష్కరణ
'క్రీడలతో మానసికోల్లాసం'
26న ట్రాక్టర్‌ ర్యాలీని జయప్రదం చేయండి
అరకొర నిధులతో జాన్‌పహాడ్‌ సైదన్న ఉర్సు ఉత్సవాలు
మండలస్థాయి క్రీడలు
ప్రజాపంపిణీ వ్యవస్థను బలహీన పరుస్తున్న మోడీ ప్రభుత్వం
డీజిల్‌ దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ట్రాక్టర్లర్యాలీని జయప్రదం చేయండి
బీఎస్పీ రాష్ట్ర నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్‌ అరెస్టు
25న దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని ధర్నా

తాజా వార్తలు

10:21 AM

చివరి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఓడి కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

09:37 AM

అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్

09:30 AM

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి...

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.