Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-నాంపల్లి
74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నాంపల్లి మండలంలో జాతీయ జెండాలను ఎగురవేసి, స్వీట్లు పంచి, విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో పురవీధులలో తిరుగుతూ నినాదాలు చేస్తూ ఘనంగా నిర్వహించారు. నాంపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత రవీందర్‌ రెడ్డి, జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలల వేయగా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి శేషుకుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా తహసిల్దార్‌ కార్యాలయంలో తహసిల్దార్‌ చిలుకూరి లాల్‌ బహదూర్‌, స్త్రీ శక్తి కార్యాలయంలో స్త్రీ నిధి రాష్ట్ర, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గాలెంక ఇందిర, పసునూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో మండల విద్యాధికారి గురువా రావు, నాంపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కే.సంజీవరావు, నాంపల్లి గ్రామపంచాయతీలో ఉప సర్పంచ్‌ షేక్‌ అస్రాబి చాంద్‌ పాషా, పోలీస్‌ స్టేషన్లో సబ్‌ ఇన్స్పెక్టర్‌ నాగరాజు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ గంధం మోహన్‌ రావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వైద్యులు సయ్యద్‌ ఇక్బాల్‌, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పాఠశాల ప్రత్యేక అధికారి విజయ శ్రీ, మండలంలోని అన్ని గ్రామాలలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్‌ నేత, కుంభం జయవర్ధన్‌ రెడ్డి, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్‌, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు, జాతీయ అంబేద్కర్‌ యువ కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు గాలెంక గురుపాదం, కర్నాటి నాగరాజు, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ బెల్లి సత్తయ్య, వార్డు సభ్యులు గాదెపాక వేలాద్రి, పెద్దిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, కుంభం చరణ్‌ రెడ్డి, కామనబోయిన శ్వేత, దేవి రెడ్డి పద్మ, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో...
74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నాంపల్లి మండలంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హాజరై జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పానగంటి వెంకన్నగౌడ్‌, యువజన నాయకులు గడ్డం శ్రీను, నాంపల్లి వార్డు సభ్యుడు గాదెపాక వేలాద్రి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాంపల్లి సంజీవ, మండల మైనార్టీ సెల్‌ నాయకులు షేక్‌ చాంద్‌పాషా, గ్రామపంచాయతీ కోఆప్షన్‌ సభ్యులు నాంపల్లి నారయ్య, కోరే సాయిరాం, నాంపల్లి గిరి, కోనేటి సాయి, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ : మర్రిగూడ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో గురువారం 74వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ విఠల్‌ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ ఎస్సై సైదాబాబు, కానిస్టేబుల్స్‌ గణేష్‌, యాదయ్య, వహీద్‌, రవి, సైదులు, శ్రీకాంత్‌, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
మర్రిగూడ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో గురువారం 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాందాస్‌ శ్రీనివాస్‌ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మర్రిగూడ మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, కాడి కొండల్‌, పార్టీ సీనియర్‌ నాయకులు అమరేందర్‌ రెడ్డి, పిట్టల శ్రీను చిలువేరు వెంకటేష్‌, ఉపసర్పంచ్‌ వనపర్తి యాదయ్య, గొర్రె నరసింహ, రాజేందర్‌ నాయక్‌, పరుశురాం, పెద్దయ్య, జమ్ముల వెంకటేష్‌, ఎలిమినేటి సత్తిరెడ్డి, మేతరి శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్‌ కార్యాలయంలో...
మర్రిగూడ మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మార్వో శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జెడ్పిటిసి పాశం సురేందర్‌రెడ్డి, ఎస్సై సైదా బాబు, ఎంపీడీవో జె. వెంకటేశ్వరరావు, డీటీ తారక రామన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీను నాయక్‌, ఆర్‌ఐ బషీర్‌, వైస్‌ ఎంపీపీ కట్కూరు వెంకటేశం, దళిత బంధు డైరెక్టర్‌ లపంగి నరసింహ, మర్రిగూడ సర్పంచ్‌ నల్ల యాదయ్య, పత్రికా విలేకరులు, కార్యాలయ సిబ్బంది మహేష్‌, మధు, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ మండలంలోని పలు గ్రామాలలో గురువారం 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచులు గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పలు గ్రామాలు ఎంపీటీసీలు, సెక్రటరీలు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, గ్రామ పెద్దలు, యువకులు, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొనడం జరిగింది.రోగులకు నాణ్యమైన మందులు అందించాలి
నల్లగొండ కలెక్టరేట్‌ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వీసీ గోపాలరెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ, పాటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య తుమ్మ కృష్ణారావు, ఈసీ మెంబర్‌ లు సోమ రమేష్‌, డాక్టర్‌ ఆకుల రవి, డాక్టర్‌ అంజిరెడ్డి, ఆచార్య అల్వాల రవి, డాక్టర్‌ మిరియాల రమేష్‌, ఆచార్య రేఖ, డాక్టర్‌ హరీష్‌, డాక్టర్‌ దోమల రమేష్‌, పీడీలు మురళి శ్రీనివాసరెడ్డి, స్టూడెంట్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ లక్ష్మల్ల మధు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాలలో....
గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్జీ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపల్‌ సయ్యద్‌ మునీర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ అంతటి శ్రీనివాసులు, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కార్యాలయంలో...
గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా బిజెపి కార్యాలయంలో బిజెపి కిసాన్‌ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదిగోని శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు శ్యాంసుందర్‌ యాదవ్‌, వీరెల్లి చంద్రశేఖర్‌, నిమ్మల రాజశేఖర్‌ రెడ్డి, పాలకూరి రవి గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో...
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. నల్లగొండ పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్‌రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమిదే సుమన్‌, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని ఎంపీ ఉత్తంకుమార్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొంత వెంకటయ్య, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మాధవి,సూరెడ్డి సరస్వతి, నాయకులు పనస శంకర్‌, అల్లి సుభాష్‌ యాదవ్‌, ముంతాజ్‌, పుట్ట కోటయ్య,చింత యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి సాగర్‌ :గణతంత్ర దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు .ముందుగా జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జండా లను ఆవిష్కరించారు. పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ పెద్దపంగబాబు, తాహసిల్దార్‌ కార్యాలయంలో ఎంఆర్‌ఓ పాండునాయక్‌, మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీఓ అస్గర్‌ అలి, కేజీబీవీలో ఎస్‌ఓ స్వేత, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య, మేగ్యతండాలోసాజీ భిక్ష నాయక్‌ జాతీయ జండాలను ఎగురవేశారు.ఈకార్యక్రమంలో ఎంపిపి ఆంగోత్‌ భగవన్‌ నాయక్‌ ఎంపిఓ పద్మ ,మండల కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ రహీం, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ ఆవుల నాసర్‌ రెడ్డి ఎంపిటిసి రామనర్సమ్మ ,నాయకులు శాగం అంజిరెడ్డి, శాగం కోటిరెడ్డి,అల్లి పెద్దిరాజు మహిళ నాయకురాలు జంగాల లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
వేములపల్లి : 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం మండలంలో ఘనంగా నిర్వహించారు .మండలంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ వెంకటేశం ,మండల పరిషత్‌ కార్యాలయంలో ఎండిఓ దేవిక, స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఎస్సై శ్రీను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ సుచరిత, కోపరేటివ్‌ సొసైటీలో రాములుగౌడ్‌ మండలంలోని గ్రామపంచాయతీలలో ఆయా గ్రామాల సర్పంచులు జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య, జెడ్పిటిసి ఇరుగు మంగమ్మా వెంకటయ్య వైస్‌ ఎంపీపీ పాదూరి గోవర్ధన శశిధర్‌ రెడ్డి,సర్పంచులు అంకెపాక రాజు, చిర్ర మల్లయ్య, నామిరెడ్డి కరుణాకర్‌ రె డ్డి దొంతి రెడ్డి వెంకట్‌ రెడ్డి, ఝాన్సీ ప్రవీణ్‌ ,కృష్ణవేణి సుమన్‌ , ఎంపీటీసీలు శ్రీరామ్‌ రెడ్డి, పల్ల వీరయ్య, చైతన్య, లలిత, కార్యదర్శులు, ప్రభుత్వ సిబ్బంది,వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
కేతపల్లి : కేతపల్లి మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలో పరిశ్రమలలో వివిధ గ్రామపంచాయతీలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మండల తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ డీ.వెంకటేశ్వర్లు, మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీడీవో రమేష్‌ దీన్‌ దయాల్‌, పోలీస్‌ స్టేషన్లో ఎస్‌ఐ ఎం.అనిల్‌ రెడ్డి, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ అర్చన, పీఏసీఎస్‌ లో సీఈఓ వడ్డే నరసయ్య విద్యుత్‌ సబ్స్టేషన్‌లో ఏఈ గాబ్రెల్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గొప్పని స్వర్ణలత, ఎంపీపీ పెరుమాల శేఖర్‌ రెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ బోళ్ల వెంకటరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
పెద్దవూర : పెద్దవూర మండలంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో సూపరిండెంటు హఫీజ్‌ ఖాన్‌, తహశీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సైదులుగౌడ్‌, మహిళ సమాఖ్య భవనంలో ఏపీఎం విజయకుమార్‌, పీఏసీఎస్‌ కార్యాలయంలో చైర్మెన్‌ గుంటుక వెంకట్‌ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ నగేష్‌, విధ్యావనరుల కేంద్రంలో ఎంఈఓ బాలునాయక్‌, వ్యవసాయ కార్యాలయంలో ఏఓ సందీప్‌రెడ్డి, పోలీస్‌ స్టేషన్లో ఎస్‌ఐ పరమేష, ట్రాన్స్కో కార్యాలయంలో ఏఈ దాసయ్య, సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో డీఈ వేణు, స్థానిక పంచాయతీ కార్యాలయం లో కార్యదర్శి డాకు నాయక్‌, జెడ్‌పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో నోడల్‌ ఆధికారి శ్రీనివాస్‌ త్రివర్ణ భారత జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్‌ రెడ్డి, అధ్యక్షుడు జటావత్‌ రవినాయక్‌, ఎంపీటీసీలు జాటావత్‌ జ్యోతి కృష్ణ,కృష్ణారావు, డైరెక్టర్లు శ్రీను నాయక్‌, కిషన్‌ నాయక్‌, కర్నాటీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్‌ :చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జాతీయ జెండాను మున్సిపాలిటీ కమిషనర్‌ మందడి రామ దుర్గారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మున్సిపాలిటీ చైర్మెన్‌, కమిషనర్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ కూరెల్ల లింగస్వామి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, పందిరి గీత రమేష్‌, సిలివేరు మౌనిక శేఖర్‌, జిట్ట పద్మ బొందయ్య, రేముడాల లింగస్వామి, జమగండ్ల జయమ్మ శ్రీనివాస్‌ రెడ్డి, కాకులారపు బొర్రారెడ్డి గంట శ్రీనివాస్‌ రెడ్డి పొన్నం లక్ష్మయ్య ో ఆప్షన్‌ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల తహసిల్దార్‌ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో జక్కర్తి శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 1950 జనవరి 27న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అప్పటి నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్‌ కృషి మరువలేదని భారత రాజ్యాంగ విశిష్టతను ప్రతి పౌరుడు తెలుసుకొని మహనీయుల బాటలో నడవాలని ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ దేశ ప్రగతిని పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్‌ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, నయాబ్‌ తహసిల్దార్‌ రాగ్యా నాయక్‌, మున్సిపాలిటీ కమిషనర్‌ మందడి రామదుర్గారెడ్డి, రెవిన్యూ ఇన్స్పెక్టర్‌ మల్లికార్జున్‌, అదనపు రెవిన్యూ ఇన్స్పెక్టర్‌ రఫీధ్‌, వివిధ పార్టీలకు చెందిన నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో...
ఎంపీడీవో కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లాజర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మరల అలివేలు రామిరెడ్డి, ఎంపిటిసి లు పెద్ద బోయిన సత్తయ్య, గొలనుకొండ దశరథ, నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో....
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా హెచ్‌ఎం మాధవి జాతీయ జెండా ని ఆవిష్కరించడం జరిగింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు వల రకాల క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. విజేతలందరికీ బహుమతులు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపాలిటీ చైర్మన్‌ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వైస్‌ చైర్మన్‌ కూరెళ్ల లింగస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ బెల్లి సత్తయ్య, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, భవిత కేంద్రం ఉపాధ్యాయులు, ఎమ్‌ ఈ వో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయంలో నార్కట్పల్లి సిఐ శివరాం రెడ్డి జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్‌ ఐ ఎన్‌ ధర్మ ,మహిళా ఎస్సై అనిత, ఏ ఎస్‌ ఐ జాన్‌ రెడ్డి కానిస్టేబుళ్లు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు : బ్రిటీష్‌ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో మహనీయులు ప్రాణం సైతం లెక్కచేయకుండా అనేక ఉద్యమాలలో పాల్గొన్న మహనీయుల స్ఫూర్తితో విద్యార్థులు నడవాలని ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌ అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకరి బిక్షంగౌడ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు మహనీయుల వేషాదరణ వేసిన విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం పాఠశాలలో విద్యార్థులతో డాన్స్‌, ఉపన్యాసం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు బొడ్డు శ్రావణి నాగరాజుగౌడ్‌ , ఈద నిర్మల శరత్‌ బాబు , పాఠశాల చైర్మన్‌ పందుల లింగస్వామి , గ్రామ వార్డు సభ్యులు నరసింహ, గ్రామపంచాయతీ కోఆప్షన్‌ సభ్యులు పాలకూరి నరసింహ ఆ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులున్నారు.
చింతపల్లి :అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీపీ కొండూరు భవాని పవన్‌, జడ్పిటిసి కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి అన్నారు. గురువారం చింతపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు మాట్లాడారు. అనంతరం తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ విశాలాక్షి, పోలీస్‌ స్టేషన్లో స్థానిక ఎస్సై ఈ.రమేష్‌, ఎంఈఓ కార్యాలయం ముందు ఎంఈఓ గురువారావు, వైద్యాధికారి శ్రీదేవి, ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు సిడిపిఓ లావణ్య కుమారి, అన్ని గ్రామ పంచాయతీల కార్యాలయాల ముందు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు జెండా ఆవిష్కరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇంటి నిర్మాణానికి 3లక్షలు వెంటనే విడుదల చేయాలి
పేలిన విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌
యుద్ధ ప్రాతిపదికన భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
దేవాలయాల అభివృద్ధికి కృషి
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
తరుగుకు చెక్‌ పడదా..?
మాదకద్రవ్యాల నుండి దేశాన్ని కాపాడాలి
ముగిసిన కబడ్డీ పోటీలు
వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
ఆత్మీయ సమ్మేళనాలతో బంధం బలపడుతుంది
బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
వైభవంగా సీతారాముల కల్యాణం
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరణ
ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డికి సన్మానం
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన మిర్యాల
ఆట్రాసిటీి కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి
నాలుగేండ్లలోనే...
ఎవరికి...వారే
నాయకుడిని కాదు... మీ సేవకుడిని
ముగింపు సభకు కదిలిన ఎర్రదండు
పురపాలక వార్షిక బడ్జెట్‌కు కౌన్సిలర్లు ఆమోదం
ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మోడీ
పడకేసిన.. ప్రాథమిక ఆరోగ్యం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం,గోదాం ప్రారంభోత్సవం
ఆత్మీయసమ్మేళనాలతో బంధం బలపడుతుంది
మార్కెట్‌ కమిటీచైర్మెన్‌ లక్ష్మమ్మకు సన్మానం
సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శం
ప్రచారజాతాను జయప్రదం చేయండి

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.