Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రపంచంలోకెల్లా గొప్పది మన రాజ్యాంగం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

ప్రపంచంలోకెల్లా గొప్పది మన రాజ్యాంగం

- ముఖ్యమంత్రి సారధ్యంలో అనేక వినూత్న సంక్షేమ పథకాల అమలు
- గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ టీ.వినయ్‌ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
ప్రపంచంలోకెల్లా గొప్పది మన భారత రాజ్యాంగమని, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారతదేశంను నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ సారధ్యంలో భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్‌ టీ.వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు సారథ్యంలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలు అమలు చేస్తున్నారని, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కలెక్టర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ బండా నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రేగట్టే మల్లికార్జునరెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ మందడి సైదిరెడ్డి, జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరి, అదనపు కలెక్టర్లు ఖుష్భు గుప్త, భాస్కరరావు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్‌ కార్యాలయంలో..
గణతంత్ర దినోత్సవ వేడుకలను నల్లగొండ మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కేవీ.రమణచారి జాతీయ పథకాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ మందడి సైదిరెడ్డి, పాలకవర్గ సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ : 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో అధికారులు, నాయకులు గురువారం జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా జరుపుకున్నారు. కోర్టు భవనంలో జిల్లా జడ్జి జగ్జీవన్‌కుమార్‌ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సీఈవో ప్రేమ్‌కరణ్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్‌ బండ నరేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డిఓ జయచంద్ర రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రేమా రాజేశ్వరి పోలీస్‌ గౌరవ వందన స్వీకరించి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ కేఆర్‌కే ప్రసాద రావు, ఎస్‌బీ డీఎస్పీ మొగిలయ్య, నల్లగొండ డిఎస్పీ నరసింహరెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రమేష్‌, ఏఆర్‌ డీిఎస్పీ సురేష్‌ కుమార్‌, సీఐలు చంద్రశేఖర్‌ రెడ్డి, రౌతు గోపి,ఆది రెడ్డి, శ్రీను, ఆర్‌. ఐలు నరసింహచారి, స్పర్జన్‌ రాజ్‌, హరిబాబు, సంతోష్‌, శ్రీను, నరసింహ, కృష్ణరావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఈవో బొల్లారం బిక్షపతి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్డెంట్‌ లచ్చు నాయక్‌ జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో డిసిహెచ్‌ మాతనాయక్‌, వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు . వ్యవసాయ శాఖ కార్యాలయంలో జి డి ఏ సుచరిత జాతీయ జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కార్యదర్శి బాలమ్మ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో చైర్మెన్‌ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి సిబ్బంది కట్ట నాగయ్య శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కేవీ.రమణచారి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో చైర్మెన్‌ మందడి సైదిరెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ రౌతు గోపి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు లక్ష్మీ నరసయ్య, లచ్చిరెడ్డి, వెంకట్‌ రెడ్డి, ఏఎస్‌ఐ ఎంఎం రాజు, సిబ్బంది పాల్గొన్నారు. టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ చంద్రశేఖర్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై కంచర్ల భాస్కర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో తాసిల్దార్‌ నాగార్జునరెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్‌ బండ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. ఎండిఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనిమదే సుమన్‌ సిబ్బంది పాల్గొన్నారు. బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్‌ బండ నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ మందడి సైదిరెడ్డి, మీద వార్డుల కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కార్యాలయంలో జిల్లా రెడ్‌ క్రాస్‌ చైర్మెన్‌ గోలి అమరేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం బాలసదనం మహిళా శిశు వికలాంగుల హాస్టల్‌లో అనాధ విద్యార్థి విద్యార్థులకు చాక్లెట్స్‌ దుప్పట్లు హైజెనిక్‌ కిట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ పుల్లారావు, మేనేజింగ్‌ కమిటీ సభ్యులు జల్లా దశరథ, సూరెడ్డి సరస్వతి, ట్రెజరర్‌ మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రెడ్‌ క్రాస్‌ మెంబర్స్‌ ఆమంచి విజయకుమార్‌, నేతి విప్లవకుమార్‌, హాస్టల్‌ సూపర్వైజర్‌ జయమ్మ, బ్లడ్‌ బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాములు, టెక్నీషియన్స్‌ నిర్మల, అనిత, ప్రదీప్‌రెడ్డి, పాల్గొన్నారు. పట్టణంలోని 20వ వార్డు పెద్ద బండ సెంటర్‌ లో 20వార్డు మాజీ కౌన్సిలర్‌ ఎండి సలీమ్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గాదె నర్సింహ, పాక లింగయ్య, నోముల యాదయ్య మన్నే శంకర్‌ కొత్త అశోక్‌,కత్తుల సైదులు, బొజ్జ సైదులు కోట సైదులు యాదగిరి రెడ్డి, నాంపెళ్లి సైదులు, పాక మల్లయ్య, పద్మయ విద్యార్థులు,వార్డు ప్రజలు పాల్గొన్నారు.
జిల్లా కారాగారం నందు 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా జైలు సుపెరిండెట్‌ లకావత్‌ దేవ్లా ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండజిల్లా జైలు నాన్‌ అఫిషియల్‌ విజిటర్‌ మామిడి.పద్మాప్రసాద్‌, అల్లావుద్దీన్‌, జైలర్లు అనిల్‌, సబ్‌ జైలర్‌ నరేష్‌, మరియు వెంకట్‌ రెడ్డి జిల్లా జైలు అధికారులు సిబ్బంది తదతరులు పాల్గొన్నారు. అనంతరం ఖైదీ లకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
12వ బెటాలియన్‌ అనేపర్తి కమాండెంట్‌ ఆద్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ సాంబయ్య మహాత్మా గాందీ చిత్ర పటానికి పూల మాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్‌ రామ కృష్ణ, అసిస్టెంట్‌ కమాండెంట్‌ వెంకన్న, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పద్మశ్రీ, బెటాలియన్‌ సిబ్బంది పాల్గొన్నారు.
టీఎన్జీవో భవనంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రవణ్‌ కుమార్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో
కాంచనపల్లి కిరణ్‌ కుమార్‌, వెల్లంకి మాధవి ,నాగిళ్ల మురళి, మామిడాల రమేష్‌, శేఖర్‌ రెడ్డి, డీఐ రాజు, ఆకునూరు లక్ష్మయ్య, కోటేశ్వరచారి, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిర్యాలగూడ నియోజవర్గంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు కళాశాలలు స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ చెన్నయ్య, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ రవీంద్ర సాగర్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవనంలో అధ్యక్షులు గౌరు శ్రీనివాస్‌, డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పి వెంకటేశ్వరావు, పోలీస్‌ స్టేషన్లో సిఐలు రాఘవేందర్‌, సురేష్‌, సత్యనారాయణ, అగ్ర ఫామ్‌ లో ఫర్టిలైజర్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు వింజం రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షులు జవహర్‌ బాబు, ట్రాన్స్కో కార్యాలయంలో డిఈ వెంకటేశ్వర్లు, కోర్టులో న్యాయమూర్తులు, ఎస్సీ ఉద్యోగుల సంఘం భవనంలో అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్‌ ఐసిడిఎస్‌ కార్యాలయంలో సిడిపిఓ మమత, స్వచ్ఛంద సంస్థలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆ సంఘాల అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తిప్పన విజయసింహారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగర్‌ భార్గవ్‌, ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, వైస్‌ చైర్మెన్‌ కుర్ర కోటేశ్వరరావు, కాంగ్రెస్‌ టిడిపి నాయకులు నూకల వేణుగోపాల్‌ రెడ్డి, ఎంఏ సలీం,అర్జున్‌, బంటు వెంకటేశ్వర్లు, కాసుల సత్యం తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం కృషి చేసేవారు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్‌ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో గురువారం రిపబ్లిక్‌ డే సందర్భంగా స్థానిక శివాజీ నగర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు జిట్టా స్వామి, మహిళా సంఘం నాయకురాలు సరోజ, కందుల అనిత, వివిధ ప్రజాసంఘాల నాయకులు సుంచు రవి, చేకూరి మహేష్‌ ,సిహెచ్‌ శంకర్‌, సైదులు ,దుర్గేష్‌ ,రమేష్‌, ఎల్లమ్మ ,యాదమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల పట్టణములోని ప్రభుత్వ కార్యాలయాల్లో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో మార్కెట్‌ చైర్మెన్‌ జడల ఆది మల్లయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ కార్యదర్శి జానయ్య, మున్సిపల్‌ చైర్మెన్‌ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వైస్‌ చైర్మెన్‌ కూరెల్ల లింగస్వామి, కౌన్సిలర్‌ బెల్లి సత్తయ్య, సీపీఐ(ఎం) నాయకులు జిట్టా నగేష్‌, శీ ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్‌ : 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నకిరేకల్‌ పట్టణంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని పలు విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకురాలు చెరుకు లక్ష్మీ, ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ కార్యాలయంలో....
ప్రజా ప్రతిదుల హక్కులను కాలరాయడం దుర్మార్గమని ఎంపీపీ బాచుపల్లి శ్రీదేవి గంగాధర్‌ రావు పేర్కొన్నారు. గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. రాజ్యాంగ రచనలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పడిన కష్టం శ్రమ ఫలితమే నేడు ఈ స్వేచ్ఛ జీవితాలని పేర్కొన్నారు కావాలని కొంతమంది ప్రజాప్రతినిధులు మాలాంటి ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు ఎవరైనా తమ పరిధిలో ఉంటే మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నార్కట్‌ పల్లి :
74వ భారత గణతంత్ర వేడుకలు మండల వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసిల్దార్‌ మురళీమోహన్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎండిఓ యాదగిరి గౌడ్‌ , మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం డాక్టర్‌ శ్రీనివాస్‌ ఉపాధి హామీ కార్యాలయంలో ఏపీఓ యాదయ్య పంచాయత్‌ రాజ్‌ కార్యాలయంలో డివిజనల్‌ ఇంజనీర్‌ విష్ణువర్ధన్‌ రావు పోలీస్‌ స్టేషన్లో ఎస్సై బొడిగె రామకృష్ణగౌడ్‌, వ్యవసాయ కార్యాలయంలో గిరిప్రసాద్‌, పశువైద్యశాలలో వైద్యాధికారి ఆంగోతు రవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి సారా సుల్తానా, స్థానిక గ్రామపంచాయతీలో సర్పంచ్‌ దూదిమెట్ల స్రవంతి, గ్రంథాలయంలో పంచాయతీ కార్యదర్శి సుభానుద్దీన్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పాఠశాల ఇన్చార్జ్‌ ప్రధానోపాధ్యాయులు తడకమల్ల కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కల్లూరి యాదగిరి గౌడ్‌, ఎంపీటీసీలు ముత్తయ్య, పాశం శ్రీనివాస్‌ రెడ్డి, ఉండ్రా భాగ్యమ్మ, మేకల రాజిరెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చింతపల్లి బయన్న మాజీ జెడ్పిటిసి సత్తయ్య , అధికారులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శ్రీ చైతన్య పాఠశాలలో స్టోరీ నారేషన్‌, అబాకాస్‌ పోటీలు
ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీ జయప్రదం చేయండి
ఎన్జీలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
తిరందాసు గోపి స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి
ప్రజావాణిలో దరఖాస్తులను పరిష్కరించాలి
పోలీస్‌స్టేషన్‌కు చేసిన పదో తరగతి ప్రశ్నాపత్రాలు
మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
'చలో ఢిల్లీ'ని విజయవంతం చేయాలి
అతి తక్కువ వడ్డీకే బంగారురుణాలు
'కంటివెలుగు'ను సద్వినియోగం చేసుకోండి
ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి ఆశీర్వదించాలని కేసీఆర్‌ను కోరిన మందుల సామేలు
'కంటివెలుగు'ను సద్వినియోగం చేసుకోండి
కదలండి కార్మికులారా చలో ఢిల్లీకి
ఠానునాయక్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలి
జన చైతన్యయాత్రను జయప్రదం చేయండి
చలో ఢిల్లీని జయప్రదం చేయండి
పంటనష్టం పరిశీలన
ప్రమోషన్ల ప్రక్రియలో ఉన్న ఆటంకాలు తొలగించాలి
మల్లు స్వరాజ్యం ఆశయ సాధనకు కృషి చేయాలి
విద్యార్థులు ఉన్నతలక్ష్యాన్ని ఎంచుకోవాలి
ఒకవైపు ఆనందం... మరోవైపు దుఃఖం...
మామిడి, మిర్చి తోటలపరిశీలన
అన్ని దందాలు వాళ్లవే..
పేపర్‌ లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలి
అకాలవర్షం-అపారనష్టం
సీఎంకేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మలు దహనం
ప్రజాప్రతినిధులు పదవులకు వన్నె తేవాలి
వడగండ్ల బాధితులకు ప్రభుత్వం నష్ట పరిహారమివ్వాలి
ఆశాలపై పని భారం తగ్గించాలి
వీరనారి మల్లు స్వరాజ్యం స్పూర్తితో మహిళలు ఉద్యమించాలి

తాజా వార్తలు

08:29 PM

పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని

08:17 PM

పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ

08:10 PM

యో-యో టెస్ట్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు

07:52 PM

అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌నులను ప‌రిశీలించిన మంత్రి వేముల‌...

07:34 PM

ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

07:24 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

07:17 PM

ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

04:50 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు గురువారానికి వాయిదా

04:43 PM

చెట్టును ఢీకొన్న బస్సు.. పలువురికి గాయాలు

04:33 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:23 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

04:17 PM

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వంపై మమతాబెనర్జి నిరసన..

04:16 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు

04:04 PM

జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం..

03:54 PM

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

03:50 PM

ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు..

03:41 PM

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు...

03:41 PM

ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం..

03:22 PM

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

03:04 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు...

02:45 PM

దేవాన్ష్ పుట్టినరోజు..టీటీడీకి రూ.33 లక్షల విరాళం ఇచ్చిన లోకేశ్, బ్రాహ్మణి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.