Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

- జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్‌
              భారత దేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి గురువారం కలెక్టరు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని తన ప్రసంగంలో వివరించారు. తదుపరి జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్‌ రెడ్డి, శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్‌ తివారీ, జిల్లా రెవిన్యూ ఆడిషనల్‌ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు నారాయణరెడ్డి, రెవిన్యూ డివిజనల్‌ అధికారి ఎం.వి.భూపాల్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు, ఎంపీపీ నరాల నిర్మలతో కలిసి స్వాతంత్య్య్ర సమరయోధులు బత్తిని యాదగిరి ని సన్మానించారు. అనంతరం విశేష సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందచేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకు రుణాల కింద జిల్లా మహిళా సమాఖ్యకు 274 కోట్ల 50 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. మెప్మా వీధి విక్రయదారులకు 6 కోట్ల 19 లక్షల 40 వేల రూపాయల రుణాల చెక్కును అందజేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వారు సందర్శించారు. షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ ద్వారా కులాంతర వివాహ ప్రోత్సాహకం కింద ఇద్దరు లబ్దిదారులకు 2 లక్షలా 50 వేల చొప్పున చెక్కును అందజేశారు. దళిత బంధు పథకం కింద షెడ్యూల్డు కులాలకు ఉపాధి పెట్టుబడులకు గాను పది మందికి రూ. కోటి విలువ గల డ్రోన్‌ లు, సౌండ్‌ సిస్టమ్‌, టెంట్‌ హౌజ్‌, సెంట్రింగ్‌, కుట్టు మిషన్స్‌, జీరాక్సు మిషన్‌, సిమెంట్‌ ఇటుకల తయారీ పరికరాలు, పేపర్‌ ప్లేట్‌ మెషిన్‌, గూడ్స్‌ వెహికిల్‌ అందజేశారు. ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ, వ్యవసాయశాఖ, మహిళా సంఘాల ఉత్పత్తులు, స్వయం సహాయక సంఘాలు, విద్యాశాఖ ఆర్ట్‌ క్రాఫ్ట్స్‌, శ్రీప్రియ జీవనోపాదుల సంఘం, మత్స్య శాఖ, కంటి వెలుగు, వెనుకబడిన తరగతుల, సఖి కేంద్రం, కొయ్యలగూడెం హ్యండ్లూమ్స్‌ వస్త్రాల స్టాల్స్ణ్‌ను సందర్శించారు. అంతకు ముందు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బాలికల దేశభక్తి ప్రబోధ నృత్య గీతం అందరిని అలరించింది. జిల్లాలో నూతనంగా ఏర్పాటు అయిన విపత్తుల స్పందన బృందం తమ ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు కె అమరేందర్‌, జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు అమరేందర్‌ గౌడ్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మెన్‌ భికూనాయక్‌, జిల్లా పరిషత్‌ సిఇఓ కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం ఉపేందర్‌రెడ్డ్డి, ఏసీపీ వెంకటరెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మాన్యా నాయక్‌, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, అనధికారులు, సమాజ సేవకులు,పాల్గొన్నారు.
మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను గుత్తా నరేందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్‌, జడ్పిటిసి సబ్బురు బీరు మల్లయ్య హాజరై, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనంతారం ఎంపీటీసీ సామల వెంకటేశం, ముత్తిరెడ్డిగూడెం ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ, తుక్కాపురం ఎంపిటిసి రాసాల మల్లేష్‌, మాజీ పి ఏ సీ ఎస్‌ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ కంచి మల్లయ్య, ఎంపీఓ అనురాధ దేవి, ఉపాధి హామీ ఎపిఓ బాలస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
భువనగిరి : వైఎల్‌ఎన్‌ఎస్‌ బ్యాంకులో
వైఎల్‌ఎన్‌ఎస్‌ బ్యాంకు ఆవరణలో బ్యాంకు చైర్మెన్‌ మందాడి వెంకటరెడ్డి జాతీయ పతాకం ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్‌ చైర్మెన్‌ కొలుపుల వివేకానంద, డైరక్టర్లు చల్ల గరుగుల రఘుబాబు, సోమరాజిరెడ్డి, మంచాల ప్రభాకర్‌, నువ్వుల సుదాకర్‌, మాజీ డైరెక్టర్‌ రంగా కృష్ణయ్య, సిఇఓ వనమాల వనిత పాల్గొన్నారు. పెయింటింగ్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకని వైఎల్‌ఎన్‌ఎస్‌ బ్యాంకు వైస్‌ చైర్మెన్‌్‌ కొలుపుల వివేకానంద అవిష్కరించారు. వందనా సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్‌ అసోసియేషన్‌ అద్యక్షులు డి.వేంకటేశ్‌, పెయింటింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అద్యక్షులు దేవేదర్‌ పాల్గొన్నారు .
జిల్లా కేంద్రం లోని ప్రిన్స్‌ చౌరస్తా బాబు జగజ్జివన్‌ రావ్‌ విగ్రహం వద్ద భువనగిరి ముస్లిం జేఏసీ తరుపున 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడుతూ 1950 జనవరి 26 రోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఒక గొప్ప మహానుభావుడని కొనియాడారు.26 వ జనవరిరోజును దేశ వ్యాప్తంగా కుల, మతాలకు అతీతంగా ఒక పండుగ లా జరుపుకుంటారని అన్నారు. భారత రాజ్యాంగం లో దేశ ప్రజలకు ఇచ్చిన హక్కులు ఉచిత విద్య, వైద్యం, మత స్వేచ్ఛ హక్కు, ఓటు హక్కు ఇలాంటివి చాలా గొప్పవని తెలిపారు.ఈ కార్యక్రమం లో నాయకులు షరీఫ్‌, ఇబ్రహీం, అఫ్జల్‌, జావీద్‌ ఖాద్రి, ఆబిద్‌ అలీ, హఫీజ్‌, జహంగీర్‌,ఫాజిల్‌,అత్తర్‌, ముజీబ్‌,సలాఉద్దీన్‌,బర్రె జహంగీర్‌, శివ లింగం,ఇమ్రాన్‌, ఇస్తియాక్‌, ఇంతియాజ్‌, అంజద్‌, జలీల్‌, నేహాల్‌ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని భువనగిరి అతి పురాతనమైన డెకరేషన్‌ క్లబ్‌లో గౌరవాధ్యక్షులు, మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ బర్రె జహంగీర్‌ జెండాను ఆవిష్కరించారు. చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మెన్‌ పోతం శెట్టి చంద్రపాల్‌, కృష్ణమూర్తి, సాదు విజయకుమార్‌, గద్దె నరసింహ, స్వాగతం కృష్ణ, ఎండి జావేద్‌, బొబ్బిలి ఉమాశంకర్‌, మాయ ప్రభాకర్‌ పాల్గొన్నారు.
నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ను ఎండీ ఇంతియాజ్‌అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ స్టేట్‌ పి ఆర్‌ ఓ ఇశ్రత్‌ జహాన్‌ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇస్తియాక్‌ హ్యూమన్‌ రైట్స్‌ సభ్యులు హుస్సేన్‌ అలీ మహేష్‌ జుబేర్‌ ఎండీ సమీర్‌ ఎలియాస్‌ నిఖిల్‌ రెడ్డి పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురం : మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ , ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అమరవీరులకు జై అంటూ ప్రదర్శన నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, తహసీల్దార్‌ శ్రీనివాస రాజ్‌, ఎస్సై యుగంధర్‌, పీఏసీఎస్‌ చైర్మెన్లు జక్కిడి జంగారెడ్డి, దొడయాదిరెడ్డి, ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌ సురేష్‌, సర్పంచ్‌ సికిలమెట్ల శ్రీహరి,ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, గ్రామ పంచాయతీ భవనాల వద్ద సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు, రాజకీయ పార్టీ కార్యాలయాల ముందు అధ్యక్ష కార్యదర్శులు,జాతీయ నాయకుల విగ్రహాల వద్ద ఆ సంఘం నాయకులు, కుల సంఘాల అధ్యక్షులు జెండాల ఆవిష్కరించారు.
వలిగొండ : మండల కేంద్రంతో పాటు మండలంలో వివిధ గ్రామాలలో 74వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు తహసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ గణేష్‌ నాయక్‌ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ నూతి రమేష్‌ వ్యవసాయ మార్కెట్‌ వద్ద చైర్మన్‌ కూనపురి కవిత పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్సై ప్రభాకర్‌ ట్రాన్స్కో కార్యాలయం వద్ద ఏ ఈ మచ్చేందర్‌ వివిధ ప్రభుత్వ కార్యాలయం వద్ద అధికారులు గ్రామ పంచాయతీలలో సర్పంచులు మండల కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయం వద్ద పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ వివిధ కుల సంఘాలు జెండా ఆవిష్కరణ గావించారు ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిరిపంగి స్వామి కూర శ్రీనివాస్‌ జ్ఞానబోయిన యాదగిరి గణేష్‌ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు
భూదాన్‌పోచంపల్లి : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మండల పరిషత్‌ కార్యాలయంలో పోలీస్‌ స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయాలు, రామనంద తీర్థ యూనివర్సిటీ ప్రభుత్వాసుపత్రిలో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, మున్సిపల్‌ కార్యాలయంలో, ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయంలో, అంగన్వాడి కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా శాంతినికేతన్‌ పాఠశాల విద్యార్థులు నేషనల్‌ లీడర్స్‌ మహాత్మా గాంధీ సుభాష్‌ చంద్రబోస్‌ అల్లూరి సీతారామరాజు భరతమాత వేషధారణతో పాటు సంస్కృతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి పురస్కరించుకొని సరస్వతి దేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు స్లేట్‌ అందించి ఓంకారం తోఅక్షరాభ్యాసం చేయించారు పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉపాధ్యాయులు ఎడ్ల తిరుమలరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే లలిత సంధ్య శారద సంతోష రవళి అంకిత శిరీష ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండలంలోని యావపూర్‌ గ్రామంలో యువ డిఫెన్స్‌ అకాడమీ కాలేజ్‌ ఆవరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఏ డి జి అండ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా మేఘాలయలో బాధ్యతలు నిర్వహించిన ఐపీఎస్‌ జి హెచ్‌ రాజు విచ్చేసి జాతీయ పథకాన్ని ఎగురవేశారు.అనంతరం విద్యార్థులచే ప్రదర్శించబడిన పరేడ్‌ కార్యక్రమంలో కమాండర్‌ అండ్‌ టీమ్‌ వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యువ కళాశాల సీఎండీ పివి రావు, డైరెక్టర్‌ ఎం భాస్కర్‌, ప్రిన్సిపల్‌ శాంతి, అధ్యాపకులు ,విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్‌ :మండల కేంద్రంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కోర్టు హాలులో జడ్జి , తహసీల్దార్‌ కార్యాలయంలో రామకృష్ణ, పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో పురపాలక సంఘం చైర్మెన్‌వస్పరి శంకరయ్య, వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం, పిఎసిఎస్‌ కార్యాలయం, గ్రంథాలయం, పోస్ట్‌ ఆఫీస్‌, పోలీస్‌ స్టేషన్‌,సివిల్‌ సప్లై గోదాం, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఆవరణలో , మున్నూరు కాపు సంఘం, కురుమ సంఘం, రజక సంఘం,పద్మశాలి సంఘం, తోపాటు పట్టణంలోని వివిధ వార్డులలో వివిధ పార్టీల వార్డు అధ్యక్షులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు
బీబీనగర్‌ : మండల వ్యాప్తంగా 64వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినారు, సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీవాణి, తాసిల్దార్‌ కార్యాలయం వద్ద తాసిల్దార్‌ అశోక్‌ రెడ్డి, స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఎస్‌ఐ సైదులు, జాతీయ జెండాను ఆవిష్కరించినారు, అలాగే సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో సభ రిజిస్టర్‌ సతీష్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ యాదగిరి, పిఎసిఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌ రెడ్డి, తో పాటు వివిధ పార్టీల మండల కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యెర్కల సుధాకర్‌ గౌడ్‌, జెడ్పీటీసీ గోళి ప్రణీత పింగల్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ మల్ల గారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్‌, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ బొక్క జైపాల్‌ రెడ్డి, బిఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నారగోని మహేష్‌ గౌడ్‌, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్‌ : మండలంలోని కొలనుపాక గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షులు గంధమల్ల చరణ్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్‌ ,గ్రామ సర్పంచ్‌ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్‌ రెడ్డి ,వార్డు సభ్యులు జంగా కమల, కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గొట్టం విజేందర్‌ రెడ్డి, వివిధ పార్టీ నాయకులు పెద్దలు అంబేద్కర్‌ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇంటి నిర్మాణానికి 3లక్షలు వెంటనే విడుదల చేయాలి
పేలిన విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌
యుద్ధ ప్రాతిపదికన భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
దేవాలయాల అభివృద్ధికి కృషి
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
తరుగుకు చెక్‌ పడదా..?
మాదకద్రవ్యాల నుండి దేశాన్ని కాపాడాలి
ముగిసిన కబడ్డీ పోటీలు
వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
ఆత్మీయ సమ్మేళనాలతో బంధం బలపడుతుంది
బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
వైభవంగా సీతారాముల కల్యాణం
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరణ
ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డికి సన్మానం
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన మిర్యాల
ఆట్రాసిటీి కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి
నాలుగేండ్లలోనే...
ఎవరికి...వారే
నాయకుడిని కాదు... మీ సేవకుడిని
ముగింపు సభకు కదిలిన ఎర్రదండు
పురపాలక వార్షిక బడ్జెట్‌కు కౌన్సిలర్లు ఆమోదం
ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మోడీ
పడకేసిన.. ప్రాథమిక ఆరోగ్యం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం,గోదాం ప్రారంభోత్సవం
ఆత్మీయసమ్మేళనాలతో బంధం బలపడుతుంది
మార్కెట్‌ కమిటీచైర్మెన్‌ లక్ష్మమ్మకు సన్మానం
సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శం
ప్రచారజాతాను జయప్రదం చేయండి

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.