Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదలు x సంపన్నులు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2022

పేదలు x సంపన్నులు

- గరీబోళ్ల వార్షిక కుటుంబ ఆదాయంలో 53శాతం తగ్గుదల
- అత్యంత ధనికుల ఆదాయం 39శాతం పెరుగుదల
- పట్టణ పేదలపై కోవిడ్‌, లాక్‌డౌన్‌ దెబ్బ : తాజా సర్వే వెల్లడి
   దేశంలో ఉన్నోడు..లేనోడికి మధ్య ఆర్థిక అసమానతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. 1995నాటితో పోల్చితే నేడు రెండు రకాల భారత్‌ కనపడుతోంది. దేశంలో 2015 నుంచి ధనిక వర్గం ఆదాయాలు భారీగా పెరుగుతు న్నాయి. మరోవైపు ఎగువ మధ్య తరగతి..దిగువ మధ్య తరగతిలోకి, పేదలు మరింత పేదరికంలోకి కూరుకు పోతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో పేద కుటుంబాల ఆదాయాలు పడిపోతున్నాయి. అత్యంత దిగువన ఉన్న పేద కుటుంబాల వార్షిక ఆదాయం 53శాతం పడిపోయింది.
- ఐసీఈ360 సర్వే 2021
న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాల ఆదాయం గణనీ యంగా పడిపోతోంది. ఇదంతా కోవిడ్‌ సంక్షోభం, లాక్‌డౌన్‌ రాకముందే మొదలైందని, సంక్షోభం తర్వాత ఆదాయాలు పడిపోవటం వేగవంతం అయ్యాయని తాజా సర్వే ఒకటి తేల్చింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ పీపుల్స్‌ రిసెర్చ్‌ ఆన్‌ ఇండియాస్‌ కన్జ్యూమర్‌ ఎకానమీ( 'ప్రైస్‌') దేశవ్యాప్తంగా 2లక్షల కుటుంబా లపై అధ్యయనం చేసింది. ఆదాయం పరంగా దేశ ప్రజల్ని 5 కేటగిరీలుగా విభజించి..వివరాలు సేకరించారు. ఇందులో అత్యంత దిగువన ఉన్న 20శాతం పేద కుటుంబాల వార్షిక ఆదాయం గణనీయంగా దెబ్బతిన్నది. 2015-2021 మధ్య వార్షిక ఆదాయం 53శాతం వరకు తగ్గిందని నివేదిక తెలింది. 100 జిల్లాల్లో 120 పట్టణాలు, 800 గ్రామాల్లో తమ అధ్యయనం సాగిందని సంస్థ తెలిపింది. 'ఐసీఈ360 సర్వే 2021' పేరుతో రూపొందించిన నివేదికలో కీలక అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
పట్టణాల్లో మరింతగా
   గ్రామీణ పేదలతో పోల్చితే పట్టణ పేదల్లో ఎక్కువగా ఆదాయం దెబ్బతిన్నది. కరోనా మొదటి వేవ్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక కార్యకలాపాలన్నీ ఒక్కసారిగా ఆగిపోవటం, ఉపాధి కోల్పోవటం పట్టణ పేదలపై తీవ్ర ప్రభావం చూపింది. దినసరి కూలీలు, వీధి వ్యాపారులు, గృహసంబంధ పనులు చేసే కార్మికులు ఎక్కువగా నష్టపోయారు. 2016 తర్వాత పేదల సంఖ్య పట్టణాల్లో పెరిగింది. దిగువన ఉన్న 20శాతం పేద కుటుంబాల వార్షిక ఆదాయం 1995 తర్వాత పెరుగుతూ రాగా, 2016 నుంచి పడిపోవటం మొదలైంది. వార్షిక ఆదాయం 2016లో 5.9శాతం పడిపోగా, 2021లో 3.3శాతం క్షీణించింది.
ధనికులు పైపైకి..
   దేశంలో ధనికులు, అత్యంత ధనికులైన 20శాతం కుటుంబాల వార్షిక ఆదాయ వివరాల్ని 'ప్రైస్‌' సేకరించింది. ఈ వర్గం కుటుంబాల వార్షిక ఆదాయం గత ఐదేండ్లలో 39శాతం పెరిగింది. వీరి కుటుంబ ఆదాయాలు 1995నాటితో పోల్చుకుంటే 50శాతం నుంచి 56.3శాతానికి (2021లో) చేరుకుంది. దిగువ మధ్య తరగతి కుటుంబాల ఆదాయం 32శాతం పడిపోగా, ధనిక వర్గానికి చెందిన 20శాతం కుటుంబాల ఆదాయంలో 7శాతం పెరుగుదల నమోదైంది.
అంతరాలు తగ్గించే విధానాలు రావాలి : రాజేశ్‌ శుక్లా, ఎండీ, సీఈవో, ప్రైస్‌
   టైర్‌-1, టైర్‌-2 నగరాల్లో దినసరి కూలీలు, చిన్న వ్యాపారులు, ఇండ్లల్లో పనిచేసే కార్మికులపై కోవిడ్‌ సంక్షోభం ప్రభావం ఎక్కువగా ఉంది. పట్టణల్లో ఆదాయా లు దెబ్బతిని ఎగువ మధ్య తరగతి...దిగువ మధ్య తరగతి స్థాయికి పడిపోయింది. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకొని రాబోయే 2022-23 కేంద్ర బడ్జెట్‌లో సరైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. దేశంలో రెండు వేరు వేరు భారత్‌లు కనపడుతున్నాయి. వీరి మధ్య అంతరాలు తగ్గించే ఆర్థిక విధానాలు ఎంచుకోవాలి.
బడా కంపెనీలకు ప్రభుత్వ సాయం అవసరం లేదు : రమా బిజాపూర్కర్‌, ఫౌండర్‌, ప్రైస్‌
   ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తో వ్యాపార వర్గాల్లో నమ్మకాన్ని పెంచే చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలు. ఇందు కోసం సుదీర్ఘమైన స్థిరమైన ప్రణాళికలు ఎంచుకోవాలి. బడా వ్యాపార సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు లాభాలు పోగేసుకున్నాయి. వీటికి ప్రభుత్వ సహకారం, సాయం అవసరం లేదు. దేశంలో అత్యంత పేదరికంలో కూరుకుపోయిన వర్గాల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజీవ్‌ హత్య కేసులో దోషి విడుదల
మహిళల వివాహ వయస్సు పెంపు వద్దు
ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ జాతీయ సదస్సు
కాలుష్య కోరల్లో భారత్‌
గుజరాత్‌లో ఘోర ప్రమాదం
డైరక్టర్లే అమ్మేయొచ్చు!
పశుగ్రహణం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌
పదో తరగతి పుస్తకాల్లో హెడ్గేవార్‌ ప్రసంగం
తొలి రోజే తడబాటు...
ట్విన్‌ టవర్‌ కూల్చివేత గడువును పొడిగించిన సుప్రీంకోర్టు
ముంబయి వీధుల్లో పూలమ్మే యువతికి అమెరికా టాప్‌ వర్సిటీలో అడ్మిషన్‌
గోధుమల ఎగుమతులకు ఓకే
రైతు నాయకుడు గౌలం ముహమ్మద్‌ జౌలా మృతి
20 నుంచి 22 వరకు ఎస్‌టీఎఫ్‌ఐ 8వ జాతీయ మహాసభలు
తమిళానికి అడ్డువస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం : కమల్‌హాసన్‌
ధరల నియంత్రణ ఏదీ?
వికలాంగుల గోడు వినేవారేరీ?
బ్యాంకుల్లో రూ.40వేల కోట్ల మోసాలు
కొనేది తినేది లేదు
మసీదులో ప్రార్థనలు అడ్డుకోరాదు
త్రిపురలో సీపీఐ(ఎం) నేతపై బీజేపీ దాడి
టాయిలెట్‌నూ ఉపయోగించుకోలేకపోతున్నా..
నూతన విద్యావిధానంతో అత్యధిక మంది విద్యకు దూరం
అసోంలో వరదలు..
కేరళలో వర్షాలు మరింత తీవ్రం
నాడు రాముడు.. నేడు శివుడు
విమాన ఇంధన ధరల మోత.. వరుసగా పదోసారి బాదుడు
దళితుడి పెండ్లి వేడుకలో పెత్తందార్ల దుశ్చర్య
స్వదేశీ డెయిరీలకు ముప్పు

తాజా వార్తలు

09:14 PM

మొగుల‌య్య‌కు కోటి న‌జ‌రానా ప్ర‌క‌టించిన కేసీఆర్‌

09:10 PM

నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:59 PM

ఫిఫా పురుషుల వరల్డ్ కప్ పోటీలకు మహిళా రిఫరీలు

08:53 PM

రేపు దావోస్‌ పర్యటనకు సీఎం జగన్‌

08:43 PM

ఎన్నికలు తట్టుకోవడం కష్టంగా ఉంది: ఉత్తమ్

08:32 PM

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

08:25 PM

మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:19 PM

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

08:02 PM

భార‌త్‌లో పెట్టుబ‌డుల గమ్మ‌స్థానం తెలంగాణ‌: కేటీఆర్

07:52 PM

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

05:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

04:47 PM

బాలుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

04:33 PM

జీఎస్టీ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.