Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోడీ సర్కార్‌ను మార్చేది మీరే ! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2022

మోడీ సర్కార్‌ను మార్చేది మీరే !

- యువతకు సీతారాం ఏచూరి పిలుపు
- కోల్‌కతాలో డివైఎఫ్‌ఐ 11వ జాతీయ మహాసభలు ఆరంభం
- అరుణారుణమయమైన సభా ప్రాంగణం
- వేలాదిమందితో భారీ ప్రదర్శన
- నిరంకుశ ప్రభుత్వాలకు ఎదురుదెబ్బలు తప్పవని వక్తల హెచ్చరిక
కోల్‌కతా : ''ప్రభుత్వం ఆస్తులకు మేనేజర్‌గా వుంది. కానీ ఆ ఆస్తులకు యజమానులు సామాన్య ప్రజలే, యజమానికి, మేనేజర్‌ను మార్చే హక్కు వుంది. కాబట్టి కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చాలి. అలా మారిస్తేనే ఈ దేశాన్ని కాపాడగలుగుతాం'' అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి యువతకు పిలుపిచ్చారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ)11వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని గురువారం కోల్‌కతాలో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. వేలాదిమంది యువత ఇందులో పాల్గొన్నారు. శుక్రవారం నుంచి మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభల వేదికపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డివైఎఫ్‌ఐ మాజీ జాతీయాధ్యక్షులు మహ్మద్‌సలీం, డివైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి అభరు ముఖర్జీ, రాష్ట్ర కార్యదర్శి మీనాక్షి ముఖర్జీలు ఆశీనులయ్యారు. ఇటీవల హత్యకు గురైన డివైఎఫ్‌ఐ కార్యకర్త బిద్యుత్‌ మోండాల్‌ తల్లి అమలా మోండాల్‌, విద్యార్ధి నాయకుడు అనీష్‌ ఖాన్‌ తండ్రి సలేమ్‌ ఖాన్‌లు కూడా వేదికపై వున్నారు. మహాసభల ప్రాంగణమంతా అరుణారుణమయంగా మారింది. భగత్‌సింగ్‌, చె గువేరా, ఇటీవల హత్యకు గురైన విదార్ధి నాయకుడు అనీష్‌ ఖాన్‌ వంటి యువజన నేతల పోస్టర్లతో ఆ ప్రాంతమంతా కళకళ లాడింది. సాల్ట్‌ లేక్‌లోని ఈస్ట్రన్‌ జోనల్‌ కల్చరల్‌ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన ఈ మహాసభలు నాలుగు రోజుల పాటు సాగతాయి.
            మహాసభల ప్రారంభానికి ముందుగా భారీ ప్రదర్శన జరిగింది. ఇటీవల బంకూరాలో మరణించిన డివైఎఫ్‌ఐ కార్యకర్త మైదుల్‌ ఇస్లామ్‌ మిద్యా గ్రామం నుంచి కోల్‌కతాలోని సభా వేదిక వద్దకు ర్యాలీ చేరుకునే వరకు ప్రతి చోటా ప్రజాదరణ ప్రముఖంగా లభించింది. సెల్దా నుండి హౌరా స్టేషన్‌ వరకు రెడ్‌ వలంటీర్ల ప్రదర్శన నిర్వహించారు. భగత్‌ సింగ్‌ వంటి యువ నేతల కటౌట్లు దారి మధ్యలో అలరించాయి. ర్యాలీకి ప్రారంభంలో, ప్రజా ఉద్యమాలపై ఇప్టా రచించిన గీతాలను వలంటీర్లు ఆలపించారు.
            సభలో ఏచూరి ప్రసంగిస్తూ, ఢిల్లీలో పాలక ప్రభుత్వం తరపున అమలు చేస్తున్న బుల్డోజరు విధానం ఎన్నాళ్ళో కొనసాగదని అన్నారు. కేంద్రం అనుసరించే ఈ విధానాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సింది యువతేనని అన్నారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ బుల్డోజరు విధానాన్ని అనుసరిస్తోంది. అంతకుముందు యూదులపై హిట్లర్‌ ఇదే పంథాను అనుసరించారు. ఇప్పుడు దేశంలోని ముస్లిం జనాభాపై మోడీ ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలను ఇస్తామని మోడీ చెప్పారు. అంటే ఎనిమిదేండ్లలో 16కోట్ల ఉద్యోగాలను అందాల్సిన తరుణంలో, ప్రస్తుతం దేశంలోని యువత ఉద్యోగాలు దొరుకుతాయన్న ఆశలు వదులుకుంటోందని అన్నారు. దాంతో మతోన్మాదంతో వారిని రెచ్చిగొడుతూ విప్లవ ప్రతీఘాత శక్తులుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యాప్తి చేస్తున్న మతోన్మాదం దేశ లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని అన్నారు. 'శాంతియుతంగా ప్రదర్శనలు జరుపుకుంటామంటే మనకు అనుమతులు దొరకవు, కానీ వారు మాత్రం రామనవమి, హనుమాన్‌ జయంతి ప్రదర్శనల్లో ఆయుధాలు ధరించి మరీ పాల్గొంటారు. ఆ ప్రదర్శనలు సాగిన ప్రాంతాల్లో మతోన్మాదాన్ని వ్యాప్తి చేస్తూ వెళతారు. ఈ దేశంలో ముస్లిం మైనారిటీ జనాభాపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి.'' అని ఏచూరి పేర్కొన్నారు.
పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కూడా ఏచూరి విమర్శనాస్త్రాలు సంధించారు. మితవాద శక్తులతో ప్రభుత్వం సన్నిహితంగా మెలిగినంత కాలమూ మతోన్మాద శక్తులను అణచివేయలేమని హెచ్చరించారు.
ప్రస్తుతం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా వున్న మహ్మద్‌ సలీం మాట్లాడుతూ, ప్రభుత్వ అణచివేత చర్యల ద్వారా పశ్చిమ బెంగాల్‌లో నిరసనలు, ఆందోళనలను అణచివేయలేరని అన్నారు. మొయిదుల్‌, అనీస్‌ ఖాన్‌, బిద్యుత్‌ మోండాల్‌ వంటి వారు అమరవీరులయ్యారు. కానీ, ఇలా అమరవీరుల జాబితా పెరిగేకొద్దీ నిరసనలు తెలియచేయాలన్న డివైఎఫ్‌ఐ కృతనిశ్చయం మరింత బలోపేతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలోని, బెంగాల్‌లోని 'నిరంకుశ ప్రభుత్వాల'కు శ్రీలంకలోని పరిస్థితులు ఒక హెచ్చరిక వంటివని సలీమ్‌ పేర్కొన్నారు.
            మీనాక్షి ముఖర్జీ మాట్లాడుతూ, మమత పాలనలో విజృంభించిన దాడులతో డివైఎఫ్‌ఐ కార్యకర్తలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నారో వివరించారు. క్రికెట్‌లో సిక్సర్‌ స్థాయిలో ఈనాడు ఉద్యమాలు కూడా అదే రీతిలో వృద్ధి చెందుతాయని అన్నారు.
            ఎ.ఎ.రహీమ్‌ మాట్లాడుతూ, దేశంలో నేడు నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఈనాడు మతోన్మాద శక్తులు ధర్మ సంసద్‌ల పేరుతో ముస్లింలను ఊచకోత కోయాలంటూ పిలుపివ్వడం ద్వారా ఎలా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో వివరించారు. పశ్చిమ బెంగాల్‌ అన్ని రకాలుగా తిరోగమన దిశలో పయనిస్తోందన్నారు. దేశంలోని ప్రజలందరికీ పని కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాలను ఉధృతం చేయాలని అభరు ముఖర్జీ పిలుపిచ్చారు. కుల, మత, వర్గాలకు అతీతంగా అందరికీ పని అన్న వైఖరిని డివైఎఫ్‌ఐ తీసుకుందని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు
జోమాటో బాయ్‌ దళితుడని ఫుడ్‌ నిరాకరణ...
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా 24న దేశవ్యాప్త ఆందోళన
మళ్లీ 12 వేలు దాటిన రోజువారీ కోవిడ్‌ కేసులు
బుల్డోజర్‌ జస్టిస్‌కు ముగింపు పలకండి
మాజీ సైనికుల కోటాకే దిక్కు లేదు !
హలో..హలో
మా వాదన వినండి
ద్రౌపది ముర్ము X యశ్వంత్‌ సిన్హా

తాజా వార్తలు

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

08:37 PM

పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు

08:35 PM

నాన్న కోసం సింగర్​గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

08:28 PM

చుక్కా రామయ్య ఆరోగ్యంగా జీవించాలి : హరీశ్‌రావు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.