Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మైనార్టీలపై హింస.. దేశంలో విభజన | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2022

మైనార్టీలపై హింస.. దేశంలో విభజన

- ప్రత్యర్థులపై బెదిరింపులు
- మోడీపై విరుచుకుపడ్డ సోనియా గాంధీ
- కాంగ్రెస్‌ చింతన్‌ శివిర్‌ ప్రారంభం
ఉదయ్ పూర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. మైనార్టీలను హింసిస్తున్నారనీ, దేశాన్ని విభజిస్తున్నారనీ, రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరిస్తున్నారని మోడీపై సోనియా
విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో మూడు రోజుల పాటు జరిగే కాంగ్రెస్‌ చింతన్‌ శివిర్‌ శుక్రవారం ప్రారంభమైంది. కాంగ్రెస్‌ పార్టీ నవ సంకల్ప్‌ చింతన్‌ శివిర్‌ పేరుతో జరుగుతున్న సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కాంగ్రెస్‌ నాయకులకు పిలుపునిచ్చారు. అలాగే ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ అతని మంత్రులు ఎప్పుడూ చెప్పే కనిష్ఠ ప్రభుత్వం గరిష్ఠ పాలన నినాదానికి అర్థం ప్రజల్లో చీలిక తేవడం, మైనార్టీలపై దాడులు, రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడమేనన్నారు. దేశాన్ని శాశ్వతంగా చీలిక స్థితిలో ఉంచడం, ప్రజలు నిరంతరం భయం, అభద్రతలో బతికేలా చేయడమే దాని అర్థమని విమర్శించారు. మోడీ పాలనలో ప్రజలు భయంభయంగా బతుకుతున్నారని అన్నారు. మైనార్టీలను హింసిస్తున్నారని, గాంధీజీని చంపిన వాళ్లను కీర్తిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని సోనియా ఆందోళన వ్యక్తంచేశారు. మోడీ పాలన ఇకపై కూడా కొనసాగితే దేశం అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మోడీని దీటుగా ఎదుర్కొనేందుకు, పార్టీని ప్రబల శక్తిగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి దేశ సమగ్రతను నిలబెట్టేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మతపరమైన విభజనను ఎదుర్కొని దేశాన్ని పునర్మించాలనే లక్ష్యంతో మున్ముందు పనిచేయాలని నిర్దేశించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాల ఫలితంగా దేశం ఎదుర్కొంటోన్న అనేక సవాళ్లపై చర్చించేందుకు ఈ సదస్సు అవకాశం కల్పిస్తోందని అన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీలో సత్వరమే సంస్థాగత మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేతల పనితీరులోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పాలని, అయితే పార్టీ బలంగా, ఐక్యంగా ఉందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పారు. పార్టీ వ్యూహాల్లోనూ మార్పు అవసరమన్నారు. ఈ సదస్సు దేశంలోని సమస్యలను చర్చిచేందుకు, ఆత్మశోధన అర్థవంతంగా కొనసాగేందుకు ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సదస్సుకు సోనియా, రాహుల్‌, ప్రియాంక సహా దాదాపు 400 ప్రతినిధులు హాజరయ్యారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు
జోమాటో బాయ్‌ దళితుడని ఫుడ్‌ నిరాకరణ...
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా 24న దేశవ్యాప్త ఆందోళన
మళ్లీ 12 వేలు దాటిన రోజువారీ కోవిడ్‌ కేసులు
బుల్డోజర్‌ జస్టిస్‌కు ముగింపు పలకండి
మాజీ సైనికుల కోటాకే దిక్కు లేదు !
హలో..హలో
మా వాదన వినండి
ద్రౌపది ముర్ము X యశ్వంత్‌ సిన్హా

తాజా వార్తలు

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

08:37 PM

పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు

08:35 PM

నాన్న కోసం సింగర్​గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

08:28 PM

చుక్కా రామయ్య ఆరోగ్యంగా జీవించాలి : హరీశ్‌రావు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.