Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధరల నియంత్రణ ఏదీ? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 18,2022

ధరల నియంత్రణ ఏదీ?

- ప్రజల కష్టాలు పట్టని మోడీ సర్కారు
- బడా వ్యాపారుల ప్రయోజనాలకే పెద్దపీట
- గోధుమల ఎగుమతుల నిషేధం సడలింపు అందుకే
న్యూఢిల్లీ : గోధుమల ఎగుమతులపై కొద్ది రోజుల క్రితం విధించిన నిషేధాన్ని సడలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక ప్రజల ప్రయోజనాల కన్నా బడా వ్యాపారుల ప్రయోజనాలే అధికంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి.అన్ని నిత్యావసరాల వస్తువులతో పాటే గోధుమలు, గోధుమ పిండి ధరలు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏడాది కాలంలో గోధుమల ధర 13 శాతం పెరిగింది. గత ఏడాది మ0 13వ తేది నాటికి గోధుమల ధర సగటున 28.80 రూపాయలు ఉండగా, ఈ ఏడాది మే 13 నాటికి 33.14 రూపాయలకు చేరింది. దీంతో గోధుమ పిండి ధర కూడా భారీగా పెరిగింది. ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడానికి విదేశాలకు పెద్ద ఎత్తున జరుగుతున్న ఎగుమతులు కూడా ఒక కారణం. ఉత్తర భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో గోధుమలే ప్రధాన ఆహారం కావడంతో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. దీంతో మే 14వ తేదిన గోధుమల ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం సహజంగానే బడా వ్యాపారులకు ఆగ్రహం తెప్పించింది. ఒక వ్యూహం ప్రకారం రైతుల నుండి గోధుమల కొనుగోళ్లు నిలిపివేశారు. అక్కడక్కడ కొనుగోళ్లు చేసినా నామమాత్రపు ధర మాత్రమే చెల్లించారు. ఎగుమతుల నిషేధంతో బహిరంగ మార్కెట్లో గోధుమల ధరలు తగ్గినప్పటీకీ కనీస ధర కూడా పలకకపోవడంతో రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని అవకాశంగా తీసుకుని గోధుమలను ఎగుమతులపై విధించిన ఆంక్షలను కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం తాజాగా సడలించింది. రానున్న కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి ఎగుమతులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎగుమతుల నిషేధం ప్రకటించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని గోధుమలు కొనుగోలు చేసి ఉంటే రైతులు నష్టపోయే పరిస్థితి ఉండేది కాదు. ప్రజలకు కూడా తక్కువ ధరకే లభించి ఉండేవి. ఆ దిశలో చర్యలు తీసుకోవడానికి బదులు బడా వ్యాపారుల ప్రయోజనాలకే కేంద్రం మొగ్గు చూపింది. ఒక్క గోధుమల విషయంలోనే కాదు, ఇతర నిత్యావసర వస్తువుల్లోనూ కేంద్ర ప్రభుత్వానిది ఇదే వైఖరి!
ఐదేళ్లుగా ధరలు పైపైకే...!
             నిత్యావసర వస్తువుల ధరలు ఐదేళ్లుగా పైకే ప్రయాణం చేస్తున్నాయి. వంట నూనెలు లీటరు 200 రూపాయలకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ పౌరసరఫరాల లెక్కల ప్రకారమే గోధుమల ధరలు ఐదేళ్ల కాలంలో 24శాతం, గోధమ పిండి 28 శాతం పెరిగింది. పప్పులు 20 నుండి 30 శాతం పెరుగుదలను నమోదుచేశాయి. బియ్యం 24 శాతం, కందిపప్పు 21శాతం, పెసరపప్పు 29 శాతం ధరలు పెరిగాయి. వంట నూనెల విషయానికొస్తే ఐదేళ్ల కాలంలో పామ్‌ఆయిల్‌ అత్యధికంగా128 శాతం పెరిగింది. వనస్పత్తి 112 శాతం, సన్‌ఫ్లవర్‌ 107 శాతం, సోయా 101 శాతం, ఆవనూనె 71 శాతం, వేరుశనగ నూనె ధర 41 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇక పెట్రోలు, డీజల్‌, గ్యాస్‌ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వంట గ్యాస్‌ ధర ఏడాది కాలంలోనే 76 శాతం పెరిగింది.
మోడీ ప్రభుత్వం ఏం చేసింది ?
             ధరలు చుక్కలను దాటి దౌడు తీస్తుంటే ఏ ప్రభుత్వమైనా వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. వరుసగా ఐదు సంవత్సరాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతున్నా మోడీ ప్రభుత్వం ఆ దిశలో ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదు. అదే సమయంలో బడా వ్యాపారులకు లబ్ధిచేయడానికి పాకులాడింది. 2020లో కరోనా రక్కసి విరుచుకుపడుతూ, ప్రజలు తీవ్రమైన అభద్రతలో ఉన్న సమయంలో నిత్యావసర వస్తువుల సేకరణకు సంబంధించిన అనేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం మార్చి వేసింది. స్వేఛ్చా వ్యాపారం పేరిట సరుకుల నిల్వ, ధర నిర్ణయం వంటి అంశాల్లో ట్రేడర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పాటు జరగిన రైతాంగ ఉద్యమం తరువాత వీటిలో కొన్నింటిని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. అదే సమయంలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న అనేక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నిత్యావసర వస్తువుల ఎగుమతులను పెద్ద ఎత్తున చేయడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. దీంతో దేశంలోని సగటు వినియోగదారుడు ధరాఘాతానికి గురికాక తప్పనిస్థితి. ఏప్రిల్‌ నెల వినియోగదారుల సూచి ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్భణం 8 సంవత్సరాల్లో అత్యధిక స్థాయికి 7.79శాతానికి తాకింది. గ్రామీణ ద్రవ్యోల్భణం 8.38 శాతానికి చేరింది. ఆహారధాన్యాల ద్రవ్యోల్భణం కూడా 8.38 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 8.5 శాతానికి చేరింది.హోల్‌సేల్‌ ధరలు రికార్డు స్థాయిలో 14.55 శాతం పెరిగాయి.
నిపుణులు ఏం చెబుతున్నారు?
             ధరాఘాతం నుండి ప్రజలను కాపాడటానికి పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపారుల లాభాపేక్షను నియంత్రించడంతో పాటు, కార్పొరేట్లపై సంపద పన్నును విధించాలని చెబుతున్నారు. ఆహారధాన్యాలను, నిత్యావసర సరుకులను రైతుల నుండి కనీస మద్దతు ధరకు సేకరించి, వాటిని ప్రభుత్వమే నేరుగా వినియోగదారులకు తక్కువ ధరలకు అందించాలన్నది మరో సూచన. పెట్రో ఉత్పత్తులపైఎక్సైజ్‌ డ్యూటీని రద్దు చేయడం ద్వారా కూడా ధరలను అదుపులో ఉంచవచ్చని చెబుతున్నారు. వీటిని మోడీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా?

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అధికార దాహానికి, స్వేచ్ఛకు మధ్య పోరు
శివసేనకు మరో షాక్‌..
చార్‌ధామ్‌ యాత్రలో 203 మంది మృతి
అన్నం..రోటీ పెట్టండి!
అదానీ విద్యుత్‌ టవర్ల నిర్మాణాన్ని ఆపాలి !
మీ ట్విట్టర్‌ ఖాతాను నిలిపివేస్తున్నాం..
దేశాధ్యక్షుడి పదవికి కులం అంటగడతారా?
యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌
సుప్రీంకు చేరిన 'మహా' అధికార పోరు !
కాంగ్రెస్‌ హింసాకాండను నిరసిస్తూ వేనాడ్‌లో నిరసనల హోరు
ఎల్‌ఐసీ ఐపీఓ సంపద ఆవిరి
ఎమర్జెన్సీపై మ్యూనిచ్‌లో మోడీ సుద్దులు
ఎఫ్‌పీఐల భయాలు
ఉచిత రేషన్‌ ఆపేయండి..
మోడీని విశాఖలో దిగనివ్వం
ఆ ఒక్కటి అడక్కు..!
అదానీ కోసమే..
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌

తాజా వార్తలు

03:31 PM

హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

03:27 PM

జులై 1న టెట్ ఫలితాలు

03:25 PM

నడవలేని స్థితిలో నిత్యామీనన్..

03:22 PM

మద్యం తాగి వాహనం నడపకుండా ప్రతేక పరికరం..!

03:06 PM

విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్: ఇద్దరు మృతి

03:05 PM

అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ‌, వాణిల ఇంటర్ రిజల్ట్స్..

02:56 PM

ఇంటర్నెట్‌ లేకున్నా జీమెయిల్ వాడొచ్చు..

02:50 PM

పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడు: మోహన్ బాబు

02:42 PM

జపాన్ నుంచి యూఏఈ బయల్దేరిన మోడీ

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.