Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాలుష్య కోరల్లో భారత్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 19,2022

కాలుష్య కోరల్లో భారత్‌

- ఒక్క ఏడాదిలో 23లక్షల మరణాలు
- ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో పరిశ్రమల కాలుష్యం : 'ది లాన్సెట్‌' అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : అన్నిరకాల కాలుష్యాల కారణంగా భారత్‌లో ఒక్క (2019) ఏడాదిలోనే 23లక్షల అకాల మరణాలు సంభవించినట్టు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో 16లక్షల మంది కేవలం వాయు కాలుష్యం వల్లే మరణించినట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2019లో కాలుష్యం కారణంగా 90లక్షల మంది ప్రాణాలు కోల్పోగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ మంది చనిపోయినట్టు పేర్కొన్నది. ఇలా ఓవైపు ప్రాణనష్టంతోపాటు అకాల మరణాలతో ఆ ఏడాదిలో ప్రపంచానికి 4.6 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనావేసింది. ఇందుకు సంబంధించిన తాజా అధ్యయనం 'ది లాన్సెట్‌' జర్నల్‌లో ప్రచురితమైంది.
ప్రతి ఆరు మరణాల్లో ఒకటి
               విశ్వవ్యాప్తంగా ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. కేవలం వాయు కాలుష్యం కారణంగానే ప్రపంచంలో ఒక్క ఏడాదే 66లక్షల మంది బలయ్యారు. నీటి కాలుష్యంతో 13లక్షలు, సీసం కారణంగా తొమ్మిది లక్షలతోపాటు మరో 8.7 లక్షల మందిఇతర విషపూరితవాయువుల కారణంగా చనిపోయారు. ఇక భారత్‌లో వాయు కాలుష్యం కార ణంగా మరణించిన వారిలో అత్యధికంగా 9.8లక్షల మంది పీఎం 2.5వల్లే అకాల మరణం చెందారు.
ఉత్తరాదిలోనే ఎక్కువ
               భారత్‌లో ముఖ్యంగా ఉత్తరాదిన ఈ కాలుష్య ప్రభావం అధికంగా అధికంగా ఉందని తాజా నివేదిక గుర్తుచేసింది. విద్యుత్తు, రసాయన పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాల వల్ల వాయు కాలుష్యం అక్కడ తీవ్రంగా ఉందని పేర్కొంది. ఇండ్లలో వంట చెరకు మండించడం భారీ స్థాయిలో వాయు కాలుష్య మరణాలకు కారణంగా నిలుస్తోందని తెలిపింది. వీటితోపాటు బొగ్గు, పంట వ్యర్థాలను కాల్చడం వంటివి తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు తెలిపింది. కాలుష్య నియంత్రణకు భారత్‌ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా సరైన కేంద్రీకృత వ్యవస్థ లేదన్న విషయాన్ని అధ్యయనం ఎత్తిచూపింది. భారత్‌లో ప్రమాదకర పీఎం 2.5 స్థాయిలు డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల కంటే చాలా అధికంగా ఉన్నాయంటూ అప్రమత్తం చేసింది.
ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
                ప్రజా ఆరోగ్యంపై కాలుష్యం ప్రభావం అధికంగా ఉందని, తక్కువ, మధ్య ఆదాయ దేశాలపై ఈభారం మరింత ఎక్కువగా ఉందని అధ్యయనానికి నేతృత్వం వహించిన స్విట్జర్లాండ్‌కు చెంది గ్లోబల్‌ అలయన్స్‌ ఆన్‌ హెల్త్‌ అండ్‌ పొల్యూషన్‌ నిపుణులు రిచర్చ్‌ ప్యుల్లర్‌ పేర్కొన్నారు. ఇది అత్యంత తీవ్రమైన విషయమైనప్పటికీ కాలుష్యాన్ని నివారించడంలో అంతర్జాతీయ స్థాయిలో పట్టించుకోవడం లేదన్నారు. అయితే వీటిపై ప్రజల్లో అవగాహన తేవడంలో ఇటీవల పురోగతి సాధించినప్పటికీ వాటికి అవసరమైన నిధులు కేటాయింపులో పెరుగుదల నామమాత్రంగానే ఉందన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అధికార దాహానికి, స్వేచ్ఛకు మధ్య పోరు
శివసేనకు మరో షాక్‌..
చార్‌ధామ్‌ యాత్రలో 203 మంది మృతి
అన్నం..రోటీ పెట్టండి!
అదానీ విద్యుత్‌ టవర్ల నిర్మాణాన్ని ఆపాలి !
మీ ట్విట్టర్‌ ఖాతాను నిలిపివేస్తున్నాం..
దేశాధ్యక్షుడి పదవికి కులం అంటగడతారా?
యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌
సుప్రీంకు చేరిన 'మహా' అధికార పోరు !
కాంగ్రెస్‌ హింసాకాండను నిరసిస్తూ వేనాడ్‌లో నిరసనల హోరు
ఎల్‌ఐసీ ఐపీఓ సంపద ఆవిరి
ఎమర్జెన్సీపై మ్యూనిచ్‌లో మోడీ సుద్దులు
ఎఫ్‌పీఐల భయాలు
ఉచిత రేషన్‌ ఆపేయండి..
మోడీని విశాఖలో దిగనివ్వం
ఆ ఒక్కటి అడక్కు..!
అదానీ కోసమే..
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌

తాజా వార్తలు

02:56 PM

ఇంటర్నెట్‌ లేకున్నా జీమెయిల్ వాడొచ్చు..

02:50 PM

పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడు: మోహన్ బాబు

02:42 PM

జపాన్ నుంచి యూఏఈ బయల్దేరిన మోడీ

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

11:49 AM

జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు పరారీ

11:35 AM

క‌రీంన‌గ‌ర్‌లో అర్ధ‌రాత్రి పిల్లి‌ని కాపాడిన పోలీసులు

11:29 AM

ఆగ‌స్టు 1 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

11:24 AM

క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం..!

11:18 AM

ఇంటర్‌ ఫలితాలు విడుదల...

11:14 AM

3డీ ప్రింటింగ్‌తో ఎన్‌95 మాస్కు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.