Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళా శక్తిని చాటాలి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 22,2022

మహిళా శక్తిని చాటాలి

- విధ్వంసకర బీజేపీిపై సంఘటితంగా పోరాడాలి
- ఎస్‌టీఎఫ్‌ఐ సెమినార్‌లో మరియం ధావలే
విజయవాడ : సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీశక్తిని చాటాలని, భావి తరాల నిర్మాణ బాధ్యతను టీచర్లు భుజానికెత్తుకోవాలని, కేంద్రంలో కొలువుదీరిన విధ్వంసకర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమించాలని ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వ నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) నిండా ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ సిద్ధాంత విస్తరణ, కార్పొరేట్ల లాభాలేనన్నారు. ఎన్‌ఈపీ అంటే కేవలం విద్యనే కాదని, యావత్‌ దేశ భవిష్యత్తుకు సంబంధించిందని చెప్పారు. స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీఎఫ్‌ఐ) 8వ జాతీయ మహాసభలో రెండవ రోజు శనివారం 'మహిళలు, పిల్లల సమస్యలు' అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ధావలే ప్రధాన ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి ఫెడరేషన్‌ నాయకురాలు ఎం సంయుక్త అధ్యక్షత వహించారు. ధావలే మాట్లాడుతూ ప్రస్తుతం దేశం ఆసాధారణ పరిస్థితుల్లో ఉంది. రెండేళ్ల కరోనా, లాక్‌డౌన్లలో ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నారు. గ్రామాలకు నెట్‌ సౌకర్యం లేకుండా ఆన్‌లైన్‌ క్లాసులనడం మోడీ ప్రభుత్వ మతిలేని పని. ఈ సమయంలోనే ఎన్‌ఇపి బాంబు వేసింది. ఎలాంటి చర్చలూ లేకుండా ఎన్‌ఇపి తేవడం కేంద్ర నేరస్త స్వభావానికి నిదర్శనం. ఎన్‌ఇపిలో పిపిపి మంత్రం జపించారు. 80 శాతం ప్రజలు ఎన్‌ఇపిని వ్యతిరేకించాలి. నాగరిక దేశాలన్నింటా కేంద్రం కరికులాన్ని తయారు చేస్తే, రాష్ట్రాలు దాని చట్రంలో స్వతంత్రంగా సిలబస్‌ తయారు చేస్తాయి. ఇక్క కేంద్రమే శాసిస్తోంది. పేద పిల్లలను చదువుకోనీకుండా అడ్డు గోడలు నిర్మిస్తోంది.
విద్రోహ చర్యలు
బీజేపీ గుజరాత్‌లో విద్యాశాఖ మంత్రి 6-12 క్లాసు పిల్లలు తప్పనిసరిగా భగవద్గీత చదవాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 28 ప్రకారం ఒక మత గ్రంధాన్ని చదవమని సర్కారు బలవంతం చేయజాలదు. పైగా వేదాలూ అంటున్నారు. వాటి నిండా మనుస్తృతి ఉంది. గుజరాత్‌లోనే నర్సింగ్‌ పాఠ్యపుస్తకంలో మహిళలు కట్నం ఇవ్వడం మంచిదేనన్నారు. సతి సంప్రదాయం మంచిదేనంటున్నారు. తమిళనాడులో ప్రశ్నాపత్రంలో మహిళలు పనులకు బయటికెళ్లడం వలన ఇళ్లల్లో పిల్లలను చూసుకోవటం లేదనే సారాంశంతో పేరాగ్రాఫ్‌ ఇచ్చి ప్రశ్నలిచ్చి జవాబులు రాయమన్నారు. ఐద్వా పోరాటంతో ఉపసంహరించారు. అశాస్త్రీయ భావాలను పిల్లల మెదళ్లలోకి ఎక్కించి విషబీజాలు నాటే కుట్ర. నమ్మకం అనేది వ్యక్తిగతం. దాన్ని రుద్దడం అప్రజాస్వామికం. శివలింగాల కోసం తవ్వకాలు దేనికి? ప్రజల్లో ఆలోచించే శక్తిని నశింపజేస్తోంది. మాక్‌ సైకాలజీని చొప్పిస్తోంది. దళితులు చదువుకోకూడదు. ముస్లింలు ఈ దేశంలో ఉండకూడదు. చర్చిలపై దాడులు, రెండవ తరగతి పౌరులుగా మహిళలు. ఇదే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం.
మన డబ్బుతో మజాలా
నూతన పెన్షన్‌ స్కీం (ఎన్‌పిఎస్‌) ప్రకారం టీచర్లు కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బును షేర్‌ మార్కెట్‌లో పెట్టడమేంటని ధావలే ప్రశ్నించారు. మన డబ్బుతో ప్రభుత్వం మజా చేసుకుంటుందా? ఇది పక్కా జూదం. అదానీ, అంబానీల వంటి వారి బ్యాంక్‌ అప్పులు రూ.10.72 లక్షల కోట్లను మాఫీ చేశారుగా? వారి నుండి ఆ డబ్బంతా వసూలు చేసి షేర్‌ మార్కెట్‌లో పెట్టండి. ఎక్కడైనా ఫాసిస్టులు ఓడిపోతారు. ఇక్కడా అంతే. రైతుల వీరోచిత ఉద్యమం రోల్‌ మోడల్‌. ఉత్తమ పౌరులను తయారు చేసే గురుతర బాధ్యత టీచర్లు, అందులోనూ మహిళా టీచర్లదే. సైనికుల్లా పోరాడాలి. మహిళా టీచర్ల పోరాటాలకు ఐద్వా మద్దతిస్తుంది... అని ధావలే అన్నారు. ఫెడరేషన్‌ మహిళా విభాగ కన్వీనర్‌ కె బద్రునిస్సా మాట్లాడుతూ మహిళలు సమానత్వం కోసం పోరాడాలన్నారు. నయా-ఉదారవాద విధానాలు మహిళల అభ్యున్నతికి అడ్డుగా నిలిచాయన్నారు. దేశవ్యాప్తంగా 47 లక్షల పురుష టీచర్లుండగా, 49 లక్షల మహిళా టీచర్లు ఉన్నారని, వీళ్లు తలుచుకుంటే సమాజాన్ని మార్చేస్తారని చెప్పారు. సెమినార్‌కు అధ్యక్షత వహించిన సంయుక్త మాట్లాడుతూ మనుస్తృతి చదివితే చెప్పు తీసుకొని తన్నాలనిపిస్తుందన్నారు. సీమ దత్తా వందన సమర్పణ చేశారు.
ఎన్‌ఈపీ, సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే :
10 తీర్మానాలకు ఆమోదం
నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపి), జాతీయ పెన్షన్‌ విధానం (ఎన్‌పీఎస్‌) రద్దు చేయాలని ఎస్‌టిఎఫ్‌ఐ మహాసభ రెండో రోజు డిమాండ్‌ చేసింది. ఎన్‌ఇపి, ఎన్‌పిఎస్‌ రద్దుతో పాటు 10 తీర్మానాలకు మహాసభ ఆమోదం తెలిపింది. విద్యలో కేంద్రీకరణ, కాషాయికరణ, వ్యాపారీకరణ అంశాలను చొప్పించడమే ప్రధాన ధ్యేయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఈపీ తీసుకొచ్చిందని విమర్శించింది. దీనిని వ్యతిరేకించాలని తీర్మానించింది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంపై పూర్తిగా కేంద్రం పెత్తనం చేసేలా ఇది ఉందని పేర్కొంది. రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానంతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నెత్తిపై రుద్దుతుందన్నారు. కరోనా సంక్షోభంలో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఎన్‌ఇపిపై కూడా పార్లమెంటులో కనీసం చర్చించ లేదని విమర్శించింది. ఫెడరేషన్‌ కార్యదర్శి కెజి హరికుమార్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని కార్యదర్శి ఎన్‌టి శివనారాయణ్‌ బలపరిచారు.
ఓపీఎస్‌ పునరుద్ధరణ
వాజ్‌పేయి 2003లో ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) విధానాన్ని రద్దు చేయాలని తీర్మానించింది. 22,83,671 మంది కేంద్ర ప్రభుత్వ, 55,76,986 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పిఎస్‌లో ఉన్నారని తెలిపింది. ఈ విధానాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ఎస్‌టిఎఫ్‌ఐ, కేంద్ర కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు అనేక ఉద్యమాలు చేశాయని వివరించింది. సంతకాల సేకరణ, సదస్సులు, ర్యాలీలు, పార్లమెంట్‌ మార్చ్‌ వంటి ఆందోళలను ఫెడరేషన్‌ నిర్వహించిందని పేర్కొంది.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున పోరాటాలు చేశారని వెల్లడించింది. ఈ పోరాటాల ఫలితంగానే రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు ఎన్‌పిఎస్‌ రద్దు చేశాయని తెలిపింది. ఎన్‌పిఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి మూడేండ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించింది. ఎన్‌పిఎస్‌ స్థానంలో గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) తీసుకొస్తానని సిఎం జగన్‌ చెబుతున్నారని, ఈ విధానం కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా ఉందని పేర్కొంది. ఎన్‌పిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ తీసుకురావాలని ఎపి యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టిఎస్‌యుటిఎఫ్‌ అధ్యక్షులు కె జంగయ్య బలపరిచారు.
రైతుల విజయానికి అభినందనలు
వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాలని ఏడాదికిపైగా ఆందోళనలు నిర్వహించి విజయం సాధించిన రైతులకు మహాసభ అభినందనలు తెలిపింది. ఇది రైతులు సాధించిన అపూర్వ విజయంగా అభివర్ణించింది. ఫెడరేషన్‌ కార్యదర్శి ప్రభుసింగ్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని కార్యదర్శి పి బాబురెడ్డి బలపరిచారు.
లింగ వివక్షకు వ్యతిరేకంగా అవగాహన
దేశంలో మహిళల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు ఈ కాలంలో ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో వివక్ష కొనసాగుతుందని పేర్కొంది. లింగ వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని మహాసభ పిలుపునిచ్చిన తీర్మానాన్ని ఫెడరేషన్‌ కార్యదర్శి కె బదీరున్నీసా ప్రవేశపెట్టగా, కార్యదర్శి దుర్గాభవానీ ఆమోదించారు.
నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా తీర్మానం
లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు తీసుకొచ్చిన 'నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌' విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడీదారి ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ఇది దేశసంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానమని తెలిపింది. సుఖంత్‌ బెనర్జీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సుకుమార్‌ పెయిన్‌ బలపరిచారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మహావీర్‌ సిహగ్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నాగేంద్రసింగ్‌ బలపరిచారు. పాఠశాల విద్యార్థులు అల్పాహారం, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని హరిసింగ్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సుఖంత్‌ కుమార్‌ బలపరిచారు. సమాజంలో మత సామరస్యం అవసరం అనే తీర్మానాన్ని ఎస్‌ మైలీ ప్రవేశపెట్టగా, కెపిఒ సురేష్‌ బలపరిచారు. విద్యాసంస్థల్లో ఉన్న బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయాలని వినోద్‌ బెహ్ర ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సుఖంత్‌ కుమార్‌ బలపరిచారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శ్లాబులను పెంచాలని అరుణకుమారి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మోహన్‌ దత్తు బలపరిచారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు

తాజా వార్తలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

12:46 PM

యాదాద్రీశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

12:32 PM

కాలువలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు మృతి

12:10 PM

గ్రీన్‌ ఇండియాలో మొక్కలు నాటిన ఎఫ్‌డీసీ చైర్మన్‌ అనిల్ కూర్మాచలం

11:54 AM

భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్‌ రెడ్డి గెలుపు

11:50 AM

80 వేల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి

11:41 AM

ఆత్మకూరులో 217 పోస్ట‌ల్ బ్యా‌లెట్ ఓట్లు‌

11:37 AM

కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.