Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీ ప్రభుత్వ విధానాలతోనే సంక్షోభం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 23,2022

బీజేపీ ప్రభుత్వ విధానాలతోనే సంక్షోభం

- ప్రతిఘటనోద్యమాలే మార్గం
- ఎస్‌టీఎఫ్‌ఐ సెమినార్‌లో సురజిత్‌ మజుందార్‌
విజయవాడ : దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని, ఎనిమిదేండ్ల కేంద్ర బీజేపీ హయాంలో కార్పొరేట్‌ అనుకూల విధానాలను పరుగులు పెట్టిస్తుండటంతో సంక్షోభం ముదురుతోందని జేఎన్‌యూ ప్రొఫెసర్‌ సురజిత్‌ మజుందార్‌ చెప్పారు. సంక్షోభ ప్రభావంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుదించుకుపోతున్నాయన్నారు. దాంతో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయని, కొనుగోలు శక్తి పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ ఎదుగూబొదుగూ లేని స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. ఇటీవలి రైతు ఉద్యమం అందించిన స్ఫూర్తితో ప్రభుత్వ హానికర విధానాలకు సంఘటిత ప్రతిఘటనోద్యమాలను చేపట్టాలని, అదే ఏకైక మార్గమని చెప్పారు. ఎస్‌టీఎఫ్‌ఐ 8వ మహాసభల చివరి రోజు ఆదివారం 'ఆర్థిక సంక్షోభం- ప్రైవేటీకరణపై వ్యతిరేకత' అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో మజుందార్‌ కీలక ఉపన్యాసం చేశారు. సరళీకరణ విధానాలు మొదలయ్యాక ఈ 30 ఏండ్లలో క్రమంగా సంక్షోభం పెరుగుతూ, బిజెపి పాలనలో ఎక్కువైందన్నారు. ఎన్నికల ప్రక్రియ అనేది అసలు విషయమే కాదు. రాజకీయ లక్ష్యంలోనే మొత్తం విషయమంతా ఉంది. 90 శాతం మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలంలో సంఘటిత రంగం, ప్రభుత్వరంగం కుదించుకుపోయింది. ఉద్యోగాలు నష్టపోయారు. ప్రభుత్వ, కో-ఆపరేటివ్‌, ప్రయివేటు అన్నీ కలుపుకున్నా 35 శాతం మందికే సంఘటితరంగంలో ఉద్యోగాలున్నాయి. మొత్తం జనాభాతో పోల్చితే భారీ వ్యత్యాసం ఉంది. ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లో క్యాజువల్‌ కార్మికుని రోజు సగటు వేతనం రూ.300. అత్యధికుల సగటు నెల వేతనం రూ.16-17 వేలే. మూడు దశాబ్దాలుగా ఫ్యాక్టరీల్లో వేతనాలు పెరగలేదు. కార్మిక చట్టాల స్థానంలో కోడ్స్‌ తేవడంతో ఆ అవకాశాలూ సన్నగిల్లుతున్నాయి. వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి లేకపోడం, అక్కడా సంక్షోభం కొనసాగుతుండటంతో ఆ రంగంలో ఆదాయాల పరిస్థితీ బాగాలేదు. వ్యవసాయేతర రంగమైన నిర్మాణ రంగం వైపు మళ్లుతుండగా ప్రజల్లో కొనుగోలు శక్తి లేక రియల్‌ ఎస్టేట్‌ సైతం సంక్షోభంలో పడింది.
పెద్ద కార్పొరేట్ల కంట్రోల్‌
                పెద్ద కార్పొరేట్లు ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నాయని, వాటి అనుకూల విధానాలు రూపొందుతున్నాయని, ఈ క్రమంలో ఆశ్రితపక్షపాతం, అవినీతి పెరుగుతోందని మజుందార్‌ తెలిపారు. 300 కార్పొరేట్‌ కుటుంబాల సంపద 55 దేశం జనాభా సంపదతో సమానం. అదానీ, అంబానీల సంపద పెరుగుదలే ప్రామాణికం కాదు. చమురు ధరల వంటి పరోక్ష పన్నులు ప్రజలపై వేసి, కార్పొరేట్లకు రాయితీలిస్తోంది. ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు లీజుకిచ్చి, ఆ డబ్బుతో పెట్టుబడి పెడతామంటోంది. ప్రభుత్వ రంగాన్ని తెగనమ్ముతోంది. సహకార రంగంపై మోడీ కన్ను పడింది. ఎన్‌ఈపీలోనూ అదే సూత్రం. ఆర్థిక సంక్షోభానికి కారణాలను, ఎవరు వాటిని సృష్టించారో ప్రజలందరూ ఆలోచించాలి. విద్యారంగ పరిక్షణకు టీచర్లు పోరాడాలి.. అని చెప్పారు.
ప్రమాదంలో మత సామరస్యం
                దేశంలో మత సామరస్యం ప్రమాదంలో పడిందని, వామపక్షాలు, ప్రజాస్వామిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఒక్కటై మత సామరస్యాన్ని కాపాడుకోవాలని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ అన్నారు. 'జాతికి మత సామరస్యం అవసరం' అనే అంశంపై ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. మతోన్మాదం, మత అల్లర్లు కేంద్రంలోని బిజెపి రాజ్య ప్రాయోజిత ప్రాజెక్టు. అయోధ్య, గుజరాత్‌, ముజఫర్‌నగర్‌ ఈ ఉదంతాలన్నీ ఒక పథకం ప్రకారం చేసినవి. రాజ్యాంగ మనుగడకు ప్రమాదం ఏర్పడింది. సమానత్వం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం లేవు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీడియా సైతం కార్పొరేటీకరణ జరగడంతో ప్రజలు పట్టట్లేదు. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ చర్యలతో ఎదుర్కోవాలి. కార్మికులకు, ఉద్యోగులకు అవసరమైన రాజకీయ విద్యనందించాలి. సోషల్‌ మీడియా సహా డిజిటల్‌ మాధ్యమాల్లో ప్రచారం చేయాలి. టీచర్లు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కృషి చేయాలి.. అని సూచించారు. సెమినార్‌కు ఫెడరేషన్‌ నేత భద్రూద్దోజాఖాన్‌ అధ్యక్షత వహించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు

తాజా వార్తలు

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

12:46 PM

యాదాద్రీశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

12:32 PM

కాలువలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు మృతి

12:10 PM

గ్రీన్‌ ఇండియాలో మొక్కలు నాటిన ఎఫ్‌డీసీ చైర్మన్‌ అనిల్ కూర్మాచలం

11:54 AM

భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్‌ రెడ్డి గెలుపు

11:50 AM

80 వేల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి

11:41 AM

ఆత్మకూరులో 217 పోస్ట‌ల్ బ్యా‌లెట్ ఓట్లు‌

11:37 AM

కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

11:35 AM

సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

11:30 AM

పోలీసుల అదుపులో సుపారీ గ్యాంగ్

11:28 AM

28న టీ-హబ్‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.