Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మాజీ సైనికుల కోటాకే దిక్కు లేదు ! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

మాజీ సైనికుల కోటాకే దిక్కు లేదు !

- అగ్నివీరులకు పుష్కల అవకాశాలంటే నమ్మేదెలా?
- కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నామమాత్రపు నియామకాలతో సరి
- గ్రూప్‌ సి పోస్టుల్లో 1.29 శాతం, గ్రూపు డిలో 2.66 శాతమే
న్యూఢిల్లీ : సైన్యంలో చేరాలనే భారత యువత కలలను సాకారం చేసే గొప్ప లక్ష్యంతోనే అగ్నిపథ్‌ పథకాన్ని రూపొందించామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకులు ఊదరగొడుతున్నారు. ఇందులో చేరే యువతకు నాలుగేళ్ల పాటు కాంట్రాక్టు కింద నైపుణ్య శిక్షణ ఇస్తామనీ, ఆ తర్వాత పుష్కల అవకాశాలుంటాయని వీరు చేస్తున్న ప్రచారానికి కార్పొరేట్‌ అధిపతులు కూడా వత్తాసు పలికిన సంగతి తెలిసిందే. కానీ రెగ్యులర్‌ నియమాకాల ద్వారా భారత సైన్యంలో విశేష సేవలందించి..ఉద్యోగ విరమణ చేసిన మాజీ ఉద్యోగులకే మోడీ సర్కార్‌ మొండి చేయి చూపుతోంది. సైనిక నిబంధనావళి ప్రకారం.. మాజీ సైనికులకు వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా కేటాయించారు. గ్రూపు సి, గ్రూపు డి పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈ పోస్టుల్లో మాజీ సైనికుల కోటానే పూర్తిగా భర్తీ చేయడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ సేవలో విశేష అనుభవం గడించి, మాజీ సైనికులు అనే గౌరవ హోదా ఉన్నవారికే పోస్టుల భర్తీలో రిక్తహస్తం చూపుతున్న మోడీ సర్కార్‌ ..నాలుగేళ్ల కాంట్రాక్టు ముగిసిన తర్వాత ఏ హోదాకూ నోచని అగ్నివీరులను అందలం ఎక్కిస్తుందంటే నమ్మేదెలా అని ఆర్మీ అభ్యర్థులు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
            కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌), రక్షణ మంత్రిత్వ శాఖ, రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూలు)లో అగ్నివీర్లకు 10 శాతం కోటాను కేంద్రం ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగాలలో రిక్రూట్‌ చేయబడిన మాజీ సైనికుల సంఖ్యలో భారీ కొరత ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌ చేయలేకపోవటంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ సైనికోద్యోగులలో కేవలం 2.4 శాతం మంది మాత్రమే ఉద్యోగం పొందగలిగారు. ఉద్యోగ విరమణ పొందిన సైనిక సిబ్బందికి పునరావాస ఉపాధి కల్పించే బాధ్యతతో డైరెక్టర్‌ జనరల్‌ రీసెటిల్‌మెంట్‌ (డీజీఆర్‌) అనే ఒక ప్రత్యేక నోడల్‌ బాడీ ఉంది. ఈ సంస్థ గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రాలు, రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలతో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌) రిక్రూట్‌మెంట్‌ చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) నిబంధన ప్రకారం గ్రూప్‌ సిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం, గ్రూప్‌ డిలో 20 శాతం ఖాళీలు మాజీ సైనికులకు కేటాయించాలి. కానీ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ల్లో గ్రూప్‌ సిలో 1.29 శాతం, గ్రూప్‌ డిలో 2.66 శాతం మాత్రమే మాజీ సైనికులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మాజీ సైనికులకు 14.5 శాతం, కేంద్ర ప్రభుత్వ రంగ యూనిట్లు, సీఏపీఎఫ్‌లకు మాజీ సైనికులకు 24.5 శాతం కోటా ఉంది. కానీ, గత ఏడాది జూన్‌ 30 నాటికి సీపీఎస్‌యుల్లో మాజీ సైనికులు గ్రూప్‌ సి ఉద్యోగాల్లో 1.15 శాతం, గ్రూప్‌ డి ఉద్యోగాల్లో 0.3 శాతం మాత్రమే ఉన్నారు. కోల్‌ ఇండియా, మహారత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో మాజీ సైనికులు కొరత ఉంది. ఇది మాజీ సైనికులకు రిజర్వ్‌ చేయబడిన 251 గ్రూప్‌ సి, గ్రూప్‌ డి పోస్టుల్లో ఒక్కపోస్టునూ భర్తీ చేయలేదు.
            77 కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లు ఉండగా అందులో 34 డిపార్ట్‌మెంట్‌లో మాత్రమే మాజీ సైనికులు గ్రూప్‌ సి, గ్రూప్‌ డి ఉద్యోగాల్లో అరకొరగానే నియామకాలు జరిగాయి. 34 డిపార్ట్‌మెంట్‌ల్లో గ్రూప్‌ సి (పది శాతం రిజర్వ్డ్‌) 10,84,705 పోస్టులకు గానూ కేవలం 13,976 (1.29 శాతం) మంది మాజీ సైనికులు మాత్రమే ఉన్నారు. అలాగే గ్రూప్‌ డి (20 శాతం రిజర్వ్డ్‌) 3,25,265 పోస్టులకు గానూ కేవలం 8,642 (2.66 శాతం) మంది మాజీ సైనికులు మాత్రమే ఉన్నారు.
            పారామిలటరీ బలగాలు కూడా మాజీ సైనికుల నియామకానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌), సెంట్రల్‌ పారా మిలటరీ ఫోర్స్‌స్‌ (సీపీఎంఎఫ్‌)ల్లో పది శాతం మాజీ సైనికులు కోటా ఉండగా, 2021 జూన్‌ 30 నాటికి కేవలం 0.47 శాతం మాత్రమే మాజీ సైనికులు ఉద్యోగులుగా ఉన్నారు. సీఏపీఫ్‌, సీపీఎంఎఫ్‌ల్లో ఎనిమిది విభాగాలు ఉండగా, అందులో ఏడు విభాగాల్లోని ఈ నియామకం జరిగింది.
            170 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, అందులో 94 సీపీఎస్‌యుల్లో మాజీ సైనికులకు ఉద్యోగాలు కల్పించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌యూ)ల్లో గ్రూప్‌ సి పోస్టులకు 14.5 శాతం, గ్రూప్‌ డి పోస్టులకు 24.5 శాతం మాజీ సైనికుల కోటా ఉంది. 2,72,848 గ్రూప్‌ సి పోస్టులు ఉండగా, 3,138 (1.15 శాతం) పోస్టులు మాత్రమే మాజీ సైనికులు ఉన్నారు. 1,34,733 గ్రూప్‌ డి పోస్టులకు గాను, 404 (0.3 శాతం) పోస్టుల్లో మాత్రమే మాజీ సైనికులు ఉన్నారు.
            ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ గ్రూప్‌ సి పోస్టులకు 14.5 శాతం, గ్రూప్‌ డి పోస్టులకు 24.5 శాతం మాజీ సైనికుల కోటా ఉంది. అయితే 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2,71,741 గ్రూప్‌ సి పోస్టులు ఉండగా, 24,733 (9.1 శాతం) పోస్టులు మాత్రమే మాజీ సైనికులు ఇచ్చారు. 1,07,009 గ్రూప్‌ డి పోస్టులకు, 22,839 (21.34 శాతం) పోస్టులు మాజీ సైనికులు ఇచ్చారు. అగ్నిపథ్‌ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్‌ను ప్రకటించిన 10 డిఫెన్స్‌ పిఎస్‌యులల్లో ప్రస్తుతం 3.45 శాతం గ్రూప్‌ సి, 2.71 శాతం గ్రూప్‌ డి పోస్టులను మాత్రమే మాజీ సైనికులతో భర్తీ చేశారు.
            2021 జూన్‌ 30 నాటికి మొత్తం 26,39,020 మంది మాజీ సైనికులు ఉన్నారు. అందులో 22,93,378 మంది ఆర్మీ, 1,38,108 మంది నేవి, 2,07,534 మంది ఎయిర్‌ ఫోర్స్‌ నుంచి మాజీ సైనికులు ఉన్నారు.
            మరోవైపు రాష్ట్రాలు కూడా మాజీ సైనికులకు ఉద్యోగాలు కల్పించలేకపోయాయి. ఉదాహరణకు, డిసెంబర్‌ 2019 నాటికి దేశంలోని 80 శాతం సాయుధ బలగాలను కలిగి ఉన్న బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానాలు ఉద్యోగం కోసం నమోదు చేసుకున్న 2 లక్షల మంది మాజీ సైనికుల్లో కేవలం 1.5 శాతానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జర్నలిస్ట్‌ జుబైర్‌ను విడుదల చేయాలి
బొగ్గు మైనింగ్‌ వేలం కోసం 31 కంపెనీల బిడ్‌లు
ప్రజలు వద్దు.. మైనింగ్‌ ముద్దు
అధికార దాహానికి, స్వేచ్ఛకు మధ్య పోరు
శివసేనకు మరో షాక్‌..
చార్‌ధామ్‌ యాత్రలో 203 మంది మృతి
అన్నం..రోటీ పెట్టండి!
అదానీ విద్యుత్‌ టవర్ల నిర్మాణాన్ని ఆపాలి !
మీ ట్విట్టర్‌ ఖాతాను నిలిపివేస్తున్నాం..
దేశాధ్యక్షుడి పదవికి కులం అంటగడతారా?
యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌
సుప్రీంకు చేరిన 'మహా' అధికార పోరు !
కాంగ్రెస్‌ హింసాకాండను నిరసిస్తూ వేనాడ్‌లో నిరసనల హోరు
ఎల్‌ఐసీ ఐపీఓ సంపద ఆవిరి
ఎమర్జెన్సీపై మ్యూనిచ్‌లో మోడీ సుద్దులు
ఎఫ్‌పీఐల భయాలు
ఉచిత రేషన్‌ ఆపేయండి..
మోడీని విశాఖలో దిగనివ్వం
ఆ ఒక్కటి అడక్కు..!
అదానీ కోసమే..
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.