Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంగన్‌వాడీ సమస్యలపై.... 26 నుంచి 29 వరకు మహాపడావ్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jul 03,2022

అంగన్‌వాడీ సమస్యలపై.... 26 నుంచి 29 వరకు మహాపడావ్‌

- ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ జాతీయ కన్వెన్షన్‌ పిలుపు
- అంగన్‌వాడీలపై అణచివేతకు వ్యతిరేకంగా తీర్మానం
- అంగన్‌వాడీలకు గ్రాట్యుటీపై సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలి
న్యూఢిల్లీ : అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ల సమస్యల పరిష్కారం కోసం జులై 26 నుంచి 29 వరకు నాలుగు రోజులు పాటు ఢిల్లీలో మహా పడవ్‌ నిర్వహించాలని ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌) జాతీయ కన్వెన్షన్‌ పిలుపునిచ్చింది. అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ, ఇతర సౌకర్యాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలుచేయాలని, 45వ, 46వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ (ఐఎల్‌సీ) సిఫార్సుల అమలు చేయాలనే డిమాండ్‌లను ఈ సమావేశం పునరుద్ఘాటించింది. సమ్మె సమయంలో హర్యానా, ఢిల్లీలో తొలగించిన వర్కర్స్‌, హెల్పర్స్‌ల తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తమ పోరాటాన్ని కొనసాగించాలని కన్వెన్షన్‌ నిర్ణయించింది. శనివారం నాడిక్కడ మీరా దత్తా నగర్‌లోని బీటీఆర్‌ భవన్‌లో ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌) ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల హక్కుల కోసం జాతీయ కన్వెన్షన్‌ జరిగింది. ఈ కన్వెన్షన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు రెండు వందల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు హాజరయ్యారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ల హక్కులతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్యం, బాలల విద్య వంటి వాటి గురించి, అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులపై అణచివేతకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌లకు గ్రాట్యుటీ చెల్లింపు, వారి పని పరిస్థితులను మెరుగుపరచాలని డిమాండ్‌ చేసింది. ''కనీస వేతనాలు, తగిన మౌలిక సదుపాయాలు, పౌష్టికాహారం సక్రమంగా చెల్లించేలా ఐసీడీఎస్‌కు తగిన కేటాయింపులు చేయాలి. నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ఆర్టీఈ చట్టంలో భాగంగా చిన్నారుల విద్య, సంరక్షణ (ఈసీసీఈ)ని ప్రకటించాలి. అంగన్‌వాడీలను నోడల్‌ ఏజెన్సీలుగా చేయాలి. డిజిటలైజేషన్‌, పోషన్‌ ట్రాకర్‌ అమలుకు ముందు టాబ్లెట్‌లు, నెట్‌వర్క్‌, డేటా ప్యాక్‌లను అందించాలి. కరోనా మహమ్మారి విధుల్లో ఉన్నవారికి రిస్క్‌ అలవెన్స్‌ చెల్లించాలి. కోవిడ్‌ 19 బాధితులకు పరిహారం ఇవ్వాలి. ట్రేడ్‌ యూనియన్‌ హక్కులను గుర్తించాలి'' అని కన్వెన్షన్‌ డిమాండ్‌ చేసింది. ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో దేశంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు జులై 26 నుంచి 29 వరకు ఢిల్లీలో మహాపడావ్‌ నిర్వహించాలని కన్వెన్షన్‌ నిర్ణయించిందని సంఘం ప్రధాన కార్యదర్శి ఎఆర్‌ సింధూ తెలిపారు.
              బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యం చేయడంతో పాటు కార్మికులుగా గుర్తింపు, కనీస వేతనాలు, పెన్షన్‌, సామాజిక భద్రత, ట్రేడ్‌ యూనియన్‌ హక్కుల కోసం పోరాటాలు చేయాలని సూచించారు. తమ హక్కులతో పాటు ప్రజల హక్కుల కోసం తాము చేస్తున్న పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ అధ్యక్షురాలు కె.హేమలత మాట్లాడుతూ బీజేపీ మతపరమైన విషాన్ని వ్యాపింపజేస్తూ ప్రజలను విభజిస్తున్నదనీ, ప్రజల వాస్తవ సమస్యల నుంచి పక్కదోవపట్టిస్తున్నదని విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాల క్రియాశీల మద్దతుతో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని హిందూత్వ శక్తులు చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వారి లక్ష్యం అంతిమంగా కార్పొరేట్‌ ఎజెండాకు సేవ చేయడమేనని ధ్వజమెత్తారు. మతోన్మాద శక్తులను బహిర్గతం చేయడంతో ప్రజల మధ్య మత సామరస్యం, శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు. అంగన్‌వాడీల గ్రాట్యుటీ కేసులో గుజరాత్‌ అంగన్‌వాడీ యూనియన్‌ తరపు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది పివి సురేంద్రనాథ్‌ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పును వివరించారు. ఈ కన్వెన్షన్‌లో గుజరాత్‌ అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్షుడు అరుణ్‌ మెహతా, వీణా గుప్తా, అంజు మైని తదితరులు ప్రసంగించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగమే మహిళలకు రక్షణ
మేమూ మీ వెంటే
సముద్రమట్టానికి 3,488 కి.మీ. ఎత్తులో జాతీయ జెండా ఎగురవేత
ఉద్యోగులపై ఆర్టికల్‌ 311 ప్రయోగం
అంబుజా, ఏసీసీల్లో అదానీ వాటాల కొనుగోళ్లు
ఢిల్లీలో భద్రత పెంపు
కర్నాటకలో హైవే బంద్‌
ఇక జాన్సన్‌ పౌడర్‌ దొరకదు
నీట్‌, జేఈఈ కలిపి ఒకే పరీక్ష?
మహా సర్కార్‌లో 15మంది నేరచరిత్ర మంత్రులు
ఇంటి అద్దెలపై 18 శాతం జీఎస్టీ
బీజేపీ పాలనలో ప్రమాదంలో రాజ్యాంగ విలువలు
నిన్న గోధుమ... నేడు బియ్యం
బీహార్‌ మార్పు దేశానికో సంకేతం...
జాతీయోద్యమ స్ఫూర్తితో మరో పోరాటం
24 నుంచి బీహార్‌ అసెంబ్లీ
బీసీలకు లక్ష కోట్లు కేటాయించాలి
బీజేపీకి ఈసీ షాక్‌
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తున్న కేంద్రం
రాజకీయ ప్రతీకార చర్య
14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌
జోక్యం చేసుకోలేం
దేశంలో ఉపాధి కొరత
ఉపాధి హామీ పని దినాలు పెంచాలి
విమాన చార్జీలు మీ ఇష్టం!
అర్జెంట్‌ లిస్టింగ్‌ అంటూ రావొద్దు..
వృద్ధులకేది భరోసా!
సమ్మెకు సై
40 శాతం మందికే పని
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జై జవాన్‌... జై కిసాన్‌

తాజా వార్తలు

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

12:26 PM

అంగన్ వాడీ ఉద్యోగుల అర్హతల్లో మార్పులు

12:18 PM

ప్రమాదంలో అందవెళ్లి బ్రిడ్జి

12:13 PM

ఏపీలో ఉక్కు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

12:07 PM

గోల్కొండ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

12:05 PM

రేపు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

11:50 AM

కుండలో నీళ్లు తాగాడని బాలుడిని చితక్కొట్టి చంపిన ఉపాధ్యాయుడు

11:44 AM

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్సీ మృతి

11:37 AM

దేశంలో కొత్తగా 14,092 కరోనా కేసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.