Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళా ఓటర్లతో మార్పు ఖాయం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

మహిళా ఓటర్లతో మార్పు ఖాయం

- గుజరాత్‌లో మహిళల భద్రత మృగ్యం
- ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు
- డెయిరీ రంగంలోనూ తిప్పలు
- సగం ఓటర్లు నారీ లోకమే
అహ్మదాబాద్‌ : గుజరాత్‌ ఎన్నికల్లో ఈ దఫా మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. రాష్ట్రంలో క్షీణించిన మహిళల భద్రత, సంక్షేమం ప్రధానంగా చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ ప్రచారాల్లో ఇప్పటికే మహిళా భద్రతను, ద్రవ్యోల్బణ అంశాలను నొక్కి చెబుతున్నాయి. పోలింగ్‌ రోజు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు తెరచాటు పన్నాగాలు చేస్తోంది. ఆఖరుకు 'సత్యనారాయణ వత్రం' వంటి కార్యక్రమాలను సైతం ఆ పార్టీ పెద్ద సంఖ్యలో పరోక్షంగా నిర్వహిస్తూ హిందూత్వ ఓటు బ్యాంకు నిలుపుకునేందుకు తంటాలు పడుతోంది.
గుజరాత్‌ మోడల్‌గా కార్పొరేట్‌ మీడియా చేసిన ప్రచారమంతా ఒట్టి డొల్ల అని రాష్ట్రంలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలు తేల్చి చెప్పాయి. మహిళలకు కూడా గుజరాత్‌ రాష్ట్రం ఏమాత్రం సురక్షితం కాదని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పారిశ్రామికంగా చాలా గొప్ప ప్రగతి సాధించామని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం అటుంచితే రాష్ట్రంలో రోజువారీ ఉపాధిలో ప్రత్యేకించి తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశ్రామిక ఉత్పాదక ప్రక్రియలో మహిళలను భాగస్వామ్యం చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
రోజువారీ సమస్యలు ఎన్ని ఉత్పన్నమైనా అంతిమంగా వాస్తవిక ప్రభావం అతి ఎక్కువగా పడేది మహిళలపైనే. రాష్ట్రంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం గృహిణులపై ఎనలేని భారాలు మోపుతోంది. వంట గ్యాసు, ఇంధన ధరల పెరుగుదల అంతిమ ప్రభావం కూడా మహిళలపైనే ఎక్కువ పడుతోందని క్షేత్రస్థాయి నివేదికలు తెలియజేస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్రం మొత్తంగా తాగునీటి కోసం నానా యాతన పడుతోంది. ప్రత్యేకించి గ్రామీణ గుజరాత్‌లో మహిళలు మంచి నీటి కోసం పడుతున్న ఇబ్బందుల వర్ణనాతీతం. ఈ పరిస్థితులన్నీ దృష్టి లో ఉంచుకొని మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించితే గుజరాత్‌లో నూతన 'మార్పు' తథ్యమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అటు అర్బన్‌ గుజరాత్‌ కానీ, ఇటు గ్రామీణ గుజరాత్‌ కానీ సమస్యల ప్రభావంలో వ్యత్యాసాలు ఉన్నా కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమిధలౌతున్నది మహిళలే. 'మహిళలు అర్ధరాత్రి వేళ స్వేచ్ఛగా వీధుల్లో సంచరించిననాడే దేశానికి నిజమైన స్వతంత్రం సిద్ధించినట్లు' అని ఉద్బోంధించిన మహాత్మా గాంధీ నడయాడిన గుజరాత్‌ రాష్ట్రమే ఇప్పుడు మహిళలకు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కార్పొరేట్‌ మీడియా వండి వారుస్తున్న కథనాల్లో పేర్కొన్నంత సురక్షితంగా అక్కడ మహిళల పరిస్థితి లేదు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం గుజరాత్‌లో మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేర ఘటనల సంఖ్య 2020లో 8,028గా ఉంది. 2021లోనూ 7348 నేరపూరిత ఘటనలు మహిళలపై చోటుచేసుకున్నాయి. ప్రతిరోజూ సగటున ఐదు లైంగికదాడి నేరాలు జరుగుతున్నాయి. ఏడాదిలో 3,796 లైంగికదాడి కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. గుజరాత్‌లో మహిళా భద్రత ఎంత లోపభూయిష్టంగా ఉందో ఈ గణాంకాలు దర్పణం పడుతున్నాయి.
రాష్ట్రంలో డెయిరీ రంగం చాలా ప్రసిద్ధి చెందిన సంగతి విదితమే. ఈ రంగంలో మహిళలదే గణనీయమైన పాత్ర. మహిళా సాధికారత దిశగా సహకార రంగం బలోపేతం కావడానికి డెయిరీ రంగం ఎంతో దోహదం చేసింది. ఇటీవలి పరిణామాలు అంత సానుకూలంగా ఉండటం లేదు. ప్రత్యేకించి అమూల్‌ కార్పొరేట్‌ ఎత్తుగడలతో మహిళల ఉపాధిపైనా ప్రభావం పడుతోంది.గుజరాత్‌లో మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు 4 శాతం పెరిగింది. అయితే ఇన్నాళ్లూ వారిని పాలక పార్టీలు పట్టించుకోలేదు. ఈ దఫా ఎన్నికల్లో మాత్రం వారిని ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. దీంతో డిసెంబరు మొదటి వారంలో జరిగే పోలింగ్‌లో నారీలోకం తమ సత్తాచాటి సరికొత్త మార్పును ఆహ్వానించడం ఖాయమని స్పష్టమవుతోంది.
రాష్ట్రంలోని ఓటర్లలో సగ భాగంగా ఉన్న మహిళా ఓటర్లలో 38 శాతం మంది 18-20 ఏళ్ల మధ్య వయసున్న యువతులే కావడం విశేషం. 2017 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి మహిళా ఓటర్ల సంఖ్య 50 శాతం పైగా పెరిగింది. 2017లో 1,59,80,616 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో గత అక్టోబరు 10న ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4.91 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 2.37 కోట్ల మంది మహిళా ఓటర్లే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి

తాజా వార్తలు

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.