Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గవర్నర్‌గిరి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

గవర్నర్‌గిరి

- రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం
- రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం
- బీజేపీకి అనుకూలంగా పనులు చక్కబెడుతున్న తీరు
- రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్న మోడీ సర్కారు
- సమాఖ్య విధానానికి తూట్లు : రాజకీయ విశ్లేషకులు
           కేంద్రంలోని మోడీ సర్కారు రాజ్యాంగ పదవులను దుర్వినియోగ చేస్తుంది. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా గవర్నర్‌ వ్వవస్థతో రాష్ట్రాలపై అధికారం చెలాయిస్తున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో కలుగజేసుకుంటూ హద్దులు దాటి వ్యవహరిస్తున్నది. రాష్ట్రమేదైనా బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా గవర్నర్‌లు వ్యవహరిస్తున్నారనే అపవాదు వినిపిస్తున్నది. కేంద్రం 'గవర్నర్‌గిరి'తో ఇప్పటికే పలు రాష్ట్రాలు విసిగెత్తిపోయాయి. ఈ జాబితాలో తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌లతో సహా అనేక రాష్ట్రాలున్నాయి.
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు హయాంలో గవర్నర్‌ వ్యవస్థ దిగజారిపోతున్నది. బీజేపీ రాజకీయ ప్రయోజనాలతో ఆ పదవికి ఉన్న గౌరవం తగ్గిపోతున్నదని రాజకీయవేత్తలు ఆరోపించారు. ఇందుకు దేశంలోని అనేక రాష్ట్రాలలో గవర్నర్లు, అక్కడి రాష్ట్ర ప్రభత్వాలతో వ్యవహరిస్తున్న తీరును వారు ఉదహరించారు. రాజ్‌భవన్‌ అనేది సమాంతర ప్రభుత్వానికి కేంద్రంగా మారిందని తెలిపారు. అయితే, గవర్నర్‌ వ్యవస్థ దుర్వినియోగం ఎప్పటి నుంచో ఉన్న మోడీ పాలనలో అది ఉచ్ఛస్థాయికి చేరిందని చెప్పారు. కేరళలో తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గవర్నర్‌ సిఫారసులపై ప్రభుత్వం రద్దయిన విషయాన్ని రాజకీయవేత్తలు గుర్తు చేశారు. అప్పటి నుంచీ దేశంలో ఆర్టికల్‌ 365 దుర్వినియోగం కొనసా గుతున్నదని చెప్పారు.
మోడీ పాలనలో తీవ్రం
           2014లో కేంద్రంలో మోడీ పాలన మొదలైనప్పటి నుంచి గవర్నర్‌ మర్యాద నిఘంటువు పూర్తిగా తారు మారైందని విశ్లేషకులు తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) లను రాజకీయ ప్రయోజనాల కోసం విపక్ష పాలిత రాష్ట్రాల్లోని అక్కడి పాలకపక్ష నేతలపై దాడులకు వినియోగిస్తున్న తీరులో గవర్నర్‌లు కీలకంగా మారా రు. దీంతో ఒక్కసారిగా సంబంధిత రాష్ట్రాల్లోని గవర్నర్‌లు దూకుడు పెంచారు. వారు తమ రాష్ట్ర ప్రభత్వ నిర్ణయాలపై బహిరంగంగా దాడి చేయటానికీ, వాటిని ప్రజా వ్యతిరేక మైనవిగా చిత్రీకరించటానికి ప్రతి అవకాశాన్నీ ఉపయోగించటాన్ని ప్రార ంభించారని విశ్లేషకులు తెలిపారు. మోడీకి ముందు దేశంలో పరిస్థితులు ఇంతలా దిగజారలేదని చెప్పారు.
ఢిల్లీలో ఎల్జీ పెత్తనం
           బీజేపీయేతర రాష్ట్రాలలో అక్కడి గవర్నర్‌లు పరిపాలనా వ్యవహారాల్లో నిర్మొహమాటంగా జోక్యం చేసు కోవటం తీవ్రమైంది. ఢిల్లీలో అక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) సక్సేనా రోజువారీ జోక్యం, అడ్డంకులు రాష్ట్ర పరిపాలనకు అడ్డంగిగా మారింది. అక్కడి అధికార ఆమాద్మీ పార్టీ (ఆప్‌) ఈ సమస్యను సుప్రీంకోర్టుకూ తీసుకెళ్లింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఎల్జీ జోక్యం చేసుకున్న వివిధ కేసులను సుప్రీం కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్‌ లో వివరించారు. ఇది బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్‌, ఎల్జీల జోక్యం స్థాయికి ఒక ఉదాహరణ అని విశ్లేషకులు తెలిపారు.
పశ్చిమబెంగాల్‌లో మమత వర్సెస్‌ ధన్‌ఖర్‌
           రాజ్‌భవన్‌ బాధిత రాష్ట్రాల్లో మరొకటి పశ్చిమ బెంగాల్‌. ఇక్కడి తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ప్రభుత్వానికి, మాజీ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌కు మధ్య నిత్యం ఘర్షణ వాతావరణమేనని విశ్లేషకులు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై రాజ్‌భవన్‌ పెత్తనం చెలాయించే విధానానికి దారి చూపిన వ్యక్తిగా ఆయన నిలిచారన్నారు. ''నేను ఆయన సేవకురాలిని కాను. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆయన బెదిరిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 'పెగాసస్‌' జరుగుతున్నది'' అని ఆయన గవర్నర్‌గా ఉన్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలు. ఆ సమయంలో ధన్‌ఖర్‌ కొన్ని చర్యలు హైకోర్టు, సుప్రీంకోర్టు ల వరకూ లాగబడ్డాయి.
కేరళ గవర్నర్‌ వివాదాస్పద తీరు
           కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఇందుకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. తన పదవి కాలంలో మొదటి రెండేండ్లు రాష్ట్రంలోని వామపక్ష సర్కారుతో సఖ్యతతో మెలిగిన గవర్నర్‌ ఆ తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్ని ప్రారంభించారన్నారు. బీజేపీ నాయకులతో సత్సంబంధాలు, చర్చలు వంటివి చోటు చేసుకున్నాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తలను రాజ్‌భవన్‌లో సీనియర్‌ సిబ్బందిగా నియమించుకున్న తీరును విశ్లేషకులు వివరించారు. ఇటు ఢిల్లీకి ఆయన ప్రయాణాలు తరచుగా, ఎక్కువ కాలం పాటు సాగాయని అన్నారు. ప్రస్తుతం కేరళలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటున్నారనీ, ఆయన తరచుగా తన గవర్నర్‌ అధికారాలను హద్దుమీరారని తెలిపారు. రాష్ట్ర మంత్రులను బర్తరఫ్‌ చేస్తాననీ ఆరిఫ్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలతో రాజ్యాంగ నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అంతేకాదు.. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ ఆయన బహిరంగంగానే ప్రకటనలు చేసిన సందర్భాలూ ఉన్నాయన్నారు. కేరళ దేశ 'డ్రగ్‌ క్యాపిటల్‌' గా మారుతుందని ఆరిఫ్‌ విమర్శించారు. రాష్ట్రానికి చెంఇన 15 మంది వైస్‌ ఛాన్సలర్లను తొలగిస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఆ తర్వాత హైకోర్టు ఈ నిర్ణయంపై స్టే విధించటం గమనార్హం.
తమిళనాడులో...
           తమిళనాడులోనూ గవర్నర్‌కు, అక్కడి డీఎంకే ప్రభుత్వానికి పొసగటం లేదు. ప్రభుత్వ విధానాల్లో అక్కడి గవర్నర్‌ జోక్యం నిత్యకృత్యంగా మారింది. గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి పదే పదే ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో డీఎంకే విసిగెత్తిపోయింది. ఆయనను రీకాల్‌ చేయాలని అధికారికంగా డిమాండ్‌ చేయటానికి ఇతర పార్టీలనూ సమీకరించింది. ఇటీవల కోయంబత్తూరు పేలుళ్ల ఘటనపై చర్యలు తీసుకోవటంలో 'నాలుగు రోజుల జాప్యం'పై తమిళనాడు ప్రభత్వంపై గవర్నర్‌ దాడి చేసిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేశారు. నీట్‌ బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపటం, మతం విషయంలో ఆయన వ్యాఖ్యలు ద్రావిడ పార్టీలకూ ఆగ్రహాన్ని తెప్పించాయి.
పంజాబ్‌లో...
           పంజాబ్‌కు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ కూడా వైస్‌-ఛాన్సలర్‌ నియామకాల అంశంపై ఆప్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో రాజ్‌భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. ప్రభుత్వ వ్యవహారల్లో తరచూ జోక్యం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి కూడా గవర్నర్‌పై ఆగ్రహంతో ఉన్నారు.
తెలంగాణలో..
           తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి సొంత రాజకీయ పునాదిని ఏర్పర్చుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలను చేస్తున్నది. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన తమిళిసై సౌందరరాజన్‌ను కేంద్రం ఇక్కడి గవర్నర్‌గా నియమించింది. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ చర్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తెలంగాణ విశ్వవిద్యాలయాల బిల్లును ఆమో ఆలస్యం చేసింది. బిల్లులోని కొత్త నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొత్తంగా అసెంబ్లీ ఆమోదించిన ఎనిమిది బిల్లులను గవర్నర్‌ నిలుపుదల చేశారు. అంతటితో కాకుండా, తన ఫోన్‌ ట్యాప్‌ చేయబడిందని కూడా ఆమె ఆరోపించారు. తాను మహిళ అయినందునే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనపై వివక్ష చూపుతున్నదన్నారు. ఇటు ఆమె వ్యవహార శైలిపై టీఆర్‌ఎస్‌ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పాలక పార్టీ నిర్ణయాలు లోపాల పుట్టగా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని కల్పించటానికే గవర్నర్‌ ఇలా వ్యవహరిస్తున్నారనీ, పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇక్కడి కొందరు రాజకీయ నాయకులు ఆరోపించారు.
           రాజ్యాంగ పరిరక్షణలో గవర్నర్‌ల పాత్ర కీలకమని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు తెలిపారు. అయితే, రాజ్యాంగంపై ప్రమాణం చేసినప్పటికీ పక్షపాత రాజకీయ అజెండాతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని తెలిపారు. కేంద్రం సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తున్నదన్నారు. మోడీ సర్కారు రాజకీయ ప్రయోజనాలను దూరం పెట్టి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి

తాజా వార్తలు

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.