Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈడీకి బలమిచ్చిన మోడీ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

ఈడీకి బలమిచ్చిన మోడీ

- కేంద్రం ఇటీవలి ఉత్తర్వులపై నిపుణులు
- అధికార దుర్వినియోగం జరగొచ్చు
- హేతుబద్ధతపై రాజకీయ నాయకులు, విశ్లేషకుల ప్రశ్న
              ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని కేంద్రంలోని మోడీ సర్కారు ఒక ఆయుధంగా వాడుకుంటున్నదని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఈడీ ప్రయోగంతో రాజకీయ నాయకులను లొంగదీసుకునే అనైతిక విధానానికి కేంద్రం పాల్పడుతున్నదని ఆరోపణలూ వినిపించాయి. ఇప్పుడు ఈడీకి మరింత బలాన్ని చేకూర్చేలా మోడీ సర్కారు ఉపక్రమించింది. 15 ఏజెన్సీలతో ఈడీ సమాచారాన్ని పంచుకోవటం కోసం కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) 2002 కింద మోడీ సర్కారు ఇటీవల ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈడీ మరో 15కు పైగా ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకునేందుకు ఇది అనుమతినిస్తుంది. అయితే, ఈ చర్యపై నిపుణులు, రాజకీయ నాయకులు, విశ్లేషకుల నుంచి ఆందోళన వెల్లడవుతున్నది. ఈడీ ద్వారా చట్టం దుర్వినియోగమయ్యే ప్రమాదమున్నదని వారు భయాలను వ్యక్తం చేశారు. ఈ చర్య వెనక గల హేతుబద్ధతను ప్రశ్నించారు.
పీఎంఎల్‌ఏ నోటిఫికేషన్‌ జవాబుదారీతనాన్ని తీసుకొస్తుందని కొన్ని ప్రభుత్వ అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి. అయితే, మరికొందరు న్యాయ నిపుణులు మాత్రం ఇందుకు విరుద్ధంగా తమ అభిప్రాయాలను తెలిపారు. ప్రభుత్వ చర్య కొన్ని కీలక న్యాయ సమస్యలను పరిష్కరించదని హెచ్చరించారు. ఇది కోవర్ట్‌ సర్వీసులకు తలుపులు తెరుస్తుందన్నారు. ప్రభుత్వం ఈడీ చేతులను బలోపేతం చేసిందని సీనియర్‌ అడ్వొకేటు వికాస్‌ పాహ్వ అభిప్రాయపడ్డారు. ఈనెల 22న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌.. మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తెస్తుంది. రాష్ట్ర పోలీసు విభాగాలను ఇది ఈడీ పరిధిలోకి తీసుకొస్తుంది. ఈడీ కోరిన ఏ సమాచారమైనా ఈ సంస్థలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంస్థల్లో జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ (ఎన్‌టీఆర్‌ఓ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ది కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ), సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ), విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశీ వాణిజ్య డైరెక్టర్‌ జనరల్‌, నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌, సెంట్రల్‌ విజలెన్స్‌ కమిషన్‌, వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో, రాష్ట్ర పోలీసు విభాగాలు ఉన్నాయి. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 66కింద ఈ నోటిఫికేషన్‌ జారీ చేయబడింది. దీనికి ముందు ఈడీ కేసు సంబంధిత సమాచారాన్ని పంచుకోగల సంస్థల జాబితాలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ), ది డైరెక్టర్‌, ఫైనాన్షియల్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ శాఖ, కంపెనీ వ్యవహారాల శాఖ, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) లు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ ఇతర ఏజెన్సీలపై ఆధారపడి ఉంటాయనీ, ఇతర అధికారుల విచారణకు లోబడి ఉంటుందని కొందరు నిపుణులు చెప్పారు. ఇతర ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకునేలా వారిని బలోపేతం చేయటం ద్వారా ప్రభుత్వం ఈడీ చేతులను బలోపేతం చేసిందని వికాస్‌ పాహ్వ అన్నారు. ఏజెన్సీకి అందిన సమాచారం ఆధారంగా అరెస్టులు లేదా ఆస్తులను అటాచ్‌ చేయవచ్చనీ, ఏజెన్సీల మధ్య సమాచారాన్ని పంచుకోవటం ద్వారా కొన్ని నిబంధనలు దుర్వినియోగమయ్యే ప్రమాదమున్నదని మాజీ న్యాయమూర్తి చెప్పారు. సీనియర్‌ కాంగ్రెస్‌ ఎంపీ, న్యాయవాది మనీశ్‌ తివారీ కూడా ఈ నోటిఫికేషన్‌ వెనుక ఉన్న హేతుబద్ధతపై అనేక ప్రశ్నలను లేవనెత్తారు. నోటిఫికేషన్‌పై ప్రభుత్వ వివరణ కోరుతూ తాను పార్లమెంటుకు ప్రశ్నను సమర్పించినట్టు ఆయన చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ

తాజా వార్తలు

09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.