Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మానవతావాది చే గువేరా | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

మానవతావాది చే గువేరా

- అమెరికా ఎత్తులను చిత్తు చేస్తున్నాం.. దీనికి క్యూబా ప్రజల ఐక్యతే బలం
- అలైదా గువేరా, ఎస్తెఫానియాకు ఢిల్లీలో ఘనస్వాగతం
న్యూఢిల్లీ: చే గువేరా మానవత్వం కోసం నిలిచారని చేగువేరా కుమార్తె అలైదా గువేరా అన్నారు. వర్ణం, భాష, సంస్కృతి మొదలైన భేదాలు ఉన్నా మనం ఒక్కటే అనే మానవతా భావం ఉండాలని అన్నారు. ప్రపంచంలో ఎలాంటి వ్యవస్థలోనైనా సమానత్వం కోసం నిలబడాలని క్యూబా విశ్వసిస్తుందని నొక్కి చెప్పారు. చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తెఫానియాకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం నాడిక్కడ హరి కిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో జాతీయ క్యూబా సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభ జరిగింది. వందలాది మంది 'చే' అభిమానులు విప్లవ గీతాలు ఆలపిస్తూ, నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మలయాళీలతో సహా చాలా మంది విద్యార్థులు సూర్జీత్‌ భవన్‌కు వచ్చి 'చే' కూతురు, మనవరాలిని కలుసుకుని పలకరించారు.
జేఎన్‌యూ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు ఐషీఘోష్‌ పుష్పగుచ్ఛాన్ని అలైదా గువేరాకు అందజేశారు. ఈ సందర్భంగా అలైదా కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికా నిషేధం కారణంగా క్యూబా అనుభవిస్తున్న సవాళ్లను వివరించారు. క్యూబా అమెరికాతో పోరాడగలుగుతోందనీ, దానికి కారణం ఒక్కటేననీ, క్యూబా ప్రజల ఐక్యత వల్లనే అని ఆమె నొక్కి చెప్పారు. అందుకే క్యూబా ప్రజల ఐక్యతను నాశనం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమెరికా ఆంక్షలను ఎదుర్కొవడానికి, అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి క్యూబా భారీ ఖర్చులను చేయాల్సి వస్తుందని అన్నారు. క్యూబాకు సహకరించే అన్ని దేశాలు, వాణిజ్య సంస్థల పట్ల అమెరికా శత్రు వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు. క్యూబాకు సరఫరా చేసే నౌకలపై కూడా యునైటెడ్‌ స్టేట్స్‌ నిషేధం విధించిందని తెలిపారు. అయితే అమెరికా బెదిరింపులను పట్టించుకోకుండా క్యూబాకు సహకరించే దేశాలు ఉన్నాయనీ, క్యూబా ఆ దేశాలు, సంస్థల పట్ల విధేయతగా ఉంటుందన్నారు. క్యూబా వైద్యులు ఏ దేశానికైనా, ఏ సమయంలోనైనా సేవ చేస్తారని అన్నారు. అమెరికా భయంతో ఐదేండ్ల చిన్నారికి సులువుగా దొరికే మందు ఇవ్వడానికి ఏ దేశం సిద్ధంగా లేదని ఆమె చెప్పారు. 'ది వైర్‌' ఎడిటర్‌, ప్రముఖ పాత్రికేయుడు సిద్ధార్థ్‌ వరదరాజన్‌ మాట్లాడుతూ జీ-20కి అధ్యక్షత వహించే అవకాశాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోవాలనీ, క్యూబాపై అప్రజాస్వామిక, అమానవీయ ఆర్థిక ఆంక్షలను ముగించే ప్రతిపాదనను తీసుకురావాలని అన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ క్యూబా పట్ల సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. సీపీఐఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య మాట్లాడుతూ క్యూబాకి భారతదేశం అండగా ఉండాలన్నారు. ఆర్జేడి ఎంపీ మనోజ్‌ ఝా, క్యూబా రాయబారి అలెజాండ్రో సిమాన్కాస్‌, నేషనల్‌ కమిటీ ఫర్‌ సాలిడారిటీ విత్‌ క్యూబా కన్వీనర్‌ ఎంఎ బేబి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డీయూటీఏ మాజీ అధ్యక్షురాలు నందితా నారాయణ్‌, సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌. అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
క్యూబాకి ఎల్లప్పుడూ సంఘీభావం
క్యూబా, భారతదేశం మధ్య సంఘీభావాన్ని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గుర్తుచేసుకున్నారు. అలీన ఉద్యమంలో నాయకత్వం గురించి పంచుకున్నారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం అలీన దేశాల సదస్సులో పాల్గొనకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. క్యూబాకి ఎల్లప్పుడూ సంఘీభావంగా ఉంటామన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి

తాజా వార్తలు

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

11:19 AM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

11:05 AM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

10:06 AM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

09:55 AM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

07:53 AM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

06:56 AM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.