Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జేఎన్‌యూలో రణరంగం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2023

జేఎన్‌యూలో రణరంగం

- విద్యార్థులపై రాళ్లు..గాజు ముక్కలతో హిందూత్వ శక్తుల దాడి
- బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన అడ్డుకునేందుకు రాత్రంగా కరెంట్‌ కట్‌..
- జామియా మిలియాలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు అరెస్టు
న్యూఢిల్లీ: గుజరాత్‌ 2002నాటి అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా మోడీ సర్కార్‌ అణచివేత చర్యలకు దిగుతోంది. వివిధ వర్సిటీల్లో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనలను జీర్ణించుకోలేకపోతోంది. మంగళవారం రాత్రి ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో డాక్యుమెంటరీ చూస్తున్న వందలాది మంది విద్యార్థులపైకి రాళ్లు, గాజు ముక్కలతో దాడి జరిగింది. ఏబీవీపీ కార్యకర్తలు ఈదాడికి తెగబడ్డారని ఆరోపణలు వెలువడ్డాయి. బుధవారం ఢిల్లీ జామియా మిలియా వర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన డాక్యుమెంటరీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ ప్రదర్శన చేపట్టగా, డాక్యుమెంటరీ ప్రసారమవుతుండగా...మధ్యలో పోలీసులు రంగంలోకి దిగి కార్యక్రమాన్ని నిలిపివేశారు. మంగళవారం రాత్రి డాక్యుమెంటరీ ప్రదర్శనకు జేఎన్‌యూ విద్యార్థి సంఘం పిలుపునివ్వగా, ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని వర్సిటీ యాజమాన్యం, పోలీసులు బెదిరింపులకు దిగారు. ప్రదర్శన ముగిసిన తర్వాత రాత్రి 10.40 గంటల సమయంలో కమ్యూనిటీ సెంటర్‌ వద్ద గుమికూడిన విద్యార్థులపై రాళ్లదాడి జరిగింది. హాజరైనవారి పైకి పగిలిన అద్దాల్ని విసిరేశారని మీడియాలో వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. వర్సిటీ యాజమాన్యం మంగళవారం రాత్రంతా విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. ప్రధాన గేట్లతో సహా అనేక చోట్ల దారుల్ని పోలీసులు మూసేశారు. అయినప్పటికీ వర్సిటీలో క్యాంపస్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటుచేసిన డాక్యుమెంటరీ ప్రదర్శనకు వందలాది మంది విద్యార్థులు హాజరుకావటం విశేషం.
తమ మొబైల్‌ ఫోన్లలో, ల్యాప్‌ట్యాప్స్‌లో డాక్యుమెంటరీని విద్యార్థులంతా చూశారు. డాక్యుమెంటరీ ప్రదర్శనకు ముందు జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ ప్రసంగించారు. ''డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైఫై, విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తారు. అయినా మన కార్యక్రమం ఆగిపోదు'' అని చెప్పారు. ''కార్యక్రమం జరగకుండా వర్సిటీ యాజమాన్యం అడ్డంకులు సృష్టించింది. విద్యుత్‌ సరఫరా నిలిపివేయటం పిరికిచర్య. అన్ని రకాల భావాలపై చర్చించే వేదికగా ఈ వర్సిటీకి పేరుంది. అయితే ఇప్పుడు వర్సిటీ యాజమాన్యం వ్యవహరించిన తీరు విద్యాసంస్థ ప్రతిష్టను దెబ్బతీసింది''అని ఒక విద్యార్థి అన్నారు.
చూడొద్దు..అంటూ నోటీసు
డాక్యుమెంటరీ చూడొద్దు, ప్రదర్శనలో పాల్గొనద్దు..అంటూ సోమవారం నాడు జేఎన్‌యూ యాజమాన్యం విద్యార్థులను బెదిరించింది. జేఎన్‌యూఎస్‌యూ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అనుమతులు లేవని పేర్కొంది. ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి కమ్యూనిటీ సెంటర్‌ వద్ద జరిగిన రాళ్లదాడి, గాజుపెంకల దాడి..ఏబీవీపీ కార్యకర్తల పనేనని ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ) ఆరోపించింది. దాడి ఘటనను తీవ్రంగా ఖండించింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా విద్యార్థులంతా గళమెత్తుతారని, ప్రజాస్వామిక గొంతు వినిపిస్తారని ఒక ప్రకటనలో ఏఐఎస్‌ఏ తెలిపింది.
జామియా మిలియా
బుధవారం ఢిల్లీ జామియా మిలియా వర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన డాక్యుమెంటరీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. పదుల సంఖ్యలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం వర్సిటీ ప్రధాన గేటును మూసేసిన పోలీసులు, విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. దీంతో గేటు వద్ద విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఫతేపూర్‌ బేరిలోని క్యాంపస్‌కు 20 కి.మీ దూరంలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల్ని పోలీసులు అరెస్టు చేయటం ఏంటని 'ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌' (ఏఐఎస్‌ఏ) ప్రశ్నించింది. అరెస్టయిన కార్యకర్తల మొబైల్‌ ఫోన్లను పోలీసులు లాక్కున్నారని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తు న్నామని ఏఐఎస్‌ఏ ఒక ప్రకటన జారీచేసింది. అరెస్టు చేసిన విద్యార్థుల్ని పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో బుధవారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో డాక్యు మెంటరీ ప్రదర్శన చేపట్టగా, డాక్యుమెంటరీ ప్రసారమవుతుం డగా...మధ్యలో పోలీసులు రంగంలోకి దిగి కార్యక్రమాన్ని నిలిపివేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డిగ్రీ చూపించమంటే..జరిమానా?
కార్మిక హక్కులపై దాడికి వ్యతిరేకంగా నిరసన దినం
ఏప్రిల్‌ 3న ప్రతిపక్ష పార్టీల సమావేశం
పెగాసస్‌ తర్వాత ఏంటి ?
గుజరాత్‌లో ఖాళీగా 32 వేలకు పైగా టీచింగ్‌ పోస్టులు
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బెంగళూరులో దారుణం
35కు చేరిన ఇండోర్‌ మెట్లబావి మృతులు
మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ నిరాకరణ
అధిక విమాన ఛార్జీలను నియంత్రించాలి
జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..
ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్‌
రూ.2,235 కోట్లతో వరంగల్‌-ఖమ్మం మధ్య జాతీయ రహదారుల విస్తరణ : నితీన్‌ గడ్కరీ
ముగిసిన ఉపాధి 'ఆధార్‌' గడువు
మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు
ఆజ్మీర్‌లో ఓయో ఉచిత వసతి
కళాక్షేత్రలో లైంగిక వేధింపులు
కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలి
384 ఔషధాల ధరలు 12.12 శాతం పెంపు
తొవ్వేయడమే
పెరుగు వివాదంపై పీఛేముడ్‌...
ఢిల్లీలో పోస్టర్ల యుద్ధం
పీఎఫ్‌ ఖాతాల్లో 4,962 కోట్లు
డర్టీ బీజేపీ ఎమ్మెల్యే
శ్రీరామనవమి ఉత్సవాల్లో విషాదం !
రాహుల్‌కు పాట్నా హైకోర్టు సమన్లు
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..
'ఉపాది' బకాయిలు
బీసీ గణన చేయాలి
బీమా కంపెనీలకే లబ్ది

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.