Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు గౌతం అదానీ సంస్థల బండారం బట్టబయలైంది. హిండేన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ బయటపెట్టింది అదానీ బాగోతమే కాదు ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ అక్రమాల అసలు మతలబుని. రెండు రోజుల్లో 4,18,000 కోట్ల మేర అదాని సంస్థల సంపద ఆవిరైంది. అసాంఖ్యాక ప్రజల, ఎన్నో సంస్థలకి నమ్మక ద్రోహం చేసిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానిది ప్రధాన భూమిక. మూడు దశాబ్దాల్లో ప్రపంచ మూడవ కూబేరుణ్ణి చేసిన ఘనత కచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వానిదే. రెగ్యులేటరీ నిబంధనలను సవరింపజేసి, పెన్షన్‌, ప్రావిడేంట్‌ ఫండ్‌ను, ప్రభుత్వ రంగాలైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి దిగ్గజాలతో పెట్టుబడులు పెట్టించిన ప్రభుత్వం ప్రధాన బాధ్యురాలేనని నిపుణులు అభిప్రాయపడు తున్నారు. అయితే ఈ సీక్రెట్‌ వ్యవహారా లకు ఆశ్రిత విధానాలతో స్టాక్‌ మార్కెట్టూ అదానీకి బాగా ఉపయోగపడ్డాయి, ఒక్క వార్త వేలకోట్ల సామ్రాజ్యాన్ని పేక మేడలా కూలేటట్లు చేయగల సామర్థ్యం స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత వ్యవస్థకు మాత్రమే సాధ్యం. ప్రపంచ కుబేరుడు గౌతమ్‌ అదాని వ్యాపార వ్యవహారాలపై హిండెన్‌ బర్గ్‌ ఇచ్చిన ఒక దర్యాప్తు నివేదిక వారి సామ్రాజ్యానికి బీటలు వారేలా చేసింది. కుబేరుల్లో మూడు నుంచి ఏడవ స్థానానికి రెండు రోజుల వ్యవధిలోని పడిపోయినట్లు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైనట్లు వార్తా మాధ్యమాలన్నీ గొల్లుమన్నాయి. అయితే కూలిపోయిన అదాని పేక మేడకు ఆశపడి రాళ్ళెత్తిన అనేక ప్రభుత్వ, ప్రైవేటు, వ్యక్తిగత మదుపుదారులందరూ కన్నీళ్లు కార్చడం తప్ప వేరే దారి లేదు. దీని పర్యవసానంగా అదాని గ్రూపులో పెట్టుబడులు పెట్టిన అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగాల కంపెనీల వాటాలన్నీ కూడా పడిపోతున్నవి. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ వంటి సంస్థల వాటాలు కూడా వేలకోట్ల నష్టాలు చవిచూశాయని వార్తలున్నాయి. ఇలాంటి సంస్థల కన్నా వ్యక్తిగత మదుపుదారులే భయాందోళనకు గురై అమ్ముకున్న కారణంగా చాలా నష్టపోయారు. షేర్లలో అవకతవకలకు, అకౌంట్స్‌లో మోసాలకు, మనీలాండరింగ్‌కు అదానీ గ్రూపు పాల్పడిందన్నది హిండెన్‌బర్గ్‌ నివేదిక సారాంశం. ఆ రిపోర్టులో లేవనెత్తిన పలు అంశాలు, ప్రశ్నలపై అదానీ సమాధానం చెప్పకుండా, తమను దెబ్బతీయడానికి చేసిన కుట్ర అని ఎదురుదాడి చేశారు. ప్రతిగా తమ నివేదికపై కట్టుబడి ఉన్నామని, ఎలాంటి చర్యలకైనా సిద్ధమని హిండెన్‌బర్గ్‌ చేసిన సవాల్‌పై అదానీ వైపు నుంచి స్పందన శూన్యం.
పైకి రోల్‌మోడల్స్‌గా కనిపించే కార్పొరేట్ల చీకటి దందాలు హిండెన్‌బర్గ్‌ నివేదికతో మరోసారి బహిర్గతం అయ్యాయి. అదానీ గ్రూపులోని ఏడు ప్రధాన కంపెనీల షేర్లను తిమ్మినిబమ్మిని చేసి కత్రిమంగా ధరలు పెంచుకున్నారు. ఆ షేర్లను తాకట్టుపెట్టి బ్యాంకుల నుంచి అడ్డగోలుగా అప్పులు తెస్తున్నారు. అందినకాడికి పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారు. పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా ఉన్న సింగపూర్‌, మారిషస్‌, కరీబియన్‌ దీవులు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి లాభాలను వాటిలోకి మనీలాండరింగ్‌ పద్ధతుల్లో తరలిస్తున్నారు. ఇటువంటి అక్రమాలతోనే అదానీ గ్రూపులోని షేర్లు ఎకాయికిన 819 శాతం పెరిగాయి. నికర విలువ 231 శాతానికి ఎగబాకింది. మూడేళ్ల క్రితం గ్రూపు వర్త్‌ రూ.1.62 లక్షల కోట్లు కాగా ఇప్పుడు 9.78 లక్షల కోట్లు. ఈ స్వల్ప సమయంలో 8.1 లక్షల కోట్లు పెరగడం అసాధారణం. కరోనా విలయంతో ప్రజలు అల్లాడుతుండగా అదానీ సంపద అనూహ్యంగా పెరిగింది మోసాల నిచ్చెనతోనేనన్న విషయంలో ఎలాంటి సందేహం ఉండనవసరం లేదు. హిండెన్‌బర్గ్‌ పేల్చిన బాంబుతో అదానీ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. రూ.వేల కోట్ల విలువైన సంపద ఆవిరైంది. షేర్‌ మార్కెట్‌లో సంపద గాలి బుడగ అనడానికి ఇదొక ఉదాహరణ. అదానీ గ్రూపులోని షేర్లలో 85 శాతం కుప్పకూలతాయని హిండెన్‌బర్గ్‌ చేసిన హెచ్చరికకు తాజా పరిణామం బలాన్ని చేకూరుస్తోంది.
హిండెన్‌బర్గ్‌ నివేదిక అదానీకో లేదంటే ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకో పరిమితం కాదు. మోడీ ప్రభుత్వానికీ పెద్ద కుదుపు. అదానీ-మోడీ మధ్య అవినాభావ సంబంధం బహిరంగం. 1988లో చిన్న ఎగుమతి, దిగుమతి కంపెనీతో వ్యాపారం ప్రారంభించిన అదానీకి 1991 నుంచి దేశంలో ప్రారంభమైన సరళీకరణ విధానాలు ఊపునిచ్చాయి. గుజరాత్‌ సిఎంగా మోడీ వచ్చాక అదానీ ప్రభ వెలిగింది. మోడీ దేశ ప్రధాని అయ్యాక అదానీ వాణిజ్య సామ్రాజ్యం అవధులు దాటింది. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రైల్వే, రోడ్డు, విద్యుత్‌, గ్యాస్‌, బొగ్గు, రియల్‌, ఒకటేమిటి... సకలం అదానీ వశమవుతున్నాయి. కేంద్ర బిజెపి ఆశ్రితపక్షపాతం లేకుండా అదానీ ఇంతగా ఎదగడం అసాధ్యం. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల్లోనూ అదానీ చక్రంతిప్పడానికి మోడీ సర్కారే కారణం. డ్రగ్స్‌ అక్రమ రవాణాకు అదానీ పోర్టులు కేంద్రాలుగా మారాయని వెల్లడైంది. ఇంతకుముందు అక్రమాలకు సంబంధించిన కేసులలో అదానీ కంపెనీలపై సెబి నిషేధం విధించగా, దానిని జరిమానా కింద మార్పించుకుని అదానీ బయట పడ్డారు. సెబి, ఆర్‌ఒసి, ఇడి, సిబిఐ, నిఘా సంస్థలు కొమ్ము కాస్తున్నందునే అదానీ మార్కెట్‌ మాయాజాలం సక్సెస్‌ అయింది. ఇప్పటికైనా హిండెన్‌బర్గ్‌ రిపోర్టుపై కేంద్రం అదానీ ఆర్థిక అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయిస్తుందో లేదో వెండితెరపై చూడాల్సిన బొమ్మే!
అదానీ కోసం ఎల్‌ఐసి, ఎస్‌బిఐలు బలి..!
- కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ ప్రశ్నలు
హైదరాబాద్‌ : అదానీ గ్రూపు మోసాలపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై మంత్రి కెటిఆర్‌ స్పందించారు. అదానీ గ్రూప్‌ స్టాక్‌ల్లో ఎల్‌ఐసి, ఎస్‌బిఐ సంస్థలు వరుసగా రూ.77వేల కోట్లు, రూ.80వేల కోట్లు చొప్పున ఎందుకు పెట్టుబడులుగా పెట్టాల్సి వచ్చిందని కెటిఆర్‌ శనివారం ప్రశ్నించారు. ఎల్‌ఐసి, ఎస్‌బిఐ సంస్థలను అలా నెట్టిందెవరు?.. అని కేంద్రాని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు సహాయం చేశారు?.. అని పేర్కొన్నారు. ఈ తీవ్రమైన ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ దెబ్బకు అదానీ గ్రూపు కంపెనీల షేర్లు 25 శాతం వరకు పతనం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్లపై అదే విధంగా ఎల్‌ఐసి, ఎస్‌బిఐ షేర్లపై తీవ్రంగా పడుతోంది. ఇతర బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కూడా ఒత్తిడికి గురి అవుతున్నాయి.
మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించాలి : ఎంఎల్‌సి కవిత
            స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులు, షేర్ల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ట్విట్టర్‌ ద్వారా ఆమె డిమాండ్‌ చేశారు. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో ఎల్‌ఐసి, ఎస్‌బిఐ సహా ఇతర షేర్లలో తగ్గుదల, ఒడుదొడుకులు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని కవిత పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ప్రతీ ఒక్క భారతీయుడికి కేంద్రం సమాధానం చెప్పాలని కవిత డిమాండ్‌ చేశారు. దీనిపై నెలకొన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, సెబీ చీఫ్‌ మాధవి పూరీ బుచ్‌ దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన లక్షలాది మంది పెట్టుబడిదారులు, వారిపై ఆధారపడిన కుటుంబాలతో ప్రభుత్వం తరఫున స్పందించాలన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గుజరాత్‌లో ఖాళీగా 32 వేలకు పైగా టీచింగ్‌ పోస్టులు
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బెంగళూరులో దారుణం
35కు చేరిన ఇండోర్‌ మెట్లబావి మృతులు
మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ నిరాకరణ
అధిక విమాన ఛార్జీలను నియంత్రించాలి
జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..
ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్‌
రూ.2,235 కోట్లతో వరంగల్‌-ఖమ్మం మధ్య జాతీయ రహదారుల విస్తరణ : నితీన్‌ గడ్కరీ
ముగిసిన ఉపాధి 'ఆధార్‌' గడువు
మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు
ఆజ్మీర్‌లో ఓయో ఉచిత వసతి
కళాక్షేత్రలో లైంగిక వేధింపులు
కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలి
384 ఔషధాల ధరలు 12.12 శాతం పెంపు
తొవ్వేయడమే
పెరుగు వివాదంపై పీఛేముడ్‌...
ఢిల్లీలో పోస్టర్ల యుద్ధం
పీఎఫ్‌ ఖాతాల్లో 4,962 కోట్లు
డర్టీ బీజేపీ ఎమ్మెల్యే
శ్రీరామనవమి ఉత్సవాల్లో విషాదం !
రాహుల్‌కు పాట్నా హైకోర్టు సమన్లు
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..
'ఉపాది' బకాయిలు
బీసీ గణన చేయాలి
బీమా కంపెనీలకే లబ్ది
కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.