Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు

- ఆగస్టు 9న రాష్ట్రాల్లో మహా ధర్నా
- 2023 పోరాటాల సంవత్సరం
- ఏడాది చివరిలో జాతీయ సమ్మె

- జాతీయ కన్వెన్షన్‌లో కార్మిక సంఘాల నేతలు పిలుపు
న్యూఢిల్లీ : తీవ్ర స్ధాయిలో కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలను ఉధృతం చేసేందుకు కేంద్ర కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్నందున 2023 పోరాటాల సంవత్సరంగా మారనుందని స్పష్టం చేశాయి. లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాలను నిలిపివేయాలనీ, కార్మికులకు హాని కలిగించే విధానాలను ఉపసంహరించుకోవాలనీ, ఉద్యోగ స్థిరత్వాన్ని నిర్ధారించాలనీ, సార్వత్రిక పెన్షన్‌ను కోరుతూ ఆందోళనలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి. సోమవారం నాడిక్కడ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ అనెక్స్‌లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, ఏఐయూటీయూసీ, సేవా, టీయూసీసీ, ఏఐసీసీటీయూ, ఎల్పిఎఫ్‌, యూటీయూసీ నేతృత్వంలో జాతీయ కన్వెన్షన్‌ జరిగింది. మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించడంతో కన్వెన్షన్‌ ప్రారంభమైంది. ఆగస్టు 9న క్విట్‌ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో మహాపడవ్‌ను కార్మిక సంఘాలు నిర్వహించనున్నాయని కన్వెన్షన్‌ ప్రకటించింది. మహా ధర్నాకు ముందు జిల్లా, పంచాయతీ స్థాయిల్లో సమావేశాలు, జాతాలు, పాదయాత్రలు నిర్వహించనున్నారు. ఏడాది చివరిలో జాతీయ సమ్మె కూడా నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు కె. హేమలత (సీఐటీయూ), బినరు విశ్వం (ఏఐటీయూసీ), అమిత్‌ యాదవ్‌ (ఐఎన్‌టీయూసీ),రాజా శ్రీధర్‌ (హెచ్‌ఎంఎస్‌), ఆర్‌.పరాశర్‌ (ఏఐయూటీయూసీ), జిఆర్‌ శివశంకర్‌ (టీయూసీసీ), లతా బెన్‌ (సేవా), కెకె బోరా (ఏఐసీసీటీయూ), రషీద్‌ ఖాన్‌ (ఎల్పీఎఫ్‌), శత్రుజిత్‌ సింగ్‌ (యూటీయూసీ) పది మంది సభ్యులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. అన్ని సెక్టోరల్‌ నేషనల్‌ ఫెడరేషన్‌ల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక వ్యవస్థలోని అసంఘటిత, వ్యవస్థీకృత, స్వయం ఉపాధి, మొదలైన అన్ని రంగాలకు చెందినవారు పాల్గొన్నారు. జాతీయ ఐక్యత, సామరస్య జీవనాన్ని కాపాడేందుకు కార్మికులు పోరాడాలనీ, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ విధానాలను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్రాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆమోదించడానికి రాష్ట్ర, జిల్లా, సెక్టోరల్‌ స్థాయి సమావేశాలను నిర్వహించడం ప్రారంభించి, ఆగస్టు 9న క్విట్‌ ఇండియా రోజున రాష్ట్రాల్లో మహాపాడవ్‌గా ముగుస్తుందని డిక్లరేషన్‌ను కన్వెన్షన్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అదానీ కంపెనీల మోసాలపై దర్యాప్తు చేయాలి : తపన్‌ సేన్‌
సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ మాట్లాడుతూ కేంద్రంలోని ప్రభుత్వ, కార్మిక, ప్రజా, జాతీయ వ్యతిరేక విధానాలను బహిర్గతం చేయడానికి ఏడాది పొడవునా ఆందోళనలు చేయనున్నట్టు తెలిపారు. పీఎస్‌యూల ప్రయివేటీకరణ విధానాలు, జాతీయ వనరులు, ఆస్తులను దేశ, విదేశీ కార్పొరేట్‌లకు విక్రయించడం, దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ఫైనాన్స్‌ క్యాపిటల్‌కు లొంగదీసుకోవడానికి వ్యతిరేకంగా, దేశ స్వావలంబన, సార్వభౌమాధి కారం, స్వాతంత్య్రం పరిరక్షణ కోసం పోరాడాలనే నొక్కిచెప్పారు. అశ్రిత పెట్టుబడిదారులు (క్రోనీ క్యాపిటలిస్ట్‌ల)ను రక్షించడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బహిర్గతం చేశారు. హిండెన్‌బర్గ్‌ పరిశోధన నివేదిక చేసిన అదానీ కంపెనీల మోసాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక స్వరాన్ని అణచివేయడానికి అన్ని అప్రజాస్వామిక చర్యలకు పూనుకోవడంతో సమాజంలోని లౌకిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్‌ కౌర్‌, ఐఎన్‌టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్‌ కుమార్‌ సింగ్‌, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి హర్భజన్‌ సింగ్‌, ఏఐయూటీయూసీ వర్కింగ్‌ కమిటీ రాజిందర్‌ సింగ్‌, టీయూసీసీ అధ్యక్షురాలు కె ఇందు ప్రకాష్‌ మీనన్‌, సేవా జాతీయ కార్యదర్శి సోనియా జార్జ్‌, ఏఐసీసీటీయూ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ దిమ్రీ, ఎల్పీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి షణ్ముగం, యూటీయూసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ ఘోష్‌ తదితరులు మాట్లాడారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డిగ్రీ చూపించమంటే..జరిమానా?
కార్మిక హక్కులపై దాడికి వ్యతిరేకంగా నిరసన దినం
ఏప్రిల్‌ 3న ప్రతిపక్ష పార్టీల సమావేశం
పెగాసస్‌ తర్వాత ఏంటి ?
గుజరాత్‌లో ఖాళీగా 32 వేలకు పైగా టీచింగ్‌ పోస్టులు
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బెంగళూరులో దారుణం
35కు చేరిన ఇండోర్‌ మెట్లబావి మృతులు
మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ నిరాకరణ
అధిక విమాన ఛార్జీలను నియంత్రించాలి
జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..
ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్‌
రూ.2,235 కోట్లతో వరంగల్‌-ఖమ్మం మధ్య జాతీయ రహదారుల విస్తరణ : నితీన్‌ గడ్కరీ
ముగిసిన ఉపాధి 'ఆధార్‌' గడువు
మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు
ఆజ్మీర్‌లో ఓయో ఉచిత వసతి
కళాక్షేత్రలో లైంగిక వేధింపులు
కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలి
384 ఔషధాల ధరలు 12.12 శాతం పెంపు
తొవ్వేయడమే
పెరుగు వివాదంపై పీఛేముడ్‌...
ఢిల్లీలో పోస్టర్ల యుద్ధం
పీఎఫ్‌ ఖాతాల్లో 4,962 కోట్లు
డర్టీ బీజేపీ ఎమ్మెల్యే
శ్రీరామనవమి ఉత్సవాల్లో విషాదం !
రాహుల్‌కు పాట్నా హైకోర్టు సమన్లు
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..
'ఉపాది' బకాయిలు
బీసీ గణన చేయాలి
బీమా కంపెనీలకే లబ్ది

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.