Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొలువు సవాల్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

కొలువు సవాల్‌

- కష్టంగా మారిన నాణ్యమైన ఉద్యోగాల సాధన
- మహమ్మారి, లాక్‌డౌన్‌ పరిస్థితుల ప్రభావం
- దేశంలోని యువత, నిరుద్యోగులకు క్లిష్ట కాలం
- బడ్జెట్‌లోనైనా ఏదైనా పరిష్కారం చూపాలి
- ఆర్థిక నిపుణులు, విశ్లేషకుల సూచన
న్యూఢిల్లీ : దేశంలో ప్రతి రంగాన్ని కుదేలు చేసిన కరోనా మహమ్మారి సామాన్య ప్రజల నుంచి చిన్న వ్యాపారుల వరకు.. ప్రతి ఒక్కరికీ వివత్కర పరిస్థితులను చూపింది. మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేసిన లాక్‌డౌన్‌, పెద్ద నోట్ల రద్దు దుష్ప్రభావాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, దేశంలోని యువత కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పటి వరకు తమకున్న ఉద్యోగాలను కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. దీంతో వారి ఆశలన్నీ అడడియాశలయ్యాయి. కరోనా ముందు వరకూ ఆర్థిక మందగమనంతో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనదశలో ఉన్నది. అయినప్పటికీ.. ఆ పరిస్థితుల్లోనూ దేశ యువత కొంత వరకు నిలదొక్కుకున్నారు. అయితే, కరోనానంతరం పరిణామాలు ఒక్కసారిగా వారి జీవితాలను తలకిందులుగా చేశాయి. ఆకర్షణీయమైన జీతాలు, ఒక స్థిరమైన హౌదాలో ఉన్న ఉద్యోగులందరిలో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అలాంటి ఉద్యోగులు బతుకు బండి నడవటం కరోనా కాలంలోనూ, ఇప్పటికీ.. తమకు సంబంధం లేని పనులను చేస్తున్నారు. కొందరు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలతో నెట్టుకొస్తుంటే.. మరికొందరు ఉదయం నిద్ర లేచింది మొదలు.. అర్ధరాత్రి వరకు ఒకటికి పైగా ఉద్యోగాలను చేస్తున్న పరిస్థితులు కనబడ్డాయి.
''నేను హౌరాలోని మెటల్‌ వర్క్స్‌లో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేసేవాడిని. అయితే, కరోనా పరిస్థితులతో ఆ ఉద్యోగం కోల్పోయాను. లాక్‌డౌన్‌ సమయంలో పోస్టా మార్కెట్‌కు సమీపంలోని ఉంటూ.. గోనె సంచులలో వ్యాపారం చేసే హౌల్‌సేల్‌ సంస్థలో పార్ట్‌టైమ్‌ పని చేస్తున్నాను. అలాగే, ఒక ఫుడ్‌కోర్టులో క్యాషియర్‌గా చేస్తున్నాను'' అని కోల్‌కతాలోని ఒక వ్యక్తి తెలిపాడు. అయితే, ఈ రెండు ఉద్యోగాల కారణంగా జీవిత నాణ్యత పడిపోయందని సదరు వ్యక్తి వాపోయాడు. ఎక్కువ పని గంటలు, ఆరోగ్యం, భవిష్యత్తుకు సంబంధించి భరోసా లేకుండానే ఈ ఉద్యోగాలను చేయాల్సి వస్తున్నదని చెప్పాడు. ఇతను మాత్రమే కాదు.. దేశంలోని చాలా మంది యువత, నిరుద్యోగుల పరిస్థితి ఇలాగే ఉన్నదని నిపుణులు, విశ్లేషకులు చెప్పారు. మహమ్మారి ప్రేరిత వ్యాపార మాంద్యం తర్వాత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకోవడంతో ఉద్యోగాలు కొంత ఏర్పడ్డాయి. కానీ, ఆ ఉద్యోగాల నాణ్యత తరచుగా అస్పష్టంగా ఉన్నది. ఎందుకంటే వాటిలో ఎక్కువ భాగం అనధికారిక రంగంలో ఉన్నాయని నిపుణులు తెలిపారు. దేశంలోని చాలా మంది యువత ఇప్పటికీ ఉద్యోగాలు పొందలేక నిరుద్యోగులుగా మారుతున్నారని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న నిరుద్యోగులకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించటం కష్టంగా తయారైందని అన్నారు. జనాభా పెరుగుదల, మహమ్మారి సమయంలో పనిని కోల్పోయిన వారితో జాబ్‌ మార్కెట్‌లో ఎక్కువ మంది కొత్తగా చేరటం, కేంద్రం నుంచి సరైన విధానాలు లేని కారణంగా ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు.'' రెండు సంవత్సరాల కోవిడ్‌ -19 నుంచి కోలుకున్న పెద్ద కార్పొరేట్‌ల ద్వారా వృద్ధి ఎక్కువగా ఉన్నది. అయితే, సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) లేదా సెమీ ఫార్మల్‌ రంగం కొంత భాగం చనిపోయింది. కొంత భాగం రెండింతల నుంచి కోలుకోలేదు. పెద్ద నోట్ల రద్దు, మహమ్మారి దెబ్బ కారణంగానే ఇదంతా..'' అని ప్రఖ్యాత ఆర్థికవేత్త, జాతీయ గణాంక కమిషన్‌ మాజీ చైర్మెన్‌ ప్రణబ్‌ సేన్‌ వివరించారు. భారత్‌లో 2011-12లో 3 శాతం లోపు.. 2017-18లో ఆరు శాతం లోపు ఉన్న నిరుద్యోగం.. ప్రస్తుతం 8 శాతం దగ్గరకు చేరుకున్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, తాజాగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోనైనా నిరుద్యోగుల విషయంలో కేంద్రం ఏవైనా ఉపయోగపడే చర్యలు చేపట్టాలని సూచించారు. లేకపోతే దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరే ప్రమాదమున్నదని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇస్రో ఘన విజయం
కరోనా కేసులు పెరుగుతున్నయ్‌
అది ఉగ్రవాద సంస్థ కాదు
మంగుళూరులో రెచ్చిపోయిన కాషాయ మూకలు
పిరికి ప్రధాని
ఉపాధి తగ్గింది
నా పేరు సావర్కర్‌ కాదు..గాంధీ
చిన్నారుల్లో పోషకాహారలోపం
ప్రజాస్వామ్య భావనపై దాడి
గుజరాత్‌ సీఎంఓ సీనియర్‌ అధికారి రిజైన్‌
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి సత్తా
ప్రతిపక్షాల న్యాయ పోరాటం
40% పెరిగిన బ్యాంక్‌ ఎగవేతలు
ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
15 రోజుల్లోగా లొంగిపోండి : సుప్రీం
మోడీ సొంత రాష్ట్రంలో పెరిగిన పేదరికం
అదానీ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే !
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
రాహుల్‌పై అనర్హత వేటు
రాహుల్‌కు జైలు
విప్లవ వీరులకు వందనం
పోలవరం మొదటి దశ 41.15 మీటర్ల ఎత్తు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌
గ్యాస్‌ సబ్సిడీకి కోత రూ.44,647 కోట్లు
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందే..
27న కవిత పిటిషన్‌ విచారణ
భువనగిరికి బ్లాక్‌ లెవెల్‌ క్లస్టర్‌ మంజూరు చేయండి
కులాన్ని బట్టి శిక్ష?
బాణసంచా పరిశ్రమలో పేలుడు
మహాత్మాగాంధీ మనవరాలు గోకనీ మృతి

తాజా వార్తలు

07:43 PM

తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.