Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఢిల్లీలో మళ్లీ విద్వేష ప్రసంగాలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 09,2023

ఢిల్లీలో మళ్లీ విద్వేష ప్రసంగాలు

న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాల్ని మొగ్గ దశలోనే అడ్డుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నా..మోడీ సర్కార్‌ ఆ ఆదేశాల్ని పెడచెవిన పెడుతోంది. దాంతో హిందూత్వ శక్తులు చెలరేగిపోతున్నాయి. ఢిల్లీ వేదికగా విద్వేష ప్రసంగాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో 'సనాతన్‌ ధర్మ సన్సద్‌' పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించగా, అందులో పాల్గొన్న హిందూత్వ సంస్థల నాయకులు మైనార్టీలపై విద్వేషాన్ని వెళ్లగక్కారు. ఈ ప్రసంగాలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తగా, కేవలం ట్విట్టర్‌ ఖాతాలను నిలుపుదల చేస్తూ చర్యలు తీసుకున్నారు. విద్వేష ప్రసంగాలు చేసిన నాయకులపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేయక పోవటం విమర్శలకు దారితీసింది. ధీరేంద్ర శాస్త్రి, ఆయన మద్దతుదారుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో 'సనాతన్‌ ధర్మ సన్సద్‌' ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన భక్త హరి మహరాజ్‌, మరికొంత మంది మైనార్టీలపై విద్వేషాన్ని వెళ్లగక్కుతూ ప్రసంగించారు. ఈ ప్రసంగాల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయినా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టడం లేదు. వీడియోలు ప్రసారం కాకుండా ట్విట్టర్‌కు నోటీసులు జారీచేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. అంతకు మించి నిందితులపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని విద్వేష ప్రసంగాలు చేశారని వీడియో దృశ్యాలతో స్పష్టమైన ఆధారాలున్నా పోలీసులు కేసులు నమోదుచేయక పోవటంపై విమర్శలు వస్తున్నాయి. ''పోలీసుల నుంచి నోటీసు మాకెందుకు వచ్చిందో తెలియటం లేదు. ఇది మమ్మల్ని ఆశ్చర్యపర్చింది. విద్వేష ప్రసంగాలు చేసినవారికే నోటీసులు పంపాల్సింది'' అంటూ ట్విట్టర్‌ స్పందించింది.
          రామచరిత మానస్‌ను జాతీయ పుస్తకంగా, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, ధీరేంద్ర శాస్త్రికి 'జెడ్‌ ప్లస్‌' కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని 'ధర్మ సన్సద్‌' డిమాండ్‌ చేసింది. మైనార్టీలపై హింసకు దిగాలని మెజార్టీ హిందువుల్ని రెచ్చగొడుతూ సభ ప్రారంభమైన కొద్ది సేపటికి ప్రసంగాలు మొదలయ్యాయి. ఇండియాను హిందూ రాష్ట్రగా మార్చాలని మద్దతుదారులకు ధీరేంద్ర శాస్త్రి, మిగతా నాయకులు పిలుపునిచ్చారు. రామ్‌చరిత్‌ మానస్‌ను వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకుల్ని ముఖ్య అతిథి భక్త హరి తీవ్రంగా దూషించాడు. ఒక వర్గం వాళ్లని ప్రత్యేకంగా పేర్కొంటూ, ''వాళ్లని ఎప్పుడు చంపుతావు? నీ దగ్గర ఆయుధాల్లేవా? కూరగాయలు కోసే కత్తి వుందికదా? కత్తులు, తుపాకులు తెచ్చుకో. చూడండి...మన దేవుళ్లందరి దగ్గరా ఏదో ఒక ఆయుధం ఉంటుంది. అలాగే నీ దగ్గర కూడా ఒక ఆయుధం ఉండాలి. మత పుస్తకాలు, ఆయుధాలు సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్లూ'' అంటూ భక్త హరి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పెరుగు వివాదంపై పీఛేముడ్‌...
ఢిల్లీలో పోస్టర్ల యుద్ధం
పీఎఫ్‌ ఖాతాల్లో 4,962 కోట్లు
డర్టీ బీజేపీ ఎమ్మెల్యే
శ్రీరామనవమి ఉత్సవాల్లో విషాదం !
రాహుల్‌కు పాట్నా హైకోర్టు సమన్లు
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..
'ఉపాది' బకాయిలు
బీసీ గణన చేయాలి
బీమా కంపెనీలకే లబ్ది
కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం
పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
విజయవంతంగా సారెక్స్‌-2023
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించం
లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు
రాహుల్‌ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌
పంటనష్టం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ
రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.