Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రకటనలు ఘనం..పనులు శూన్యం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 18,2023

ప్రకటనలు ఘనం..పనులు శూన్యం

- 'ఎయిమ్స్‌' విషయంలో మోడీ సర్కారు తీరు
- బీజేపీ పాలనలో ఇలాంటి సంస్థలు మూడింతలయ్యాయని గొప్పలు
- ఇప్పటికీ ఏ ఒక్క ఇన్‌స్టిట్యూట్‌ కూడా పూర్తిస్థాయిలో పని చేయని వైనం
- పరిమితంగానే సేవలు..మానవ వనరుల కొరత
- సరిపడా ఫ్యాకల్టీ, వైద్యులు, నర్సులు, మెడికల్‌ స్టాఫ్‌ లేక సతమతం
- పార్లమెంటులో కేంద్ర ఆరోగ్య మంత్రి సమాచారం
           దేశవ్యాప్తంగా ఎయిమ్స్‌ వంటి సంస్థల ఏర్పాటు విషయంలో మోడీ సర్కారు తీవ్రంగా ప్రచారాలు చేసుకుంటున్నది. ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో వీటి గురించి చెప్పుకుంటూ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నది. తమ పాలనలో ఈ ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య మూడింతలు పెరిగిందని వెల్లడించింది. అయితే ఇప్పటి వరకూ వీటిలో ఏ ఒక్కటీ పూర్తి స్థాయి సేవలను అందిండం లేదు. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ విషయాన్ని పార్లమెంటులో వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థల ద్వారా ప్రజలకు ఉపయోగం చేకూరకపోవడంపై ఆరోగ్య నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటక రాష్ట్రంలో ఇటీవల పర్యటించిన ప్రధాని మోడీ ఎయిమ్స్‌ అంశాన్ని ప్రస్తావించారు. తమ ప్రభుత్వం దేశంలో ఏయిమ్స్‌ లాంటి సంస్థలను మూడు రెట్లు పెంచిందని తెలిపారు. ఈనెల 13న మాండ్యలో పర్యటించిన ఆయన ఒక సభలో ప్రసంగిస్తూ చెప్పారు. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్‌ మాండవీయ సైతం ట్వీట్‌ చేశారు. మోడీ జమానాలో ఎయిమ్స్‌ వంటి సంస్థలు ఏడు నుంచి 22కు పెరిగాయని పేర్కొన్నారు. అయితే, ఇదే ఆరోగ్య మంత్రి ఎయిమ్స్‌ వంటి సంస్థల పనితీరు విషయంలో పార్లమెంటులో చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించక మానదు. 2014లో మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనఇలాంటి సంస్థల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో పని చేయటం లేదని బడ్జెట్‌ సమావేశాల్లో వెల్లడించారు.
పూర్తి స్థాయిలో
పని చేస్తున్నవి ఆ ఆరు మాత్రమే
లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య మంత్రి వెల్లడించిన లిఖిత పూర్వక సమాధానం ప్రకారం.. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) కింద 2014 నుంచి ఏయిమ్స్‌ వంటి 16 సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థలు 'వివిధ దశల కార్యచరణ'లో ఉన్నాయి. పరిమిత ఔట్‌-పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ) మరియు ఇన్‌పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఐపీడీ) సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ సంస్థలు సేవలను అందించటం లేదు. అయితే, మోడీ సర్కారు కేంద్రంలో రావడానికి ముందు దేశంలో ఉన్న భోపాల్‌, పాట్న, రారుపూర్‌, రిషికేశ్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌ లాంటి సంస్థలే పూర్తి స్థాయిలో పని చేస్తుండటం గమనార్హం.
మూడేండ్లు గడిచినా ఓపీడీ,
ఐపీడీ సేవలు లేవు
పరిమిత ఓపీడీ, ఐపీడీ సర్వీసులను ప్రభుత్వం నిర్వచించలేదనీ, దీనిపై వివరణ అవసరమని ఆరోగ్య నిపుణులు తెలిపారు. సంస్థలకు సంబంధించిన ప్రస్తుత స్థితి గురించి తెలియాలంటే వీటి ద్వారా సేవలు పొందిన రోగుల గణాంకాలను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని పబ్లిక్‌ హెల్త్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా గౌరవ ఆచార్యులు కె. శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఎయిమ్స్‌ గువహతి (అసోం) ఏర్పాటై మూడేండ్లు గడిచిన సందర్భంగా ఇటీవలే వేడుకలు నిర్వహించారు. అయితే ఇందులో ఓపీడీ, ఐపీడీ సేవలేవీ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్‌స్టిట్యూట్‌లో కనీసం ఒక్క క్లినికల్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా నడవడంలేదు. సదరు సంస్థ వెబ్‌సైట్‌లోనే ఈ విషయం పొందుపర్చబడింది. 2017లో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ సంస్థ శంఖుస్థాపన జరిగింది.
మానవ వనరులు అసరం
ఈ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటు, నడిపే బాధ్యత కేంద్రానిదే. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిలో తమ పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొనడం గమనార్హం. ఈ సంస్థలు పూర్తిస్థాయిలో పని చేయాలంటే అధ్యాపకలు, రెసిడెంట్‌ డాక్టర్లు, నర్సులు వంటి మానవ వనరులు కావాలని నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ రీసోర్స్‌ సెంటర్‌ మాజీ హెడ్‌ టి. సుందరరామన్‌ తెలిపారు. ఫ్యాకల్టీ కొరతనే ఈ ఆస్పత్రులు, కాలేజీలల ప్రస్తుత పనితీరుకు కారణమై ఉండొచ్చని శ్రీకాంత్‌రెడ్డి, సుందరరామన్‌ అన్నారు.
మంజూరైన పోస్టుల్లో కొన్ని మాత్రమే భర్తీ
గతేడాది డిసెంబర్‌లో రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాక సహాయ మంత్రి భర్తి ప్రవీణ్‌ ఇచ్చిన సమాధానం ప్రకారం.. ఈ 16 ఇన్‌స్టిట్యూషన్‌లలో ఫ్యాకల్టీ సభ్యుల కొరత ఉండటం గమనార్హం. ఫ్యాకల్టీయేతర పోస్టుల కొరత ఇంకా దారుణంగా ఉన్నది. ఉదాహరణకు.. ఏయిమ్స్‌ గువహతికి మంజూరైన పోస్టులు 1026కాగా.. 95 పోస్టులు మాత్రమే భర్తీ చేయబడటం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిమ్స్‌(మంగళగిరి)కు మంజూరైన 1054 పోస్టులకు గానూ 474 పోస్టులు మాత్రమే భర్తీ కావడం ఇలాంటి సంస్థలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నదని వైద్యారోగ్య నిపుణులు, విశ్లేషకులు అన్నారు. పూర్తి స్థాయిలో పని చేయనీ, సదుపాయాలు లేని ఇలాంటి సంస్థల ఏర్పాటుతో లాభమేమిటని ప్రశ్నించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
గిరిజనులపై తూటా!
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు
పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం
ప్రతిపక్షాల భారీ మానవహారం
దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు
ఉక్కు సంకల్పం..
జైలుకు పరిమితం చేసేందుకు కుట్ర : ఆప్‌

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.