Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదేశాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలి
- మోడీకి పినరయి విజయన్ లేఖ
తిరువనంతపురం : కరోనా వైరస్ ప్రభావమున్న దేశాల నుంచి భారతీయులు వెనక్కిరాకుండా కేంద్రం ఆదేశాలు జారీ చేయడం అనాగరిక చర్య అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఇటలీ, దక్షిణకొరియాల నుంచి వచ్చే భారతీయులు, ఆ దేశ పర్యాటకులు తమకు కరోనా లేదని నిర్థారించే అక్కడి ఆరోగ్య అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాన్ని తీసుకురావాల్సి వుంటుందని, ఈ నిబంధన మార్చి 10 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కోరుతూ ప్రధాని మోడీకి విజయన్ లేఖ రాశారు. కేరళీయులతో సహా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విదేశాల నుంచి తిరిగి తీసుకురావడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం పరిశీలిస్తుందని విజయన్ ఆ లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో చిక్కుకున్న భారతీయులను దేశంలోకి అనుమతించాలంటూ పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కూడా ముఖ్యమంత్రి విజయన్ ఒక లేఖ రాశారు.