Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు లక్ష్ నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.
'ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసి, ప్రమోషన్స్‌ని మేకర్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని, ట్రెమిండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లిరికల్ సాంగ్స్ ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ చూపించాయి. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేయడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే అవుట్ పుట్ విషయంలో, బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా సర్వ హంగులతో గ్రాండ్‌గా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుతున్నారు. జూన్ 24న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చాలా గ్రాండ్‌గా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికర కథతోఈ సినిమాని రూపొందిస్తున్నామని, ప్రేక్షకులు థ్రిల్ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి' అని చిత్రయూనిట్ తెలిపింది.