Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'అధర్వ'. మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రానికి విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో గ్రాండ్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుభాష్ నూతలపాటి మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకు ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. సినిమా ఎంతో అద్భుతంగా వచ్చింది. ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం' అని అన్నారు.
'పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయ్యింది. 'డీజే టిల్లు' ఫేమ్ శ్రీచరణ్ పాకాల మంచి సంగీతాన్ని అందించారు. కెమెరామెన్ చరణ్ మాధవనేని అద్భుతంగా చూపించారు. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్‌లా ఈ సినిమా ఉండదు. ఆడియెన్స్ కచ్చితంగా థ్రిల్ అవుతారు. మూడు పాటలు అద్భుతంగా ఉంటాయి. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన సాంగ్స్, ఆర్‌ఆర్ అన్నీ కూడా అద్భుతంగా ఇచ్చారు' అని డైరెక్టర్ మహేష్ రెడ్డి అన్నారు. హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ, ''కౌసల్యా కృష్ణమూర్తి' తరువాత మంచి సినిమా చేద్దామని అనుకుంటున్న సమయంలో ఈ సినిమా కథ విన్నాను. పోలీస్ డిపార్ట్‌మెంట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ క్లూస్ డిపార్ట్‌మెంట్ మీద సినిమాలు రాలేదు. మా నిర్మాత సినిమాకు కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు' అని చెప్పారు.
'మా డైరెక్టర్ మహేష్ సినిమాని అద్భుతంగా రూపొందించారు. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది' అని హీరోయిన్ సిమ్రాన్ చౌదరి అన్నారు.