Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2019 శిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'డర్టీ ఫెలో'. ఆడారి మూర్తి సాయి డైరెక్షన్‌లో జీఎస్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. నక్కిన త్రినాథ్ రావు మాట్లాడుతూ, 'మోషన్ పోస్టర్ బాగుంది. హీరో శాంతి చంద్ర కొన్ని సినిమాలలో నటించారు. ఫైర్ ఉన్న నటుడు. సినిమా పట్ల ఫ్యాషన్‌తో ఎంతో డెడికేటెడ్‌గా వర్క్ చేస్తాడు. దర్శకుడు మూర్తి సాయి తన పంథా మార్చుకొని డాన్ సినిమాని తెరకెక్కించారని అనుకుంటున్నాను. మోహన్ రావుకి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి' అని చెప్పారు.
'అరకు, వైజాగ్, హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ చేశాం. మాకు బలమైన నమ్మకం ఈ సినిమా కథ. ఒక తండ్రి తన కొడుకునీ సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు విచ్చల విడిగా సమాజానికి హానికరంగా మారితే, ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏమిటి?, తండ్రీ కొడుకుల మధ్య జరిగే యాక్షన్ డ్రామా. హీరోయిన్స్ ఇద్దరు బాగా నటించారు' అని హీరో శాంతి చంద్ర తెలిపారు.
దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ, 'ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు మా కథలో ఉన్నాయి' అని అన్నారు.
హీరోయిన్ శిమ్రితీ బతీజా మాట్లాడుతూ, 'నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్‌లో నటించాను. అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ నాది' అని చెప్పారు. 'నేను స్వతహాగా డాక్టర్‌ని. సినిమాలు అంటే ఫ్యాషన్‌తో ఈ సినిమాకు మ్యూజిక్ అందించాను. కథానుగుణంగా ఈ చిత్రానికి మంచి సంగీతం కుదిరింది. హీరో, దర్శకుడు ఇద్దరు నాకు మంచి మిత్రులు. ఈ సినిమా అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను' అని మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ తెలిపారు.