Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో నవీన్ చంద్ర నటించిన కొత్త సినిమా 'రిపీట్'. మధుబాల కీలక పాత్రలో నటించారు. సత్యం రాజేష్, మైమ్ గోపి, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పీజీ ముత్తయ్య, విజయ్ పాండే నిర్మించిన ఈ చిత్రానికి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. గురువారం నుంచి ఈ మూవీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమాను 'డెజావు' పేరుతో తమిళంలో రూపొందించారు. దాన్ని తెలుగులోకి 'రిపీట్' మూవీగా చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా చూస్తున్న వాళ్లు నాకు రాత్రి నుంచే స్క్రీన్ షాట్స్ పంపుతున్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్‌గా ఉందని చెబుతున్నారు. ఈ సినిమాలో విక్రమ్ అనే క్యారెక్టర్‌లో నటించాను. ఇందులో మధుబాలతో కలిసి పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. సత్యం రాజేష్ కీ రోల్ చేశాడు. మా ఈ కథకు ఉన్నంత బడ్జెట్‌లో కాంపాక్ట్‌గా రూపొందించాడు. ఇటీవల రిలీజైన 'పరంపర'తో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం 'వీర సింహా రెడ్డి', రామ్ చరణ్, శంకర్ చిత్రాలతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఓటీటీ, సినిమా ఏదైనా సరే నటుడిగా బాగా నటించడమే నా బాధ్యత' అని తెలిపారు.