Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆస్కార్‌ రేసులో నాటు నాటు పాట.. | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

ఆస్కార్‌ రేసులో నాటు నాటు పాట..

మూడు విభాగాల్లో పోటీ పడుతున్న భారతీయ సినిమాలు
మొత్తం విభాగాల్లో ఆస్కార్‌ రేసులో అమీతుమీ తేల్చుకునేందుకు పోటీ పడిన భారతీయ సినిమా మూడు విభాగాల్లో స్థానాన్ని సొంతం చేసుకుంది. వీటిల్లో తెలుగు సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని 'నాటు నాటు' పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో స్థానం దక్కించుకోవడం విశేషమైతే, 'లాగాన్‌' తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కార్‌కి నామినేట్‌ కావడం మరో విశేషం. అలాగే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో 'ఆల్‌ దట్‌ బ్రెత్స్‌', డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌ విభాగంలో 'ది ఎలిఫెంట్‌ విష్పర్స్‌' నామినేషన్లు సొంతం చేసుకున్నాయి. యావత్‌ భారతీయ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 95వ అకాడమీ అవార్డుల (ఆస్కార్‌) ఫైనల్‌ నామినేషన్ల జాబితాను మంగళవారం ఆస్కార్‌ కమిటీ ప్రకటించింది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్‌ లిస్ట్‌ కాగా, వీటిల్లో అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్‌ ద్వారా ఆస్కార్‌ సభ్యులు తుది జాబితాకు ఎంపిక చేశారు.
ఉత్తమ చిత్రం
అవతార్‌ : ది వే ఆఫ్‌ వాటర్‌, టాప్‌గన్‌ : మావెరిక్‌, ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌, ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌, ఎల్విస్‌, ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, ది ఫేబుల్‌ మ్యాన్స్‌, టార్‌, ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌ వంటి చిత్రాలు పోటీ పడుతున్నాయి.
ఉత్తమ దర్శకుడు
మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌), డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌), టడ్‌ ఫీల్డ్‌ (టార్‌), రూబెన్‌ ఆస్టాండ్‌ (ట్రైయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌).
ఉత్తమ నటుడు
ఆస్టిన్‌ బట్లర్‌ (ఎల్విస్‌), కొలిన్‌ ఫార్రెల్‌ (ది బన్షీష్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌), బ్రెండన్‌ ఫాస్రెల్‌ (ది వేల్‌), పాల్‌ మెస్కల్‌ (ఆప్టర్‌సన్‌), బిల్‌ నిగీ (లివింగ్‌).
ఉత్తమ నటి
కేట్‌ బ్లాంచెట్‌ (టార్‌), అన్నా దె ఆర్మాస్‌ (బ్లాండ్‌), ఆండ్రియా రైజ్‌బరో (టు లెస్లీ), మిషెల్‌ విలియమ్స్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌), మిషెల్‌ యా (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌).
ఒరిజినల్‌ సాంగ్‌
నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌), అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌), హోల్డ్‌ మై హ్యాండ్‌ (టాప్‌గన్‌ : మార్వెరిక్‌), లిప్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌), ది ఈజ్‌ ఏ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌).
ఉత్తమ సహాయ నటుడు
బ్రెన్డాన్‌ గ్లెసన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌), బ్రెయిన్‌ టైరీ హెన్రీ (కాజ్‌వే), జడ్‌ హిర్చ్‌ (ది ఫేబుల్‌ మ్యాన్స్‌), బేరీ కియోఘాన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిస్‌), కి హురు క్వాన్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌).
ఉత్తమ సహాయనటి
ఆంజెలా బాస్సెట్‌ (బ్లాక్‌ పాంథర్‌ : వకండ ఫరెవర్‌), హాంగ్‌ చ్యూ (ది వేల్‌), కెర్రీ కాండన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌), జామీలీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), స్టెఫానీ (ఎవ్రీ థింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌).
అత్యధికంగా 11 నామినేషన్లు దక్కించుకున్న
ఎవ్రీ థింగ్‌ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
                95వ అకాడమీ అవార్డుల్లో ఈ ఏడాది అత్యధికంగా 11 నామినేషన్లను దక్కించుకుని 'ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌' చిత్రం ప్రధమ స్థానంలో నిలిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నటి, ఉత్తమ ఎడిటర్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి (ఇద్దరు), బెస్ట్‌ కాస్టూమ్స్‌ విభాగాల్లో ఈ సినిమా తుది జాబితాలో చోటు సొంతం చేసుకుని సత్తా చాటింది. దీని తర్వాత ది బన్షీస్‌ ఆఫ ఇనిషెరిన్‌, ది ఫేబుల్‌ మ్యాన్స్‌, టాప్‌ గన్‌, టార్‌, బ్లాక్‌పాంథర్‌ తదితర చిత్రాలు సైతం చెప్పకోదగ్గ నామినేషన్లతో బరిలో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. మార్చి 12 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13)న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగే వేడుకలో విజేతలకు ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారాలను అందజేయనున్నారు.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేడు మహిళలకు ఉచిత ప్రదర్శన
అలరించే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
శివరాత్రి స్పెషల్‌ కానుకగా విడుదల
కవలలు హీరోలుగా సినిమా ప్రారంభం
దేశం కోసం..
తెలుగులోనూ హెబ్బులి విజయం ఖాయం
ఘనంగా ఐపీఎల్‌ ప్రీ రిలీజ్‌ వేడుక
వసంత కోకిల రిలీజ్‌కి రెడీ
విద్యా వ్యవస్థలోని లోపాలతో యూనివర్శిటీ
సందేశాత్మకంగా సిరిమల్లెపువ్వు
రైౖటర్‌ పద్మభూషణ్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు
ఏప్రిల్‌ 28న ఏజెంట్‌ రిలీజ్‌
మూగబోయిన సుమధురవాణి
అమిగోస్‌.. మిమ్మల్ని నిరుత్సాహపరచదు
ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌
క్రియేటీవ్‌ కామ్రేడ్‌.. కె.విశ్వనాథ్‌
ఆయన మరణం కూడా ముగింపు కాదు
పదహారణాల తెలుగు పాట
నాన్న ఆఖరి కోరికని తీర్చగలిగాను
సీనియర్‌ దర్శకుడు సాగర్‌ ఇకలేరు
సూర్యాపేట జంక్షన్‌లో ఏం జరిగింది?
ఏ పాత్రలోనైనా మెప్పిస్తా..
కొత్త ఒరవడిని సృష్టిస్తుంది
బుట్టబొమ్మ విజయం ఖాయం
బెలూన్స్‌ అమ్ముకునే కుర్రాడి లవ్‌స్టోరీ
ఊహకు అందని కాన్సెప్ట్‌
ఎన్నో రాత్రులొస్తాయిగానీ..
అలరించే రెండు భిన్న ప్రేమకథలు
ఘనంగా నాని కొత్త సినిమా ప్రారంభం
అల్లంత దూరాన రిలీజ్‌కి రెడీ

తాజా వార్తలు

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

11:19 AM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

11:05 AM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

10:06 AM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

09:55 AM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

07:53 AM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

06:56 AM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.