Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కన్నడ కథానాయకుడు శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం 'సీతాయణం'. ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనహిత భూషణ్ కధానాయిక. కలర్ క్లౌడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ, 'రెస్పెక్ట్ ఉమెన్ అనే శీర్షికతో ప్రేమ, క్రైమ్, డ్రామాగా నడిచే చిత్రమిది. కథా కథనాలు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటాయి. చిత్రంలోని పాటలు ఆకట్టుకుంటాయి. 63 రోజులపాటు బ్యాంకాక్, బెంగళూర్, మంగళూర్, ఆగుంబే, విశాఖపట్నం వంటి తదితర ప్రాంతాలలో షూటింగ్ జరిపాం. క్లైమాక్స్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్‌లో నిలుపుతుంది. ఈనెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. 'నేటి తరానికి నచ్చేలా, హద్యమైన అంశాలు, సన్నివేశాలతో రాసుకున్న కథ. మా యంగ్ సుప్రీం హీరో అక్షిత్‌కి ఈ చిత్రం చాలా పెద్ద పెద్ద అవకాశాల్ని తెస్తుంది. హీరోయిన్ అనహిత చాలా బాగా చేసింది. వీరిద్దరి జోడి చాలా బాగా కుదిరింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడతో పాటు తమిళంలో డబ్బింగ్ చేసి అన్నీ ఒకే రోజున విడుదల చేస్తాం' అని దర్శకుడు ప్రభాకర్ ఆరిపాక చెప్పారు.