Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతుబంధు సంబురాలు ఎవరి కోసం..? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 11,2022

రైతుబంధు సంబురాలు ఎవరి కోసం..?

రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలుతున్నారు. కల్లాం కుప్పల పైనే తనువు చాలిస్తున్నారు. రోజూ ఏ పేపర్‌ చూసినా రైతు ఆత్మహత్య వార్తలే దర్శనమిస్తున్నాయి. పంట దిగుబడి రాక, పండించిన పంటకు గిట్టుబాటు లేక.. అప్పుల ఊబిలో కురుకుపోయిన రైతన్న మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతువ్యతిరేక విధానాలతో రైతులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇవేమీ పట్టని రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్రంలో ఘనంగా రైతుబంధు సంబురాలు నిర్వహిస్తోంది. ఈ సంబురాలు ఎవరి కోసం నిర్వహిస్తోందో రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది.
   రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం 2018లో రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. మొదట ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన ప్రభుత్వం.. తరువాత ఎకరాకు రూ.5వేలు ఇస్తోంది. ఇప్పటి వరకు రైతుబంధు కోసం సుమారు రూ.500 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతోంది. దీని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సంబురాలు నిర్వహిస్తోంది. గ్రామ గ్రామాన విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొంటున్నాయి. అయితే వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు రైతుబం ధుకు వ్యతిరేకంగా రాయడం కొసమెరుపు. రైతుబంధు కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.500 వేల కోట్లు అసలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి అన్నది అసలు ప్రశ్న. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నప్పటికీ వీరికి ఎకరం, రెండు ఎకరాలకు మించి భూమి ఉండదు. అంటే ప్రభుత్వం ఇచ్చిన నగదులో వీరికి సుమారు 30శాతం నిధులు కూడా ముట్టి ఉండవు. మిగిలిన 70శాతం నిధులు వందల, వేల ఎకరాలు ఉన్న బడాబాబుల ఖాతాల్లోకే వెళ్లాయని స్పష్టం అవుతోంది. వీరు అసలు వ్యవసాయం చేసిన దాఖలాలు ఉండవు. 'పేదోడి పొట్టగొట్టి.. పెద్దొడు కడుపు నింపుకున్న' చందంగా రైతుబంధు పథకం ఉంది. ఇవ్వన్నీ ప్రజలకు తెలియదు అన్నట్టు, తామే రైతుల కోసం అన్నీ చేశామని ప్రభుత్వం రైతుబంధు సంబురాలు నిర్వహించడం సిగ్గుచేటు. అయితే ఇప్పుడే ఈ వేడుకలు నిర్వహించడానికి కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు వానాకాలానికి సబంధించిన పూర్తి వడ్లను కొనుగోలు చేసింది లేదు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో జమా కాలేదు. ధాన్యం డబ్బులను బ్యాంక్‌ అధికారులు రుణమాఫీ కిందికి జమ చేసుకున్నారు. దీంతో అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతున్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రభుత్వం తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి రైతుబంధు సంబురాలు అంటూ కొత్త నాటకానికి తెర లేపింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఎన్నికల్లో చెప్పినట్టు రూ.లక్ష రుణమాఫీ చేయాలి, విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలి. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలి. వీటన్నిటికీమించి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలి. అసలు రైతు ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించి, రైతు చావులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. అవేమీ చేయకుండా భూస్వాములకు, బడాబాబులకు మేలు చేసే పథకానికి సంబురాలు నిర్వహించడం వలన ప్రయోజనమేమిటి? రైతు కష్టానికి సరైన ప్రతిఫలం దక్కినప్పుడే రైతుకు నిజమైన సంబురం కదా...
- అజయ్ కుమార్‌
సెల్‌: 297630110

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇక మన ఆర్మీ వంతు....
తుపాకుల సంస్కృతి
ఎదిగితేనే అద్భుతమైన మానవత్వ దృశ్యాలు
సుందరయ్య వారసత్వాన్ని నిలబెడదాం...
అసాధారణ విప్లవకారుడు హౌచిమిన్‌
వ్యవసాయసమస్యకు ప్రాధాన్యతనిచ్చిన సుందరయ్య
రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం

తాజా వార్తలు

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

రేప‌టి నుండి పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

10:49 AM

నిజామాబాద్‌లో చెట్టును ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి

10:48 AM

అందుకే ఈ మ్యాచ్‌లో బాగా ఆడ‌గ‌లిగాను: విరాట్ కోహ్లీ

10:37 AM

నేటితో ముగియ‌నున్న‌ పోలీస్ ఉద్యోగాల‌ దర‌ఖా‌స్తు ప్ర‌క్రియ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.