Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్థానికత ప్రస్థావన లేకుండా ఉద్యోగుల విభజన | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 11,2022

స్థానికత ప్రస్థావన లేకుండా ఉద్యోగుల విభజన

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా లోకల్‌ క్యాడర్లలో ఉద్యోగుల విభజన అత్యంత వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ ఆధారంగా జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ పోస్టుల్లో ఉద్యోగుల కేటాయింపు జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన జీఓ 317 రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడికి కారణమైంది. ఏ స్థానికత సెంటిమెంటును ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం జరిగిందో ఆ స్థానికత పునాదులనే ధ్వసం చేయబూనుకున్న ప్రభుత్వ వైఖరిపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. బలవంతపు బదిలీలతో స్వంత ఊరుకు, అయిన వాళ్ళకూ దూరమై పొరుగు జిల్లాలో పరాయివాళ్ళుగా రిటైర్‌మెంట్‌ వరకూ కొనసాగాల్సిందేనా అని మధన పడుతున్నారు.
   తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అప్పటివరకూ ఉన్న 10జిల్లాలను 2016 అక్టోబర్‌ 11 నుండి 31 జిల్లాలుగా పునర్విభజించి, జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయని, విద్య, ఉద్యోగాల్లో స్థానికులకు సముచితమైన అవకాశాలు కల్పించటానికి వీలుగా ఏర్పాటైన జోనల్‌ వ్యవస్థను రద్దు చేయటం సమంజసం కాదని ఆనాడే స్పష్టంగా చెప్పాం. అయినా ఆర్టికల్‌ 371(డి)కి సవరణ చేయకుండా జోనల్‌ వ్యవస్థ రద్దు అసాధ్యమని కూడా స్పష్టం చేశాం. రెండు జోన్లను ఆరు లేదా అంతకంటే ఎక్కువ చేయాలని ప్రతిపాదించాం. జోనల్‌ వ్యవస్థ రక్షణ కోసం ఐక్య ఉద్యమాన్ని నిర్వహించాం. సరిగ్గా సంవత్సరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 31జిల్లాలను ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులను ఆర్డర్‌ టు సర్వ్‌ పేరిట తాత్కాలికంగా కొత్త జిల్లాలకు కెటాయించారు. ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు వారు పనిచేస్తున్న పాఠశాల/ కార్యాలయం ఏ జిల్లా పరిధిలోకి వస్తే ఆ జిల్లా ఉద్యోగులుగా పరిగణించబడ్డారు.
   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేస్తూ నూతన ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ది తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాడర్స్‌ అండ్‌ రెగ్యులేషన్‌ అఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్‌) ఆర్డర్‌, 2018 (పిఓ - 2018) జిఎస్‌ఆర్‌ 820(ఇ) ఆగస్టు 29న వెలువడగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ 124 జిఎడి తేదీ 30.08.2018 ద్వారా అమలులోకి తెచ్చింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన మరో రెండు జిల్లాలను చేర్చి, వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లోకి మార్చి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ ఉత్తర్వులు జిఎస్‌ఆర్‌ 279(ఇ) 2021ఏప్రిల్‌ 16న విడుదల కాగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ 128 జిఎడి తేదీ 30.06.2021 ద్వారా అమలులోకి తెచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులు (పిఓ-2018) విడుదలైన మూడు సంవత్సరాల్లోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను స్థానిక (జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌) క్యాడర్లుగా వర్గీకరించాలనే నిబంధన రాష్ట్రపతి ఉత్తర్వుల్లోనే ఉన్నది. తుది గడువు సమీపిస్తున్న తరుణంలో ఆగస్టు నెలలో ప్రభుత్వం హడావుడిగా శాఖల వారీ పోస్టుల లోకల్‌ క్యాడర్‌ క్లాసిఫికేషన్‌ ఉత్తర్వులు (జిఎడి జీఓలు 141 నుండి 258 వరకు) విడుదల చేసింది. అప్పటినుండి వివిధ లోకల్‌ క్యాడర్లలో ఉద్యోగుల కేటాయింపు ఎలా జరుపుతారనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చోప చర్చలు జరిగాయి. స్థానికత ఆధారంగా సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు జరుగుతాయని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా డిసెంబర్‌ 6న విడుదల చేసిన జీఓ 317 రాష్ట్ర ఉద్యోగ వర్గంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల మనోభావా లను గమనించకుండా హైదరాబాద్‌ చుట్టూ ఉన్న కొద్దిమంది స్థానికేతరుల ప్రయోజనాలు కాపాడటం కోసం స్థానికత ఊసే లేకుండా ఉద్యోగుల కెటాయింపు నిబంధనలు రూపొందించటం ఆశ్చర్యకరం.
   జిఓలో ఉన్న లోపాలు: స్థానికతను పరిగణించకపోవటం. దివ్యాంగుల వైకల్యం పర్సంటేజి 70శాతంగా నిర్ణయించటం. ఆ ఏరియాలో చేసిన మొత్తం సర్వీసును పరిగణనలోకి తీసుకోకపోవటం. కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్‌రంగ సంస్థల స్పౌజ్‌ల ప్రస్తావన లేకపోవటం. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం. మరికొన్ని దీర్ఘకాలిక జబ్బులను పరిగణనలోకి తీసుకోకపోవటం.
   జీఓ విడుదలైన వెంటనే ఈ లోపాలను ఎత్తిచూపుతూ సవరించాలని టీఎస్‌ యుటిఎఫ్‌ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలు ఇచ్చాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉపాధ్యాయుల్లో ఆందోళన వెల్లువెత్తింది. ఇది గమనించిన ప్రభుత్వం డిసెంబర్‌13న విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది. దాదాపు ఆరుగంటలపాటు జరిగిన సమావేశంలో సంఘాల అభిప్రాయాలను ఓపిగ్గా విన్నారు. రాసుకున్నారు. ఇచ్చిన వినతిపత్రాలు తీసుకున్నారు. కానీ ఒక్క సూచనను కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
   ఉపాధ్యాయుల నుండి ఒక్కరోజులో ఆప్షన్లు తీసుకున్నారు. రాత్రికి రాత్రే సీనియారిటీ లిస్ట్‌ తయారు చేయాలన్నారు. ఉపాధ్యాయుల బేసిక్‌ సీనియారిటీ జాబితాలు డీఈఓ కార్యాలయాల్లో లేనేలేవు. పాఠశాలల నుండి వివరాలు తెప్పించి హడావుడిగా డ్రాఫ్ట్‌ లిస్టులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో సీనియారిటీపై వచ్చిన అభ్యంతరాలను సవరించకుండానే ఫైనల్‌ చేసి అలొకేషన్‌ చేసేశారు. మహబూబ్‌నగర్‌, వరంగల్‌, రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో సీనియారిటీ నిర్ణయం, జిల్లాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని అత్యధికంగా పిర్యాదులు వచ్చాయి.
   సీనియారిటీ జాబితాలు సమగ్రంగా తయారు చేయాలని, ఫైనల్‌ సీనియారిటీ లిస్ట్‌ ప్రకటించిన తర్వాత ఆప్షన్స్‌ రివైజ్‌ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరితే పట్టించుకోలేదు. స్పెషల్‌ క్యాటగిరీ సర్టిఫికెట్స్‌ సరిగా పరిశీలించలేదు. ఎస్సీ, ఎస్టీ దామాషా పాటించలేదు. స్థానిక భాషలనూ పరిగణనలోకి తీసుకోలేదు. ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ప్రాంత ఉద్యోగులను వారి ఆప్షన్లకు భిన్నంగా మైదాన ప్రాంతమైన నిర్మల్‌కు మంచిర్యాలకు, ఆదివాసీ ప్రాంతమైన ములుగు జిల్లాకు మహబూబాబాద్‌ నుండి మైదాన ప్రాంత గిరిజనులను, మైదాన ప్రాంత గిరిజనులు ఉన్న మహబూబాబాద్‌ జిల్లాకు ములుగు జిల్లా ఆదివాసీలను కేటాయించారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో మైదాన ప్రాంత గిరిజనేతరులను, మైదాన ప్రాంత గిరిజనులను ఆదివాసీ ప్రాంతాలైన ములుగు, భద్రాద్రి జిల్లాలకు కెటాయించారు. అదేవిధంగా నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట ఏజెన్సీ ప్రాంత గిరిజనులను వారి ఆప్షన్‌కు విరుద్ధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాపరిధిలోని అన్ని జిల్లాలకు కేటాయించారు. గిరిజనేతరులను అచ్చంపేట ప్రాంతానికి కేటాయించారు. జిల్లాల్లో ఎస్సీ ఉపాధ్యాయుల దామాషాను సక్రమంగా అమలు చేయలేదు. అలోకేషన్‌ అనంతరం స్పౌజ్‌, సీనియారిటీ, జిల్లాల కేటాయింపుపై కుప్పలు తెప్పలుగా అప్పీల్స్‌ వచ్చాయి. పీఓ - 2018 ప్రకారం అప్పీల్స్‌కు అరవై రోజుల సమయం ఉంటుంది. కానీ జీఓ 317లో నిర్దిష్టమైన గడువు ఇవ్వలేదు. అప్పీల్స్‌ ఏవి పరిష్కరించారో, ఏవి తిరస్కరించారో, కారణాలేమిటో కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. అంతా నోటి మాటలతోనే నడిపించేస్తున్నారు.
   ప్రాథమిక సమాచారాన్నిబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో దాదాపు 40వేలమంది, విద్యాశాఖలోనే 22,500 మంది ఇతర జిల్లాలకు కేటాయించబడినట్లు తెలుస్తోంది. సుమారు పది వేలమంది ఉపాధ్యాయులు తమ ఆప్షన్‌కు విరుద్ధంగా వేరొక జిల్లాకు కేటాయించబడి స్థానిక జిల్లాకు శాశ్వతంగా దూరమయ్యారు. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. అన్యాయం ఒకరికి జరిగినా అన్యాయమే.
   ప్రధానంగా సీనియర్లు ఎక్కువగా పట్టణ ప్రాంత జిల్లాలకు, జూనియర్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంత జిల్లాలకూ కెటాయించబడినారు. పీఓ - 2018 పేరా 4లో పేర్కొన్న వయస్సు సమతుల్యతకు భంగం కలుగుతుంది. ఇది భవిష్యత్తులో సామాజిక సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు. పీఓ-2018 ప్రకారం 95శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేశారు. అయితే నియామకాలు జరగాలంటే ఖాళీలుండాలి కదా... రెండేండ్ల తర్వాత రిటైర్‌మెంట్లు ప్రారంభమైతే పట్టణ ప్రాంత జిల్లాల్లో ఖాళీలు ఏర్పడతాయి. జూనియర్లు ఎక్కువగా కేటాయించబడిన జిల్లాల్లో పదిహేను, ఇరవై సంవత్సరాల వరకు రిటైర్‌మెంట్లు ఉండే అవకాశమే లేదు. ఆయా జిల్లాల నిరుద్యోగుల్లో అసహనం ప్రబలి లోకల్‌ - నాన్‌ లోకల్‌ విభజనతో స్థానికేతరులను వారి స్వంత జిల్లాలకు పంపాలంటూ మరలా జీఓ 610 లాంటి జీఓ కోసం వత్తిడి పెరగొచ్చు. జీఓ 610 వలన కేవలం ఆంధ్రా ఉద్యోగులను మాత్రమే వెనక్కి పంపలేదు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వేరే జిల్లాల్లో నియామకం అయిన, బదిలీ అయిన ఉద్యోగులను కూడా వారి స్థానిక (స్వంత) క్యాడర్లకు పంపించారు. అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం కాదని అనుకోలేం.
   రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన, పోరాటాలను గమనిస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి క్షేత్ర స్థాయి సమస్యలను గుర్తెరిగి తదనుగుణంగా జీఓ 317ను సవరించాలి. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. స్పౌజ్‌, పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలి. స్థానిక జిల్లాలకు దూరమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులను అవసరమైతే సూపర్‌ న్యూమరరీ పోస్టులు మంజూరు చేసి స్వంత జిల్లాలకు తిరిగి పంపించాలి. లేదా భవిష్యత్తులో ఏర్పడే రిటర్మెంట్‌ ఖాళీలలో వారిని తాము కోరుకున్న సొంత జిల్లాకు బదిలీ చేస్తామనే అంశాన్ని ఉత్తర్వుల్లో పేర్కొనాలి. ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేయాలో ఎంచుకునే స్వేచ్ఛ ఉద్యోగికే ఇవ్వండి. ఉద్యోగులు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా పనిచేయగలరు. వారిని ప్రశాంతంగా పనిచేసేటట్లు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే?
- చావ రవి
సెల్‌:9490300571

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇక మన ఆర్మీ వంతు....
తుపాకుల సంస్కృతి
ఎదిగితేనే అద్భుతమైన మానవత్వ దృశ్యాలు
సుందరయ్య వారసత్వాన్ని నిలబెడదాం...
అసాధారణ విప్లవకారుడు హౌచిమిన్‌
వ్యవసాయసమస్యకు ప్రాధాన్యతనిచ్చిన సుందరయ్య
రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం

తాజా వార్తలు

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

10:49 AM

నిజామాబాద్‌లో చెట్టును ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.