Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతాంగ విజయం కొత్త సంవత్సరానికి శుభసూచకం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 12,2022

రైతాంగ విజయం కొత్త సంవత్సరానికి శుభసూచకం

ప్రజలను పూర్తి స్థాయిలో కష్టనష్టాలకు గురిచేసిన 2021 సంవత్సరం ముగిసింది. గతేడాది మార్చి - మే మాసాల్లో డెల్టా వేరియంట్‌తో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ బీభత్సాన్ని సృష్టించింది. ప్రజలను అతలాకుతలం చేసింది. జనవరిలోనే కరోనాపై విజయం సాధించామంటూ మోడీ, ఆయన ప్రభుత్వం ప్రకటించేసుకున్నారు. దాంతో ఆ తర్వాత తలెత్తిన ఈ దాడికి దేశం ఏవిధంగానూ సమాయత్తం కాలేదు. ఈ తప్పుడు ఆశావాదం ఫలితంగా, ఆక్సిజన్‌ లేక ఊపిరి ఎగబీలుస్తూ, ఆయాసంతో బాధపడుతున్న రోగులను, గంగా నదిలో తేలియాడుతున్న శవాలను ప్రపంచ దేశాలన్నీ వీక్షించాయి. కానీ, దేశాన్ని ఇంత అధ్వాన్న స్థితికి దిగజార్చినందుకు ప్రధాని నుండి కనీసం చిన్నపాటి పశ్చాత్తాపం కానీ, ఆవేదన కానీ కనిపించలేదు. దానిపై ఒక్క మాట కూడా లేదు.
   సకాలంలో తగిన సంఖ్యలో వ్యాక్సిన్లను సమకూర్చుకోవడం, దేశంలో వాటి ఉత్పత్తిని పెంచడం, వేగంగా, సమానంగా అందరికీ అందేలా పంపిణీ చేయడం వంటి అంశాల్లోనూ అదే గందరగోళ పరిస్థితులు చూశాం. మొదటిసారి దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి బదులుగా ధరను నిర్ణయించారు. ఇక ఆ తర్వాత 18ఏండ్లు దాటిన పెద్దలందరికీ డిసెంబరు 31లోగా రెండు డోసుల వ్యాక్సిన్లను అందచేస్తామని జూన్‌లో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. కానీ ఇప్పటికీ కేవలం 65శాతం మందే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అంటే 35శాతం కొరత వుందన్నమాట. ఇదే సమయంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ దేశాన్ని చుట్టుముడుతోంది.
   కరోనా సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళిక రూపొందించడం, అన్ని సదుపాయాలు, చర్యలతో ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడం, సమగ్ర వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను రూపొందించడంలో మోడీ ప్రభుత్వం విఫలమవడమే కాదు, మరోపక్క తన విచ్ఛిన్నకర, కార్పొరేట్‌ అనుకూల ఎజెండాతో ముందుకు సాగేందుకు ఈ సమయాన్నే ఉపయోగించుకుంది.
   రూ.1.75 లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. ఆ తర్వాత, రూ.6 లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ రంగ ఆస్తులను విక్రయించే ప్రణాళికను చేపట్టారు. ఇదంతా ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాకులు, భూమి ఇతర ఆస్తులను ప్రయివేటు పార్టీలకు లీజుకిచ్చే పేరుతో అయిన కాడికి అమ్మేయడం తప్ప మరొకటి కాదు. ఇక మరోపక్క కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన రుణాలు రద్దు చేయడం కొనసాగుతూనే ఉంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించనున్నారు. ఎల్‌ఐసి వాటాలను ఉపసంహరించుకున్నారు.
   అంబానీ, అదానీల పట్ల ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రదర్శించిన పక్షపాతం కారణంగా కరోనా మహమ్మారి సమయంలో కూడా వారు అభ్యంతరకరమైన రీతిలో లాభాలు ఆర్జించారు. 2021లో అంబానీ నికర ఆస్తుల విలువ 927 కోట్ల డాలర్లుకు చేరుకుంది. అదానీ ఆస్తుల విలువ 787 కోట్ల డాలర్లకు పెరిగింది.
   ఇక ప్రజలకు సంబంధించి చూసినట్లైతే వారిపై ఇబ్బడి ముబ్బడిగా భారాలు మోపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజలను దారుణంగా దెబ్బ తీసింది. నిరుద్యోగం విశంఖలంగా పెరిగిపోయింది. ధరల పెరుగుదలతో ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయి. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా భగ్గుమన్న ద్రవ్యోల్బణం ప్రభావంతో సామాన్యులు సంపాదించుకున్న కనీస ఆదాయాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఫలితంగా లక్షలాదిమంది దారిద్య్రంలోకి నెట్టబడ్డారు. ఉపాధులు కోల్పోయి, నిరుద్యోగం పెరిగిపోతున్న కారణంగా ఆదాయాలు నష్టపోవడం కూడా పేదరికం పెరగడానికి మరో కారణమైంది. 2020-21లో కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన కాలంలో దాదాపు 7 నుండి 8 కోట్ల మంది అదనంగా దారిద్య్రంలోకి జారిపోయారు.
   మరోవైపు కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ ఎజెండాను తీవ్రంగా అమలు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర హౌదాను ధ్వంసం చేసి, దానికి గల ప్రత్యేక హౌదాను తొలగించిన తర్వాత రాష్ట్రం గుర్తింపును, దానికి గల భౌగోళిక, రాజకీయ పొందికను కూడా మార్చాలని చూస్తోంది. కాశ్మీర్‌లోయ హౌదాను, దాని రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించే లక్ష్యంతో అసెంబ్లీ సీట్ల పునర్విభజనను ఒక పద్ధతి ప్రకారం సాగిస్తోంది. అమిత్‌ షా ఆ వరుస క్రమాన్ని నిర్దేశించారు-ముందు పునర్విభజన, ఆ తర్వాతే ఎన్నికలు, ఆ తర్వాత రాష్ట్ర ప్రతిపత్తి. కత్తిరించిన రాష్ట్ర హౌదాతో జమ్మూ కాశ్మీర్‌ సమగ్రతను నాశనం చేయవచ్చన్నది వారి ప్రణాళికగా ఉంది. ఈలోగా, పౌర హక్కుల అణచివేతనూ వదిలిపెట్టలేదు.
   కాశ్మీర్‌లో భద్రతా బలగాలదే రాజ్యం అనుకుంటే ఈశాన్య ప్రాంతాలకూ అదే వర్తిస్తోంది. నాగాలాండ్‌లో 13మంది పౌరులను సైన్యం కాల్చివేయడం జాతీయ భద్రత లోపించిందనే విషయాన్ని మనకు గుర్తు చేస్తోంది. హిందూత్వ పాలకులకు, అంతర్గత, బహిర్గత శత్రువులపై పోరాటం జరిపేందుకు పటిష్టమైన భద్రతతో కూడిన దేశాన్ని నిర్మించడం అవసరం. అంతర్గతంగా అంటే ముస్లింలే శత్రువులనేది స్పష్టమవుతోంది. మైనారిటీలను లక్ష్యంగా పెట్టుకుని బీజేపీ నేతలు ప్రతీసారీ కవ్వించే రీతిలో విద్వేష ప్రసంగాలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం నిలకడగా సాగుతోంది. మైనారిటీలకు వ్యతిరేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుసగా పలు చట్టాలను ఆమోదించిన ఫలితమే ఇవన్నీ. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఇటీవలే కర్నాటకలో మత మార్పిడి చట్టాలను ఆమోదించారు. యూపీ ఎంపీల్లో చేసిన చట్టాలు లవ్‌ జిహాద్‌ను లక్ష్యంగా చేసుకుని, మతాంతర వివాహాలను చేసుకున్న ముస్లిం యువతను అరెస్టు చేయగా, కర్నాటక చట్టం క్రైస్తవులపై దృష్టి పెట్టింది.
   ముస్లింలపై, వారి జీవనోపాధులపై నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాదిలో క్రైస్తవులపై, వారి ఆరాధనా స్థలాలపై కూడా ముమ్మరంగా దాడులు జరిగాయి. క్రిస్మస్‌ పండుగ రోజున కూడా ఇటువంటి దాడులు చోటు చేసుకున్నాయి. మదర్‌ థెరిస్సా మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీకి విదేశీ విరాళాల లైసెన్స్‌ను కూడా తిరస్కరించారు.
   ఇలా మొత్తంగా ఈ సంవత్సరమంతా కూడా కోవిడ్‌ మహమ్మారిని నియంత్రించడంలో విఫలమవడం, నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగా ప్రజలపై భారాలు పెరగడం, మైనారిటీలపై బహుముఖ దాడులు జరగడం కనిపిస్తోంది.
   దాడులన్నింటినీ ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు, తిరిగి పోరాడుతూనే ఉన్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళల్లో బీజేపీ పరాజయాలను చవిచూసింది. అసోంలో మాత్రమే అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. అది కూడా చాలా స్వల్ప మెజారిటీతో. ఈ ఏడాదిలో చివరిగా జరిగిన ... కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్ని వనరులను పూర్తి స్థాయిలో వినియోగించినా, హిందూత్వ ప్రచారాన్ని సాగించినా బీజేపీకి పరాభవం తప్పలేదు. చండీగఢ్‌ కార్పొరేషన్‌ను బీజేపీ కోల్పోగా, ఆప్‌ ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించింది.
   పోరాటాలు, ప్రజా నిరసనలు, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలోనే బీజేపీకి ఈ ఎన్నికల పరాజయాలు సంభవించాయి. ఇక చారిత్రక రీతిలో రైతాంగం సాగించిన పోరాటం దేశంలో ప్రజా పోరాటాలు, ఉద్యమాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. 2021 సంవత్సరంలో రైతాంగ పోరాటం ఒక కొత్త చరిత్రను నమోదు చేసింది. ఈ పోరాటానికి మోడీ ప్రభుత్వం తల వంచక తప్పలేదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయక తప్పలేదు. ఈ విజయంతో-ఐక్యంగా పోరు సల్పితే విజయం మీదేనన్న స్పష్టమైన సందేశం - కార్మిక వర్గానికి అందింది.
   ఈ రైతాంగ ఉద్యమం ఫలితంగా కార్మికులు, కర్షకుల మధ్య ఐక్యత పెరగడం మనం చూశాం. వారి సంయుక్త కార్యాచరణలో అది ప్రస్ఫుటంగా వెల్లడైంది. హిందూత్వాకార్పొరేట్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా భవిష్యత్తులో సాగే పోరాటాలు, నిరసనలకు ఇదొక పునాదిని వేస్తుంది. కొత్త సంవత్సరం ఈ శుభ సూచనతోనే ప్రారంభం కానుంది.
- 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇక మన ఆర్మీ వంతు....
తుపాకుల సంస్కృతి
ఎదిగితేనే అద్భుతమైన మానవత్వ దృశ్యాలు
సుందరయ్య వారసత్వాన్ని నిలబెడదాం...
అసాధారణ విప్లవకారుడు హౌచిమిన్‌
వ్యవసాయసమస్యకు ప్రాధాన్యతనిచ్చిన సుందరయ్య
రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం

తాజా వార్తలు

08:03 PM

ఆరుగురు ఎస్సైలకు బదిలీలు

07:58 PM

ఢిల్లీ చేరిన సీఎం కేసీఆర్‌..

07:57 PM

రాహుల్ భ‌ట్ హ‌త్య అత్యంత దుర‌దృష్ట‌క‌రం : ఎల్జీ మ‌నోజ్ సిన్హా

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.