Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారతదేశ ఆదాయ అసమానతలు - వాస్తవాలు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 15,2022

భారతదేశ ఆదాయ అసమానతలు - వాస్తవాలు

ప్రపంచం అసమానతల మార్గంలో చాలా వేగంగా దూసుకుపోతున్నదని వరల్డ్‌ ఇనీక్వాలిటీ తాజా నివేదిక నిర్ధారించింది. ''గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ మల్టీ మిలియనీర్లు, ప్రపంచ సంపద వృద్ధిలో అసమతూకమైన వాటాను స్వాధీనం చేసుకుంటున్నారు. ఎగువనున్న ఒక శాతం ఉన్నత శ్రేణికి చెందిన వారు, 1990 నుండి పోగుపడిన అదనపు సంపదలో 38శాతం పొందుతుంటే, దిగువనున్న 50శాతం ప్రజలు ఆ పోగుపడిన సంపదలో కేవలం 2శాతం మాత్రమే పొందుతున్నారు.'' ''భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో బాగా అసమానతలున్న దేశాల్లో ఒకటిగా ఉందని'' నోబెల్‌ బహుమతులు పొందిన ఆర్థిక శాస్త్రవేత్తలు అభిజిత్‌ బెనర్జీ, ఇస్థర్‌ డఫ్లోలు రాసిన ఒక ముందుమాటలో పేర్కొన్నారు. అంటే ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల్లో భారతదేశంలో ఎగువనున్న ఒకశాతం, దిగువనున్న 50శాతం వారి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భారత్‌లోని ఈ వ్యత్యాసం అమెరికా, యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్‌ దేశాల్లో ఉండే వ్యత్యాసం కన్నా ఎక్కువగా ఉంది.
పేదరికం కొనసాగింపు
''సామ్యవాద ప్రేరణతో ఏర్పడిన పంచవర్ష ప్రణాళికలు'' వలస పాలనలో 50శాతం ఆదాయం గల ఎగువనున్న 10శాతం వారి వాటాను, స్వాతంత్య్రం వచ్చిన తరువాత 35-40శాతానికి తగ్గడానికి సహాయపడ్డాయని కొంత కాలంగా కొనసాగుతున్న అసమానతలు తెలియజేస్తున్నాయి. కానీ, 1980వ దశకం మధ్య నుండి అదుపులేని సరళీకరణ విధానాలు, ప్రపంచంలో అత్యంత ఎక్కువగా పెరిగిన ఆదాయ, సంపదల అసమానతలకు దారి తీసాయి. ఎగువనున్న ఒక శాతం ఉన్నత శ్రేణికి చెందిన వారు ప్రధానంగా ఆర్థిక సంస్కరణల నుండి లబ్ది పొందారు, తక్కువ ఆదాయం, మామూలు ఆదాయ సమూహాల వృద్ధి పోల్చి చూస్తే తక్కువగా ఉంది, పేదరికం ఆ విధంగా కొనసాగుతోంది. ఇటీవల సంవత్సరాల్లో, 2014 తరువాత ఆర్థిక వ్యవస్థకు పరిష్కారంగా భారతదేశం పెద్ద వ్యాపారం, ప్రయివేటీకరణలపైన విశ్వాసం కలిగి ఉండే దశలోకి వెళ్ళినట్లు కనిపిస్తుంది. ఫలితంగా మరింత అస మానతలను సృష్టించింది. దిగువనున్న 50శాతం వాటా 13శాతానికి పడిపోయిందని వరల్డ్‌ ఇనీక్వాలిటీ తాజా నివేదిక నిర్ధారించింది. భారతదేశం విశిష్టమైన సంపదతో ఒక పేద, అసమమైన దేశంగా ఉంది.
స్థిరమైన వృద్ధి రేటు
అన్నింటినీ మించి, 1951 నుండి దిగువనున్న 50శాతం ప్రజల ఆదాయం విషయంలో ఏం జరుగుతుందో ట్రైబ్యునల్‌లో ఆనింద్యో చక్రవర్తి పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1951-1981 మధ్య కాలంలో సంవత్సరానికి 2.2శాతం పెరిగింది. కానీ ఇది, ''గత నలభై సంవత్సరాలుగా వృద్ధి రేటు అదే విధంగా స్థిరంగా ఉండిపోయిందనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థకు, ఏ రాజకీయాలతో నిమిత్తం లేకుండానే, భారతదేశంలో దిగువనున్న సగం మంది ప్రజల స్థితి, ఘోరమైన ఆదాయ వృద్ధి రేటుతో పూర్తిగా మారిపోయిందని ఇది స్పష్టం చేస్తుంది. భారతదేశంలో సామాజిక నిర్బంధాలు, పరిస్థితులే దీనికి ప్రధాన కారణం.
భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచిన సామాజిక నిర్మాణం, అసమానతలను ప్రోత్సహించి, అసమాన ధోరణులను పెంచింది. భారతదేశ రాజ్యాంగం ఏర్పడిన తరువాత పరిస్థితులు మారాయి. నెహ్రూ పాలనలో, ఆ తరువాత కూడా భారతదేశంలో సామాజిక ప్రజాస్వామ్యం సాధన కోసం తీవ్రమైన ఒక ప్రయత్నం జరిగింది కానీ, ఇది రాష్ట్రాలకు, ప్రాంతాలకే పరిమితమైంది. ఆ విధంగా, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో కొద్దిపాటి చలనం కలిగింది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా, దిగువనున్న ప్రజల జీవితాలను నిరంతరం పేదరికంలోకి నెట్టివేసిన సామాజిక నిర్మాణాలను బద్దలు కొట్టిన ప్రయత్నాలు కొన్ని నమోదయ్యాయి. ఆ ప్రయత్నాలు మెరుగైన ఆర్థిక అవకాశాలు పొందవచ్చని స్పష్టం చేశాయి. ఈ అసమానతలను పెంచి పోషించిన ఆర్థిక విధానాల కంటే కూడా, పాత సామాజిక నిర్మాణాలను వదిలించుకోకుండా, వాటికి వెన్ను దన్నుగా ఉంటూ, వాటిని రోజురోజుకూ బలోపేతం చేసి, ప్రజలు ఇబ్బందులకు గురి అవడానికి కారణం అధికార పార్టీ. మన సామాజిక నిర్మాణాలకు, ఆదాయ అసమానత లకు మరియు పేదరికానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఖచ్చితంగా అంగీకరించాల్సిన అవసరం ఉంది.
సర్వే మరియు డాటా
ప్రపంచ వ్యాప్తంగా, సామాజికంగా తిరోగమన సాంప్రదాయాలను సవాల్‌ చేయకుండా, ప్రజల ఆర్థిక పరిస్థితుల రూపాంతరం, ముఖ్యంగా అసమానతల తగ్గింపు సంభవించలేదు. యూకేలోని బ్రిస్టల్‌, అమెరికాలోని టెన్నిస్సీ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు 20వ శతాబ్దంలో (1900-2000)మతం యొక్క ప్రాధాన్యతను లెక్కించడానికి వరల్డ్‌ వాల్యూస్‌ సర్వే డాటాను ఉపయోగించి, ఆర్థిక అభివృద్ధికి ముందుగా లౌకికీకరణ జరగాలని వారు కనుగొన్నప్పుడు, 2018లో 106 దేశాల్లో రికార్డ్‌ బద్దలు కొట్టిన పరిశోధన బహిరంగ రహస్యాన్ని బట్టబయలు చేసింది.
దానితోపాటుగా లౌకికీకరణ (తోడుగా వ్యక్తిగత హక్కుల పట్ల సహనం, గౌరవం ఉన్నప్పుడు మాత్రమే) మాత్రమే భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి గురించి ముందుగా తెలియజేస్తుందని ఆ నిర్థారణలు స్పష్టం చేశాయి. అప్పుడే ఒక సమాజం విభిన్న కులాలకు, జాతులకు, విశ్వాసాలకు, వర్ణాలకు చెందిన వారిని సమానంగా చూడగలదు. లౌకికీకరణ యొక్క ప్రధానమైన దృష్టికోణం, ప్రజాజీవితం నుండి మతాన్ని వేరు చేయడం. ఇది వారి వారి విశ్వాసాలతో నిమిత్తం లేకుండా ప్రతీ పౌరుడిని, శాస్త్ర విజ్ఞానాన్ని, హేతుబద్ధతను గౌరవించడానికి దారి తీస్తుంది. ఇది గత కొన్ని శతాబ్దాలుగా ఐరోపా దేశాలు, ఆసియా దేశాలైన చైనా, వియత్నాం, దక్షిణ కొరియాల అనుభవాల నుండి స్పష్టమైంది.
లోపభూయిష్టమైన 'ఒకే దేశం' విధానం
ఒకే భాషకు, ఒకే ప్రాంతానికి చెందిన సభ్యులకే ప్రాధాన్యత ఇవ్వాలనే యూనియన్‌ ప్రభుత్వ ప్రస్తుత విధానాలతో తిరోగమన మార్గంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న భారతదేశం తీవ్రమైన ఆర్థిక పరిణామాలకు దారి తీసిన ఫలితంగా ఆదాయ అసమానతలు మరింతగా పెరుగుతున్నాయి. దేశంలోని అనేక వైవిధ్యాల మధ్య 'ఒకే దేశం' విధానం పొసగదు. అన్ని వర్గాల ప్రజలకు తమ జీవనానికి అందుబాటులో ఉన్న అవసరమైన మార్గాలు, (కేంద్ర ప్రభుత్వ నూతన ప్రాధాన్యతలు, విధానాలు భారతదేశ సామాజిక నిర్మాణాలకు తూట్లు పొడిచిన ఫలితంగా) నిషేధానికి గురయ్యాయి.
వైవిధ్యం, సమ్మిళితం, సార్వజనీనమైన భావనలను విశ్వసనీయమైనవి కానివిగా పరిగణిస్తూ, భారతీయ ఒడంబడికకు ఆధారమైన మతస్వేచ్చను, దేన్నైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛలను నేరపూరిత చర్యలుగా పరిగణించడం వల్ల తీవ్రమైన సామాజిక, ఆర్థిక పరిణామాలు ఏర్పడతాయి. ఖచ్చితంగా ఈ విషయమై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఈ విధంగా హెచ్చరించాడు. ''రాజకీయాల్లో మనం ఒక మనిషి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ నిబంధనను చూస్తాం. మన సామాజిక, ఆర్థిక జీవితంలో మన సామాజిక ఆర్థిక నిర్మాణంలోని హేతువు ద్వారా ఒక మనిషి ఒక విలువ నిబంధనను తిరస్కరించడం కొనసాగిస్తాం. ఇలాంటి వైరుధ్యాలతో కూడిన జీవితాన్ని ఎంత కాలం కొనసాగించాలి? మనం ఇంకెంత కాలం మన సామాజిక ఆర్థిక జీవనంలో సమానత్వం నిజం కాదనే విషయాన్ని చెప్పాలి?''
మనం సుదీర్ఘకాలం పాటు సామాజిక ఆర్థిక అసమానతలను తిరస్కరించడం కొనిసాగిస్తేనే, మన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణం ప్రాధాన్యతను పెంచగలమని 1949లోనే బీఆర్‌ అంబేద్కర్‌ తీవ్రంగా హెచ్చరించాడు. మనం అనేక ఆపదలను, నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. దేశాల భవితవ్యం ఎలా ఉండబోతోందనే విషయం ఎవరకీ ముందుగా తెలియదు. ఇష్టాలను మనమే ఏర్పరచుకుంటాం, భవితవ్యాలు సృష్టించబడతాయి. ఆధునికీకరణను తిరోగమన మార్గం పట్టించడం, ప్రజాజీవితానికి మతాన్ని అనుసంధానం చేయడం, ఆధునికతను నిర్మూలించే ప్రయత్నాలను ఇప్పటికే భారతదేశం ఆదర్శంగా తీసుకుంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు, మన పొరుగు దేశాలు అలాంటి మార్గాలను అవలంభించి ప్రమాదకరమైన సంకుచిత మార్గంలో ఉన్న దారిలోనే, మనం కూడా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి.
(''ద హిందూ'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్‌
సీమా ఛిస్తీ
సెల్‌:9848412451

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం
'మధ్యతరగతి'.. అంటే ఎవరు?
ప్రశ్నిస్తున్న 'పత్రం'
త్రికోణ రాజకీయంలో తెలంగాణ
కొబ్బరిబోండాం...
లడ్డూ కావాలా నాయకా...
యూపీలో గట్లనే జేస్తున్నరా..?

తాజా వార్తలు

08:28 AM

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ భుయాన్‌

08:18 AM

నా చావుకు నేనే కారణమం..యువ ఇంజినీర్ ఆత్మహత్య

08:06 AM

బీజేఆర్‌నగర్‌లో రోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం

07:55 AM

ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు

07:49 AM

హర్యానాలో స్వల్ప భూకంపం...

07:42 AM

ప్రయివేట్ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ

07:32 AM

గెలిచినా హైదరాబాద్‌కు తప్పని నిరాశ

07:26 AM

తాగి మండపానికి వచ్చిన వరుడు..మరో యువకుడితో..!

07:20 AM

పుతిన్‌పై నిషేధం విధించిన కెనడా...

07:16 AM

రూ.10లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్ల పట్టివేత

06:10 AM

నోషనల్‌ ఇంక్రిమెంట్లకు వివరాలు పంపాలి: జేడీ

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.