Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నో అంటావా... సారూ.. నోనో అంటావా... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 14,2022

నో అంటావా... సారూ.. నోనో అంటావా...

         కరోనా మూడో వేవ్‌ కాలం ఇది. చాలా వేగంగా దౌడ్‌ తీస్తోంది. అంటే వేగంగా మారిపోతోంది కాలం. దానితో పాటు మానవుడూ. ఇక సినిమా వాళ్ళ గురించి చెప్పే అవసరమే లేదు. ఎదో విధంగా తీసేసి, ఇంకో విధంగా అంటే ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేసేసి తమ పని అయిపోయింద నిపించుకోవాలి. అలాగే తమ డబ్బూ రాబట్టుకోవాలి అది వేరే సంగతి. నో అంటావా బాబు నో నో అంటావా బాబూ అని పాడిస్తారు, ఆడిస్తారు. అందరూ చూడాలని కొన్ని సీన్లు పెడతారు. తరువాత వాటిని తీసేసి వెరీ గుడ్‌ బారు అన్న సర్టిఫికెట్‌ తెచ్చుకుంటారు. అది ఇంకో సంగతి. మొత్తం మీద ప్రపంచ గతి అంటే ప్రపంచం ఎలా నడుస్తోందో చూపిస్తారు. వాళ్ళు చూస్తున్నారని మేము తీస్తున్నాం అని చెబుతారు. చూసే వాళ్లేమో వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అనేస్తారు. ఇద్దరూ చేసే పని వాళ్ళు, చూసేపని వీళ్ళు చేస్తూనే ఉంటారు. అదే సినిమా తర్కం. వాళ్ళు నో చెప్పలేదు అందుకే ఈ సినిమాలు అంటారు. వాళ్ళు ఎస్‌ అని కూడా చెప్పలేదు కదా అంటే మాత్రం నో సమాధానం. చిన్నప్పుడు ఎస్‌, నో, ఆల్రైట్‌ అన్న మూడు ముక్కల ఇంగ్లీషు మాత్రం వచ్చినవాడు నెత్తిమీదికి తెచ్చుకున్న కథ చెప్పి నవ్వించేవారు. ఇప్పటికైనా పెద్దవాళ్ళు చెబుతారు కావాలంటే.
            సినిమా మొదలు పెడతారు. మొదట్లోనే అనుమానమొస్తే తీద్దామంటావా బాబు వదిలేయమంటావా బాబు అని అడుగుతారు. ఊరకే సినిమా తీసి చేయి కాల్చుకోవడమా లేక కడుపులో చల్ల కదలకుండా పడుకోవడమా అన్న పాయింటుకు ఎస్‌ లేదా నో అని మొదట ఒక సమాధానం సిద్ధంగా ఉంచుకోవాలి. అలా నిర్ణయాలు తీసుకోవలసిన సమయాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇంకో చోట ఒక నాయకుడు ఫలానా రూట్లో ఎన్నికల మీటింగుకి పోదామని బయలుదేరతాడు. మధ్యలో ఎదో అడ్డంకి వచ్చి ఆగిపోతాడు. పొదామంటావా సారు ఆగుదమంటావా సారూ అని అధికారులడుగుతారు. ఆలోచిస్తా బాబూ ఆలోచిస్తా బాబూ అని సమాధానం చెప్పి వెంటనే మిత్రుడికి ఫోను కొడతాడు. ఏమి చెయ్యాలి దోస్తు ఇప్పుడేం చేయాలీ దోస్తు అని అడుగుతాడు. ఓట్లొస్తాయా బాసు మనకోట్లొస్తాయా బాసు అని అవతలనుంచి అడుగుతాడు. నో అంటున్నారు బాబు నో నో అంటున్నారు బాసు అంటాడు. వాపస్‌ ఆజావో బాసు వాపస్‌ ఆజావో బాసు అని రిస్కెందుకంటాడు. అలా సినిమా వాళ్ళు కూడా అంతంత డబ్బుపెట్టి సినిమా తీస్తే అవి తిరిగి వస్తాయా రావా అన్న విషయాన్నీ చూసుకొని కానీ ముందుకు పోరు. అలా వ్యాపారమైనా, సినిమా అయినా, వ్యాపారం లా చూసే ప్రజా సేవ అయినా నో అంటావా లేక ఎస్‌ అంటావా అని అడిగి కానీ ముందుకు పోరు. పోకూడదు కూడా. ప్రజా సేవలో లాభాలు ఆశించని వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఎస్‌ అనే సేవ చేస్తుంటారు. వాళ్ళు నో అనేది ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని మాత్రమే అన్న విషయం మరువరాదు.
చదువుల కాలం. అసలు ఎవరు చెబుతున్నారో, ఎవరు చదువుతున్నారో, అందులో ఏమి చదువుతున్నారో తెలియని కాలం. లైఫ్‌ అంటే ఓ జిందగీ అయిపోయిందని సినిమాలో హీరో చెప్పిన తమాషా డైలాగ్‌ గుర్తొస్తుంది. జిందగీ అన్నా లైఫ్‌ అన్నా ఒకటే కదా అంటే, అందులోనే ఉంది మరి తమాషా. ఈ తమాషా మన జీవితాల విషయంలో ఇంకా విచిత్రంగా ఉంటుంది. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు ఉంటుంది పరిస్థితి . అసలు ఈ టామ్‌ అండ్‌ జెర్రీ కార్టూనులు మన సామెతను చూసే కాపీ కొట్టారని మన దగ్గర ఉన్న ఒకే ఒక్క డైలాగ్‌ చెప్పొచ్చు వెంటనే. చదివెయ్యా సీటు లేదు చదివొస్తే పనీ లేదు అని ఆకలి రాజ్యంలో కమలహాసన్‌ పాడినట్టు ఇప్పుడు ఏది చదవాలో ఏది కూడదో తేల్చుకోవడం చాలా యదార్‌ ఉంది. విద్యార్థుల్లో, తల్లి తండ్రుల్లో కూడా. ఎందుకంటే చదువూ ఒక వ్యాపారమే కదా. అందుకే నోనా, ఎస్సా అని ఒకటికి పదిసార్లు తేల్చుకొని కానీ ముందుకు పోలేని పరిస్థితి. సంకట స్థితి.
నో అనవలసిన సమయంలో ఎస్‌ అనడంవల్లే ఎక్కువ అనర్ధాలు కొనితెచుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. ఎదో మొహమాటం కొద్దో, మిత్రులో, సన్నిహితులో, బంధువులో అన్న ఫీలింగులో ఎస్‌ అనేస్తుంటారు చాలా మంది. నో అని చెప్పలేకున్నా మళ్ళీ చెబుతాను, చూస్తాను లాంటి నాన్చుడు మాటలతో దాటవేయడం కొన్ని సందర్భాల్లో మంచిదని తెలివిగలవారు చెబుతుంటారు. దానివల్ల ఏంతో సమయం ఎక్కువ సార్లు పైసలు మిగులుతాయని మా మిత్రుడు చెబుతాడు. ఏకంగా ఈ విషయం పైన ఓ పుస్తకమే ఉంది. నీవు నో అని చెప్పదలచుకుంటే ఎస్‌ అని చెప్పొద్దంటాడు ఆ రచయిత. ఇదేదో స్వార్ధపరులు చేసేపని అని అనుకోవలసి పనిలేదని అసలు అలాంటి స్వార్థపరుల దగ్గర ఇలా చెప్పాలని మళ్ళీ మా మిత్రుడు ఒక ఉచిత సలహా పడేస్తుంటాడు. ఒక్కోసారి వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ కూడా ఇస్తుంటాడు సలహాలు. ఒకటి అడిగినది ఇంకొకటి అడగనిది కలిపి.
             ఎన్నికల్లో నోటా అని ఒక ఓటు ఉంటుదన్న విషయం అందరికీ తెలుసు. నిలబడ్డ అభ్యర్థుల్లో మనకు ఎవరూ నచ్చలేదనుకోండి, మనం ఈ నోటా ఓటు వేయొచ్చు. ఆ ఓటు ఎవ్వరికీ కాదన్నా మాట. నిలబడ్డ వాళ్ళల్లో మనకు ఒక్కళ్ళూ నచ్చలేదని అర్థం. అందరికీ నో అంటున్నాను, అందుకే నోటా అంటున్నాను అన్నది సారాంశం. అలా నో చెప్పకనే తలతిక్క పనులు చేసే వాళ్ళను మన నెత్తిన ఎక్కించుకుంటున్నామని ప్రజలు గమనించాలి. గమనించి నో చెప్పాలి. లేదంటే బాగా నష్టపోతారు. అసలు మేము ఓటుకింత ఇచ్చినప్పుడే నో చెప్పవలసింది గెలిచాక చెబితే ఏం ప్రయోజనం? వాళ్ళకివ్వాలి కాబట్టి సంపాదించాలిగా!! అని సినిమా మాటలు వీళ్ళూ చెబుతారు.
       నేరస్థులు పార్టీల్లో ఉండకూడదంటారు కాని వాళ్ళు తమతో చేరతామంటే మాత్రం నో అనలేరు. వాళ్ళ కేసులన్నీ పక్కన పెట్టిస్తారు కూడా. వాళ్ళు తమను వీడిపోతే మమ్మల్నే నో అంటావా నోనో అంటావా అని పాత కేసులన్నీ తోడితీసి ఉన్నవాళ్ళలో ఇతరులు బయటకు పోకుండ చూసుకుంటారు. అయినా ప్రజలంతా కలిసి నో అంటామూ మేము నోనో అంటాము... అనే రోజులు దూరంలో మాత్రం లేవు... హ్యాపీ సంక్రాంతి...
జె. రఘుబాబు
సెల్‌: 9849753298

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం
'మధ్యతరగతి'.. అంటే ఎవరు?
ప్రశ్నిస్తున్న 'పత్రం'
త్రికోణ రాజకీయంలో తెలంగాణ
కొబ్బరిబోండాం...
లడ్డూ కావాలా నాయకా...
యూపీలో గట్లనే జేస్తున్నరా..?

తాజా వార్తలు

08:28 AM

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ భుయాన్‌

08:18 AM

నా చావుకు నేనే కారణమం..యువ ఇంజినీర్ ఆత్మహత్య

08:06 AM

బీజేఆర్‌నగర్‌లో రోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం

07:55 AM

ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు

07:49 AM

హర్యానాలో స్వల్ప భూకంపం...

07:42 AM

ప్రయివేట్ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ

07:32 AM

గెలిచినా హైదరాబాద్‌కు తప్పని నిరాశ

07:26 AM

తాగి మండపానికి వచ్చిన వరుడు..మరో యువకుడితో..!

07:20 AM

పుతిన్‌పై నిషేధం విధించిన కెనడా...

07:16 AM

రూ.10లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్ల పట్టివేత

06:10 AM

నోషనల్‌ ఇంక్రిమెంట్లకు వివరాలు పంపాలి: జేడీ

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.