Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధ్యాయుల జీవితాలను బలి తీసుకోవద్దు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2022

ఉపాధ్యాయుల జీవితాలను బలి తీసుకోవద్దు

గురువులను సాక్షాత్తు దైవంగా పూజించే సంస్కృతి మనదేశంలో వందల సంవత్సరాలుగా విలసిల్లుతున్నది. ఉపాధ్యాయులకు సముచిత గౌరవం ఇవ్వటం మన సంస్కృతిలో అంతర్భాగంగా వస్తున్నది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరిస్థితి మాత్రం భిన్నంగా మారింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగులు ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ మధ్య ఉపాధ్యాయుల బదిలీలలో చేసిన తప్పుల కారణంగా ఇప్పటికే 15 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
   జీఓ317తో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాల పెంపు కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల శాశ్వత బదిలీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం జోనల్‌, మల్టీ జోనల్‌, జిల్లాస్థాయి పోస్టులు ఏవి అనేది నిర్ణయం చేయకుండానే ఆదరా బాదరాగా చేపట్టిన ఈ బదిలీల ప్రక్రియ అంతా లోప భూయిష్టంగా జరిగింది. ఉపాధ్యాయుల బదిలీలలో అసలు స్థానికత అనే విషయాన్ని పట్టించుకోలేదని, కేవలం సీనియారిటీని పరిగణలోకి తీసుకొని బదిలీలు చేయటం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. కేవలం స్థానికతే కాదు, డీఎస్సీ మార్కులను, గతంలో వారు చేసిన సర్వీసును సైతం పరిగణనలోకి తీసుకోలేదని, కొన్ని సందర్భాల్లో తమ తర్వాత ఉద్యోగాలలో చేరిన వారికి అధిక సర్వీస్‌ వచ్చిందని, ఆయా సీనియారిటీ జాబితా అంతా తప్పుల తడకగా ఉందని దాదాపు 20 రోజులుగా తరగతి గదులను, తమ పాఠశాలలను విడిచిపెట్టి కలెక్టరేట్‌లు, డీఈవో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. వారిని పోలీసులు లాక్కు వెల్లి అరెస్ట్‌ చేయడం నిజంగా భాధకరం. స్పౌస్‌, వీడో అనే విషయాలను సైతం పరిగణలోకి తీసుకోలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు బదిలీలకు కావాల్సిన సీనియార్టీ లిస్టును సైతం విడుదల చేయకుండా ఆప్షన్ల ప్రక్రియను ముగించేశారు.
   ఈ బదిలీల కారణంగా ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థులు సైతం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. చాలా పాఠశాలల్లో ఉన్న 5, 6 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసింది, కొన్ని పాఠశాలల్లో కనీసం విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి పాఠశాలకు కనీసం ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేడు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల్లో చదువుకునే స్తోమత ఉండదు కాబట్టి మొత్తానికే చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడేండ్ల తర్వాత చేసిన బదిలీలు ఎంతో పరిపక్వతతో, ప్రణాళికాబద్ధంగా ఉండాల్సింది పోయి లోపభూయిష్టంగా మారడం విచారకరం. ఈ బదిలీలను చూస్తుంటే ప్రభుత్వానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యారంగం మీద ఉన్న శ్రద్ధ ఏపాటిదో కనిపిస్తోంది.
   సరే పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులను బదిలీ చేశారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఏర్పడిన చోట మన ప్రభుత్వ పెద్దలు రిక్రూట్‌మెంట్‌ చేసి భర్తీ చేస్తారా అంటే అదీ తీరని ఆశగానే కనిపిస్తున్నది. ఉపాధ్యాయులను బదిలీ చేయటం వలన విద్యార్థులు అధిక సంఖ్యలో పాఠశాలలో చేరరు. కాబట్టి తక్కువ సంఖ్యతో నడుస్తున్న ఈ పాఠశాలలను రేషనలైజేషన్‌ పేరుతో మూసివేసే కుట్ర ఇందులో ఉందేమో అనేది తెలంగాణ సమాజంలో ఉన్న అతి పెద్ద సందేహం. ఇప్పటికే వందల కొద్ది పాఠశాలలను రేషనలైజేషన్‌ పేరుతో మూసివేయడం జరుగుతున్నది. కేజీ టు పీజీ, ఉచిత విద్య నా మానస పుత్రిక అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి రెండు ఎన్నికల్లో నెగ్గినాక సైతం ఈరోజుకి కేజీ టు పీజీ ఉచిత విద్య దేవుడెరుగు గాని, కేజీ టు పీజీ ఫీజుల మోత మోగుతోంది. వేలాది మంది విద్యార్థులు అప్పులు తీసుకొచ్చి చదువుతున్నారు, కొంత మంది చదువుకు దూరమవుతున్నారు.
   వాస్తవానికి ఈ ఉపాధ్యాయులే మనందరికీ తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పింది. అటువంటి ఉపాధ్యాయుల ఆత్మహత్యలు చూడాల్సిన రోజు రావడం బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం జీఓ 317 రద్దుచేసి లక్షా 60వేల మంది ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. కావలసినంత సమయం తీసుకొని పక్కా ప్రణాళికను సిద్దం చేసుకొని, స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితాను ముందే సిద్ధం చేసి జిల్లాస్థాయి, జోనల్‌ స్థాయి, మల్టీ జోనల్‌ స్థాయి పోస్టులు ఏవి అనేవి ఖరారు చేసుకుని ఒక కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసి అందులో కొంత మంది ఉద్యోగులను, ఉపాధ్యాయులను సభ్యులుగా తీసుకొని, వారి ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చి విధివిధానాల రూపకల్పన చేయాలి. స్పౌజ్‌, వీడో ఆప్షన్లకు సైతం బదిలీల ప్రక్రియలో ప్రాధాన్యమిచ్చి నిష్పక్షపాతంగా ఉపాధ్యాయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలి. అంతేగాని ప్రభుత్వం చేసిన తప్పులకు ఉపాధ్యాయులను బలి చేయడం. సమంజసం కాదు. ఆత్మహత్య అనేది ఏనాటికీ పరిష్కారం కాదనేది ఉపాధ్యాయ సమాజం సైతం ఆలోచించాలి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం చేసి అయినా సక్రమంగా ఉపాధ్యాయ, ఉద్యోగ బదిలీలను సాధించాలి. ప్రభుత్వం జీఓ 317 విషయంలో పునరాలోచించి రద్దు చేసి ఉపాధ్యాయ బదిలీలను సక్రమంగా నిర్వహించేలా మరొక జీఓను విడుదల చేయాలి. ఉపాధ్యాయ బదిలీల విషయంలో కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు తమ అగ్ర నాయకత్వం మెప్పు పొందే క్రమంలో ఉపాధ్యాయు లను కించపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం భావ్యం కాదు.
-జవ్వాది దిలీప్‌
సెల్‌:7801009838

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం
'మధ్యతరగతి'.. అంటే ఎవరు?
ప్రశ్నిస్తున్న 'పత్రం'
త్రికోణ రాజకీయంలో తెలంగాణ
కొబ్బరిబోండాం...
లడ్డూ కావాలా నాయకా...
యూపీలో గట్లనే జేస్తున్నరా..?

తాజా వార్తలు

08:28 AM

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ భుయాన్‌

08:18 AM

నా చావుకు నేనే కారణమం..యువ ఇంజినీర్ ఆత్మహత్య

08:06 AM

బీజేఆర్‌నగర్‌లో రోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం

07:55 AM

ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు

07:49 AM

హర్యానాలో స్వల్ప భూకంపం...

07:42 AM

ప్రయివేట్ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ

07:32 AM

గెలిచినా హైదరాబాద్‌కు తప్పని నిరాశ

07:26 AM

తాగి మండపానికి వచ్చిన వరుడు..మరో యువకుడితో..!

07:20 AM

పుతిన్‌పై నిషేధం విధించిన కెనడా...

07:16 AM

రూ.10లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్ల పట్టివేత

06:10 AM

నోషనల్‌ ఇంక్రిమెంట్లకు వివరాలు పంపాలి: జేడీ

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.