Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రామ - కృష్ణ యుద్ధంలో రైతుల పాత్ర | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2022

రామ - కృష్ణ యుద్ధంలో రైతుల పాత్ర

'జిస్‌సే ఖేల్తేహై - ఉస్‌ సే మర్తా హై!' (ఏ ఆయుధంతో నీవు ఆట ఆడతావో ఆ ఆయుధమే నిన్ను బలి తీసుకుంటుంది.
  - ఒక సామెత)
   హిందూమత రాజ్యస్థాపనే లక్ష్యంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. పనిచేస్తున్నదన్న విషయం అందరికీ తెలిసిందే. దాని ఉపాంగమైన బీజేపీ ప్రస్తుతం యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందూత్వ ఎజెండానే ఒక ఆయుధంగా తీసుకుని ఒక వితండ వాదాన్ని తెరపైకి తెచ్చింది.
   ఈ ఎన్నిక ఎనభై శాతంగా ఉన్న మెజార్టీవారికీ ఇరవైశాతంగా ఉన్న మైనార్టీవారికీ జరుగుతున్న ఎన్నిక అని, మైనార్టీవారి నుండే మెజార్టీవారికి ప్రమాదం పొంచి ఉన్నదని, జాగ్రత్తగా యోచించి ఓట్లేయాలని బీజేపీ నర్మగర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చింది. లోతుగా పరిశీలిస్తే ఇది మైనార్టీవారిని మరింతగా భయభ్రాంతులను గావించే లజ్జారహిత రాజ్యాంగ వ్యతిరేక చర్య అని వేరుగా చెప్పక్కర్లేదు. అయితే పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. మెజార్టీ ఓట్లు గుండు గుత్తగా పొందాలనుకునే వారికి చుక్కెదురు అవుతున్నది. కులాలు-మతాలు భావవాద పునాదులపై మనిషి ఏర్పరుచుకున్నవే తప్ప భౌతిక వాస్తవాలు కావనే విషయం శాస్త్రం నిత్యం చెపుతూనే ఉన్నది. కనుకనే ప్రతి మతంలోనూ బహుళత్వం, కులంలో ఉప కులత్వం ఏర్పడుతున్నాయి. నమ్మకాల ఆధారంగా ఏర్పడ్డాయి గనుక ఆయా సందర్భాల్లో అవి సంకోచిస్తుంటాయి, వ్యాకోచిస్తుంటాయి లేదా సమాంతరంగా వైవిధ్యాలతో కొనసాగుతుంటాయి. ఏది ఏమైనా సామరస్యము, సహజీవనము అనివార్యమైన ప్రాకృతిక సహజ ధర్మంగా వర్థిల్లుతూనే ఉంటాయి. ఆ... భిన్నత్వంలోని ఏకత్వమే భారతీయ విశిష్టతగా అనాదిగా జగమంతా చాటుతున్నది.
   రామజన్మభూమి, రామరాజ్యం, అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాలను ప్రాతపదికగా చేసుకుని 1990లో బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర చేశాడు. ఇది మత పరంగా మనుషుల మధ్య చీలికలకు దారితీసింది. తదనంతరం చెలరేగిన మత ఘర్షణల్లో అసంఖ్యాకంగా అమాయక ప్రజలు అశువులు బాసారు. అయినా ''ఇది కోట్లాది మంది ప్రజల నమ్మకం, దీనిని ఏ కోర్టులూ పరిష్కరించలేవు'' అంటూ చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న రాజ్యాంగ నిబంధనను ఆనాడే బీజేపీ వారు తుంగలో తొక్కారు. 1992 డిసెంబర్‌ 6న అక్కడ బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇదంతా గతం. రాజకీయాలను ఆ విధంగా గందరగోళంలోకి నెట్టారు. రాజకీయాన్ని మతాన్ని కలగాపులగం చేసి భావవాదానికి పెద్దపీట వేశారు. తత్‌ ఫలితంగా బీజేపీ రాజకీయంగా ఎగబ్రాకి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నదని కొందరు విశ్లేషకులు చెపుతున్నారు. నిజమే కావచ్చు. కానీ ఇప్పుడు ఆ హిందూ ఏకత్వ సిద్ధాంతానికి రాజకీయంగా బీటలు వారడం ప్రారంభమైంది.
   తాజాగా సమాజవాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ శూద్రులకు ప్రతినిధిగా భావించే శ్రీకృష్ణుడిని రాముడికి ప్రతిగా నిలపడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీకృష్ణరాజ్యమే సమాజవాది సోషలిస్టు రాజ్యమని అఖిలేష్‌ అభివర్ణిస్తున్నాడు. ఆ విధంగా త్రేతాయుగంలోని రామునికి, ద్వాపరయుగం లోని శ్రీకృష్ణుడికి మధ్య వైరుధ్యం మొదలైంది.
   ఎక్కడైనా దేవుడు ఒక్కడే కదా! అన్న వాదనను వీరు ఒప్పుకోవడం లేదు. 2014లో మోడీ ఎన్నికల్లోకి వచ్చినప్పుడు సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌' అన్నాడు. మరి ఏడాది పాటు సాగిన రైతాంగ ఉద్యమంలో ఏడువందల మందికి పైగా ప్రాణాలు పోయినా ప్రదాని మోడీగాని, బీజేపీ పార్టీ గాని మతసంబంధమైన కనీస మానవత్వంతో న్యాయబద్దంగా వ్యవహరించలేదు కదా..? అని వాదిస్తున్నారు. అంటే హిందువులైన రైతులకు న్యాయం దక్కలేదన్నది వారి వాదన. అంతే కాదు.. రామాయణంలో రాముడు వర్ణాశ్రమ వ్యవస్థకు బంధీ, శూద్రులు వేదాలు చదువరాదన్న విప్రుల (బ్రాహ్మణుల) మాటకు విధేయుడై శంభూకుడ్ని వధించాడు. కానీ కృష్ణపరమాత్ముడు బోధించింది ధర్మలౌక్యం. దుష్టశిక్షణకు శిష్టరక్షణకు నడుంకట్టి ధర్మస్థాపనకు మార్గం చూపాడు అని విశద పరుస్తున్నారు.
   పైగా కృష్ణుడ్ని పశుపాలకునిగా, ఆహార వ్యవసాయ ఉత్పత్తి కులాల ప్రతీకగా చూపుతూ రైతులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
   కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు అర్జునినికి గీతాసారాన్ని బోధిస్తాడు. గీతలో వైరుధ్యాలు, మినహాయింపులు ఎన్ని ఉన్నా అంతిమంగా కర్మ ప్రాధాన్యాన్ని, స్థిత ప్రజ్ఞతను విశదపరుస్తున్నదని తత్వజ్ఞులు చెపుతున్నారు. మనిషి నిరంతరం పనిచేయాలి. పని అంటేనే శ్రమ. శ్రమించేవారే విజయం సాధిస్తారు. 'శ్రయేవ జయతే' అంటూ రైతులను, శూద్రులను, శ్రమజీవులను కీర్తిస్తున్నారు. సోమరులను, సన్యాసులను పరోక్షంగా తెగనాడుతున్నారు. 'నియంతం కురు కర్మత్వం, కర్మ జ్వాయోహ్య కర్మణః
శరీర యాత్ర పిచతే, నప్రసిద్దే దకర్మణః (-గీతాశ్లోకం)
   పనీపాటలు చేయని సోమరులకు జీవనయాత్ర గడపటం అనర్హం. కష్టం. శ్రమ అన్నది మనిషి సామాజిక బాధ్యతగా కృష్ణుడు గీతలో పేర్కొనడాన్ని మహాత్మాగాంధీ అనేకసార్లు ఉటంకిస్తాడు. కాగా, 'మనదంతా ఒకే మతం హిందూ మతం హమ్‌ సబ్‌ హిందూ' అన్న సనాతన ధర్మ ఏకత్వ భావవాద సిద్ధాంతాన్ని రైతాంగం తన సమరశీల పోరాటంతో బ్రద్దలు కొట్టిందనేది గమనార్హం. రైతులు, కష్టజీవులు అన్ని మతాల్లో ఉంటారు. తమకు మేలు చేసేది, ఆనందాన్ని ఇచ్చేది ఏ మత భావమైనా సునాయాసంగా స్వీకరించ డానికి ప్రజలు సదా సిద్ధపడతారు. ఇది వాస్తవమైన సామరస్య జీవన భావన. అదే ఆచరణ మార్పుకు దారితీస్తుంది.
   ఒక యుగపు సామాజిక మనస్తత్వం ఆ యుగపు సామాజిక సంబంధాల ద్వారా నిర్దేశితమవుతుందని ప్లేఖన్‌ల్‌ చెప్తాడు. అంతే కాదు ఇప్పుడు ఈ రామ - కృష్ణ అవతారాల భావయుద్ధంలో మానవ (రైతుల) శ్రమ పాత్ర కీలకం గావడం శుభపరిణామం.
- కె. శాంతారావు
సెల్‌:9959745723

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సుందరయ్య వారసత్వాన్ని నిలబెడదాం...
అసాధారణ విప్లవకారుడు హౌచిమిన్‌
వ్యవసాయసమస్యకు ప్రాధాన్యతనిచ్చిన సుందరయ్య
రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం
'మధ్యతరగతి'.. అంటే ఎవరు?
ప్రశ్నిస్తున్న 'పత్రం'
త్రికోణ రాజకీయంలో తెలంగాణ

తాజా వార్తలు

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

05:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

04:47 PM

బాలుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

04:33 PM

జీఎస్టీ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు‌

04:24 PM

ట్వి‌ట్ట‌ర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి‌న ట్రంప్‌.. మళ్లీ నిషేధం..!

04:13 PM

మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

04:04 PM

స్టాక్ మార్కెట్లు ఢమాల్..!

03:58 PM

ఆర్ఆర్ఆర్‌లో పులితో ఫైట్‌.. వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో విడుద‌ల‌

03:51 PM

క్రికెట్‌ బెట్టింగ్‌లో టీడీపీ నేత అరెస్టు

03:44 PM

భూత వైద్యుడి నిర్వాకం.. బాలికను నిపులపై నడిపించి..

03:32 PM

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యతల స్వీకరణ

03:23 PM

న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది జైలు శిక్ష‌

03:20 PM

వెనక్కు తగ్గిన జీ5.. సబ్​స్క్రైబర్లకు ఉచితంగా ఆర్ఆర్ఆర్ సినిమా

03:13 PM

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మ‌రో షాక్‌..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.