Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత రాజ్యాంగమా? మనుధర్మమా? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2022

భారత రాజ్యాంగమా? మనుధర్మమా?

జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ భారత సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న న్యాయమూర్తి. 2021 డిసెంబర్‌ 26న హైదరాబాద్‌లో జరిగిన 16వ అఖిల భారతీయ అధివక్త పరిషత్‌ (ఏబీఏపీ) జాతీయ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఆయన ''భారతీయ న్యాయవ్యవస్థ నిర్వలసీకరణ'' పై ప్రసంగించాడు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆరెస్సెస్‌) అనుబంధ సంస్థ నిర్వహించిన ఆ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం ఆశ్చర్యం కలిగించింది.
   ఏ కారణంగానో ఏబీఏపీ, న్యాయమూర్తి ప్రసంగాన్ని తన వెబ్‌సైట్లో పెట్టలేదు, కానీ ఒక ప్రముఖ లీగల్‌ పోర్టల్‌ ఆయన పూర్తి ప్రసంగాన్ని తన వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. భారతీయ ప్రజలకు అనుగుణంగాలేని భారతీయ న్యాయ వ్యవస్థ వలసకాలం నాటిదని, దానిని అత్యవసరంగా భారతీయీకరణ చేయాలని జస్టిస్‌ నజీర్‌ పేర్కొన్నాడు. ప్రాచీన భారతదేశంలోని మనువు, కౌటిల్యుడు, కాత్యాయనుడు, బృహస్పతి, నారదుడు, యజ్ఞవాల్క్యల గొప్ప న్యాయ సాంప్రదాయాల విజ్ఞానాన్ని భారతీయ న్యాయ వ్యవస్థ అలక్ష్యం చేస్తున్న ఫలితంగా మన జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా, మన రాజ్యాంగానికి హాని కలిగించే వలసకాలం నాటి న్యాయ వ్యవస్థను అంటిపెట్టుకుందని అన్నాడు. భారతదేశంలో అప్పటికే ఉనికిలో మహౌన్నతమైన న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ, దాడులు, దురాక్రమణల ద్వారా విదేశీ న్యాయ వ్యవస్థను మనపై విధించారని, 2021నాటికి కూడా అదే వలసకాలం నాటి న్యాయ వ్యవస్థను కొనసాగించడం విచారకరమని ఆయన అన్నాడు.
   నేరస్తులకు బహిరంగంగా శిక్షను విధించిన మనువును జస్టిస్‌ నజీర్‌ అహేతుకంగా గుర్తు చేసుకున్నాడు. సర్వోన్నత న్యాయస్థానంలో విశేషానుభవం గల న్యాయమూర్తి బహిరంగ శిక్షా విధానాన్ని శ్లాఘించడం దురదృష్టకరం. చట్ట వ్యతిరేకంగా జరిగే మూక హత్యలు, వెంటాడి, వేటాడి పట్టుకొని శిక్షించే చర్యలు గత నిరంకుశ పాలనలో, ఇప్పుడు కూడా అమలులో ఉన్నాయనే విషయాన్ని ఆయన పూర్తిగా విస్మరించాడు. వాస్తవానికి, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసించిన వారి పేర్లను బహిరంగ పరచటం అంటే, ప్రజల గోప్యతలో అహేతుకంగా జోక్యం చేసుకొని, ఆర్టికల్‌ 21ని ఉల్లంఘించడమేనని అలహాబాద్‌ హైకోర్టు మార్చి 2020లో వెలువరించిన తీర్పులో పేర్కొంది. వాస్తవాలు తెలియాలంటే జస్టిస్‌ నజీర్‌ వాదనలను, తాను అభిమానించే ఇద్దరు భారతీయ మేథావులైన మనువు, కౌటిల్యుని అసలు రచనలతో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
మనుస్మృతి
   మనుస్మృతిలోని కొన్ని చట్టాలు శూద్రులను హీనంగా చూసే విధానం ఇలా.. 1. ప్రపంచ శ్రేయస్సు కోసం, దేవుడు బ్రాహ్మణులను నోటి నుంచి, క్షత్రియులను భుజాల నుండి, వైశ్యులను తొడల నుండి, శూద్రులను పాదాల నుండి సృష్టించాడు. 2. శూద్రులు, మిగిలిన ముగ్గురికి సేవ చేసే పనిని దేవుడు వారికి అప్పగించాడు. 3. ఒకవేళ శూద్రుడు అహంభావంతో బ్రాహ్మణుల బాధ్యతల గురించి బోధిస్తే, రాజు అతని చెవిలో, నోటిలో వేడి నూనెను పొయ్యాలి. 4.ఒక అగ్రకుల వ్యక్తితో సమానంగా ఆసీనుడయ్యే ఒక నిమ్న కులానికి చెందిన వ్యక్తి తొంటిపైన వాతలు పెట్టాలి, లేదా దేశ బహిష్కరణచేెయాలి, లేదా అతని పిరుదులపై గాట్లు పెట్టాలి.
   మనుస్మృతిలోని కొన్ని చట్టాలు మహిళలను హీనంగా చూసే విధానం ఇలా... 1. రాత్రి, పగలు మహిళలు కుటుంబంలోని పురుషులపై ఆధారపడి ఉండాలి. ఒకవేళ వారు ఇంద్రియ సుఖాలను పొందాలనుకుంటే, ఒక్కరి అదుపులోనే ఉండాలి. 2. మహిళ తండ్రి ఆమెను బాల్యంలో రక్షిస్తాడు, భర్త యవ్వనంలో రక్షిస్తాడు, కుమారులు తన వృద్ధాప్యంలో రక్షిస్తారు. అంతేతప్ప ఒక మహిళ స్వతంత్రంగా ఉండడం కుదరదు. 3. మహిళలు అందం గురించి పట్టించుకోకూడదు, వయసు గురించి ఆలోచించకూడదు. 'అతనొక పురుషుడు' అంతే చాలు, తమను తాము అందానికి, అంద విహీనానికి అర్పించు కోవాలి. 4. వారిని సృష్టించే సమయంలో మనువు మహిళలకు వారి ప్రేమ పాన్పును, వారి స్థానాన్ని, ఆభరణాలను, అపరిశుద్ధమైన కోరికలను, ఆగ్రహాన్ని, నీతిమాలినతనాన్ని, అసూయను, చెడు ప్రవర్తనను ఆపాదించాడు.
   ''మన హిందూ జాతికి చెందిన వేదాల తరువాత ఆరాధించ దగినది మనుస్మృతి'' అని వీడీ సావర్కర్‌ ప్రకటించాడు. నవంబర్‌ 26, 1949 నాడు భారత రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగాన్ని ఆమోదించిప్పుడు, ఆరెస్సెస్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ''ప్రాచీన భారతంలోని ప్రత్యేకమైన రాజ్యాంగ అభివృద్ధిని గురించి మన రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. నేటికీ కూడా మనుస్మృతిలో స్పష్టంగా వివరించబడిన చట్టాలు ప్రపంచాన్ని ప్రశంసించడానికి ప్రేరేపించి, విధేయతను, అంగీకారాన్ని బయటకు తీస్తాయి. కానీ, మన రాజ్యాంగ పండితులకు మాత్రం ఇవేవీ లెక్కలో లేని విషయాలని'' నవంబర్‌ 30, 1949న ఆరెస్సెస్‌ పత్రిక 'ఆర్గనైజర్‌' సంపాదకీయంలో పేర్కొన్నారు.
కౌటిల్యుడు - అర్థశాస్త్రం
   బీజేపీ, తన అధికార వెబ్‌సైట్లో, ఆర్‌.శ్యామ్‌ శాస్త్రి ఇంగ్లీష్‌లోకి అనువదించిన కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ''అధ్యయనం చేయడం, బోధించడం, యజ్ఞయాగాదులు నిర్వహించడం, ఇతరులు చేసే యజ్ఞాలలో మత క్రతువులను నిర్వహించడం, బహుమతులు ఇచ్చి, పుచ్చుకోవడం బ్రాహ్మణుని విధి. అధ్యయనం చేయడం, యజ్ఞయాగాదులు చేయడం, బహుమతులు ఇవ్వడం, యుద్ధాలు చేయడం, జీవితాలను రక్షించడం క్షత్రియుని విధి. అధ్యయనం చేయడం, యజ్ఞాలు చేయడం, బహుమానాలు ఇవ్వడం, వ్యవసాయం చేయడం, పశుపోషణ, వ్యాపారం చేయడం వైశ్యుని విధి. పై మూడు వర్గాలకు రెండు జన్మలపాటు సేవచేయడం, వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం, చేతి వృత్తులు చేయడం శూద్రుని విధి'' అని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో కుల వ్యవస్థను బలపరిచాడు.
   కౌటిల్యుని దృష్టిలో రాజు ఒక క్రూర నియంతగా ఉండాలి. ''ఇంద్రుడు (బహుమతులు ఇచ్చేవాడు), యముడు (శిక్షించే వాడు), వీరిరువురి విధులు రాజు విధుల్లో సమ్మిళితం అవుతాయి. శిక్షలను అమలుచేసేది, బహుమతులు ఇచ్చేవాడు అందరికీ కనిపించే రాజు మాత్రమే. రాజును లెక్కచేయని వారిని తీవ్రమైన శిక్షలకు గురిచేయవచ్చు. కాబట్టి రాజును ఎవ్వరూ అలక్ష్యం చేయకూడదు. ఆ విధంగా అధికారానికి వ్యతిరేకంగా ఉండే ప్రతీఘాతశక్తుల నోళ్ళు మూయిస్తారు. ఒక వ్యక్తి నేరం చేశాడని రుజువైతే, అతనిపై చిత్రహింసలకు గురి చేసి శిక్షిస్తారు''. కౌటిల్యుడు సిగ్గుమాలిన తనంతో జాతి వెలి విధానాన్ని విధించాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. ''రాజుగారి కొలువులో ఉండే గురువులు, పురోహితులు, మంత్రులు తూర్పు దిక్కునున్న రాజభవనానికి ఉత్తరాన ఉన్న స్థలాల్లో ఉంటే, పడమర దిక్కున వస్తువులు తయారు చేసే చేతి వృత్తి దారులతో పాటు శూద్రులు నివాసం ఏర్పరచుకుంటారు''.
రాజ్యాంగానికి అవమానం
   ఇలాంటి అమానవీయ న్యాయ వ్యవస్థను శ్లాఘిస్తూ, రాజ్యాంగబద్దంగా ఏర్పరచిన న్యాయ వ్యవస్థను తీవ్రంగా, బహిరంగంగా ఖండించడం ద్వారా జస్టిస్‌ నజీర్‌ ''రాజ్యాంగం మీద విశ్వాసాన్ని, విధేయతను కలిగి ఉంటానని, రాజ్యాంగాన్ని, చట్టాలను సమర్థిస్తానని'' చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించాడు. ఆయన ప్రసంగం రాజ్యాంగ పరిషత్‌ అందించిన తోడ్పాటును, కృషిని అవమానించింది.
   జస్టిస్‌ నజీర్‌ ప్రసంగంలో రెండు బలహీనతలున్నాయి: వాస్తవంగా, ఆయన భారతీయ నాగరికత, దాని చట్టబద్ధమైన వారసత్వాన్ని ఏకపక్షంగా నొక్కి చెప్పడం తప్పు. ప్రాచీన భారతదేశంలో, ఆయన న్యాయ కోవిదులుగా, ఆరాధ్యులుగా ఉదాహరించిన మనువు, కౌటిల్యుడు, కాత్యాయనుడు, బృహస్పతి, యజ్ఞవాల్క్యుడు బ్రాహ్మణవాద వివరణలకు ప్రసిద్ధి చెందినవారు. ఎందుకో గాని ఆయన సర్వమానవ సమానత్వానికి, మానవత్వానికి ప్రతీకగా నిలిచిన భౌధ్ధ, జైన ధర్మశాస్త్రాలను ఉదహరించలేదు.
బౌద్ధ, జైన ధర్మశాస్త్రాలు
   ప్రముఖ న్యాయవాది, భారతీయ ధర్మశాస్త్ర చరిత్ర పరిశోధకుడు రాహుల్‌ శ్యామ్‌ భండారీ బౌద్ధమతం ఆధ్వర్యంలో ఉన్న న్యాయ వ్యవస్థపై మొదటిసారి పరిశోధన చేశాడు. భండారీ సమాచారం ప్రకారం, ఒకే వ్యక్తికి సంపూర్ణమైన అధికారాన్ని ఇవ్వకూడదని బుద్ధుడు ప్రచారం చేశాడు. జైన మతం కూడా మహిళలను తక్కువ చేసి చూడని ఒక విస్తృతమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. క్రీ.పూ 367-298కి చెందిన భద్రబాహు, మహిళలకు వారసత్వ హక్కులను కల్పించిన 'భద్రబాహు సంహిత'ను రచించాడు. ఒకవేళ ఒక వ్యక్తి మరణిస్తే, అతనికి చెందిన ఆస్తి (కొడుకు ఉన్నా లేకున్నా) వితంతువయిన అతని భార్యకు చెందేది. పురుషులకు ఈ విషయంలో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
   జస్టిస్‌ నజీర్‌ ఆధునిక కాలానికి ముందున్న న్యాయ వ్యవస్థను, రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించిన న్యాయ వ్యవస్థ కంటే ఉన్నతమైనదిగా శ్లాఘించాడు. సమ న్యాయ పాలన, సహజ న్యాయం, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతపై ఆధారపడిన న్యాయ వ్యవస్థలను మనువు, కౌటిల్యుడు సమర్థించారని చెప్పడం చాలా పెద్ద తప్పిదం. ఆనాడు అలాంటి వ్యవస్థలు ఉనికిలో లేవు. ఆ కాలంలో పంచ పాండవులు జూదంలో అన్ని హక్కులను, వారి రాజ్యాన్ని, ఆస్తులను, ఆఖరికి వారి ఉమ్మడి జీవిత భాగస్వామి, ద్రౌపదిని ఫణంగా పెట్టారు. ఒకవేళ ఇదే సమన్యాయం, సహజ న్యాయమై ఉండి ఉంటే, పాండవులకు జరిగిన దుష్ట సంఘటన జరిగి ఉండెడిది కాదు.
   జస్టిస్‌ నజీర్‌, స్వర్ణ చరిత్ర (అనేక మంది చరిత్రకారుల అనుమానాలతో కూడిన)కు తిరిగి వెళ్ళాలనే పిలుపు వల్ల ముప్పు వాటిల్లుతుంది. వలస పాలనలో అనేకమంది ప్రజల ప్రాణ త్యాగాలతో విజయవంతమైన 'నిర్వలసీకరణ', 20వ శతాబ్దం మధ్య కాలంలో సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ఏర్పడిన ఒక బలమైన శక్తి. దాని లక్ష్యం సామ్రాజ్యవాద, భూస్వామ్య, పెట్టుబడిదారీ దాస్య శృంఖలాలను తెంచుకొని, ప్రగతిశీల, సర్వమానవ సమానత్వంతో కూడిన ఒక హేతుబద్ధమైన రాజ్య వ్యవస్థను నెలకొల్పడం. భారత రాజ్యాంగం, దేశంలోని న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం సరియైనది. వీటిని మానవీయ కోణంలో ముందుకు తీసుకొని పోవడమే సరియైన పరిష్కారం తప్ప... రాజుల, రాజ్యాల గాథల్లో రక్షణ కోసం శరణు కోరడం పరిష్కారం కాదు.
   జస్టిస్‌ నజీర్‌ ప్రసంగం, ఇప్పటికే ఆరెస్సెస్‌, బీజేపీ పాలనలో ప్రమాదంలో పడిన భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యానికి ఒక హెచ్చరిక. ఎన్నికల్లో సాధించిన పూర్తి మెజారిటీ ద్వారా రాజ్యాంగ విలువల సంరక్షణను గాలికి వదిలి, వారు పార్లమెంట్‌ ను ఒక చర్చా వేదికగా కాక, ఒక నోటీస్‌ బోర్డ్‌గా మార్చి వేశారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రతాప్‌ భాను మెహతా అభిప్రాయపడ్డాడు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో... న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ హిందూత్వ అరాచకాలను అదుపు చేయాలని ఆశిద్దాం.
(''ఫ్రంట్‌ లైన్‌'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్‌, 9848412451
- శ్యామ్‌ సుల్‌ ఇస్లాం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సుందరయ్య వారసత్వాన్ని నిలబెడదాం...
అసాధారణ విప్లవకారుడు హౌచిమిన్‌
వ్యవసాయసమస్యకు ప్రాధాన్యతనిచ్చిన సుందరయ్య
రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం
'మధ్యతరగతి'.. అంటే ఎవరు?
ప్రశ్నిస్తున్న 'పత్రం'
త్రికోణ రాజకీయంలో తెలంగాణ

తాజా వార్తలు

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

05:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

04:47 PM

బాలుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

04:33 PM

జీఎస్టీ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు‌

04:24 PM

ట్వి‌ట్ట‌ర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి‌న ట్రంప్‌.. మళ్లీ నిషేధం..!

04:13 PM

మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

04:04 PM

స్టాక్ మార్కెట్లు ఢమాల్..!

03:58 PM

ఆర్ఆర్ఆర్‌లో పులితో ఫైట్‌.. వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో విడుద‌ల‌

03:51 PM

క్రికెట్‌ బెట్టింగ్‌లో టీడీపీ నేత అరెస్టు

03:44 PM

భూత వైద్యుడి నిర్వాకం.. బాలికను నిపులపై నడిపించి..

03:32 PM

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యతల స్వీకరణ

03:23 PM

న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది జైలు శిక్ష‌

03:20 PM

వెనక్కు తగ్గిన జీ5.. సబ్​స్క్రైబర్లకు ఉచితంగా ఆర్ఆర్ఆర్ సినిమా

03:13 PM

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మ‌రో షాక్‌..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.