Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రణభూమి రాచకొండ...పల్లెపల్లెన ఎర్రజెండ... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 23,2022

రణభూమి రాచకొండ...పల్లెపల్లెన ఎర్రజెండ...

ప్రకృతి సోయగాలు
అద్భుత కళా శిల్పాల మెరుపులు
దట్టమైన అడవులు
పిల్లబాటలు... రాతికోటలు...
ఇవి పర్యాటక ప్రాంతంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాచకొండలో కనిపించే దృశ్యాలు.. కాని
వీరోచిత పోరాటపటిమ...
నిఖార్సయిన సంఘతత్వం
దుర్మార్గాన్ని ఎదిరించే జనతత్వం
గడప గడపకూ ఎరుపును అద్దుకున్న ధీరత్వం... ఇవి ఈనేలను మర కోణంలో ఆవిష్కరించే ప్రజా పోరాటాలు...
క్రీస్తుశకం 14వ శతాబ్దంలో రేచలా నాయకుల ఏలుబడిలో తెలంగాణ రాజధానిగా రాచకొండ ప్రసిద్ధిగాంచింది. 19వ శతాబ్దంలో అదే రాచకొండ తెలంగాణ సాయుధ పోరాటమై చరిత్రలో నిలిచింది. ఎర్రజెండా వెలుగుల్లో సాగిన అమరవీరుల బాట ఇది. అగ్గిపూల కోట ఇది. ఒక ఇల్లు కాదు, ఒక్క పల్లెకాదు ఊరూరూ పోరాటాలై కదిలి ఈ నేలను పోరుభూమిగా మార్చాయి. రంగారెడ్డి జిల్లాను ఉద్యమఖిల్లాగా నిలిపాయి.
నిజాం, రజాకార్ల ఏలుబడిలో అష్టకష్టాలు మోసి ఓర్చుకున్న ఇక్కడి పల్లెలోని ప్రజలు, తిరుగుబాటు తత్వాన్నీ అదే రీతిన చాటారు. ఆంధ్రమహాసభ ప్రభావంతో చైతన్యవంతమవుతున్న ప్రజలు నిర్మాలలో ముందుగా గుత్పల సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి పరిణామాలలో ఉత్తేజితులై ఉద్యమదారి పట్టిన కాచం కృష్ణమూర్తి ఆ తర్వాత కాలంలో తన రాజకీయ పోరాటాన్ని రాచకొండ, ఇబ్రహీంపట్నం ప్రాంతాలకు విస్తరించారు. రాచకొండ సరిహద్దు పల్లెలన్నీ ఆ యుద్ధవీరుడికి స్వాగతం పలికాయి.
ప్రధానంగా ఆరుట్ల, లోయపల్లి, బండలేమూరు, రంగాపూర్‌, జాపాల, చీదేడు వంటి గ్రామాల్లో కార్యక్రమాల్ని ప్రారంభించిన కృష్ణమూర్తి... తెలంగాణ పోరాటం సాయుధ సమరంగా మారాక రాచకొండ దళాన్ని ఏర్పాటు చేసి నిజాం దొరలకు ముచ్చెమటలు పట్టించారు.
తెలంగాణ పోరాట నినాదమే భూమి, భుక్తి, విముక్తి. అందువల్ల ఈ ప్రాతాలలోనూ భూస్వాముల అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా భూపంపిణీ కోసం అనేక పోరాటాలు జరిగాయి. ఆరుట్లలో జాగీరు, సర్కారు భూముల పంపకం కోసం నినదించగా.. భూస్వాములు అడ్డుకుని కేసులు పెట్టించారు. అదరని ఆరుట్ల జనం శత్రువుల కుట్రలను భగం చేస్తూ ధైర్యంగా ముందుకు సాగారు. సర్కారు అండతో గ్రామంలో ప్రత్యేక పోలీసు క్యాంపు ఏర్పాటు చేయగా వారి రక్షణలో భూస్వాములు చేసిన దాడిలో దానయ్య, పోచయ్య అనే ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు. తిరగబడ్డ మహిళలు క్యాంపుపై దాడి చేశారు. భూస్వాములకు తలవంచక తప్పక పోవడంతో వందల ఎకరాల భూమి పేదలకు దక్కింది. లోయపల్లిలోనూ అనేక ఎకరాల భూమి ఉన్న కిషన్‌రావుతో సుదీర్ఘకాలం పోరాటం జరిగింది. చిన్నతుండ్లలో 400 ఎకరాల చిన్నరాళ్ల చెరువు భూమిపైన 12 ఏండ్ల పాటు పోరాడి విజయం సాధించారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగానూ, కౌలుదార్లు జీతగాళ్ల జీవితాల్లో మార్పుల కోసం సైతం పోరాటాలు కొనసాగించి ఫలితాలు సాధించారు. ఇదే స్ఫూర్తితో జోడకొండ, దండు మైలారం, జాపాల, రంగాపూర్‌ వంటి అనేక చోట్లకు ఉద్యమం విస్తరించింది.
ఇక నెహ్రూ సైన్యాల రాక తర్వాత కమ్యూనిస్టులపై నిర్భంధం పెరిగినా తట్టుకుంటూ ప్రజలనంటిపెట్టుకుని పని చేసింది కృష్ణమూర్తి దళం. ఇందులో పోచమోని జంగయ్య వంటి వారు తుపాకిపట్టి పోరాడగా కోటప్ప, ఎర్రచెంద్రం, అడివయ్య, జంగారెడ్డి, వీరారాజీ వంటి వారు గ్రామాల్లో పార్టీ విస్తరణకు తోడ్పడ్డారు. 1951లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించుకున్నాక.. అంటరానితనం, వరకట్నం, అణచివేత వంటి అనేక సామాజిక సమస్యలపైనా పార్టీ పోరాటాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే జాపాలలో... పాషన్న (పాషా) కృష్ణమూర్తికి పరిచమయ్యాక... ఇక్కడ ఉద్యమ ప్రస్థానం క్రమంగా మరో స్థాయికి చేరింది. కమ్యూనిస్టులు విడిపోయాక ఇక్కడ సీపీఐ(ఎం) గ్రామాలకు అండగా నిలవగా... రాజకీయ కయ్యాలకు తెరలేపింది కాంగ్రెస్‌. ఆరుట్లలో సొసైటీ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌ అడ్డదారులు తొక్కగా, పార్టీ అడ్డుకుంది. విజయవాడ నుంచి రౌడీలను తెప్పించినా జనం తిరుగుబాటుతో తోక ముడిచారు. ఆ తర్వాత సర్పంచ్‌ ఎన్నికల్లో కమ్యూనిస్టుల విజయాలు కాంగ్రెస్‌కు మరింత కంటగింపుగా మారాయి. పార్టీ ప్రభావాన్ని తట్టుకోలేక పాషాను అడ్డుతొలగించే ఆలోచన చేసిన శత్రువులు 1989లో లింగపల్లి గేటుకాడ పాషా, నరహరి హత్యతో విర్రవీగినా ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా సీపీఐ(ఎం) విజయాలను అడ్డుకోలేకపోయారు. పార్టీ తరఫున కొండిగారి రాములు ఎమ్మెల్యేగా ఎన్నికకాగా... తాగునీరు, భూ సమస్యలు పేదలకు ఇండ్లు, మారుమూల ప్రాంతాలకు రోడ్ల వంటి అనేక సమస్యలపై పని చేస్తూ పార్టీ మరింత విస్తరించింది. విద్యార్థి, యువజన మహిళా సమస్యలపై పోరాటాల్ని విస్తృతం చేసింది. కులవివక్ష, అసంఘటితరంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయగా 2004లో ఇబ్రహీంపట్నంలో మస్కు నర్సింహ ఎమ్మెల్యేగా గెలిచి ఎర్రజెండా మరింత ఎరుపెక్కింది. ఇందుకు సాంస్కృతిక రంగాలలో పార్టీ చేసిన కృషి ప్రత్యేక పాత్ర పోషించింది.
పార్టీ కృషితో ఇక్కడ దాదాపు ప్రతి గ్రామంలో కొంత భూమి పేదలకు దక్కగా, భూధాన యజ్ఞ బోర్డు భూములపైనా పేదలకు హక్కులు కల్పించడం, జీతగాళ్ల వెట్టి చాకిరీ రూపు మాపడం, కృష్ణానీటి సాధన వంటి అనేక విజయాలు ప్రజా శత్రువులకు కంటగింపుగా మారాయి. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో ఎర్రజెండా ఎదగడం ప్రమాదకరమనుకున్న రాజకీయ నేతలు... ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థల్ని ప్రోత్సహించడం, కమ్యూనిస్టులపై దాడులకు పూనుకోవడం తీవ్రం చేశారు. ఈ క్రమంలో... రోషయ్య, యాదగిరిరెడ్డి వంటి యువకిశోరాలు నేలకొరిగారు. అయినా ప్రజాసమస్యలపై ఎర్రజెండా పోరు సాగుతూనే ఉంది. దసరా పండగ సమయంలో ప్రతి గ్రామంలో విజయానికి గుర్తుగా పంచుకునే జమ్మి చెట్టు వద్ద ఎర్రజెండాను ఎగురవేసే సంప్రదాయం నెలకొందంటేనే ఇక్కడి ప్రజాభిమానం ఎలాంటిదో తెలుస్తుంది. బండరావిరాల వంటి గ్రామాల్లో నేటికీ దసరాలో ఎర్రజెండా ఎగురుతూనే ఉంది. రణఖిల్లాగా పేరుగాంచిన రంగారెడ్డి జిల్లాలో ఉద్యమ ప్రభావం ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మహేశ్వరం, కందుకూరు, హయత్‌నగర్‌తో పాటు పశ్చిమ ప్రాంతంలోనూ పరవళ్లు తొక్కుతూనేవుంది. పొల్కంపల్లి, కప్పాడు, పెదతుండ్ల, చినతుండ్ల, మేడిపల్లి, ధర్మన్నగూడ, పులిమామిడి, జాపాల చిత్తాపూర్‌, ఎలిమినేడు వంటి ఎన్నో గ్రామాలు పోరు కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. బర్ల శివయ్య, లాలు, పెద్దులు... వంటి వీరులు పోరాటంలో ముందున్నారు.
పేదలకు కష్టం ఉన్న ప్రతిచోటా-ఎర్రజెండా సమరం ఉంటుంది. నాటి కడివెండి నుంచి నేటి ముదిగొండ వరకు ఇది నిరూపితమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పోరుగడ్డ ఇబ్రహీంపట్నం (తుర్కాయాంజల్‌)లో జరుగుతున్న సీపీఐ(ఎం) 3వ రాష్ట్ర మహాసభ రానున్న కాలానికి మరిన్ని పోరాటాలకు పదును పెట్టనుంది. ఈ పోరుబాట నడిచేందుకు నాటి పోరు పల్లెల వీరగాథలు తోడుకోవాలి.
చీకటి రేకలు చీలి
వెన్నెల వెలుగులు రావాలి
అందుకే... జనమంతా ఎర్రజెండాకు జై కొట్టాలి!
- భాస్కర్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సుందరయ్య వారసత్వాన్ని నిలబెడదాం...
అసాధారణ విప్లవకారుడు హౌచిమిన్‌
వ్యవసాయసమస్యకు ప్రాధాన్యతనిచ్చిన సుందరయ్య
రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం
'మధ్యతరగతి'.. అంటే ఎవరు?
ప్రశ్నిస్తున్న 'పత్రం'
త్రికోణ రాజకీయంలో తెలంగాణ

తాజా వార్తలు

08:02 PM

భార‌త్‌లో పెట్టుబ‌డుల గమ్మ‌స్థానం తెలంగాణ‌: కేటీఆర్

07:52 PM

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

05:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

04:47 PM

బాలుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

04:33 PM

జీఎస్టీ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు‌

04:24 PM

ట్వి‌ట్ట‌ర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి‌న ట్రంప్‌.. మళ్లీ నిషేధం..!

04:13 PM

మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

04:04 PM

స్టాక్ మార్కెట్లు ఢమాల్..!

03:58 PM

ఆర్ఆర్ఆర్‌లో పులితో ఫైట్‌.. వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో విడుద‌ల‌

03:51 PM

క్రికెట్‌ బెట్టింగ్‌లో టీడీపీ నేత అరెస్టు

03:44 PM

భూత వైద్యుడి నిర్వాకం.. బాలికను నిపులపై నడిపించి..

03:32 PM

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యతల స్వీకరణ

03:23 PM

న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది జైలు శిక్ష‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.